మన ఆచారాలు - అర్ధాలు -2 chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
మన ఆచారాలు - అర్ధాలు -2 :
1. కాళ్ళ కడుక్కోవడం :
బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్లు కడుక్కోవాలి. దూర ప్రయాణం చేసి వచ్చిన అతిధి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వవలెను. ఈ విధంగా చేసిన సమస్త దరిద్రాలు వదిలి సుఖంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. దరిద్రాలు వదిలి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
2. నమస్కారం చేయడం :
పెద్దలకు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మంచిది. దీని వలన వారి దీవెనలు మనకు ఆశీర్వాద బలంగా అందుతాయి.
3. పాదాభి వందనం :
పాదాలు అద్ర్రుష్ట కారకమైన బ్ర్రుహస్పతికి యొక్క కారకాలు, పెద్దలకు పాదాభివందనం చేసినట్టయితే సంపదలు, అద్ర్రుష్టం, ఆరోగ్యాలు కలుగుతాయి.
4. గడప మీద కూర్చోవడం :
గడపమీద కూర్చుంటే తలకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి.
5. గడప మీద తుమ్మరాదు :
ఈ విధంగా చేసినా ఆపదలకు సంకేతం, అలా జరిగితే కొద్దిగా నీళ్లు తీసుకొని తుమ్మినవారి తలపై జల్లాలి.
6. భోజనం చేస్తూ తుమ్మరాదు :
భోజనం చేసేటప్పుడు తుమ్మితే ఎడమ చేతిని నీటితో తడిపిన ఆ దోషం పోతుంది.
7. ఈశాన్యంలో తేనె తుట్ట :
ఇంటికి ఈశాన్యంలో తేనె తుట్ట పడితే అది ఒక రాబోయే చెడుకు సంకేతం. తుట్ట వెంటనే తీసి వేసి శాంతి చేయించుకోవాలి. శాంతి అనగా ఇల్లు శుభ్రముగా కడిగి వాస్తు హోమం చేయించాలి.
8. కదిలే శ్మశానం కూదడు:
మనిషి చనిపోతే శ్మశానంలో కాలుస్తాం లేదా పూడుస్తాం, ఐతే కోళ్లు, మేకలు, చేపలు వంటి వాటి మాంసం ఆరగిస్తున్నాం. అంటే మనిషి కదులుతున్న స్మశానం. వేదాలలో అన్నిటికన్నా గొప్ప ధర్మం అహింస. అందుకే అహింసా పరమోధర్మహ : అన్నారు.
మాసం మానితే జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించగలరు.
9. బూజు దులపాలి : 
ఇళ్ళలోని బూజు దరిద్రానికి చిహ్నం, బూజు ఎప్పటికప్పడు దిలిపి ఇల్లు శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.  శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి తాండవిస్తుంది.
chintamani free astrology
For Free Astrology click here


Comments