తారాబలం-చంద్రబలం

tarabalam and chandrabalam

తారాబలం - చంద్ర బలం అంటే ఏమిటి ? ఎలా తెలుసుకోవాలి. ?

What is Tarabalam-Chandrabalam ? How to Know ?

tarabalam

     మనకు జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములు ప్రతి దినము రోజుకు ఒక నక్షత్రము చొప్పున ఆకాశ గమనమున చంద్ర గ్రహము ఉన్న మార్గమున ఉదయిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి భూమి పై జన్మించిన సమయంలో ఆ రోజు అతను జన్మించిన సమయానికో, అంతకు ముందో ఒక నక్షత్రం ఉదయించి ఉంటుందిం. అదే అతని జన్మ నక్షత్రం అవుతుంది. మన ఇంట్లో ఉండే క్యాలెండర్ లేదా పంచాగం చూసినట్లయితే ఏ ఏ రోజులలో ఏయే నక్షత్రం ఉందో, ఎప్పుడు ప్రారంభమైనదో, ఎప్పుడు ముగుస్తుందో ఉంటుంది. దానిని బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు పుట్టిన సంవత్సం క్యాలెండర్ లేనట్లయితే ఇప్పుడు ఆన్ లైన్ లో 100 సం. ల వరకు తెలిపే వెబ్ సైట్లు, యాప్ లు ఉన్నాయి, వాటిని ట్రై చేయండి. లేదా మీ ఇంట్లో పెద్దవారు మీ జన్మకుండలి రాయించి దాచి ఉంచుతారు దానిని బట్టి మీ నక్షత్రం తెలుసుకోండి. ఒక వేళ మీకు పుట్టిన తేదీ సమయం వంటి  వివరాలు తెలియక పోతే మీ పేరును బట్టి మీ రాశి, నక్షత్రం తెలుసుకునే పట్టిక ఈ మన బ్లాగులో ‘నామ నక్షత్రాలు’ అని పోస్టు ఉంది ఆ పోస్టులో చూసి తెలుసుకోవచ్చును.
   ఇక విషయానికి వస్తే ఈ 27 నక్షత్రాలలో మనకు శుభకార్యములకు పనికి వచ్చే నక్షత్రాలు, శుభకార్యములకు పనిచేయని నక్షత్రములు ఉంటాయి. ఏయే నక్షత్రలముల వారికి ఏయే నక్షత్రములు పనికి వస్తాయో, ఏవేవి పనిచేయవో తెలియజేసేదే ‘తారాబలం’ మీరు ఏదైన శుభకార్యం కాని, ప్రయాణం కాని, నూతన కార్యక్రములుగాని, వాహనం కొనుగోలుగాని, భూమి, గృహం కొనుగోలుగాని, ఇంట్లో వివాహాది శుభకార్యములు గాని ఇతరత్రా  చేయాలనుకున్నప్పుడు ఈ తారాబలం చూసకొని చేసినట్లయిన విజయం చేకూరుతుంది.

ఎలా తెలుసుకోవచ్చు ?
మనము ఈ 27 నక్షత్రాలను నవకములలో ( నక్షత్రాలను 9 చొప్పున మూడు వరుసలలో రాసినట్లయితే దానిని నవకం అంటారు) రాసినపుడు 1. జన్మతార, 2. సంపత్తార, 3. విపత్తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్తార, 6. సాధనతార,
7. నైదనతార, 8. మిత్రతార, 9 పరమమిత్ర తారులగా ఏర్పడుతాయి. తారాబలం తెలుసుకోవాలంటే ఈ నవకంను పరిశీలించవలసి ఉంటుంది.
మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ తారాబలం తెలుసుకోవాలంటే  
తారాబలం హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మనక్షత్రం లేదా నామనక్షత్రం  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న నక్షత్రం వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా మీరు లెక్కించడం నేర్చుకొని తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు పద్దతులు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి.

ముందుగా ఈ నక్షత్రముల పట్టకను పరిశీలించండి

ప్రథమ నవకం
ద్వితీయ నవకం
తృతీయ నవకం
తారాభలం
అశ్విని
మఖ
మూల
7 నైదనతార
భరణి
పుబ్బ (పూర్వఫల్గుని)
పూర్వాషాఢ
8 మిత్రతార
కృత్తిక
ఉత్తర (ఉత్తర ఫల్గుని )
ఉత్తరాషాఢ
9 పరమమిత్రతార
రోహిణి
హస్త
శ్రవణం
1  జన్మతార
మృగశిర
చిత్త
ధనిష్ఠం
2 సంపత్తార
ఆరుద్ర
స్వాతి
శతభిషం
3 విపత్తార
పునర్వసు
విశాఖ
పూర్వాభాద్ర
4 క్షేమతార
పుష్యమి
అనూరాధ
ఉత్తరాభాద్ర
5 ప్రత్యక్ తార
ఆశ్లేష
జ్యేష్ఠ
రేవతి
6 సాధనతార

తారాబలమును చూసుకునే  విధానం - 1

ఉదాహరణకు : ఒక వ్యక్తి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం హస్త  అనుకుందాం.
ఇపుడు మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ తీసుకొని మీకు కావలసిన రోజున ఏ నక్షత్రం ఉందో చూడండి.
ఉదా: తేది. 30.04.2020 గురువారం రోజున క్యాలండర్ లో పుష్యమి నక్షత్రం ఉంది.
ఇప్పుడు హస్త నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం ఏ వరసులో ఉందో పై పట్టికలో చూడండి.
హస్త నక్షత్రం 1వ (జన్మతార) వరుసలో ఉంది, పుష్యమి నక్షత్రం 5వ (ప్రత్యక్ తార) వరుసలో ఉంది
అంటే హస్త నక్షత్రం వారికి  ఆ రోజు పుష్యమి నక్షత్రం ప్రత్యక్ తార అవుతుంది.
దీనిని బట్టి ప్రత్యక్ తార ఫలితములు చూసుకోవాలి.
ఆ విధంగా ఏ నక్షత్రం వారైన వారి యెక్క జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం 1వ వరుసగా (జన్మతారగా) భావించి
అక్కడ నుండి మిగతా నక్షత్రాలు  2 , 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్లను మార్చకుంటూ పరిశీలించుకోవచ్చు.

మరొక విధానం (2) :

జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి మీకు కావలసిన రోజున ఉన్న నక్షత్రం (క్యాలెండర్ చూడండి) వరకు లెక్కించి వచ్చిన విలును 9 చే భాగించిగా వచ్చిన శేషము విలువను 1. జన్మతార, 2. సంపత్ తార, 3. విపత్ తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్ తార, 6. సాధన తార, 7. నైదనతార, 8. మిత్రతార, 9. పరమ మిత్రతార గా భావించవలెను.
ఉదా : హస్త నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు లెక్కించిన 23 అవుతుంది 23 ను 9 చే భాగించిన 9x2=18,
23-18= 5 , శేషం 5 వచ్చింది, అంటే 5. ప్రత్యక్ తార అవుతుంది. ఈ విధంగా వారి వారి నక్షత్రములను బట్టి తారా బలము తెలుసుకోవచ్చు.
గమనిక : జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రం ప్రకారం చూసుకోవచ్చు. నామ నక్షత్రముల కొరకు
ఈ మన బ్లాగులోనే  నామ నక్షత్రముల పట్టిక (పోస్టు)లో ఇవ్వడం జరిగింది. కావలసిన వారు చూసుకోగలరు.

గమనిక -1: శుభకార్యముల విషయములలో
ప్రథమ నవకములో జన్మతార, ద్వితీయ నవకములో విపత్తార, తృతీయ నవకములో ప్రత్యక్తార,
మూడు నవకములలో నైధన తారను విడిచి పెట్టవలయును.
ఇతర నవకములలో ఆ తారలు వచ్చిన దానములు ఇచ్చి దొషకాలము వదిలి పనులు చేసుకోవచ్చను.

వివాహ సమయంలో వధూవరులకు జన్మతార, విపత్తార, ప్రత్యక్తారలు వచ్చిన దోషశాంతికి
జన్మతారకు శాకదానము (కూరగాయలు)
విపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పు దానము
ఇచ్చి వివాహము జరిపించవచ్చును.
గమనిక-2
జన్మతార యందు గం. 02:48 ని.లు (సుమారు 3 గంటలు)
విపత్తార యందు గం. 01.12 ని.లు (సుమారు 1 గంట)
ప్రత్యక్, నైధన తారల యందు గం. 03.12 ని.లు (సుమారు 3 గంటలు) విడువ వలెనని కొందరి అభిప్రాయం,
చంద్రుడు జన్మతార, పరమ మిత్ర తారలయందు గాక విపత్తార, ప్రత్యక్తారల యందు
స్వోచ్చ స్వగతుడైన సర్వ కర్మలయందు శుభప్రదుడని కొందరి అభిప్రాయము.

తారలకు అధిపతులు  - ఫలములు

1. జన్మతార : అధిపతి సూర్యుడు , నెమలి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు. 
మనస్తాపము, అశాంతి, తలనొప్పి, తిండి, నిద్ర సరిగా లేకపోవుట జరుగును.
పరిహారం : గుమ్మడి పండు దానము చేసిన కొంత శాంతి కలుగును.
2. సంపత్తార : అధిపతి బుధుడు, వాహనము గుఱ్ఱము, 
అన్నివిధములుగా లాభించును. ధనాదాయము బాగుండును.
వ్యాపార, వ్యవహారములందు ప్రయత్నములు కలిసివచ్చును.
అన్ని విషయములలో యుక్తిగా వ్యవహరించుట జరుగును.
3. విపత్తార : అధిపతి రాహువు, వాహనము మేక, దోషకాలము సుమారు 1 గంట
అకారణ కలహము, హోదాకు తగని వ్యక్తులతో కలిసి తిరుగుట, శారీరక సంబంధమైన చికాకులు కలుగును.
పరిహారం :  బెల్లం దానం ఇవ్వవలెను.
4. క్షేమతార: అదిపతి గురుడు, ఏనుగు వాహనము
దైవ సంబంధమైన కార్యముల యందు పాల్గొనుట,
నూతన వ్యక్తులను కలుసుకొనుట, సంఘములో గౌరవ మర్యాదలు, ఆదరణ కలుగును,
ధనాదాయము బాగుండును.
5. ప్రత్యక్తార : అధిపతి  కేతువు,  కాకి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
ఇతరుల వలన మాటలు పడుట, ఏ పని కలిసి రాకపోవుట,
ప్రతి పనికి ఊహించని ఆటంకములు కలుగును.
పరిహారం :  ఉప్పును దానము ఇవ్వవలెను.
6. సాధనతార: అధిపతి చంద్రుడు,  నక్క వాహనము
గొప్పవారితో పరిచయము, మనస్సు ప్రశాంతముగా యుండుట,
నూతన స్త్రీలతో పరిచయము.
7. నైధనతార : అధిపతి శని, సింహము వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
అనవసర విషయములలో కలుగజేసుకొనుట, వాద ప్రతివాధములు చేయుట.
పరిహారం :  సువర్ణ దానము చేయుటవలన కొంత శాంతి కలుగును.
8. మిత్రతార: అధిపతి శుక్రుడు, వాహనము గరుత్మంతుడు
సంగీత సాహిత్యముల యందు అభిలాష, స్త్రీ సౌఖ్యం,
నూనత వ్యక్తులతో పరిచయం, ధనాదాయం బాగుండుట,
శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనుట జరుగును.
9. పరమ మైత్రతార: అధిపతి కుజుడు,  హంస వాహనము, 
ఊహించని చికాకులు, సాహసకార్యము చేయుటకు ఉత్సాహపడుట,
 వైరాగ్యము, ఇతరుల మీద కర్రపెత్తనం చేయుటకు ఆసక్తి చూపించెదరు.

 chandrabalam

మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి. చంద్రుడు రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున  ఒక నెలలో 12 రాశులలో సంచారం చేయును. ఒక వ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశినే అతని యొక్క జన్మరాశి అంటారు.  జన్మరాశి నుండి ప్రస్తుతం మీకు కావలసిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో లెక్కించనట్లయితే చంద్రబలం తెలుసుకోవచ్చను.

మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ చంద్రబలం తెలుసుకోవాలంటే  
చంద్రబలం  హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మరాశి లేదా నామరాశి  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న చంద్రుడు ఉన్నరాశి  వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా ఇక్కడ ఇవ్వబడిన  చంద్రబలం తెలుసుకునే విధానం చూడండి

జన్మరాశి  ఎలా తెలుసుకోవాలి ?

జన్మరాశిని తెలుసుకొనుటకు మీ పుట్టిన తేది క్యాలండర్ లేదా పంచాగం తీసుకోండి. ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. ఉదాహరణకు పుష్యమి నక్షత్రం అనుకుందాం (పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు ఉంటే ఆ రోజు చంద్రడు కర్కాటక రాశిలో ఉంటాడు) అపుడు మీ జన్మనక్షత్రం కర్కాటకం అవుతుంది. (మఖ, పుబ్బలో ఉంటే సింహరాశి అవుతుంది) ఇలా ఏయే నక్షత్రాలు ఉంటే ఏయే రాశి అవుతుందో ‘నామ నక్షత్రాలు’ అనే పోస్టులో మన ఈ బ్లాగు నందు ఇవ్వబడినవి కావలసిన వారు తెలుసుకోగలరని మనవి.
మరి పుట్టిన తేది లేనివారు వారి పేరులో ముందు అక్షరాన్ని బట్టి వారి రాశిని తెలిపే పట్టిక కొరకు ‘నామనక్షత్రములు’  పోస్టులో ఇవ్వబడినది  తెలుకోగలరు.

మరి చంద్రుడు ఉన్న రాశిని తెలుసుకోవడం ఎలా ?

చంద్రడు ఉన్న రాశిని తెలుసుకోవాడినికి కూడా ఇదే విధానం ఆ   రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. (ఉదాహరణకు హస్త నక్షత్రం అనుకుంటే కన్యరాశి అవుతుంది.)  (‘నామ నక్షత్రాలు’ పోస్టు చూడండి)

చంద్రబలం తెలుసుకునే విధానం:

జన్మరాశి నుండి చంద్రుడున్న రాశి వరకు గణన చేయగా 1, 3, 6, 7, 10, 11 రాశుల యందు చంద్రుడున్న ధనలాభము, కార్యసిద్ధి, శుభమును ఇచ్చును. మిగిలిన రాశుల యందు కార్యవిఘ్నము కలిగించును. 

ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మరాశి లేదా నామ రాశి తులా రాశి అనుకుందా, ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకుంటే తులారాశి నుండి, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, కర్కాటకం 10వ రాశి అవుతుంది. పై నంబర్లలలో 10 ఉంది కావున శుభం. ఇలా తెలుసోకవచ్చును.

శుక్లపక్షమున 2, 5, 9 రాశుల యందును, కృష్ణ పక్షమున 4, 8, 12 రాశుల యందును ఉన్న చంద్రడు తల్లి కుమారుడిని రక్షించునట్లు రక్షించునట్లుగా శుభమును కలుగ జేయును.

గమనిక: శుక్ల పక్షమున చంద్ర బలమును, కష్ణ పక్షమున తారా బలమును చూడవలెనని కొందరి అభిప్రాయము.
శుక్ల పక్షమి: అమావాస్య తదుపరి నుండి పౌర్ణమి వరకు ఉండే 15 రోజులు. 
కృష్ణ పక్షమి: పౌర్ణమి తదుపరి నుండి అమావస్య వరకు ఉండే 15 రోజులు.

తారా బలము, చంద్ర బలములలో ఏది మంచిది. ?

  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం వచ్చినచో అది చాలా శుభప్రదంగా భావించవచ్చును.
  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం రానిచో ఆ పని వాయిదా వేసుకొనుట కాని లేదా పరిహారము చేయుట కాని మంచిది.
  • తార బలము, చంద్ర బలములలో ఏదో ఒకటి అనుకూలముగా వచ్చినచో ఆ పనికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి తారాబలం కాని, చంద్రబలం కాని  శుభప్రదంగా భావించి ముందుకు వెళ్ళవచ్చును.
సర్వే జనా సుఖినోభవంతి

మీకు ఈ పోస్టు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ ను ఇవ్వండి, 
మరి ఇంత అమూల్యమైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి.

Comments

Post a Comment