మానసిక లకోట ప్రశ్నాపల చింతామణి
ఓం పరబ్రహ్మణే నమ :
మిట్లంపల్లి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తిమ్మణశాస్త్రులు వారిచే రచింపబడి
శతాథిక వైదిక గ్రంథకర్త కీ.శే. చల్లా లక్ష్మినరసింహశాస్త్రి గారిచే ఆవిష్కరించబడినది.
గ్రంధారంభము
శో. గణేశ్వరం విఘ్నహరంప్రణమ్య శ్రీనీలకంఠార్యగురో:పదాం
బుజం శ్రీతిమ్మనాభ్యాద్బుత ప్రశ్న మేకంయద్భారతీవాక్యమధాతనోతి
తా : ఇష్టదేవతా ప్రార్ధనారూపమయిన మంగళము చేయు కాక. సకల విఘ్నహరుండగు విఘ్నేశ్వరునకు, అస్మత్రువునకును విద్యాగురుండగు శ్రీనీలకంఠార్యపాదాంబుదములకును వందనంబుచేసి శ్రీమత్తిమ్మణదైవజ్నుడను నేను సరస్వతి అనుగ్రహముచే ఈ ప్రశ్న గ్రంధమును వ్రాసితిని.
శ్లో : పశ్నశాస్ర్తం వ్రవక్ష్యామి సర్వప్రశ్నార్ధ సంగ్రహమ్ శుభాశుభఫలం జ్నేయం ప్రశ్నజ్నానాదిభి స్సహ :
తా : నానాప్రశ్న గ్రంధములు పలుమారుజూచి అందలి సారములు సంగ్రహించి యీ ప్రశ్నగ్రంధము వ్రాసితిని. దీనిచే శుభాశుభఫలములు సులభముగా చెప్పదగును.
శ్లో : శుచిర్భూత్వా భక్తియుక్తో దైవజ్నం పరిప్రుచ్చతి .
ప్రశ్నం సలభతే పూర్ణం ఫలం నోచే ద్రుధాభవేత్
తా :: ప్రుచ్ఛకుండు శుచియై, దైవభక్తిగలిగి ప్రశ్నయడిగనేని యతడు పూర్ణఫలము జెందును, లేనిది వ్రుధాయగును.
శ్లో :: ఆదిత్యం చంద్రభౌమౌ బుధ గురు భ్రుగుజాన్ భానుజం రాహుకేతూ ::
నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయలయ స్తైఐర్య సంపత్తిహేతూన్
జ్యోతిశ్చక్రేస్మిన్ తారాద్యుడు గణసహితాన్మేషరాశ్యాదిరాశీ నేతేష్వాసక్త మూర్తీన్ ఖచరసురవరాన్ భక్తిత : ప్రార్థయామ : ధ్యానమంత్ర:
ఓం నమోభగవతీ దేవీ కూశ్మాండినీ సర్వకార్యప్రసాదినీ సర్వనిమిత్తప్రకాశినీ ఏ హ్యేహిత్వరత్వరవరం దేహి హిలిహిలి మాతంగినీ సత్యం బ్రూహిబ్రూహిస్వాహా త్రివారముచ్చరేత్ ::
తత: సూర్య ప్రార్ధనం కుర్యాత్ ::
విజ్నాపనము
జనస్కందత్రయాత్మక జ్యోతిషములో నొకభాగము ప్రశ్న బోధకగ్రంధము పరమేశ్వరనిర్మితమై అనాదికాలమునుండి పరిగణించబడుచూ వచ్చెను. తరువాత భ్రుగుమహర్షి మొదలగువారు కొన్ని గ్రంధములు చేసితిరి. తరువాత అనేకానేక పండితులు వివిధ శీర్షికలతో ప్రశ్నలు వ్రాసియున్నారు, మనోగత ప్రశ్నోత్తర గ్రంధము యిదివరకు నాకు ద్రుగ్గోచరము కాలేదు. ఇప్పడు కొందరు లకోటాప్రశ్నచెప్పుదుమని ధనార్జన కొరకు కుత్రిమ ప్రశ్నలు చెప్పుచు జనులను మోసపరుచుచన్నారు. అధివిద్వద్ధూషనముగానే యున్నది. నేను యీ విషయమై అనేక గ్రంధములు పరిశీలించి అత్యంత లఘురూపముగా, పూర్వాచార మార్గము ననుసరించి జ్యోతిష్కులకు సభాపూజ్యత కలుగుటకొరకు నా యిష్టదేవతానుగ్రహజనితమైన బుద్దిచే మానసికలకోటాప్రశ్నాఫలచింతామణి యను గ్రంధమును తెలుగు భాషలో వ్రాసితిని ఇందలి లోపాలోపములు సవరించి నాశ్రమను సాఫల్యముచేసి నను్న క్రుతార్థుడను చేయవలయును విద్వద్ బ్రుందములకు వందనముచేసి నివేదించియున్నాను. ఈ ప్రశ్న చెప్పువారికి జ్యోతిషము తెలిసియుండవలయుననే ఆవశ్యకత యుండదు.(పై విధముగా గ్రంధకర్త పేర్కొనడం జరిగినది.)
మేము వారి గ్రంధమును ఏకలవ్యశిష్యలవలె అభ్యసించి
'' చింతామని.కో.ఇన్'' అను వెబ్ సైట్ ను రూపొందించడం జరిగినది. కావున విజ్నులు ఈ సదావకశమును ఉపయోగించుకొన మనవి. ఇందు ఎటువంటి ప్రశ్నోత్తరములకు తావులేదు.
ఏదైనా పనిమీద దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే ముందుగా ఏంచేస్తాం?
ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, విమానం, రైలు, బస్సు లేదా ఏదైనా వాహన సౌకర్యం ఉందా, వెళ్ళే మార్గం అనుకూలంగా ఉంటుందా, ఏవైనా ఆటంకాలు కలుగుతాయా, ఎలా వెళ్తే సులువుగా, సౌకర్యంగా వెళ్ళవచ్చు. ఎన్ని రోజులు వెళ్ళాలి, అవసరమైతే వెంట ఏం తీసుకుని వెళ్ళాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఎన్నో సందేహాలు (ప్రశ్నలు) వస్తాయి, ఒక్కొక్క సందేహానికి సమాధానం దొరికిన తరువాతే ప్రయాణం సాగిస్తాం...
అదేవిధంగా మన జీవన ప్రయాణంలో సాగే అనేకానేక సందేహాలకు సమాధానమే '' చింతామణి.కో.ఇన్''
హుదూద్ ఈ పదం విననివారు ఉన్నారా ?

అదేవిధంగా మన జీవన ప్రయాణంలో సాగే అనేకానేక సందేహాలకు సమాధానమే '' చింతామణి.కో.ఇన్''

హుదూద్ తుఫాన్ గురించి తెలియనివారు ఉండరు, ఏ చిన్నపిల్లవాడిని అడిగినా టక్కున చెప్పేస్తాడు. మన శాస్త్రసాంకేతక పరిజ్నానానికి చక్కటి ఉదాహరణ హుదూద్ ను ముందుగా గుర్తించడం. లేకుంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదో, హాస్దినష్టం జరిగితే మళ్లీ పునరుద్దరించుకోవచ్చు, పోయిన ప్రాణాలను రప్పించగలమా...
కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే శాస్ర్దసాంకేతిక పరిజ్నాన్ని వాడారు అనడానికి మనకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రామాయణంలో పుష్పక విమానం గురించి తెలిసే ఉంటుంది, భారతంలో శ్రీక్రిష్ణుడు శశిరేఖకు 'మాయాదర్పణం'లో అభిమన్యుని చూపించాడని అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
మనం ఇప్పుడిప్పుడు విమానాలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇంటర్నెట్ వంటివి ఉపయోగిస్తున్నాము. విచిత్రం కాకపోతే ఏమిటి ఎక్కడో ఉన్నమీరు ఈ వెబ్ సైట్ చూసి నన్ను ప్రశ్నఅడిగితే మీరెవరో తెలియక పోయిన, మీ మనసులో ఏ ప్రశ్న అనుకున్నారో తెలియకపోయినా, మీరు అడిగే ప్రశ్న దానికి సమాధానం ఇ-మేయిల్ ద్వారా మీకు చేరుతుంది. ఇదంతా ఇంటర్ నెట్ ద్వార సాధ్యమవుతుంది.
మనం ఇంటర్ నెట్ ను, కంప్యూటర్లను ఉపయోగించడం సాంకేతిక పరిజ్నానం కాదా, మా వద్ద శాస్త్రపరిజ్నానం ఉన్నది, దానికి సాంకేతిక పరిజ్నానాన్ని ఉపయోగిస్తున్నాను.
చింతామణి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటంటే
హుదూద్ భీభత్సాన్ని ముందుగా గుర్తించి ఏవిధంగా ముందుజాగ్రత్తలు తీసుకొని రక్షణ పొందామో, అదే విధందా చింతామణి ద్వారా మీ భవష్యత్తును ముందుగానే తెలుసుకొని సరైన చక్కటి నిర్ణయాలు తీసుకొని భంగారు భవిష్యత్తును పొందాలని కోరుకుంటున్నామ.
ఒక వేళ వచ్చే సమాధానాలు మీకు అనుకూలంగా లేకుంటే (ముందుగా ఒక హెచ్చరికగా భావించి) కుంగిపోకుండా ఎలాంటి తగుజాగ్రత్తలు తీసుకుంటే శుభం జరుగుతుందో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

మనకు అనుకోకుండా ఏదైనా జబ్బు చేస్తేం ఏంచేస్తాం ?

ఉదాహరణకు కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం, వెంటనే మనకు తెలిసిన టాబ్లెట్ (మెడిసిన్) వేసుకుంటాం, అప్పటికీ కడుపునొప్పి తగ్గకపోతే ఏంచేస్తాం, ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్తాం, అప్పడు డాక్టర్ ఏంచేస్తాడు, కడుపు నొప్పి రావడానికి కారణాలు అడిగి తెలుసుకొని వెంటనే ట్రీట్ మెంట్ చేస్తాడు. కడుపు నొప్పి తగ్గిపోతుంది. మరి మనవల్ల సాధ్యం కానిది డాక్టర్ వల్ల ఎలా సాధ్యమయింది. డాక్టర్ ఏమైనా దేవుడా, ఏమైనా మహిమలు చేసాడా ? మరి ఎలా నొప్పి నయం చేసాడు.
అంటే మీరే సమాధానం చెప్తారు, ఏముంది చాలా సింపుల్, డాక్టర్ గారు వైద్య విద్యను అభ్యసించాడు, ఏ జబ్బకు ఏ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో నేర్చకున్నాడు, ఎంతో మంది రోగులను, పరీక్షించిన అనుభవం ఉంటుంది, అందుకే చాలా సులువుగా నయంచేయగలిగాడు అంటారు, అంతేనా... ? అవునండి ఖచ్చితంగా అంతే,
చింతామణి.కో.ఇన్ కూడా చేసేది ఇదేనండి.

నిత్యం పూజించే దేవతావిగ్రహాల్ని శిలలుగా బావిస్తామా ?

మనం ప్రతి రోజు పూజించే దేవతా విగ్రహాలు శిలతో చేసినవేనని మనకు తెలిసనా ఎప్పుడైనా వాటిని రాళ్లుగా భావిస్తామా ?
ఆ విగ్రహాలను మన మనస్సునందు దేవతామూర్తులుగా కొలువుచేసుకన్నాము. ఇక్కడ మన మనస్సే కేంద్ర భిందువు, మన మనస్సును దైవానికి అనుసందానం చేసి దైవానుగ్రహం ఏ విధంగా పొందుతామో అదే మనస్సును ఆధారం చేసుకొని మన మనస్సలో 3 అంకెను దైవస్మరణచేసి అనుకొని చెప్పడం ద్వారా చక్కటి సమాధానాలను పొందవచ్చను.

మా ఈ ప్రయత్నంతో మీరు సమ్మతిస్తే మీ అమూల్య సలహాలు, సూచనలు తెలుప గోరుచున్నాము. అంతేగాక మీరు మీ కుటంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, సహచరులకు, మీకు పరిచయమున్నవారందరికీ మీకు వీలైన పద్దతిలో (లైక్ సోషల్ మీడియా) తెలియజేయసి సహకరించ గోరుచున్నాము. (ఇదే మీరు మాకు ఇచ్చే అసలైన రుసుము)
చింతామణి నే ఎందుకు నమ్మాలి ?
నేటి కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి ప్రశ్నలు, జాతకాలు, జ్యోతిష్యం ఏంటి, ఇదంతా వట్టి మూడనమ్మకం కాకపోతే అనుకునేవారు చాలా మంది వుంటారు.అభివ్రుద్ది చెందిన దేశాలు సైతం రోదసీ పరిశోధనలకోసం, శాటిలైట్ ప్రయోగాల కోసం అయితేనేమి వ్యోమనౌకలను (రాకెట్) పంపేముందు పూజాదికార్యక్రమాలు, దైవ ప్రార్ధనలు చేసి పంపిస్తున్నారన్న విషయం మనకు తెలియంది కాదు. మనం ఎంతగా అభివ్రుద్ది చెందినా గ్రహాంతర యానం చేసినా విశ్వం యొక్క ఆదిఅంతాలను ఇప్పటి వరకు చేదించలేకపోయాము.
అంతే కాదు వైద్య శాస్త్రంలో అవయవ మార్పిడులు చేసినా, అనేకానే మందులను కనిపెట్టినా వ్యాది నయం చేయగలుగుతున్నాము, మరణాన్ని కొంతకాలం వాయిదావేయగలుగుతున్నాము కాని పూర్తిగా మరణాన్ని జయించలేక పోయాము.
ఇప్పటి అంతుచిక్కని రహస్యాలు మనకు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అయితే ఒక్కటి మాత్రం మనం విశ్వసిస్తున్నాము. ఈ అనంత విశ్వాన్ని ఏదో దైవశక్తి నడిపిస్తున్నదని.
మన రుషులు, మునులు, వేదదేదాంత పండితులు, గురువర్యులు వేదాలు, ఉపనిషత్తు, అనేకానేక గ్రంధాల ను పరిశీలించి, శోదించి, పఠించి అందలి సారములను గ్రహించి మనకు అమూల్యమైన విజ్నానాన్ని అందించినారు. మన దురద్రుష్టవషాస్తు వాటిని గ్రహించలేక వాటన్నిటి విస్మరిస్తున్నాం.
అనేకానేక దేశాలు భారతీయ విజ్నానాన్ని, సంప్రదాయాల్ని గౌరవిస్తుంటే, మనం వాటిని చులకగా చూస్తున్నాము.
మానసిక లకోట ప్రశ్నాఫల చింతామణి దైవజ్నులు విట్లంపల్లి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తిమ్మణశాస్ర్తులు వారిచే రచింపబడినది. వారి గ్రంధరాజమును అనుసరించే మేము మా ప్రుచ్చకులకు సమాధానాలు సూచించడం జరుగుచున్నది.
ఇది కేవలం ధైవ బలం మాత్రమే, ఇందు మాయామంత్రములు ఏమీ లేవు.
జాతకం (జ్యోతిష్యం) అంటే ఏమిటి ?
What is Astrology ?
వీటన్నిటిని ద్రుష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో తన జీవన విధానం ఎలా వుంటుందో, ఏంచేస్తే పూర్వజన్మదోశాలు తొలగుతాయో, గ్రహచార దోశాలను ఏవిధంగా తొలగించుకోవాలో తెలుసుకొని వాటికి తగ్గ రెమిడీస్ (నియమాలు) పాటించి బంగారు భవిష్యత్తును సాకారం చేసుకోవాలని అనుకుంటారు. జ్యోతిశాస్త్రం ద్వారా ఇది సాధ్యమేనా ? <br>
ఒక వ్యక్తి యొక్క జీవన విధానం భవిష్యత్తులో ఏ విధంగా వుండబోతుందో తెలిపేది (జ్యోతిష్కం) జ్యోతిశాస్త్రం.
వ్యక్తి జాతకాన్ని తెలిపేందుకు జ్యతిష్యంలో ఏఏ పద్దతులు వున్నాయి ?
1. చిలక జ్యోతిష్యం 2. హస్తరేఖాసాముద్రికం 3. పుట్టుమచ్చల విధానం
4. గవ్వలశాస్త్రం 5. సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజి)
6. సాంప్రదాయ జ్యోతిష్యం : పుట్టిన తేది, సమయం, ప్రాంతం ( ఇది ఖచ్ఛిత జాతకాన్ని తెలుపుతుందని నమ్మకం)
7. ప్రశ్నాజాతం (పుట్టిన తేది, సమయం, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రశ్న అడిగే సమయానికి దైవబలంచే ఏర్పడే గోచారం లేదా లగ్న ప్రధానంగా చెప్పబడేదే ప్రశ్నా శాస్త్రం)
అయితే '' ప్రశ్నాఫల చింతామణి '' పేరులో ఉన్నట్టుగానే ప్రశ్నాజాతకం.
ఇది వ్యక్తి మనస్సుకు దైవబలాని మద్య అంకెల అధారంగా పనిచేస్తుంది.
- ఒక వ్యక్తి లేవలేని స్థితిలో ఉండి, తనకు సహాయం చేసేవారు లేక, చివరకు గుప్పెడు మెతుకులు అందించే వారు లేక నిత్సహాయతలో వుండి, ఆకలితో అలమటిస్తుంటే - ఎవరైనా కడుపునిండా అన్నం పెట్టి చేయూతనిస్తే ఎలావుంటింది.
- అదే కడుపునిండి, ఆకలి లేనివానికి పంచబక్షపరమాన్నాలు ముందు పెడితే ఎలా వుంటుంది. ఇదే సూత్రాన్ని ఆధారం చేసుకొని చేయూతనిస్తుంది '' ప్రశ్నాఫల చింతామణి ''
- ప్రశ్నావళిలో పేర్కొన్న ప్రశ్నలు ఎవరి అయితే అవసం అవుతాయో వారు మాత్రమే అడిగితే ఫలితం వుంటుంది. ఏదో సరదాకి, నిజమో కాదో తెలుసుకుందామని ప్రశ్నిస్తే ఫలం దక్కదు.
చింతామణి అంటే అర్ధం ఏమిటి ?
చింతామణి (Chintamani or Chintamani Stone) ఒక అమూల్యమైన రత్నం. ఇది హిందూ మరియు బౌద్ధ ధర్మాలలో చాలా ప్రాముఖ్యమున్నది.ఇది కోరిన కోర్కెల్ని తీర్చే గుణం కలది. బౌద్ధంలో దీనిని బోధిసత్వుడు, అవలోకితేశ్వరుడు మరియు క్షితిగర్భుడు ధరించారు.
హిందూమతంలో విష్ణువు మరియు వినాయకుడు లకు దీనితో సంబంధం ఉన్నది.
ప్రశ్నాఫల చింతామణి కూడా మీరు ప్రశ్నించడం ద్వారా మీ కోరిక నెరవేరుతుందని (ఫలితం) గ్రంధకర్త సూచించడం జరిగింది.
Comments
Post a Comment