దేవుని పటాలు ఎక్కడ ఉంచాలి - chintamani free astrology

దేవుని పటాలు ఎక్కడ ఉంచాలి.
chintamani free astrology
chintamani free astrology
1. శ్రీ వెంకటేశ్వర స్వామి 
వెంకటేశ్వరస్వామి పటాలను ఇంట్లోగాని, ఆఫీసులలో గాని, షాపులలో  తూర్పు లేదా పడమర మాత్రమే ఏర్పాటు చేయవలెను. ఉత్తరములో మరియు దక్షిణములో ఏర్పాటు చేయరాదు. వెంకటేశ్వరస్వామి పటాలు సుఖశాంతులను, ధన సంపదలను ఇస్తాయి.
2. విష్ణుమూర్తి, రాముడు, క్రిష్ణుడు :
విష్ణుమూర్తి పటం మరియు విష్ణుమూర్తి అవతారాలైన రాముడు, క్రిష్ణుడు మొదలైన వారి పటాలను తూర్పుగోడలకు ఏర్పాటు చేయవలెను. దక్షిణం, ఉత్తరం గోడలకు ఏర్పాటు చేయరాదు.
విష్ణుమూర్తి ధైర్యాన్ని ఇస్తాడు. రాముడు ప్రతాపాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు.
క్రుష్ణుడు సౌఖ్యాన్ని, ఆనంధాన్ని ఇస్తాడు.
3. శివుడు :
శివుడి పటం పడమర గోడకు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం, తూర్పు గోడలకు కూడా ఏర్పాటు చేయవచ్చను.
దక్షిణ, ఉత్తర దిశలలో ఉంచరాదు.
శివుడు భయాన్ని పోగొట్టి ఆయుర్ధాయాన్నిస్తాడు.
4. గణేషుడు :
వినాయకుడి పటం ఉత్తర దిశ గోడకు ఉచడం శ్రేయస్కరం. మనం ఇంట్లో ఉంచే వినాయకుడి  తొండం ఆయనకు ఎడమవైపునకు తిరిగి ఉండాలి. అనగా చూచే మనకు కుడి వైపునకు తిరిగినట్లుగా కనిపించాలి. గణేశుడి ప్రతిమను తలుపులపై చెక్కరాదు.
గణేశుడు విఘ్నాలను పోగొట్టి ధనాన్ని, కార్యజయాన్నిస్తాడు.
5. ఆంజనేయుడు :
ఆంజనేయుడి పటాన్ని ఉత్తరపు గోడకు గాని, దక్షిణపు గోడకు గాని ఏర్పాటు చేయవలయును. ఆంజనేయస్వామి తోక, ముఖం ఆయనకు ఎడమవైపనకు తిరిగేట్లుగా ఏర్పాటు చేయడం మంచిది. అనగా చూచే మనకు కుడివైపునకు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఆంజనేయస్వామి ఆరోగ్యాన్ని, ధైర్యాన్నిస్తాడు. దెయ్యాలను, పిశాచాలను ప్రారదోలుతాడు.
ఆంజనేయస్వామి పటాల క్రిందనుండి నడువరాదు.
6. లక్ష్మీదేవి :
కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే ఇంటి యందు ఏర్పాటు చేయవలయును. నుంచుని ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేయరాదు. లక్ష్మీదేవి పటాన్ని ఉత్తరపు గోడకు గానీ, తూర్పు గోడకు గాని ఏర్పాటు చేయాలి. లక్ష్మదేవి పటాన్ని వాయువ్యంలో ఉత్తరపు గోడకు, ఆగ్నేయంలో తూర్పుగోడకు ఏర్పాటు చేస్తే ధనాదాయం బాగుంటుంది. శుభం కలుగుతుంది. వివాహాలు సకాలంలో అవుతాయి.
లక్ష్మీదేవిని ద్వారాలపై, గుమ్మాలపై చిత్రించరాదు. లక్ష్మీదేవి పటాల క్రిందనుండి నడువరాదు.
7. షిరిడీ సాయిబాబ :
బాబా పటాన్ని తూర్పు, ఈశాన్యంలో గాని, తూర్పు ఆగ్నేయంలో గాని, తూర్పు మధ్యలోగాని, ఉత్తరం మధ్యలోగాని ఏర్పాటు చేయవచ్చు.
8. నరసింహస్వామి : 
నరసింహస్వామి పటాన్ని ఇంట్లో పెట్ట కూడదని కొందరి నమ్మకం. నరసింహస్వామి పటాలను దక్షిణంలో గాని, పడమరలోగాని ఏర్పాటు చేయవచ్చును.
అయితే ప్రతీరోజు ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి.
9. కుమారస్వామి :
కుమారస్వమి పటాన్ని ఇంట్లో పెట్టకూడదనేది కొందరి నమ్మకం, కుమారస్వామి పటాలను, కేలండర్లను తమిలనాడులో విశేషంగా ఏర్పాటు చేస్తారు. దోషం లేదు. కుమారస్వమి పటాలను దక్షిణంలో గాని, ఉత్తరంలో గాని ఏర్పాటు చేయవచ్చను.
10. కనకదుర్గమ్మ అమ్మవారు : 
ఇంట్లో పడమర గోడకు గాని, తూర్పు గోడకు గాని పటం ఏర్పాటు చేసుకోంచ్చును.
11. సత్యనారాయణ స్వామి :
స్వామి వారి పటాన్ని ఇంట్లో తూర్పుగోడకు గానీ, పడమర గోడకు గానీ ఏర్పాటు చేయవచ్చును.

ఇంట్లో- ఆఫీసులలో ఉండకూడనివి :

1.  సర్పాలు, డ్రాగన్లు, కప్పలు మొదలైన పటాలు బొమ్మలు ఇళ్ళల్లో పెట్టడం భారతీయ వాస్తుకు విరుద్దం.
కావున వీటిని ఇంట్లో ఉంచరాదు.
2. ఉగ్రమూర్తులైన చండీ శక్తుల పటాలను, ఉగ్ర ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహస్వామి పటాలు ఇళ్ళల్లో ఉంచరాదు.
3. ఆటవీ ద్రుశ్యాలు, ఆఫీసుల్లో ఉంచరాదు. జింక తలలు, పులి తలలు, పులి తోళ్ళు, జింక తోళ్ళు, ఉడతల, ముంగీసల తోళ్ళు మొదలైనవి ఇళ్ళల్లో ఉంచరాదు.
4. సింహం, పులి మొదలైన అటవిక జంతువుల పటాలు ఇళ్ళల్లో, ఆఫీసులలో ఉండరాదు.

ఇంట్లో- ఆఫీసులలో ఉండవలసినవి:
1. ఇంట్లో, ఆఫీసలలో ఏనుగు పటాలు, ఏనుగు బొమ్మలు పెడితే శుభం.
2. నెమలి పటాలు, నెమలి బొమ్మలు శుభం
3. గోమాత ద్రుశ్యాలు ఇంటికి శుభం చేస్తాయి.
4. పూర్ణకుంభం ఫోటోలు, చిత్రాలు మంచివి. తలుపులపై పూర్ణకుంభం, నెమళ్ళు, ఏనుగులు చెక్కడం శుభకరం.

chintamani free astrology
For Free Astrology click here

Comments