ఆగ్నేయంలో అఖండ దీపం - అద్భుత ఫలితం - chintamani free astrology

ఆగ్నేయంలో అఖండ దీపం - అద్భుత ఫలితం

chintamani free astrology
chintamani free astrology
ఏదైన  ఆర్ధిక సమస్య గానీ, అనారోగ్య సమస్య గానీ, ఒక అవసరం గానీ లేదా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సమస్యగానీ ఉన్నప్పుడు ఒక అద్బుత మార్గం ద్వారా తప్పని సరిగా ఫలితాన్ని పొందవచ్చను.
ఈ ప్రపంచాన్ని మొత్తం సూర్యడు కాపాడినట్లుగా  మీ ఇంటిని ఒక చిన్న దీపం కాపాడుతుంది.
ఏంచేయాలంటే :
ఇంటిలో ఆగ్నేయ మూలలో తూర్పు గోడకు ఒక పెద్ద ప్రమిదతో కనీసం 3 నెలలు  నిరంతరం వెలిగేటట్లుగా ఈ దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఆగ్నేయంలో తూర్పు గోడకు లక్ష్మీదేవి పటాన్ని ఉంచి ఆ పటం ముందు ఈ అఖండ దీపం ఉంచాలి.

ఎప్పడు ప్రారంభించాలంటే :
- ఒక ఆదివారం గానీ లేదా మంగళవారం గానీ గురువారం గానీ ఈ దీపాన్ని ఉదయం పూట మాత్రమే వెలిగించాలి.

- ఆవనూనె గానీ, నువ్వుల నూనె గానీ ఆవు నెయ్యి గానీ ఈ అఖండ దీపానికి ఉపయోగించుకొనవచ్చు.
- నూలు దారంతో పేటలుగా చేసి మందంగా ఉండే పొడుగు వత్తిని తయారు చేసుకోవాలి.
- పెద్ద మట్టి ప్రమిద లేదా మట్టి మూకుడును ఉపయోగించుకోవాలి.
- ప్రమిదను శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి, నూనె పోసి లక్ష్మీదేవి పటం ముందుంచి వెలిగించాలి.
- అమ్మవారికి పంచదార గానీ బెల్లం గానీ ఏదైనా రెండు పండ్లు గానీ నైవేద్యంగా పెట్టి మనస్పూర్తిగా కోరికను విన్నవించుకోవాలి.
- ప్రతి రోజు ఉదయం ఇలాగే చేయాలి.
- దీపం మధ్యలో కొండెక్కడం (ఆరడం) జరిగినా ఎటువంటి నష్టం వాటిల్లదు.  వెంటనే మళ్లీ వెలిగించుకోవచ్చు.
- వత్తి సన్నగా ఉంటే నూనె ఎక్కవు ఖర్చు అవ్వదు.
- దీపం కొండెక్కకూడదు అనుకుంటే గాలి ఎక్కువగా తగులకుండా చూట్టు గ్లాస్ లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇలా దీపం వెలిగించి 3 నెలలు ఉంచడం కొద్దిగా ఖర్చుతో కూడుకొన్నదైనా, ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

chintamani free astrology
For Free Astrology click here


Comments