మన ఆచారాలు - ప్రయోజనాలు - chintamani free astrology

మన ఆచారాలు - ప్రయోజనాలు 
chintamani free astrology
chintamani free astrology

1. గడపకు పసుపు -కుంకుమ :
పసుపు రంగు శుభానాకి గుర్తు, ఎరుపు రంగు అభివ్రుద్దికి గుర్తు, మన ఇళ్ళకు ఉన్న సింహద్వారపు మరియు ఇతర ద్వారాలకు పసుపు రంగు, ఎరుపు రంగు డిజైన్లు వేయాలి. శుభ సమయాలలో గడపలకు పసుకు కుంకుమ రాయాలి. అటువంటి ఇళ్ళల్లో సంపద, ఆరోగ్యం, వివాహాలు, సంతానాలు ఉంటాయి.
2. కట్టు, బోట్టు :
ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ఇంటికి వచ్చిన ఆడపడచులకు, అతిధులకు అతిధి మర్యధలతో భోజనం పెట్టి భహుమతులు ఇవ్వడం - ఇలా చేసిన ఇళ్ళు ఇంద్రవైభవం అనుభవిస్తాయి.
3. ద్వారాణికి తోరణాలు :
ప్రతి పండుగకు, వేడుకగా గడపకు పచ్చటి మామిడాకుల తోరణాలు కట్టాలి. అలా కడితే లక్ష్మిదేవి ఆ ఇంటిలో కాపురం ఉండి అన్ని ఐశ్వర్యాలను మనకు ఇస్తుంది.
4. చేతికి గోరింటాకు :
గోరింటాకు మంచి ఔషదమే కాక అద్ర్రుష్టదాయిని కూడా, గోరింటాకు అద్ర్రుష్టాలను, సిరి సంపదలను తెస్తుంది.
స్త్రీ,పురుషులు, పిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకోవచ్చు.
5. చేతికి గాజులు : 
ఇల్లాళి చేతికి గాజులు గలగలలాడితే ఆ ఇంట్లో కాసులు గలగలలాడుతాయి. బంగాపు గాజులు ఎన్ని వేసుకున్నప్పటికీ వివాహం అయిన స్త్రీలు మట్టి గాజులు కూడా ధరించాలి.
6. పూలు - ధన సంకేతాలు : 
మీరు పూలు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే ధనం మీకు అంత బాగా వస్త్తుంది. గడపలకు పూల దండలు వేయాలి. ఆఫీసులలో ఇళ్లల్లోనూ తొట్టెలు, గిన్నెలలో రంగురంగుల పూలు వేయాలి. ఆడువారి జడలో మల్లెలు, విరజాజులు, చామంతులు ధరించాలి. కలువపూలు లక్ష్మిదేవి ఇష్టం. ఆ తల్లిని కలువ పూలతో పూజించాలి. దేవుడి పటాలకు పూలదండలు వేయాలి. గులాబీలను పూజలో వాడాలి. పూలెక్కువగా ఉపయోగిస్తే డబ్బు ఎక్కువగా రావడం ఖాయం.
7. ఇళ్ళకు సున్నం- రంగులు : 
ఎప్పటి కప్పడు ఇంటికి సున్నం వేయడం చేయాలి, కనీసం 3 సంవత్సరాలకు ఒక సారి రంగులు వేయాలి. సున్నం లేక రంగులు లేక వెలవెలబోయే ఇల్లు దరిద్ర నిలయాలు.
8. ముగ్గులు :
పల్లెటూళ్లలో పేడనీళ్లు చల్లి మంచి ముగ్గలు పెడతారు. పట్నాలలో కూడా గచ్చు మీద చక్కటి ముగ్గుల, రంగురంగుల ముగ్గులు వేస్తే ఆ ఇంటి వారు ఆయురారోగ్యాలతో, సంపదలతో ప్రకాశిస్తారు.
9. ఇంట్లో దీపం :
తూర్పు మధ్యన లేక పడమర మధ్యన పూజపెట్టు కొని ఆపూజ వద్ద ఎల్లప్పడు దీపం వెలిగి ఉంటే ఆ ఇంటి వారికి కష్టాలు రావు. అద్ర్రుష్టాలు కలిసి వస్తాయి.
10. ఆగ్నేయంలో అఖండ దీపం: 
కోరికలు తీరనప్పడు, కష్టాలు కలిగినప్పడు, అనారోగ్యాలు, ఆర్ధిక బాధలు వేదిస్తున్నప్పుడు ఇంటికి ఆగ్నేయంలో ఒక అఖండ దీపాన్ని వెలిగించి మూడు నెలలు ఆరకుండా ఉంచితే మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. దీనిలో సందేహం లేదు.
chintamani free astrology
For Free Astrology click here


Comments