జై హనుమాన్ ఆరాధన
(ఉద్యోగ ప్రయత్నాలకు మంత్రసాధన)
త్వమస్మిన్ కార్య నిరుయోగే
ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్నమాస్తాయి
దుఃఖ క్షయ కరోబవబవ ll
అసాధ్యసాధక స్వామిన్
అసాధ్యం తవ కిమ్ వద
రామదూత కృపాసిందో
మత్కార్యం సాదయ ప్రబో ll
ఈ మంత్రమును
ఒక మంగళవారం ప్రారంభించాలి.
హనుమాన్ గుడికి వెళ్లి స్వామికి ఐదు అరటి పండ్లు నివేదన చేసి 108 ప్రదక్షిణలు (వీలుకానిచో 11 ప్రదక్షిణాలు) చేసి తర్వాత గుడిలో ఒకపక్కగా కూర్చుని పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు పటించాలి. తర్వాత ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇంట్లో గాని గుడికి వెళ్లి గాని వరుసగా 108 సార్లు 41 రోజులు భక్తిశ్రద్ధలతో చదవాలి.
ఇలా చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి తప్పకుండా ఉద్యోగాన్ని వచ్చేలా చేస్తాడు.
Comments
Post a Comment