చెట్టు - ఇంటి ఆవరణ - అదృష్టం - chintamani free astrology

చెట్టు - ఇంటి ఆవరణ - అదృష్టం
chintamani free astrology
chintamani free strology
1. నివాస గ్రుహాల ఆవరణయందు మారేడు, వేప, మామిడి చెట్టు, పింజీతము మొదలైన చెట్లు ఉండవచ్చను.
కొబ్బరి చెట్టు, సీతాఫలం కూడా ఉండవచ్చును. అయితే ఈ చెట్లు ఇంటికి కనీసం పదిహేను అడుగుల దూరంలో గానీ అంత కంటే దూరంలో గానీ ఉండాలి. పనస చెట్టు దొడ్లో ఉండటం శుభకరం. తెల్ల మందారం, నంది వర్ధనం, జాజి, మల్లి, సంపెంగ ఇవన్నీ ఇంటి ఆవరణలో ఉండవచ్చును. పారిజాతం, మాలతి చెట్లు కూడా శుభమే.
2. ఏ దిక్కున ఏ వ్రుక్షాలు:
వ్రుక్షాలు దక్షిణ దిశన అసలు ఉండరాదనేది వాస్తు శాస్త్ర నియమం. పడమరలో వ్రుక్షాలు ఉండటం శ్రేష్ఠం, తూర్పున, తూర్పు ఆగ్నేయంలో మాత్రమే చెట్లు ఉండాలి. ఉత్తరాన ఉత్తర వాయువ్యంలో చెట్లు ఉండాలి.
పనస చెట్లు ఏ దిశలోనైన ఉండవచ్చునని శాస్త్రం చెబుతుంది. అనగా దక్షిణంలో కూడా ఉండవచ్చను. ఈశాన్యంలో ఎలాంటి చెట్లు ఉండరాదు.

3. ఉండకూడని వ్రుక్షాలు :
రేగు, అరటి, దానిమ్మ, గజనిమ్మ చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇంటి వారికి అబివ్రుద్ది ఉండదని శాస్త్రవచనం. ముళ్లు గల చెట్లు, ఎర్రని పూలు పూచే చెట్లు, పాలుగారే చెట్లు, బొప్పాయి, గన్నేరు చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే శత్రు భయాలు, ధన నాశనం కలుగుతాయి. ఇంటి ఆవరణలో చింత చెట్లు ఉన్నట్లయితే అన్నీ చింతలే...
4. తోటలు- చెట్లు
ఏ తోట వేసినప్పటికీ ఆ తోటలో కొన్న రకాల వ్రుక్షాలు ఆ తోటకు రక్షణనిస్తయి. అవి తప్పకుండా తోటలో ఉండాలి. తోటలలో ఆగ్నేయంలో దానిమ్మ చెట్లు ఉండాలి. నైరుతి దిశలో చింతచెట్లు ఉండాలి. వాయువ్యంలో మారేడు చెట్లు ఉండాలి. పడమర రావి చెట్టు నాటాలి. దక్షిణాన బ్రహ్మమోడి ఉంచాలి. తూర్పు సరిహద్దు వెంబడి వెదురు చెట్లు నాటడం శుభం. తోట ఏదైనప్పటికి పై విధంగా ఆయా చెట్లు తోటలలో నాటడం తోటవారికి శుభకరం.

chintamani free astrology
For Free Astrology click here


Comments