జాతక దోషాలు (కుజదోషం) - chintamani free astrology

కుజదోషం : 
chintamani free astrology
chintamani free astrology

జాతక చక్రంలో దోషాల వలన మరియు ఇప్పుడు జరిగే దశవలన, ప్రస్తుత గ్రహస్థితి యైన గోచారం వలన మనవులకు అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు తొలగించు కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

జాతక చక్రంలో కుజుడు లగ్నం నుండి 2,4,7,8,12 స్థానాలలో ఉంటే కుజదోషం ఉన్నట్టుగా భావించబడుతుంది. చంద్రుని నుండి 2,4,7,8,12 స్థానాల్లో కుజుడు ఉంటే అది కూడా కుజ దోషమని చెప్పబడుతుంది. కాని దీనికి శాస్త్ర ఆధారం లేదు.
కుజదోషం - నష్టాలు

  1. కుజదోషం వలన వివాహాలు చాలా ఆలస్యమవుతాయి.
  2. కుజదోషం వలన కొంత మంది అసలు వివాహాలు కాకుండానే మిగిలిపోతారు.
  3. కుజదోషం వలన కుదిరిన వివాహాలు రద్దు అంవుతాయి.
  4. కుజదోషం వలన వివాహాలు కుదిరిన తరువాత తీవ్రమయిన తగాదాలు ఉంటాయి.
  5. కుజదోషం వలన వివాహం అయిన తరువాత విడిపోవడం జరుగుతుంది.
  6. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్య భర్తలలో ఎవరో ఒకరికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.
  7. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్యాభర్తలలో ఎవరో ఒకరు మరణిస్తారు.
  8. కుజదోషం వలన వివాహ జీవితానికి పనికిరాని వారితో వివాహం జరుగుతుంది.
  9. కుజదోషం వలన ఎక్కువ వయసు తేడాతో వివాహం జరుగుతుంది.
  10. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్య భర్తను గాని భర్త భార్యను గాని చంపడం జరుగుతుంది.


పరిష్కార మార్గాలు :
  1. కుజదోషం  ఉన్న జాతకులకు కుజదోషం ఉన్న జాతకులతోనే వివాహం చేయాలి. కుజదోషం లేనివారికి కుజదోషం లేనివారితో వివాహం చేయ్యాలి.
  2. వివాహానికి ముందు కుజుడికి 7000 సార్లు జపం చేయించి పురోహితునికి కందుల దానం చేయ్యాలి. కుజదోషం శాంతిస్తుంది.
  3. సుబ్రహ్మణ్య స్వమికి మంగళవారాలు అభిషేకం చేయించినట్లయితే కుజదోషం శాంతిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజుకూడా పూజలు చేయాలి.
  4. మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆలయంలో 108 సార్లు ప్రదక్షిణలు 4  వారాలు చేస్తే కుజదోషం శాంతించి వివాహం జరుగుతుంది.
  5. నరసింహస్వామి  ఆలయాలు దర్శించి పూజలు చేయడం వలన కూడా కుజదోషం శాంతిస్తుంది.
  6. రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, సుభద్రా కళ్యాణం పారాయణం చెయ్యాలి.
  7. భగవద్గీత, రామాయం, భారతం, భాగవతం వంటి గ్రంధాలు ఇంట్లో ఉంచడం వలన కుజదోషం శాంతిస్తుంది. 
  8.  వీటిని చదవండం వలన, వినడం వలన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
chintamani free astrology
For Free Astrology click here



Comments