జాతక దోషాలు-కాలసర్ప దోషం (నాగదోషం) - chintamani free astrology

జాతక దోషాలు
chintamani free astrology
chintamani free astrology
కాలసర్ప దోషం (నాగదోషం)
రాహుకేతువులు లగ్నంలో గానీ, 7వ స్థానంలో గానీ, 2వ స్థానంలో గానీ, 8వ స్థానంలో గానీ ఉంటే కాలసర్పదోషం తీవ్రంగా ఉంటుంది.
దీనినే రాహుకేతు దోషం అని కూడా అంటారు.
రాహుకేతు దోషాలు తీవ్రంగా ఉన్నవారికి ప్రయత్నాలు ఫలించకపోవడం, అప్పులు, నష్టాలురావడం, నిరుద్యోగం, అతికోపం, దుర్మార్గపు ప్రవర్తన, అనారోగ్యాలు, గర్భస్రావాలు, పాము లేదా విష కీటకాలు కాటు, వ్యభిచారం, త్రాగుడు, జూదం వంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు ప్రమాదంగా మారతాయి.
గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండటం కూడా కాల సర్పదోషమే.

పరిష్కార మార్గాలు :
1. శ్రీ కాల హస్తిలో రాహుకేతు పూజ చేయించడం.
2. రాహు కేతువులకు మినుములు, ఉలవలు దానం
3. అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు చేయించాలి.
4. గణపతికి అటుకులు బెల్లంతో నైవేద్యంతో పూజలు చేయడం.
5. నాగేంద్రస్వామి 2 వెండి పడగలకు అభిషేకం చేయడం.
6. రాహుకేతుల దోష నివారణకు ఏదైనా గానీ, అన్నీ గానీ శక్తి పీఠాలు దర్శించాలి.
7. విజయవాడ కనక దుర్గమ్మ, సికింద్రాబాదులో ఉజ్జయినీ కాళీమాత, జూబ్లీహిల్ సు పెద్దమ్మ దేవాలయాలను దర్శించడం వలన రాహుకేతువుల దోషం పోతుంది.
8. సింహాచంలం లోని ఆదివరాహస్వామిని దర్శించడం వలన రాహుదోషం తొలుగుతుంది.
9. క్రుష్ణా జిల్లా మోపి దేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హైదరాబాద్ లో స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించడం వలన, అభిషేకాలు చేయడం వలన నాగదోషం తొలగుతుంది.
10. నాగప్రతిష్ఠ చేయడం, బొగ్గులు నీళ్లలో వదలడం, శుక్ర, మంగళవారాలు పుట్టలో పాలు పోయడం వల్ల సర్పదోషం తొలగుతుంది.

Comments