జాతక దోషాలు (శనిదోషాలు) -shanigraha dosham - chintamani free strology

జాతక దోషాలు

శనిదోషాలు

chintamani free astrology
chintamani free astrology
జాతక దోషం : 
శని లగ్నంలో గాని, 7 లోగానీ, చంద్రునితో గానీ కలిసి ఉంటే వివాహం ఆలస్యంగా కావడం,  వివాహానంతరం తగారాలు రావడం, భార్యాభర్తలు విడిపోవడం వంటి నష్టాలు ఉంటాయి.
ఏలినాటి శని :
జన్మరాశి మీద శని సంచారాన్ని ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని దోషాన్నే ఏడున్నర ఏండ్ల శనిదోషం అంటారు. ఏలినాటి శని కాలంలో అనారోగ్యాలు, తగాదాలు, గ్యారంటీలు  ఉండి నష్టపోవడం, కోర్టు కేసులు, అవమానాలు, ఉద్యోగుల వలన సమస్యలు, భర్యాభర్తల మధ్య గొడవలు, దండగ ఖర్చులు ఉంటాయి.
అష్టమ శని :
జన్మరాశి నుండి 8వ స్థానంలో సంచరించటాన్ని అష్టమ శని అంటారు. ఆనారోగ్యం, ఆపరేషన్లు, ఉన్నచోటు నుండి మారడం, ఆర్ధిక నష్టాలు, గౌరవ భంగం, ప్రాణ భయం మొదలైన సమస్యలు ఉంటాయి. అష్టమ శని దోషం  2 1/2 సంవత్సర కాలం ఉంటుంది.
అర్ధాషమ శని:
జన్మరాశి నుండి శని 4వ స్థానంలో సంచరించటాన్ని అర్ధాష్టమ శని అంటారు. మనశ్శాంతి లేకపోవడం, తీవ్రమైన భయాందోళనలు కలగడం, భార్యాభర్తల మధ్య  ఎడబాటు, తల్లికి అనారోగ్యం, గ్రుహ సంపదలకు నష్టం,  వాహనాలకు యాక్సిడెంట్లు లేదా వాహన నష్టం  వంటి సమస్యలు ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం 2 1/2 సంవత్సరాలు ఉంటుంది.

పరిష్కారం మర్గాలు :
శని వలన పైన చెప్పిన ఏ దోషాలు కలిగినప్పటికీ ఈ క్రింది శాంతి పూజలు, పరిష్కారాలు ఉపశమనం కలగజేస్తాయి.
1. శనికి నువ్వుల దానం, తైలాభిషేకం ఒక శనివారం నాడు లేదా శని త్రయోదశినాడు చేయడం.
2. శనివారం అన్నధానం, వస్త్రదానం, పండ్లు, ప్రసాదాలు పంచండం.
3. శనివారం నాడు  ఓపికను బట్టి 9, 18, 27, 54, 108 ప్రదక్షిణాలు ఏదో ఒక దేవాలయలయం చుట్టూ చేయడం.
4. శని దోషం తొలగేవరకూ విస్తరాకు భోజనం చేయడం.
5. శని దోషం తొలగేవరకూ మాంసాహారం మానివేయడం.
6. సోమవారాలు శివాలయంలో లేదా ఇంట్లో రుద్రాభిషేకాలు చేయడం.
7. నల్ల  ఆవుకు నువ్వులు బెల్లం కలిపి తొక్కిన పిండి తినిపించడం.
8. తలనీలాలు ఏదో ఒక దేవునికి ఒక శనివారం సమర్పించడం.
9. శనివారం నాడు శ్రీశైలంలో శివుని దర్శనం.
10. శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం.
11. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, చేయించడం, వినడం
12. సుందరకాండ పారాయణం చేయడం, చేయించడం, వినడం.
13. వెంకటేశ్వరస్వామి కీర్తనలు, పాటలు పాడటం, వినడం.
14. ఇంటి సంహద్వారం వద్ద బైట నువ్వుల నూనె దీపం సాయంకాలం వెలిగించి ఉంచడం.
15. అయ్యప్ప స్వామి మాల ధరించడం, శబరిమలై యాత్ర చేయడం.
16. శివ దీక్షతీసుకొని శ్రీశైలం వెళ్లడం.
17. ప్రతి రోజూ ఆంజనేయ స్వామి దండకం ఫఠించడం.
18. ప్రతీ రోజూ శనీశ్వర జపం పఠించడం.
19. శని క్షేత్రాలు శనివారం దర్శించడం.
20. శివపురాణం చదవడం, విష్ణుపురాణం చదవడం.
21. శని వారం రోజున నల్లని వస్తాలు దానం చేయడం.

chintamani free astrology
For free Astrology click here

శని గ్రహ దేవతా అనుగ్రహ స్తోత్రం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి


Comments