నవగ్రహ దోష నివారణ, శాంతి పూజ విధానములు (రెమెడీస్)


నవగ్రహ శాంతి అర్థం ఆయాగ్రహ కారకత్వ ధాన్య, వస్త్ర, దక్షిణ, పుష్ప, గంధాలను దిగదీసి పృద్వి, వాయితత్వ భూతములకు (పంచభూతములలో ఇరువురికి) సమర్పించి కూడా గ్రహశాంతిలు జరిపించవచ్చును.

 
పూజకు కావలసిన వస్తువులు:
గ్రహమునకు సంబంధించిన ధాన్యము, వస్త్రము (చిన్న ముక్కలుగా చేసి జెండాలుగా చేయాలి)
గ్రహముకు సంబంధించిన రంగు పూవులు( గ్రహ సంఖ్యను బట్టి ఎన్నైతే అన్ని)
చిల్లర నాణ్యాలు ( పైసలు- రూపాయి బిళ్ళలు)
పసుపు, కుంకుమ, గంధము, విభూతి మొదలైనవి.
విస్తరాకు లేదా కొత్త పాత్ర, అగరవత్తులు.


విధానము :
ప్రతి గ్రహంనకు సంబంధించిన దిశ లేదా దిక్కు ఉంటుంది. సమయం కూడా ఉంటుంది. ఆయా గ్రహమునకు సంబంధించిన సమయంలో పైన చెప్పిన సామాగ్రి సమకూర్చుకొని గ్రహమునకు సంబంధించిన సంఖ్య గల ధాన్యపు గింజలతో బియ్యంలో కలిపి పులగముగా చేసుకోవచ్చు లేదా గింజలను పిండిగా తీసుకొని కుడుములుగా గాని లేదా పాయసం చేసుకొని కూడా పెట్టవచ్చును. వాటిని గ్రహమునకు సంబంధించిన విస్తరాకు లేదా ఒక కొత్త పాత్ర లో పెట్టుకోవాలి, (విస్తరాకు దొరకనిచో పేపర్ ప్లేట్ లోనైనా పెట్టుకోవచ్చు) విస్తరాకులు పెట్టడం శ్రేయస్కరం. ఆ పదార్థం పై గంధము, కుంకుమ, విభూతి, పసుపు ఇలా గ్రహమునకు సంబంధించి చల్లాలి, తర్వాత గ్రహ సంఖ్య గల చిల్లర నాణెములు అందులో పెట్టాలి, ఆ తర్వాత గ్రహ మనకు సంబంధించిన వస్త్రము చిన్న జెండాలుగా చేసి పెట్టాలి, ఒక అగరవత్తు కూడా పెట్టాలి.


దిగదీసే విధానము:
దిగదీసే విధానము రెండు విధాలుగా ఉంటుంది, తలపై నుంచి వెనకవైపు  ముందువైపు  అపసవ్య దిశలలో దిగదీయాలి, ఇక్కడ ఎన్నిసార్లు అనేది గ్రహ సంఖ్యను బట్టి ఉంటుంది.
రెండవ విధానం: తల నుండి పాదాల వరకు పాదముల నుండి తల వరకు గ్రహ సంఖ్యను బట్టి అపసవ్య దిశలో దిగ తీయాలి.
శనివర్గ జాతకులకు శనివర్గ జాతకులగు ఇతరులతో (దిగ తీయాలి) తిప్పించాలి.  గురువర్గ జాతకులకు గురు వర్గ జాతకులగు ఇతరులతో (దిగ తీయాలి) తిప్పించాలి. ఇలా చేస్తే మంచిది (లేకుంటే ఎవరితోటైనా పెద్దవారితో తీయించవచ్చు)
దిగదీసిన పదార్ధమును గ్రహమునకు సంబంధించిన సమయంలో బయట ఖాళీ స్థలంలో గాని ఇంటికి దగ్గర ఏదైనా మైదానం లేదా పొలం ఉంటే అక్కడ గాని లేదా డాబా పైన గాని గ్రహమునకు సంబంధించిన దిశలో తిరిగి గ్రహమునకు సంబంధించిన సంఖ్యగల అడుగులు ముందుకు వేసి ఆ పదార్థమును అక్కడ పెట్టి రావాలి. (పదార్థమును పక్షులు తినేలా ఆరు బయట పెట్టినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా గ్రహమునకు సంబంధించి వరుసగా రోజులు లేదా వారాలు చేయవలసి ఉంటుంది.
ఇంటిలోకి వచ్చిన తర్వాత కాళ్లు చేతులు ముఖం కడుగుకోవాలి లేదా బయట  కడుగుకొని ఇంటిలోకి రావచ్చు,

****

గురువర్గ లగ్న జాతకులకు శాంతి విధానము:
గురువర్గులకు శుక్ర, రాహు, శని, బుధ గ్రహములు పాప గ్రహములు అవుతారు.


శుక్ర గ్రహమునకు శాంతి విధి :
శుక్ర గ్రహం కారకత్వ సంబంధ ధాన్యమగు నల్లని అనుములు లేదా అలచంద గింజలను తెచ్చుకొని అందులో నుంచి 101 గింజలు (ఉదయం 7 నుండి 9 గంటల వరకు) బియ్యంతో కలిపి ఉడకబెట్టి పులగముగా తయారు చేయాలి. పులగంగా తయారు చేసుకున్న ( ఆయా ధాన్య సంబంధ 101 సంఖ్యలో ముడి సరుకుగా కూడా తీసుకొనవచ్చును) వీటిని మర్రి ఆకుల విస్తరిలో గాని లేదా కొత్త పాత్ర లో గాని పోయాలి. విభూతి బస్మాన్ని, రెండు రూపాయల లేదా 11 రూపాయల దక్షిణలను,  వేప పూలు లేదా తెల్లని లేదా నీలపు రంగు పువ్వులను రెండు లేదా 11 పెట్టాలి.  రెండు నల్ల రంగు  వస్త్రములను చిన్న ముక్కలుగా తీసుకొని చిన్న జెండాలుగా తయారు చేసుకోవాలి, చిన్న జెండాలుగా పెట్టాలి, ఒకటి అగర్బత్తి లేదా ఊదుకడ్డి పెట్టి ఇతరులతో లేదా శనివర్గ జాతకులతో (ముందువైపు రెండుసార్లు వెనుక వైపు రెండుసార్లు  అప్రదక్షిణ గా) లేదా తల మీద నుండి పాదాల వరకు దిగ దీయించి ఉదయం 9 గంటలకు ఆగ్నేయ దిశమున గాని లేదా బయట స్థలంలోకి వెళ్లి ఆగ్నేయ ముఖంగా తిరిగి రెండు అడుగులు వేసి దానిని అక్కడ పెట్టి రావాలి. ఇట్లు రెండు లేదా 11 దినాలు తీసివేయాలి. తారాబల రీత్యా ఈ క్రయను ఆయా దినములందు ఆచరించినచో ఇంకా శీఘ్రంగా శుక్ర గ్రహ శాంతి కలుగును..


రాహు గ్రహ శాంతి విధి :
(రాహు గ్రహ సంఖ్య 4 - టోటల్ 4 వచ్చేలా చూసుకోవాలి)
రాహు గ్రహ కారకత్వ సంబంధ ధాన్యము 13 మినుప బీడలతో స్వల్పంగా బియ్యంతో ఉడకబెట్టి పులగంగా తయారు చేయాలి లేదా  4 మినప గింజలను గాని పై విధంగా మరి ఆకుల విస్తరిలో గాని కొత్త బుక్ లో గాని పెట్టాలి నాలుగు రూపాయలు గాని నాలుగు టమాటాలు 4 టోటల్ వచ్చినట్లు పైసలు సంఖ్యను సరిచేసి గాని అందులో పెట్టాలి విభూతి భస్మము,  తెలుపు పూలు నాలుగు లేదా 13 పెట్టాలి నాలుగు బూడిద లేదా సిమెంటు రంగు వస్త్రాలు జెండాలు ఊది కడ్డి పెట్టి శనివర్గ జాతకులకు ఇతరులతో ముందువైపు నాలుగు సార్లు వెనుక వైపుకు నాలుగు సార్లు అపసవ్యంగా ప్రదక్షిణ కారకంగా గాని లేదా తల మీద నుండి పాదముల వరకు దిగదుడిచి సాయంత్రం మూడు గంటలకు నైరుతి దిశగాని బయలు స్థలం ఏ చిన్న దిశలో ఉన్న బయలు స్థలం ఏ దిశలో ఉన్నను దానిలోకి వెళ్లి నైరుతి దిశముఖంగా నాలుగడుగులు వేసి దాన్ని అక్కడ పెట్టి రావాలి ఇట్లు నాలుగు లేదా 13 దినములు తారాబల రీత్యా ఆచరించిన రాహు గ్రహ శాంతి కలుగును.

 
శని గ్రహ శాంతి విధి:
శని కారకత్వ సంబంధ ధాన్యము నల్లని నువ్వుల పిండి 5 చిన్న ముద్దలు పెట్టాలి. విభూతి భస్మము నీలము లేదా తెల్లని పువ్వులు ఐదు రూపాయలు గాని 50 పైసలు గాని పెట్టి పైన వివరించినట్లుగా వీటన్నిటిని మట్టి పాత్రలో పోసి శనివర్గ జాతకులకు ఇతరులతో ముందువైపు ఐదుసార్లు వెనుక వైపు ఐదుసార్లు తన మీద నుండి క్రింది వరకు పాదముల వరకు దిగదీసి గాని లేదా ముందు వైపు వెనుక వైపు ఐదుసార్లు అప్రదక్షిణగా తిప్పిగాని పడమర దిశగా పైపు పెట్టి రావాలి ఇతర దిశలలో పొలం ఉన్నచో దానిలోకి వెళ్లి పడమర ముఖ దిశముఖంగా 5 అడుగులు వేసి పెట్టి రావాలి ఇంటికి వచ్చాక కాళ్లు చేతులు ముఖం కడుక్కుని ఇంటిలోకి వెళ్లాలి అన్నముతో నువ్వుల పిండి కలిపి దిగదీసి శని వాహనమగు కాకులకు కూడా ఆహారంగా పెట్టవచ్చును. ఈ ప్రక్రియను సాయంత్రం నాలుగున్నర నుండి సూర్యాస్తమయం 6 గంటలలోగా ఆచరించాలి. తారాబల రీత్యా పరిశోధించి శని గ్రహ శాంతి చేసినచో ఇంకా త్వరితంగా శాంతి కలుగును.

 
బుధ గ్రహ శాంతి విధి:
బుదగ్రహ కారకత్వ సంబంధాన్యమగు ఆకుపచ్చ పెసలు, పెసర్లు గింజలు, బియ్యం కలిపి పెసర బేడల పులగము చేయాలి లేదా 106 పైసలు గింజలు గాని పోయవచ్చు 25 పైసలు దక్షిణగా పెట్టాలి, ఏడు రూపాయల బిల్లలు, విభూతి భస్మము ఊది కడ్డీ 7 ఆకుపచ్చ వస్త్రపు జెండాలు నీలం లేదా తెలుపు రంగు ఏడు పూలు, నిమ్మకాయలు గాని నిమ్మ దెబ్బలు గాని ఏడు, వీటిని పైన తెలిపినట్లు మర్రి ఆకుల విస్తరిలో గాని కొత్త గిన్నెలో గాని వీటన్నిటినీ పెట్టాలి ఈ కార్యక్రమం అంతా రాత్రి 10:30 నుండి 12 గంటల మధ్య ఆచరించాలి.  ఇతర వ్యక్తుల ద్వారా వీటిని ముందుగా ఏడుసార్లు వెనుక వైపు ఏడుసార్లు తల మీద నుండి పాదముల వరకు దిగదీసి లేదా అప్రదక్షిణ గా తిప్పిగాని ఉత్తర దిశ వైపు గల బయలు పొలంలో పెట్టి రావాలి. ఈ ప్రక్రియను ఏడు రోజులు ఆచరించాలి. బుద త్రయంతో సంబంధం గల గ్రహ నక్షత్రాల నాడు ఆచరించినచో అతి శీఘ్రంగా ఉపగ్రహం శాంతించును. ఇట్లు గురు లగ్న జాతకులు శని వర్గ గ్రహమునకు శాంతి దానములు ఆచరించాలి.

 
శనివర్గ జాతకులకు శాంతి విధానం:
ఈ లగ్నంలో వారికి రవి (సూర్యుడు) కు, చంద్ర, కేతు, గురు గ్రహములు పాప గ్రహములు అవుతారు.


రవి గ్రహమునకు శాంతి విధి:
రవి గ్రహ కారకత్వ సంబంధాన్నిమగు గోధుమ గింజలను 100 లేదా గోధుమ పరమాన్నాన్ని గాని గోధుమతో కుడుములు కానీ చేసి మోదుగ ఆకుల విస్తరిలో గాని జిల్లేడు చెట్టు ఆకుల విస్తరిలో గాని పెట్టాలి తిరుమణి లేదా పసుపు కుంకుమ గంధము ఒక రూపాయి దక్షిణ కాషాయ రంగు వస్త్రం జండా ఒకటి ఒక ఊదుకడ్డి.  గురువర్గ లగ్నజులగు ఇతర వ్యక్తులతో ముందువైపు తల మీద నుండి పాదముల వరకు వెనుకవైపు తల మీద నుండి పాదముల వరకు దిగదీయాలి లేదా ఒకటి లేదా పది చుట్టూ తిప్పి సూర్యోదయ కాలమున నాలుగున్నర గంటల నుండి 6 మధ్య తూర్పు దిశకు తీసివేయాలి. ఈ విధంగా తారాబలాన్ని బట్టి కూడా గమనించి ఒకటి లేదా పది దినములు ఈ విధంగా శాంతి చేయాలి. అనారోగ్య కాలన్న తారాబలంను చూడకుండానే ప్రతి దినం శాంతి చేయాలి.

 
కుజ గ్రహ శాంతి విధి:
కుజగ్రహ కార్యకర్తల సంబంధ ధాన్యము 102 కంది గింజలను లేదా కంది బేడలను పులగముగా గాని పైన వివరించిన విస్తరాకులో పెట్టి తిరుమని లేదా సింధూరం  కుంకుమ గంధము చల్లాలి. 75 పైసలు దక్షిణ లేదా మూడు రూపాయి బిల్లలు దక్షిణగా పెట్టాలి.  మూడు ఎర్రని రంగు వస్త్రాలతో జెండా చేసి పెట్టాలి. ఎర్ర గన్నేరు పూలు గాని గులాబీ పూలు గాని కనకంబరం పూలు గాని మూడు లేదా 12 పూలు పెట్టాలి.  ఊదు కడ్డీ ఒకటి పెట్టి గురు వర్గ లగ్నజులగు ఇతర వ్యక్తుల ద్వారా ముందు వెనకాల తల మీద నుండి పాదాల వరకు దిగ తీయాలి లేదా అప్రదక్షిణ గా మూడు లేదా 12సార్లు తిప్పి మధ్యాహ్నం పదిన్నర నుండి 12 గంటల మధ్య దక్షిణ దిశకు తీసివేయాలి. ఈ విధంగా తారాబలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మూడు లేదా 12 దినాలు ఈ విధంగా శాంతి చేయాలి. అత్యవసరకాలంలో తారాబలం చూడనవసరం లేదు.

 
చంద్రగ్రహ శాంతి విధి:
చంద్రగ్రహ కారకత్వ సంబంధ ధాన్యము 105 వడ్ల గింజలను లేదా బియ్యము, చెక్కర, పాలు కలిపి పొంగలిని గాని లేదా అన్నము పెరుగు లేదా మజ్జిగ గాని కలిపి ఆరు మోదుగ ఆకుల విస్తర్లు పెట్టాలి పసుపు లేదా శ్రీకాంతము చల్లాలి 150 పైసలు(ఆరు రూపాయల బిల్లలు) దక్షిణ గా పెట్టాలి.  ఇంతక రంగు జెండాగా  6 జెండాలు చేయాలి ఒకటి, చమురు వత్తి దీపం పెట్టి గురువర్గ లగ్నజులకు ఇతర వ్యక్తులతో ముందు వెనకాల నుండి తల మీద నుండి పాదాల వరకు దిగ తీయాలి. లేదా అప్రదక్షిణగా ఆరు లేదా 15 చుట్టు తిప్పి రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు పై కార్యక్రమాన్ని ఆచరించి వాయువ్య దేశకు తీసివేయాలి. ఈ విధంగా తారాబలాన్ని బట్టి కూడా పరిగణలోకి తీసుకొని ఆరు లేదా 15 దినాలు శాంతి చేయాలి అత్యవసర పరిస్థితిలో తారాబలం చూడవలసిన పనిలేదు

 
కేతు గ్రహమునకు శాంతి విధి :
ముందుగా కేతు గ్రహ కారకత్వ సంబంధముకు ధాన్యము 107 ఉలవ గింజలను గాని లేదా బియ్యము తో కలిపిఉలవ బేడలు కలిపి పులగముగా గాని పైన వివరించినట్లుగా గాని రాగి ఆకు విస్తరిలో పెట్టాలి పసుపు లేదా శ్రీగంధం చల్లాలి 125 పైసలు (8 రూపాయల బిల్లలు) దక్షిణగా పెట్టాలి. ఊదా రంగు గుడ్డ జెండాలు ఎనిమిది జండాలుగా చేసి పెట్టాలి. ఊదుకడ్డి ఒకటి పెట్టి ఇతర గురువర్గ జాతకుల ద్వారా ముందు వెనకాల నుండి 8సార్లు తల మీద నుండి పాదాల వరకు దిగ తీయాలి లేదా అప్రదక్షిణగా ముందువైపు 8సార్లు వెనుకవైపు ఎనిమిది సార్లు తిప్పి రాత్రి ఒకటి నుండి 3 గంటల సమయాన పై కార్యక్రమాన్ని ఆచరించాలి. ఆ తర్వాత దిగదీసిన దాన్ని ఏశాన్య దిశకు తీసివేయాలి .


గురు గ్రహ శాంతి విధి :
గురు గ్రహ కారకత్వ సంబంధాన్యమగు శనగలను లేదా శనగపప్పు గింజలను 108 గాని లేదా శనగ గుగ్గిలను గాని తయారుచేసి పైన వివరించినట్లుగా రాగి ఆకుల విస్తరిలో పెట్టాలి. పసుపు లేదా శ్రీగంధం ను చల్లాలి 450 పైసలు (తొమ్మిది రూపాయ బిల్లలు) దక్షిణగా పెట్టాలి. పసుపు రంగు వస్త్రం జెండాలు తొమ్మిది పెట్టాలి. ఒకటి ఉడుకడ్డి పెట్టి ఇతర గురువర్గ జాతకుల ద్వారా ముందు వెనకాల 9సార్లు తలమీద నుండి పాదాల వరకు దిగదీసి లేదా అప్రదక్షిణ గా ముందు వైపు 9సార్లు వెనక వైపు 9సార్లు అపసవ్యంగా తిప్పి రాత్రి 1:30 నుండి 3 గంటల సమయాన పై కార్యక్రమాన్ని ఆచరించాలి. ఆ తర్వాత దిగదీసిన దానిని ఈశాన్య దిశకు తీసివేయాలి.
ఇట్లు శనివర్గ జాతకులకు గురువర్గ గ్రహములకు సామాన్య శాంతిని కూడా ఆచరించి నవగ్రహ శాంతిని పొందవచ్చును.

Comments