chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Saturday, October 26, 2019

జాతక దోషాలు-కాలసర్ప దోషం (నాగదోషం) - chintamani free astrology

జాతక దోషాలు
chintamani free astrology
chintamani free astrology

కాలసర్ప దోషం (నాగదోషం)

రాహుకేతువులు లగ్నంలో గానీ, 7వ స్థానంలో గానీ, 2వ స్థానంలో గానీ, 8వ స్థానంలో గానీ ఉంటే కాలసర్పదోషం తీవ్రంగా ఉంటుంది.
దీనినే రాహుకేతు దోషం అని కూడా అంటారు.

రాహుకేతు దోషాలు తీవ్రంగా ఉన్నవారికి ప్రయత్నాలు ఫలించకపోవడం, అప్పులు, నష్టాలురావడం, నిరుద్యోగం, అతికోపం, దుర్మార్గపు ప్రవర్తన, అనారోగ్యాలు, గర్భస్రావాలు, పాము లేదా విష కీటకాలు కాటు, వ్యభిచారం, త్రాగుడు, జూదం వంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు ప్రమాదంగా మారతాయి.
గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండటం కూడా కాల సర్పదోషమే.

పరిష్కార మార్గాలు :
1. శ్రీ కాల హస్తిలో రాహుకేతు పూజ చేయించడం.
2. రాహు కేతువులకు మినుములు, ఉలవలు దానం
3. అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు చేయించాలి.
4. గణపతికి అటుకులు బెల్లంతో నైవేద్యంతో పూజలు చేయడం.
5. నాగేంద్రస్వామి 2 వెండి పడగలకు అభిషేకం చేయడం.
6. రాహుకేతుల దోష నివారణకు ఏదైనా గానీ, అన్నీ గానీ శక్తి పీఠాలు దర్శించాలి.
7. విజయవాడ కనక దుర్గమ్మ, సికింద్రాబాదులో ఉజ్జయినీ కాళీమాత, జూబ్లీహిల్ సు పెద్దమ్మ దేవాలయాలను దర్శించడం వలన రాహుకేతువుల దోషం పోతుంది.
8. సింహాచంలం లోని ఆదివరాహస్వామిని దర్శించడం వలన రాహుదోషం తొలుగుతుంది.
9. క్రుష్ణా జిల్లా మోపి దేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హైదరాబాద్ లో స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించడం వలన, అభిషేకాలు చేయడం వలన నాగదోషం తొలగుతుంది.
10. నాగప్రతిష్ఠ చేయడం, బొగ్గులు నీళ్లలో వదలడం, శుక్ర, మంగళవారాలు పుట్టలో పాలు పోయడం వల్ల సర్పదోషం తొలగుతుంది.
Share:

Friday, October 25, 2019

జాతక దోషాలు (కుజదోషం) - chintamani free astrology

కుజదోషం : 
chintamani free astrology
chintamani free astrology

జాతక చక్రంలో దోషాల వలన మరియు ఇప్పుడు జరిగే దశవలన, ప్రస్తుత గ్రహస్థితి యైన గోచారం వలన మనవులకు అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు తొలగించు కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

జాతక చక్రంలో కుజుడు లగ్నం నుండి 2,4,7,8,12 స్థానాలలో ఉంటే కుజదోషం ఉన్నట్టుగా భావించబడుతుంది. చంద్రుని నుండి 2,4,7,8,12 స్థానాల్లో కుజుడు ఉంటే అది కూడా కుజ దోషమని చెప్పబడుతుంది. కాని దీనికి శాస్త్ర ఆధారం లేదు.
కుజదోషం - నష్టాలు

  1. కుజదోషం వలన వివాహాలు చాలా ఆలస్యమవుతాయి.
  2. కుజదోషం వలన కొంత మంది అసలు వివాహాలు కాకుండానే మిగిలిపోతారు.
  3. కుజదోషం వలన కుదిరిన వివాహాలు రద్దు అంవుతాయి.
  4. కుజదోషం వలన వివాహాలు కుదిరిన తరువాత తీవ్రమయిన తగాదాలు ఉంటాయి.
  5. కుజదోషం వలన వివాహం అయిన తరువాత విడిపోవడం జరుగుతుంది.
  6. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్య భర్తలలో ఎవరో ఒకరికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.
  7. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్యాభర్తలలో ఎవరో ఒకరు మరణిస్తారు.
  8. కుజదోషం వలన వివాహ జీవితానికి పనికిరాని వారితో వివాహం జరుగుతుంది.
  9. కుజదోషం వలన ఎక్కువ వయసు తేడాతో వివాహం జరుగుతుంది.
  10. కుజదోషం వలన వివాహం అయిన తరువాత భార్య భర్తను గాని భర్త భార్యను గాని చంపడం జరుగుతుంది.


పరిష్కార మార్గాలు :
  1. కుజదోషం  ఉన్న జాతకులకు కుజదోషం ఉన్న జాతకులతోనే వివాహం చేయాలి. కుజదోషం లేనివారికి కుజదోషం లేనివారితో వివాహం చేయ్యాలి.
  2. వివాహానికి ముందు కుజుడికి 7000 సార్లు జపం చేయించి పురోహితునికి కందుల దానం చేయ్యాలి. కుజదోషం శాంతిస్తుంది.
  3. సుబ్రహ్మణ్య స్వమికి మంగళవారాలు అభిషేకం చేయించినట్లయితే కుజదోషం శాంతిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజుకూడా పూజలు చేయాలి.
  4. మంగళవారం నాడు ఆంజనేయస్వామి ఆలయంలో 108 సార్లు ప్రదక్షిణలు 4  వారాలు చేస్తే కుజదోషం శాంతించి వివాహం జరుగుతుంది.
  5. నరసింహస్వామి  ఆలయాలు దర్శించి పూజలు చేయడం వలన కూడా కుజదోషం శాంతిస్తుంది.
  6. రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, సుభద్రా కళ్యాణం పారాయణం చెయ్యాలి.
  7. భగవద్గీత, రామాయం, భారతం, భాగవతం వంటి గ్రంధాలు ఇంట్లో ఉంచడం వలన కుజదోషం శాంతిస్తుంది. 
  8.  వీటిని చదవండం వలన, వినడం వలన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
chintamani free astrology
For Free Astrology click here



Share:

వధూవరుల జాతకాలు సరిచూచుట - chintamani free astrology

వధూవరుల జాతకాలు సరిచూచుట

(వివాహ పొంతనలు, అష్టగణ కూటమి - Matching Points for Marriage)

chintamani free astrology
chintamani free astrology

1. నక్షత్రాలకు గణాలు : 
వధువు నక్షత్రం, వరుని నక్షత్రం తీసుకొని పట్టిక ప్రకారం ఎన్ని పాయింట్లు వచ్చాయో చూడాలి( కొన్ని పంచాంగం పుస్తకాలలో నక్షత్ర పట్టికలు ఇస్తారు. వీలైతే పంచాంగం పుస్తకం చూసి కొనుగోలు చేయండి.) . గరిష్ట సంఖ్య 36. ఈ 36 కు కనీసం 18 పాయింట్లు వస్తే జాతకాలు కలిసినట్లు, లేదంటే కలియనట్లు.

2. షష్టాష్టక దోషం : 
వధువు/ వరుడు యొక్క రాశి నుండి వరుడు/ వధువు రాశి 6వది గానీ 8వ ది గానీ కారాదు. రాశులకు చూసినట్లే లగ్నాలు కూడా షష్టాష్టక దోషం చూడాలి. షష్టాష్టక దోషం రాశికి గానీ, లగ్నానికి గానీ ఉన్నట్లయితే జాతకాలు కలువడం లేదని అర్ధం.

3. కుజ దోషం :  
వధూదరులిద్దరికీ కుజ దోషం ఉండాలి, లేదంటే ఇద్దరికీ ఉండకూడదు. (కుజ దోశం గురించి ప్రత్యేక వ్యాసం మన బ్లాగ్ లో ఉంది. చూడగలరు)

4. కుటుంబ స్థానం : 
ఇద్దరి జాతకాలలోనూ రెండవ స్థానం పరిస్థితి చూడాలి. వధువు మరియు వరుని జాతకంలో రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మంచిది. ఒక వేళ రెండవ స్థానంలో పాప గ్రహాలు ఉంటే ఇద్దరి జాతకాలలోనూ ఉంగేటట్లు చూడాలి.

5. రాశులు- తత్వం: 
ప్రతి ఒక్కరి జాతకంలో లగ్న కుండలి పరిశీలించినపుడు అగ్ని తత్వం, భూతత్వం, వాయు తత్వం, జలతత్వ రాశులు ఉంటాయి.
అగ్ని తత్వ రాశులుకు వాయు తత్వరాశులు కలుస్తాయి. అలాగే భూతత్వ రాశులు జలతత్వ రాశాలు కలుస్తాయి. వీటికి విరుద్ధంగా అగ్ని-జలం, వాయువు-భూమి కలవవు.
 


గమనిక : వివాహ సమయంలో జాతుల పొంతన అనేది సమర్ధుడైన జ్యోతిష్య పండితునితో చేయించడం మంచిది.

( వివాహ పొంతనలు మరియు జాతక పరిశీలకు మమ్మలను సంప్రదించ వచ్చు)

 - శ్రీరాం మనూహర్, Astrologer, Cell: 9032686233

Share:

మన ఆచారాలు - అర్ధాలు -2 chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
మన ఆచారాలు - అర్ధాలు -2 :
1. కాళ్ళ కడుక్కోవడం :
బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్లు కడుక్కోవాలి. దూర ప్రయాణం చేసి వచ్చిన అతిధి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వవలెను. ఈ విధంగా చేసిన సమస్త దరిద్రాలు వదిలి సుఖంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. దరిద్రాలు వదిలి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
2. నమస్కారం చేయడం :
పెద్దలకు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం మంచిది. దీని వలన వారి దీవెనలు మనకు ఆశీర్వాద బలంగా అందుతాయి.
3. పాదాభి వందనం :
పాదాలు అద్ర్రుష్ట కారకమైన బ్ర్రుహస్పతికి యొక్క కారకాలు, పెద్దలకు పాదాభివందనం చేసినట్టయితే సంపదలు, అద్ర్రుష్టం, ఆరోగ్యాలు కలుగుతాయి.
4. గడప మీద కూర్చోవడం :
గడపమీద కూర్చుంటే తలకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి.
5. గడప మీద తుమ్మరాదు :
ఈ విధంగా చేసినా ఆపదలకు సంకేతం, అలా జరిగితే కొద్దిగా నీళ్లు తీసుకొని తుమ్మినవారి తలపై జల్లాలి.
6. భోజనం చేస్తూ తుమ్మరాదు :
భోజనం చేసేటప్పుడు తుమ్మితే ఎడమ చేతిని నీటితో తడిపిన ఆ దోషం పోతుంది.
7. ఈశాన్యంలో తేనె తుట్ట :
ఇంటికి ఈశాన్యంలో తేనె తుట్ట పడితే అది ఒక రాబోయే చెడుకు సంకేతం. తుట్ట వెంటనే తీసి వేసి శాంతి చేయించుకోవాలి. శాంతి అనగా ఇల్లు శుభ్రముగా కడిగి వాస్తు హోమం చేయించాలి.
8. కదిలే శ్మశానం కూదడు:
మనిషి చనిపోతే శ్మశానంలో కాలుస్తాం లేదా పూడుస్తాం, ఐతే కోళ్లు, మేకలు, చేపలు వంటి వాటి మాంసం ఆరగిస్తున్నాం. అంటే మనిషి కదులుతున్న స్మశానం. వేదాలలో అన్నిటికన్నా గొప్ప ధర్మం అహింస. అందుకే అహింసా పరమోధర్మహ : అన్నారు.
మాసం మానితే జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించగలరు.
9. బూజు దులపాలి : 
ఇళ్ళలోని బూజు దరిద్రానికి చిహ్నం, బూజు ఎప్పటికప్పడు దిలిపి ఇల్లు శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.  శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి తాండవిస్తుంది.
chintamani free astrology
For Free Astrology click here


Share:

మన ఆచారాలు - ప్రయోజనాలు - chintamani free astrology

మన ఆచారాలు - ప్రయోజనాలు 
chintamani free astrology
chintamani free astrology

1. గడపకు పసుపు -కుంకుమ :
పసుపు రంగు శుభానాకి గుర్తు, ఎరుపు రంగు అభివ్రుద్దికి గుర్తు, మన ఇళ్ళకు ఉన్న సింహద్వారపు మరియు ఇతర ద్వారాలకు పసుపు రంగు, ఎరుపు రంగు డిజైన్లు వేయాలి. శుభ సమయాలలో గడపలకు పసుకు కుంకుమ రాయాలి. అటువంటి ఇళ్ళల్లో సంపద, ఆరోగ్యం, వివాహాలు, సంతానాలు ఉంటాయి.
2. కట్టు, బోట్టు :
ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ఇంటికి వచ్చిన ఆడపడచులకు, అతిధులకు అతిధి మర్యధలతో భోజనం పెట్టి భహుమతులు ఇవ్వడం - ఇలా చేసిన ఇళ్ళు ఇంద్రవైభవం అనుభవిస్తాయి.
3. ద్వారాణికి తోరణాలు :
ప్రతి పండుగకు, వేడుకగా గడపకు పచ్చటి మామిడాకుల తోరణాలు కట్టాలి. అలా కడితే లక్ష్మిదేవి ఆ ఇంటిలో కాపురం ఉండి అన్ని ఐశ్వర్యాలను మనకు ఇస్తుంది.
4. చేతికి గోరింటాకు :
గోరింటాకు మంచి ఔషదమే కాక అద్ర్రుష్టదాయిని కూడా, గోరింటాకు అద్ర్రుష్టాలను, సిరి సంపదలను తెస్తుంది.
స్త్రీ,పురుషులు, పిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకోవచ్చు.
5. చేతికి గాజులు : 
ఇల్లాళి చేతికి గాజులు గలగలలాడితే ఆ ఇంట్లో కాసులు గలగలలాడుతాయి. బంగాపు గాజులు ఎన్ని వేసుకున్నప్పటికీ వివాహం అయిన స్త్రీలు మట్టి గాజులు కూడా ధరించాలి.
6. పూలు - ధన సంకేతాలు : 
మీరు పూలు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే ధనం మీకు అంత బాగా వస్త్తుంది. గడపలకు పూల దండలు వేయాలి. ఆఫీసులలో ఇళ్లల్లోనూ తొట్టెలు, గిన్నెలలో రంగురంగుల పూలు వేయాలి. ఆడువారి జడలో మల్లెలు, విరజాజులు, చామంతులు ధరించాలి. కలువపూలు లక్ష్మిదేవి ఇష్టం. ఆ తల్లిని కలువ పూలతో పూజించాలి. దేవుడి పటాలకు పూలదండలు వేయాలి. గులాబీలను పూజలో వాడాలి. పూలెక్కువగా ఉపయోగిస్తే డబ్బు ఎక్కువగా రావడం ఖాయం.
7. ఇళ్ళకు సున్నం- రంగులు : 
ఎప్పటి కప్పడు ఇంటికి సున్నం వేయడం చేయాలి, కనీసం 3 సంవత్సరాలకు ఒక సారి రంగులు వేయాలి. సున్నం లేక రంగులు లేక వెలవెలబోయే ఇల్లు దరిద్ర నిలయాలు.
8. ముగ్గులు :
పల్లెటూళ్లలో పేడనీళ్లు చల్లి మంచి ముగ్గలు పెడతారు. పట్నాలలో కూడా గచ్చు మీద చక్కటి ముగ్గుల, రంగురంగుల ముగ్గులు వేస్తే ఆ ఇంటి వారు ఆయురారోగ్యాలతో, సంపదలతో ప్రకాశిస్తారు.
9. ఇంట్లో దీపం :
తూర్పు మధ్యన లేక పడమర మధ్యన పూజపెట్టు కొని ఆపూజ వద్ద ఎల్లప్పడు దీపం వెలిగి ఉంటే ఆ ఇంటి వారికి కష్టాలు రావు. అద్ర్రుష్టాలు కలిసి వస్తాయి.
10. ఆగ్నేయంలో అఖండ దీపం: 
కోరికలు తీరనప్పడు, కష్టాలు కలిగినప్పడు, అనారోగ్యాలు, ఆర్ధిక బాధలు వేదిస్తున్నప్పుడు ఇంటికి ఆగ్నేయంలో ఒక అఖండ దీపాన్ని వెలిగించి మూడు నెలలు ఆరకుండా ఉంచితే మీరు కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. దీనిలో సందేహం లేదు.
chintamani free astrology
For Free Astrology click here


Share:

Thursday, October 24, 2019

దేవుని పటాలు ఎక్కడ ఉంచాలి - chintamani free astrology

దేవుని పటాలు ఎక్కడ ఉంచాలి.
chintamani free astrology
chintamani free astrology
1. శ్రీ వెంకటేశ్వర స్వామి 
వెంకటేశ్వరస్వామి పటాలను ఇంట్లోగాని, ఆఫీసులలో గాని, షాపులలో  తూర్పు లేదా పడమర మాత్రమే ఏర్పాటు చేయవలెను. ఉత్తరములో మరియు దక్షిణములో ఏర్పాటు చేయరాదు. వెంకటేశ్వరస్వామి పటాలు సుఖశాంతులను, ధన సంపదలను ఇస్తాయి.
2. విష్ణుమూర్తి, రాముడు, క్రిష్ణుడు :
విష్ణుమూర్తి పటం మరియు విష్ణుమూర్తి అవతారాలైన రాముడు, క్రిష్ణుడు మొదలైన వారి పటాలను తూర్పుగోడలకు ఏర్పాటు చేయవలెను. దక్షిణం, ఉత్తరం గోడలకు ఏర్పాటు చేయరాదు.
విష్ణుమూర్తి ధైర్యాన్ని ఇస్తాడు. రాముడు ప్రతాపాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు.
క్రుష్ణుడు సౌఖ్యాన్ని, ఆనంధాన్ని ఇస్తాడు.
3. శివుడు :
శివుడి పటం పడమర గోడకు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం, తూర్పు గోడలకు కూడా ఏర్పాటు చేయవచ్చను.
దక్షిణ, ఉత్తర దిశలలో ఉంచరాదు.
శివుడు భయాన్ని పోగొట్టి ఆయుర్ధాయాన్నిస్తాడు.
4. గణేషుడు :
వినాయకుడి పటం ఉత్తర దిశ గోడకు ఉచడం శ్రేయస్కరం. మనం ఇంట్లో ఉంచే వినాయకుడి  తొండం ఆయనకు ఎడమవైపునకు తిరిగి ఉండాలి. అనగా చూచే మనకు కుడి వైపునకు తిరిగినట్లుగా కనిపించాలి. గణేశుడి ప్రతిమను తలుపులపై చెక్కరాదు.
గణేశుడు విఘ్నాలను పోగొట్టి ధనాన్ని, కార్యజయాన్నిస్తాడు.
5. ఆంజనేయుడు :
ఆంజనేయుడి పటాన్ని ఉత్తరపు గోడకు గాని, దక్షిణపు గోడకు గాని ఏర్పాటు చేయవలయును. ఆంజనేయస్వామి తోక, ముఖం ఆయనకు ఎడమవైపనకు తిరిగేట్లుగా ఏర్పాటు చేయడం మంచిది. అనగా చూచే మనకు కుడివైపునకు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఆంజనేయస్వామి ఆరోగ్యాన్ని, ధైర్యాన్నిస్తాడు. దెయ్యాలను, పిశాచాలను ప్రారదోలుతాడు.
ఆంజనేయస్వామి పటాల క్రిందనుండి నడువరాదు.
6. లక్ష్మీదేవి :
కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మాత్రమే ఇంటి యందు ఏర్పాటు చేయవలయును. నుంచుని ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేయరాదు. లక్ష్మీదేవి పటాన్ని ఉత్తరపు గోడకు గానీ, తూర్పు గోడకు గాని ఏర్పాటు చేయాలి. లక్ష్మదేవి పటాన్ని వాయువ్యంలో ఉత్తరపు గోడకు, ఆగ్నేయంలో తూర్పుగోడకు ఏర్పాటు చేస్తే ధనాదాయం బాగుంటుంది. శుభం కలుగుతుంది. వివాహాలు సకాలంలో అవుతాయి.
లక్ష్మీదేవిని ద్వారాలపై, గుమ్మాలపై చిత్రించరాదు. లక్ష్మీదేవి పటాల క్రిందనుండి నడువరాదు.
7. షిరిడీ సాయిబాబ :
బాబా పటాన్ని తూర్పు, ఈశాన్యంలో గాని, తూర్పు ఆగ్నేయంలో గాని, తూర్పు మధ్యలోగాని, ఉత్తరం మధ్యలోగాని ఏర్పాటు చేయవచ్చు.
8. నరసింహస్వామి : 
నరసింహస్వామి పటాన్ని ఇంట్లో పెట్ట కూడదని కొందరి నమ్మకం. నరసింహస్వామి పటాలను దక్షిణంలో గాని, పడమరలోగాని ఏర్పాటు చేయవచ్చును.
అయితే ప్రతీరోజు ధూప, దీప నైవేద్యాలు సమర్పించాలి.
9. కుమారస్వామి :
కుమారస్వమి పటాన్ని ఇంట్లో పెట్టకూడదనేది కొందరి నమ్మకం, కుమారస్వామి పటాలను, కేలండర్లను తమిలనాడులో విశేషంగా ఏర్పాటు చేస్తారు. దోషం లేదు. కుమారస్వమి పటాలను దక్షిణంలో గాని, ఉత్తరంలో గాని ఏర్పాటు చేయవచ్చను.
10. కనకదుర్గమ్మ అమ్మవారు : 
ఇంట్లో పడమర గోడకు గాని, తూర్పు గోడకు గాని పటం ఏర్పాటు చేసుకోంచ్చును.
11. సత్యనారాయణ స్వామి :
స్వామి వారి పటాన్ని ఇంట్లో తూర్పుగోడకు గానీ, పడమర గోడకు గానీ ఏర్పాటు చేయవచ్చును.

ఇంట్లో- ఆఫీసులలో ఉండకూడనివి :

1.  సర్పాలు, డ్రాగన్లు, కప్పలు మొదలైన పటాలు బొమ్మలు ఇళ్ళల్లో పెట్టడం భారతీయ వాస్తుకు విరుద్దం.
కావున వీటిని ఇంట్లో ఉంచరాదు.
2. ఉగ్రమూర్తులైన చండీ శక్తుల పటాలను, ఉగ్ర ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహస్వామి పటాలు ఇళ్ళల్లో ఉంచరాదు.
3. ఆటవీ ద్రుశ్యాలు, ఆఫీసుల్లో ఉంచరాదు. జింక తలలు, పులి తలలు, పులి తోళ్ళు, జింక తోళ్ళు, ఉడతల, ముంగీసల తోళ్ళు మొదలైనవి ఇళ్ళల్లో ఉంచరాదు.
4. సింహం, పులి మొదలైన అటవిక జంతువుల పటాలు ఇళ్ళల్లో, ఆఫీసులలో ఉండరాదు.

ఇంట్లో- ఆఫీసులలో ఉండవలసినవి:
1. ఇంట్లో, ఆఫీసలలో ఏనుగు పటాలు, ఏనుగు బొమ్మలు పెడితే శుభం.
2. నెమలి పటాలు, నెమలి బొమ్మలు శుభం
3. గోమాత ద్రుశ్యాలు ఇంటికి శుభం చేస్తాయి.
4. పూర్ణకుంభం ఫోటోలు, చిత్రాలు మంచివి. తలుపులపై పూర్ణకుంభం, నెమళ్ళు, ఏనుగులు చెక్కడం శుభకరం.

chintamani free astrology
For Free Astrology click here

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels