chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Thursday, October 22, 2020

అలభ్య పుణ్యకాలములు -2020-21

అలభ్య పుణ్యకాలములు -2020-21

శనివారం-త్రయోదశి/పౌర్ణమి
ఆదివారం-సప్తమి
సోమవారం-అమావాస్య
మంగళవారం-చతుర్థి
బుధవారం-అష్టమి
గురువారం-ఏకాదశి
శుక్రవారం-పంచమి

ఈ రోజులలో ఆయా తిధులు ఉన్నట్లయితే వాటిని అలభ్య పుణ్య కాలాలు అంటారు.
ఈరోజు లలో ఆయా దేవతా స్తోత్రాలు, గ్రహ స్తోత్రాలు అష్టకాలు పఠించినట్లయితే ఒకసారి చదివితే వెయ్యిసార్లు చదివిన ఫలితం ఉంటుంది.
గ్రహణ సమయంలో గ్రహణం పట్టిన దగ్గర్నుంచి గ్రహణం విడిచే వరకు సోత్రాలు పఠించినట్లయితే వేయి  రేట్లు ఫలితం ఉంటుంది.

నవంబర్ -8 (ఆదివారం -సప్తమి)
ఉదయం 07:21 నిమిషముల వరకు తదుపరి అష్టమి

నవంబర్ -28 (శనివారం- త్రయోదశి)
ఉదయం 10:21 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి.

డిసెంబరు -12 (శనివారం -త్రయోదశి)
తె.జా. 3:50 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి

డిసెంబర్ -14 (సోమవారం-అమావాస్య)
రాత్రి 9:46 నిమిషముల వరకు తదుపరి పాడ్యమి.

జనవరి-6 (బుధవారం-అష్టమి)
రాత్రి 2:06 నిమిషముల వరకు తదుపరి నవమి.

జనవరి-12 (మంగళవారం- చతుర్థి)
మ. 12: 22 నిమిషముల వరకు తదుపరి అమావాస్య.

మార్చి -21(ఆదివారం- సప్తమి)
ఉదయం 7 : 10 నిమిషముల వరకు తదుపరి అష్టమి.

మార్చి -25 (గురువారం- ఏకాదశి)
ఉదయం 9: 47 నిమిషాలు తదుపరి ద్వాదశి.

ఏప్రిల్ -2 (శుక్రవారం - పంచమి)
ఉదయం 8 : 15 నిమిషాలు తదుపరి షష్ఠి.

వ్యక్తులు జాతకరీత్యా గ్రహాల యొక్క మహాదశ, అంతర్దశలో గ్రహాలు పాప స్థానంలో ఉన్న లేదా నీచ స్థితిలో ఉన్నట్లయితే ఆ గ్రహాల దేవతలకు సంబంధించిన స్తోత్రాలు పై తెలిపిన తిథులలో పటించినట్లయితే ఫలితం ఎక్కువగా గా ఉంటుంది.

- ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని గోచారరీత్యా ఉన్నవారు శనికి సంబంధించిన స్తోత్రములు చదివినట్లయితే శుభఫలితం ఉంటుంది.

- జాతకరీత్యా కుజ దోషం ఉన్నవారు కూడా కుజునికి సంబంధించిన స్తోత్రములు పటించవచ్చు.

- రాహు కేతువులకు సంబంధించి కాలసర్ప దోషం లు ఉన్నవారు కూడా రాహు కేతువులకు సంబంధించిన స్తోత్రములు పఠించినట్లైతే  శుభ ఫలితం ఉంటుంది.

పుట్టిన తేదీ, సమయం, పుట్టిన స్థలం ఆధారంగా మీ జాతక పరిశీలన చేసి జన్మకుండలి నందు గ్రహములు ఏ ఏ స్థితిలో లో ఉన్నాయి. ఏ దశ నడుస్తోంది వంటి వివరాలు తెలుసుకొనుటకు ఈ రోజే సందర్శించండి.
చింతామణి ఫ్రీ ఆస్ట్రాలజీ.

మా యూట్యూబ్ ఛానల్:
https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Tuesday, October 6, 2020

చీకటి-వెలుగుకు మధ్య ఏముంటుంది ? (day and night)

చీకటి-వెలుగుకు మధ్య ఏముంటుంది ?

చీకటి అంటే ఏమిటి ? వెలుగు అంటే ఏమిటి ?

చీకటి వెలుగులు లేకపోతే ఏమవుతుంది. ?

chintamani free astrolog

చీకటి-వెలుగులనే మనము  రాత్రి-పగలు అంటున్నాము.  వెలుగుకు మూలం, వెలుగును అందించేది సూర్యభగవానుడు.

భూమి తన చుట్టూతాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికి తెలిసిందే, దీనినే భూభ్రమనం, భూ పరిభ్రమనం అని అంటారు. భూభ్రమనం వలననే మనకు చీకటి వెలుగులు లేదా పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. భూపరిభ్రమనం వలన మనకు ఋతువులు, మాసములు (నెలలు) ఏర్పడుతున్నాయి. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగిరావడినికి ఒక సంవత్సర కాలం లేదా 365 (అర) రోజులు పడుతుంది.  ఇది సహజంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. దీనిని ఎవరూ ఆపలేరు.  చీకటి-వెలుగు (పగలు-రాత్రి) వలననే భూగోళం పై సమస్త జీవరాశుల మనుగడ జరుగుచున్నది. సూర్యుని వెలుగు వలన మొక్కలు కిరణజన్య సమ్యోజక క్రియ జరిపి తమ ఎదుగుదలకు, తద్వారా పలాలు, పుష్పాలు అందించి ఇతర జీవరాశులకు (మనుషులకు, జంతువులకు) ఆహారాన్ని సమకూర్చుతున్నాయి. రాత్రులందు వాతావరణంలోని కార్బన్ డై ఆకైడ్ (విషవాయువు) గ్రహించి ఆక్సిజన్ (ప్రాణవాయువును) విడుల చేస్తున్నాయి.  చీకటి వెలుగులు లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది. చీకటి వెలుగులు లేకపోతే జీవన చక్రం గతి తప్పుతుంది. తద్వారా సమస్త జీవరాశి మనుగడ నశిస్తుంది.

ఇదంతా భౌతికంగా మనకు కనిపించే విషయాలు.. చీకటికి, వెలుగుకు మధ్య మనం గుర్తించలేనిది, మనకు కనిపించనిది ఒకటి వుంది. అదే భ్రమణం (తిరగడం) ఈ భ్రమణమే లేకపోతే ఈ వెలుగు చీకట్లు అనేవి ఉండనే ఉండవు.

   అదేవిధంగా ఒక మనిషి జీవితంలో చీకటి-వెలుగులు అంటే అతనికి ఏర్పడే కష్ట-సుఖాలుగా మనం భావించుచున్నాము. మన కనులు (కండ్లు) వెలుగు, చీకటిలను గుర్తిస్తాయి. కనులు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది, కనులు మూసుకుంటే అంతా చీకటిగా ఉంటుంది. అంటే వెలుగుకు, చీకటి మధ్య మన కంటిపై కంటి రెప్ప ఉంది.  అది తెరుచుకొని ఉన్నంతసేపు వెలుగు, మూసి ఉన్నంతసేపు చీకటి ఉంటింది. అంటే మనకు వెలుగు చీకట్లు మన కంటిరెప్ప పై ఆధారపడి ఉన్నట్లుగా, కంటి రెప్ప వెలుగు, చీకట్లను చీకట్లను నియంత్రించేదిగా మనకు అనిపిస్తుంది. మరి కంటి రెప్పను నియంత్రించేది ఏమిటి ?. మన మెదడు, మరి మన మెదడు నియంత్రించేది ఎవరు ?. అంటే మన మనస్సు, మరి మన మనస్సును నియంత్రించేది ఎవరు ? అంటే మనమే, అంటే.... వెలుగు చీకట్లను పొందడం మనమీదనే  ఆధారపడి ఉందన్నమాట, ఆ విధంగా చూస్తే మన కష్టసుఖాలకు మనమే కారణం.. మన మనసు లో వెలుగు నిండితే అది సుఖం అవుతుంది. మన మనసులో చీకటి నిండితే అది కష్టం అవుతుంది. కష్టం వెంటే సుఖం, సుఖం వెంటే కష్టం కలిసే ఉంటాయి. జీవితంలో మొదటగా కష్టపడినవారికి తరువాత సుఖం తప్పక లభిస్తుంది. మొదట సుఖపడిన వారికి కష్టం చెప్పకుండా వస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకోవాలి అనేది నానుడి. అంటే వెలుగులో ఉన్నప్పుడే చీకటి విలువను గుర్తించాలి. చీకట్లో కలిగే ఇబ్బందులను గుర్తించినట్లే , సుఖంగా ఉన్నపుడే కష్టమొస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుండాలి. అలాకాకుండా కష్టాలకు కుంగిపోయి జీవితమే వ్యర్థం అనుకోకూడదు. వెలుగు చీకట్లను సమానంగా భావించి ముందుకు వెళితేనే మన మనుగడ సాధ్యమవుతుంది. 

  భూభ్రమనానికి కారణమై నిరంతరం భూభ్రమనాన్ని ఎవరు చేయిస్తున్నారో, వారే మన జీవితాలలో కష్టసుఖాలకు మూలం..

అతడే అంతర్యామి అయిన ఆ భగవంతుడు, అతడే ఆ సర్వేశ్వరుడు... చేయిస్తున్నది, చేస్తున్నది కూడా ఆయనే, తాను ఉన్నాడు అనుకునేవారికి ఉంటాడు. లేడు అనుకునేవారికి లేడు. ఉన్నాడు లో ఉంటాడు, లేడు లో లేడు ఆ లేనిది ఆయనే, ఉన్నదీ ఆయనే... 

సర్వ ప్రాణులయందు తను ఉన్నాని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఈ విషయాన్ని భోదించాడు. మన మంచి చెడులకై  మన చుట్టూ తల్లిగా, తండ్రిగా, గురువుగా, తోబుట్టువుగా, భార్యకు భర్తగా, భర్తకు భార్యగా, సంతానంగా,  మిత్రునిగా, శత్రవుగా అన్ని రూపాలలో తనే వుండి మన మనుగడకు కారణమువతున్నాడు. వీరిలో ఎవరో ఒకరి రూపంలో వుండి, జ్నానబోధ చేస్తునే వుంటాడు. మనము ఆ విషయన్ని గ్రహించలేము. ఒక ఉదాహరణగా మీరు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారనుకుందాము. స్వామి నన్ను ధనవంతుడిని చేయి అంటూ నిత్యం ప్రార్ధిస్తూనే వుంటారు. అపుడు ఆ భగవంతుడు నీ గురువు రూంలోనో, నీ స్నేహితుడి రూపంలోనో ఎవరో ఒకరి రూంపంలో ఉండి నీకు మార్గనిర్ధేశం (సలహా) ఇస్తాడు, కాని మనం వారి మాట వినం, తెల్లవారికి తెల్లవారు మన ఇంట్లో డబ్బుల మూట పత్యక్షం కావాలని కోరుకుంటాం. ఇలా అందరికి డబ్బుల మూటలు ఇస్తే కష్టపడాలి అని ఎవరు అనుకుంటారు. అప్పడు ఎవరు ఏ పనిచేయరు. ఒక ఇల్లాలు వండుకోవడం ఎందుకు డబ్బులున్నాయి కదా హోటల్ కు వెళ్ళి తిందాం అంటుంది. మరి హోటల్ వాడికి కూడా ఆ భగవంతుడు డబ్బుల మూట ఇచ్చాడు. వాడు ఎందుకు వండుతాడు, వాడు డబ్బులు పడేసి ఎవరైనా వండిపెడితే తిందాం అనుకుంటాడు. కష్టపడవలసిన అవసరం వాడికి కూడా లేదే, ఈ విధంగానే అందరూ అనుకుంటే మనం డబ్బులనే తిని బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది.  మనము ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆ భగవంతున్ని తెలుసుకున్నట్లే...

- సర్వే జనా సుఖినోభవంతు :

ధన్యవాదములతో...

శ్రీరామ్ మనూహర్ (వెన్ను రాము)

Share:

Monday, September 14, 2020

Sree Gurudatta Stotram - శ్రీ దత్తస్తవము

chintamani free astrology

శ్రీ దత్తస్తవము

1. ఓం దత్తాత్రేయం మహాత్మానం | వరదం భక్తవత్సలం 

ప్రపన్నార్తిహరం వందే | స్మర్తృగామీ సనో వతు 

2. దీనబంధుం కృపాసింధుం | సర్వకారణ కారణం 

సర్వరక్షాకరం వందే | స్మర్తృగామీ సనో వతు 

3.శరణాగత దీనార్త | పరిత్రాణ పరాయణం 

నారాయణం విభుం వందే | స్మర్తృగామీ సనో వతు

4 సర్వానర్థ హరం దేవం | సర్వమంగళ మంగళం 

సర్వక్లేశహరం వందే | స్మర్తృగామీ సనో వ వతు 

5. బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞులు | భక్తి కీర్తి వివర్ధనం

భక్తాభీష్టప్రదం వందే | స్మర్తృగామీ సనో వతు 

6. శోషణం పాప పంకస్య | దీపనం జ్ఞాన తేజసః 

తాప ప్రశమనం వందే | స్మర్తృగామీ సనో వతు 

7. సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం 

ఆపదుద్ధరణం వందే | స్మరామీ సనో వతు 

8. జన్మసంసార బంధఘ్నం | స్వరూపానంద దాయకం 

నిశ్రేయసపదం వందే | స్మర్తృగామీ సనో వతు

9. జయలాభ యశఃకామ | దాతుర్ధత్తస్యయత్స్తవం 

భోగమోక్ష ప్రదస్యేమం | ప్రపఠేత్ సుకృతీ భవేత్

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Subrahmanya Karavalam Stotram- శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

 శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో !

శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో ॥

శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 

దేవాధి దేవసుత దేవగణాధినాథ 

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ॥ 

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే| 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||2

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ |

తస్మాత్ర్పదాన   పూరిత భక్త కామ ॥ 

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప | 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||౩

 క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల |

(చాపాది)పాశాది శస్త్ర పరమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4

దేవాది దేవ రథమండల మధ్యవేద్య |

దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం |

శూరం నిహత్య సురకోటిభి రీద్యమానః 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 

హారాదిరత్న మణియుక్త కిరీటహార | 

కేయూర కుండల లసత్కవచాభిరామ ||

హేవీర తారక జయామర బృందవంద్య |

వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ || 6 

పంచాక్షరాది మను మంత్రితగాంగతోయైః 

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రా

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ ః 

వల్లీసనాథ మమదేహికరావలంబమ్ || 7

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||

భక్త్వాతు మా మవ కళాధర కాంతి కాంత్యా |

వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ || 8 

ఫలశ్రుతి: సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః॥ 9 

సుబ్రహ్మణ్యాష్టక మిదం పాత్ర రుత్థాయ యః పఠేత్ | 

కోటి జన్మ కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి|| 10

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Tuesday, September 8, 2020

Sree Aadithyadi Navagraha Pancha Sloki Stotramulu

శ్రీ నవగ్రహ దేవతా పంచశ్లోకి స్తోత్రములు

రవి

సోమ

మంగళ

బుధ

గురువు

శుక్ర

శని

రాహువు

కేతువు

అన్ని నక్షత్రాలవారు, రాశుల వారు గోచార రీత్యాకాని, మహాదశ నడుస్తున్న సమయంలో ఆయా గ్రహాలకు సంబంధించిన పంచశ్లోకాలను పఠించినట్లయి గ్రహదోశ విముక్తి కలిగి శుభాలు కలుగుతాయి. 

శ్లోకాల కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Kethugraha Pancha Sloki- శ్రీ కేతుగ్రహ పంచశ్లోకి

 శ్రీ కేతుగ్రహ పంచశ్లోకి 

ఫళాశ పుష్పసంకాశం తారకాగ్రహ మస్తకం |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం || 1

ధూమ్ర వర్ణాం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం |

వైఢూర్యాభరణం చైవవవైఢూర్యమకుటం ఫణిం || 2

అన్త్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ |

గృధ్రానన గతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాస్తయే || 3

పాతునేత్ర పింగళాక్షః శ్రుతిమే రక్తలోచన |

పాతుకంఠం చమే కేతుః స్కందౌ పాతుగ్రహాధిపః || 4

ప్రణమామి సదాదేవం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ |

చిత్రాంబరధరం దేవం తం కేతుం ప్రణమామ్యహం || 5

అశ్విని, మఘ, మూల నక్షత్ర జాతకులు మరియు కేతు మహార్ధశ నడుస్తున్నవారు

ఈ పంచ శ్లోకిని పఠిస్తే కేతు గ్రహ అనుగ్రహం లభిస్తుంది.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Sree Rahugraha Pancha Sloki- శ్రీ రాహుగ్రహ పంచశ్లోకి

 శ్రీ రాహుగ్రహ పంచశ్లోకి

అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం |

సింహికాగర్బ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం || 1

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినం |

సైంహికేయం కరాళాస్యం భక్తానామభయ ప్రదం ||         2

శూర్పాకారాసన స్థశ్చ గోమేధాభరణప్రియః |

మాషప్రియః కాశ్యపర్షి నందనోభజగేశ్వరః ||         3

ఆరోగ్యమాయు రఖిలాంశ్చ మనోరథార్దాన్ |

తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురుసర్వదా || 4

కరాళవదనం ఖడ్గచర్మశూల వరాన్వితం |

నీలసింహాసనం ధ్యాయేత్ రాహుం తం చ ప్రశాంతయే || 5

ఆర్ధ్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులు మరియు రాహుమహార్ధశ నడుస్తన్నవారు

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే అన్ని శుభాలు కలుగును.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Shani Graha Pancha Sloki- శ్రీ శనిగ్రహ పంచశ్లోకి

 శ్రీ శనిగ్రహ పంచశ్లోకి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం |

ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం || 1

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే |

శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమోనమః || 2

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భాననే |

భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమోనమః ||         3

ధనుర్మండల సంస్థాయ ధనదాయ ధనుష్మతే |

తనుప్రకాశదేహాయ తామసాయ నమోనమః || 4

జ్వాలోర్ధమకుటాభాసం నీల గృధ్ర రథావహమ్ |

చతుర్భుజం దేవం తం శనిం ప్రణమామ్యహమ్ || 5

పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మరియు శని మహాదశ నడుస్తున్నవారు

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది.

If you like this Post Please Comment and Share your Near and Dear

.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Shukragraha Panch Sloki- శ్రీ శుక్ర గ్రహ పంచశ్లోకి

 శ్రీ శుక్ర గ్రహ పంచశ్లోకి

హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || 1

శుక్లాంబరం శుక్లమాల్యం శుక్లగంధానులేపనం |

వజ్రమాణిక్య భూషాఢ్యం కిరీట మకుటోజ్వలమ్ || 2

శ్వేతాంబర శ్వేతవపుశ్చతుర్భుజ సమన్వితః  |

రత్నసింహాసనారూఢో రథస్థోరజతత్పరః || 3

భృగుర్భోగకరో భూమీసురపాలన తత్పరః |

సర్వైశ్వర్యప్రద స్వర్వగీర్వాణ గణసన్నుతః || 4

దండహస్తంచ వరదాం భానుజ్వాలాజ్ఞ శోభితమ్ |

అక్షమాలా కమండలం దేవం తం భార్గవం ప్రణమామ్యహమ్ || 5

భరణి, పుబ్బ, పూర్వషాఢా నక్షత్ర జాతకులు మరియు శుక్ర మహార్ధశ నడుస్తన్నవారు

ఈ పంచశ్లొకి నిత్యం పఠిస్తే సర్వశుభాలు కలుగుతాయి.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Sree Gurugraha Pancha Sloki- శ్రీ గురుగ్రహ పంచశ్లోకి

 శ్రీ గురుగ్రహ పంచశ్లోకి

దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం |

బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం || 1

వరాక్షమాలాం దండం చ కమండలధరం విభుం |

పుష్యరాగాంకితం పీతం వరదాం భావయేత్ గురుం || 2

అభీష్టవరదాం దేవం  సర్వజ్ఞం సురపూజితం | 

సర్వకార్యర్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా || 3

ఆంగీరసాబ్దసంజాత అంగీరసకులోద్భవః |

ఇంద్రాదిదేవో దేవేశో దేవతాభీష్టదాయికః  || 4

బ్రహ్రపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః |

చతుర్భుజ సమన్వితం దేవం తం గురుం ప్రణమామ్యహమ్ || 5

పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మరియు గురు మహార్ధశ నడుస్తున్నావారు

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే అన్ని శుభాలు కలుగును.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Bhudagraha Pancha Sloki - శ్రీ బుధగ్రహ పంచశ్లోకి

శ్రీ బుధగ్రహ పంచశ్లోకి

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |

సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||         1

ఆత్రేయ గోత్రజో అత్యంత వినయో విశ్వపావనః |

చాంపేయ పుష్ప సంకాశ శ్చారణ శ్చారుభూషణః ||                 2

సత్యవాక్ సత్ససంకల్ప సత్యబంధు స్సదాదరః |

సర్వరోగ ప్రశమన స్సర్వ మృత్యునివారకః ||                 3

సింహారూఢం చతుర్భుజాం ఖడ్గం చర్మగదాధరం |    

సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థసిద్దదం ||                    4

బుధోబుధార్చిత సౌమ్యసౌమ్యః చిత్త శ్శుభప్రదః |

వరదాంకిత ముద్రితమ్ దేవం తం సౌమ్యం ప్రణమామ్యహమ్ ||         5

అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు మరియు బుధ మహార్ధశ నడుస్తున్న వారు

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే సకల శుభాలు కలుగుగుతాయి.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Kujagraha Pancha Sloki - శ్రీ కుజగ్రహ పంచశ్లోకి

 శ్రీ కుజగ్రహ పంచశ్లోకి

ధరణీగర్భ సంభూతం విద్యుక్యాంతి సమప్రభమ్ |

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ || 1

మహీసుత మహాభాగో మంగళో మంగళప్రదః |

మహావీరో మహాశూరో మహాబల పరాక్రమః ||         2

భరధ్వాజ కులోద్భూతో భూసుతో భవ్య భూషణః |

మేరుం ప్రదక్షిణం కృత్వాసర్వదేవత్మ సిద్దిదం || 3

నమస్తే మహాశక్తి పాణే నమస్తే లసద్వజ్రపాణే |

నమస్తే కటిన్యస్తపాణే నమస్తే సదాభీష్టపాణే || 4

చతుర్భుజాం మేషవాహనం వరదాం వసుధాప్రియం |

రత్తమాల్యాంబరధరం తం అంగారకం ప్రణమామ్యహమ్ || 5

మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు మరియు కుజమహాదశ నడుస్తన్నవారు

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే శుభాలు కలుగును.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Monday, September 7, 2020

Sree Chandragraha Pancha Sloki - శ్రీ చంద్రగ్రహ పంచశ్లోకి

 శ్రీ చంద్రగ్రహ పంచశ్లోకి

దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ   సముద్భవం  |

నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ || 1

కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః |

దశాశ్వరధ సంరూధో దండపాణిర్థనుర్ధరః ||         2

చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ |

చంద్రధ్యానం వ్రపక్ష్యామి మనఃపీడోశాంతయే ||         3

కుందపుష్పోజ్ఞలాకారో నయనాజ్ఞ సముద్బవః |

ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతిః ||         4

శ్వేత మాల్యామ్బరధరం శ్వేతగన్ధానులేపనమ్ |

శ్వేతచ్ఛత్ర ధరం దేవం తం సోమం ప్రణమామ్యహమ్ || 5

రోహిణి, హస్త, శ్రవణా నక్షత్ర జాతకులు మరియు చంద్రమహార్ధశ నడుస్తున్నవారు

ఈ పంచశ్లోకిని పఠిస్తే రోగ బాధలు తొలగిపోయి సర్వశుభాలు కలుగును.

If you like this Post Please Comment and Share your Near and Dear

.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sree Suryagraha Pancha Sloki - శ్రీ సూర్యగ్రహ పంచశ్లోకి

 శ్రీ సూర్యగ్రహ పంచశ్లోకి

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యతిం |

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరం || 1

సూర్యోఅర్యమా భగస్త్వష్టా పూషార్కస్సరితారవిః |

గభస్తి మానజ: కాలో మృత్యుర్దాతా ప్రభాకరః || 2

భూతాశ్రయో భూతపతిః సర్వలోక సమస్కృతః  |

స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః ||         3

బ్రహ్మ స్వరూప  ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుం త్రయీమూర్తీ దివాకరః || 4

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం || 5

కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రజాతకులు మరియు రవి మహార్ధశ నడుస్తున్న వారు 

ఈ పంచశ్లోకిని నిత్యం పఠిస్తే సర్వ శుభాకాలు కలుగును.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Saturday, June 20, 2020

Important News- ముఖ్యగమనిక

సూర్యగ్రహనము సందర్భముగా

చింతామణి  జ్యోతిష్యాభిమానులకు, సభ్యులకు, అనుసరిస్తున్నవారందరికి ముఖ్యగమనిక

తేది.21-6-2020 జ్యేష్ఠ బహుల అమావాస్య ఆదివారం రోజున ఉదయం 10.19 నిమిషాల నుండి మధ్యహ్నం 1.47 నిమిషముల వరకు సూర్యగ్రహనము సందర్భముగా మృగశిర, ఆరుద్ర నక్షత్రముల వారు, మిధనం, సింహం, కన్య, తులా లగ్నముల వారు, గోచార రీత్యా రవి ఉన్న రాశుల వారు, రవి దశ నడుస్తున్న వారు, జాతక చక్రములో రవి నీచలో ఉన్న వారు సూర్యగ్రహణము వీక్షించుటవలన దోషము ఏర్పడును. కావున గమనించగలరు.
.......................................................................................................................................................
అదే విధంగా చింతామణి ప్రశ్నాశాస్త్రము (Chintaamani.co.in online Free Astrology) ఉపయోగిస్తున్నవారు గ్రహణము సందర్భముగా ఏ విధమైన ప్రశ్నలు అడుగరాదు. తేది. 22.06.2020 సోమవారం నుండి యధావిధిగా ప్రశ్నాశాస్త్రమును ఉపయోగించుకొనవచ్చును.
.......................................................................................................................................................

గ్రహణ సమయంలో చేయవసిన కార్యములు:

  • యధావిధి స్నానాధులు ముగించుకొని ఇంటిలో దేవతలకు దీపారాధన చేయవచ్చను. 
  • గ్రహణ సమయమంతా దీపాలు వెలిగేవిధముగా చూసుకొనుట ఉత్తమము. అదే విధముగా అగరువత్తులు వెలిగించుట మంచిది. 
  • గ్రహణ సమయంలో దోషపరిహార్థం సూర్యభగవానుని మంత్రజపం, స్తోత్రములు పటించవచ్చును.
  • ఈ రోజున మాంసాహార భోజన, మధుపానం కూడదు. 
  • గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకొనకపోవడం ఉత్తమం. 
  • వృద్దులు, పిల్లలు, అనారోగ్య సమస్యవున్న వారికి మినహాయింపు.

పఠించవలసని మంత్రం: 

జపాకుసుమ సంకాశం - కాశ్యపేయం మహాధ్యుతిం, తమోరిం సర్వపాపఙం ప్రణతోస్మి దివాకరం.
లేదా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పటించవచ్చును.

గ్రహణానంతరం చేయవలసని కార్యములు:

  •  స్నానము చేసి ఇంటి ఆవరణలో ఎనిమిది దిక్కులలో పసుపు కుంకుమ (లేదా పసుపు నీళ్ళు ) చల్లి కర్పూరం వెలిగించి ఇష్టదేవతలను ప్రార్ధించాలి.
శుభమస్తు 

Share:

Sunday, May 17, 2020

Rudrakavacham-రుద్రకవచమ్

రుద్రకవచమ్

free astrology - chintamani (Rudra kavacham)
free astrology-chintamani (lord shiva)

అస్యశ్రీ రుద్రకవచస్తోత్రమహామంత్రస్య దూర్వాస ఋషిః అనుష్టుప్ఛందః
త్ర్యంబకరుద్రో దేవతా ఓం బీజం, హ్రీం శక్తిః  క్రోం కీలకం
మమ మనోభీష్ట సిద్ధ్యర్ధే జపే వినియోగః  హ్రామిత్యాది షడ్దిర్ఘైప్షడంగన్యాసః

శాన్తం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్ర్తం త్రినేత్రమ్
శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తమ్
నాగంపాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తాం స్ఫటిక మణి నిభం పార్వతీశం నమామి.
దుర్వాస ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్. 1
రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షయే
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా. 2
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః 3
నేత్రయోస్త్ర్యంబకః  పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః 4
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్ 5
హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః 6
బాహుమథ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్. 7
వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః 8
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్ 9
శీతోష్ణా దథ కాలేషు తుహిన ద్రుమంకంటకే
నిర్మనుష్యే సమేమార్గే త్రాహిమాం వృషభధ్వజ 10
ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్
మహాదేవప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్ 11
మమాఖ్యాతం సమానేన న భయం విందతి క్వచిత్
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్యవర్దనమ్ 12
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ 13
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహిత్రయీమయ 14
త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ 15
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే 16
గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల
త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ధి స్త్వం పరాయణమ్ 17
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యథా సదా
జ్వరభయం ఛింది సర్వజ్వరభయం ఛింది గ్రహభయం ఛింది 18
సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్
అస్యరుద్రలోకం సగచ్ఛతి శ్రీరుద్రలోకం సగచ్ఛత్యోనమ ఇతి
ఇతి శ్రీ స్కాందపురాణే దూర్వాసః ప్రోక్తం శ్రీ రుద్రకవచమ్.

---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

raghu graha panchavimshathi-శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం

శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం

ఈ స్తోత్రం రాహువు యొక్క 25 నామాలతో కూడినది, రాహు దోషముతో బాధపడే వారు మరియు అనేక సమస్యలు, రుగ్మతలతో వేదన చెందేవారు రాత్రి 9 గంటలు దాటిన తరువాత తలస్నానం చేసి మీ దేవుని మందిరంలో కూర్చుని ఈ రాహు పంచవింశతి ని 22 సార్లు పారాయణ చేసినట్లయితే
మీమీ సమస్యలకు త్వరిత గతినమార్గం సుగమమం అగును.

free astrology- chintaamani
free astrology- chintamani (lord raghu)
రాహుర్దానవ మంత్రిచ సింహికా చిత్తానంద |
అర్ధకాయ సదాక్రోధి చంద్రాదిత్య విమర్థనా ||
రౌద్రో రుద్రప్రియో దైత్య స్వభానుర్భానుర్ భీతిదా |
గ్రహరాజా సుధాపాయి రాకాతిష్యాభిలాషుకా ||
కాలదృష్టి కాలరూప శ్రీకంఠ హృదయాశ్రయా |
విదంతుదా సింహికాయో ఘోరరూపో మహాబలా ||
గ్రహపీడకరో ద్రాంష్ర్టికర్తనేత్రో మదోదరా |
పంచవింశతి నామాని సృత్వా రాహుం సదానరః  ||
ఫతశ్రుతి :
యః పఠేత్ మహతి పీడా తస్య నాశయతి కేవలం
ఆరోగ్యం పుత్రం తులం శ్రీయం ధ్యానం పశుంతథా
దదతి రాహుతస్మై రహపఠేత్ స్తోత్రం ఉత్తమం
సతతం పఠేత్ యస్తు జీవత్ వర్షం శతం నరః

---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Thursday, April 30, 2020

తారాబలం - చంద్ర బలం అంటే ఏమిటి ? ఎలా తెలుసుకోవాలి. ?

తారాబలం - చంద్ర బలం అంటే ఏమిటి ? ఎలా తెలుసుకోవాలి. ?

What is Tarabalam-Chandrabalam ? How to Know ?

tarabalam

     మనకు జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములు ప్రతి దినము రోజుకు ఒక నక్షత్రము చొప్పున ఆకాశ గమనమున చంద్ర గ్రహము ఉన్న మార్గమున ఉదయిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి భూమి పై జన్మించిన సమయంలో ఆ రోజు అతను జన్మించిన సమయానికో, అంతకు ముందో ఒక నక్షత్రం ఉదయించి ఉంటుందిం. అదే అతని జన్మ నక్షత్రం అవుతుంది. మన ఇంట్లో ఉండే క్యాలెండర్ లేదా పంచాగం చూసినట్లయితే ఏ ఏ రోజులలో ఏయే నక్షత్రం ఉందో, ఎప్పుడు ప్రారంభమైనదో, ఎప్పుడు ముగుస్తుందో ఉంటుంది. దానిని బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు పుట్టిన సంవత్సం క్యాలెండర్ లేనట్లయితే ఇప్పుడు ఆన్ లైన్ లో 100 సం. ల వరకు తెలిపే వెబ్ సైట్లు, యాప్ లు ఉన్నాయి, వాటిని ట్రై చేయండి. లేదా మీ ఇంట్లో పెద్దవారు మీ జన్మకుండలి రాయించి దాచి ఉంచుతారు దానిని బట్టి మీ నక్షత్రం తెలుసుకోండి. ఒక వేళ మీకు పుట్టిన తేదీ సమయం వంటి  వివరాలు తెలియక పోతే మీ పేరును బట్టి మీ రాశి, నక్షత్రం తెలుసుకునే పట్టిక ఈ మన బ్లాగులో ‘నామ నక్షత్రాలు’ అని పోస్టు ఉంది ఆ పోస్టులో చూసి తెలుసుకోవచ్చును.
   ఇక విషయానికి వస్తే ఈ 27 నక్షత్రాలలో మనకు శుభకార్యములకు పనికి వచ్చే నక్షత్రాలు, శుభకార్యములకు పనిచేయని నక్షత్రములు ఉంటాయి. ఏయే నక్షత్రలముల వారికి ఏయే నక్షత్రములు పనికి వస్తాయో, ఏవేవి పనిచేయవో తెలియజేసేదే ‘తారాబలం’ మీరు ఏదైన శుభకార్యం కాని, ప్రయాణం కాని, నూతన కార్యక్రములుగాని, వాహనం కొనుగోలుగాని, భూమి, గృహం కొనుగోలుగాని, ఇంట్లో వివాహాది శుభకార్యములు గాని ఇతరత్రా  చేయాలనుకున్నప్పుడు ఈ తారాబలం చూసకొని చేసినట్లయిన విజయం చేకూరుతుంది.

ఎలా తెలుసుకోవచ్చు ?
మనము ఈ 27 నక్షత్రాలను నవకములలో ( నక్షత్రాలను 9 చొప్పున మూడు వరుసలలో రాసినట్లయితే దానిని నవకం అంటారు) రాసినపుడు 1. జన్మతార, 2. సంపత్తార, 3. విపత్తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్తార, 6. సాధనతార,
7. నైదనతార, 8. మిత్రతార, 9 పరమమిత్ర తారులగా ఏర్పడుతాయి. తారాబలం తెలుసుకోవాలంటే ఈ నవకంను పరిశీలించవలసి ఉంటుంది.
మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ తారాబలం తెలుసుకోవాలంటే  
తారాబలం హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మనక్షత్రం లేదా నామనక్షత్రం  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న నక్షత్రం వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా మీరు లెక్కించడం నేర్చుకొని తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు పద్దతులు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి.

ముందుగా ఈ నక్షత్రముల పట్టకను పరిశీలించండి

ప్రథమ నవకం
ద్వితీయ నవకం
తృతీయ నవకం
తారాభలం
అశ్విని
మఖ
మూల
7 నైదనతార
భరణి
పుబ్బ (పూర్వఫల్గుని)
పూర్వాషాఢ
8 మిత్రతార
కృత్తిక
ఉత్తర (ఉత్తర ఫల్గుని )
ఉత్తరాషాఢ
9 పరమమిత్రతార
రోహిణి
హస్త
శ్రవణం
1  జన్మతార
మృగశిర
చిత్త
ధనిష్ఠం
2 సంపత్తార
ఆరుద్ర
స్వాతి
శతభిషం
3 విపత్తార
పునర్వసు
విశాఖ
పూర్వాభాద్ర
4 క్షేమతార
పుష్యమి
అనూరాధ
ఉత్తరాభాద్ర
5 ప్రత్యక్ తార
ఆశ్లేష
జ్యేష్ఠ
రేవతి
6 సాధనతార

తారాబలమును చూసుకునే  విధానం - 1

ఉదాహరణకు : ఒక వ్యక్తి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం హస్త  అనుకుందాం.
ఇపుడు మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ తీసుకొని మీకు కావలసిన రోజున ఏ నక్షత్రం ఉందో చూడండి.
ఉదా: తేది. 30.04.2020 గురువారం రోజున క్యాలండర్ లో పుష్యమి నక్షత్రం ఉంది.
ఇప్పుడు హస్త నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం ఏ వరసులో ఉందో పై పట్టికలో చూడండి.
హస్త నక్షత్రం 1వ (జన్మతార) వరుసలో ఉంది, పుష్యమి నక్షత్రం 5వ (ప్రత్యక్ తార) వరుసలో ఉంది
అంటే హస్త నక్షత్రం వారికి  ఆ రోజు పుష్యమి నక్షత్రం ప్రత్యక్ తార అవుతుంది.
దీనిని బట్టి ప్రత్యక్ తార ఫలితములు చూసుకోవాలి.
ఆ విధంగా ఏ నక్షత్రం వారైన వారి యెక్క జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం 1వ వరుసగా (జన్మతారగా) భావించి
అక్కడ నుండి మిగతా నక్షత్రాలు  2 , 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్లను మార్చకుంటూ పరిశీలించుకోవచ్చు.

మరొక విధానం (2) :

జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి మీకు కావలసిన రోజున ఉన్న నక్షత్రం (క్యాలెండర్ చూడండి) వరకు లెక్కించి వచ్చిన విలును 9 చే భాగించిగా వచ్చిన శేషము విలువను 1. జన్మతార, 2. సంపత్ తార, 3. విపత్ తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్ తార, 6. సాధన తార, 7. నైదనతార, 8. మిత్రతార, 9. పరమ మిత్రతార గా భావించవలెను.
ఉదా : హస్త నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు లెక్కించిన 23 అవుతుంది 23 ను 9 చే భాగించిన 9x2=18,
23-18= 5 , శేషం 5 వచ్చింది, అంటే 5. ప్రత్యక్ తార అవుతుంది. ఈ విధంగా వారి వారి నక్షత్రములను బట్టి తారా బలము తెలుసుకోవచ్చు.
గమనిక : జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రం ప్రకారం చూసుకోవచ్చు. నామ నక్షత్రముల కొరకు
ఈ మన బ్లాగులోనే  నామ నక్షత్రముల పట్టిక (పోస్టు)లో ఇవ్వడం జరిగింది. కావలసిన వారు చూసుకోగలరు.

గమనిక -1: శుభకార్యముల విషయములలో
ప్రథమ నవకములో జన్మతార, ద్వితీయ నవకములో విపత్తార, తృతీయ నవకములో ప్రత్యక్తార,
మూడు నవకములలో నైధన తారను విడిచి పెట్టవలయును.
ఇతర నవకములలో ఆ తారలు వచ్చిన దానములు ఇచ్చి దొషకాలము వదిలి పనులు చేసుకోవచ్చను.

వివాహ సమయంలో వధూవరులకు జన్మతార, విపత్తార, ప్రత్యక్తారలు వచ్చిన దోషశాంతికి
జన్మతారకు శాకదానము (కూరగాయలు)
విపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పు దానము
ఇచ్చి వివాహము జరిపించవచ్చును.
గమనిక-2
జన్మతార యందు గం. 02:48 ని.లు (సుమారు 3 గంటలు)
విపత్తార యందు గం. 01.12 ని.లు (సుమారు 1 గంట)
ప్రత్యక్, నైధన తారల యందు గం. 03.12 ని.లు (సుమారు 3 గంటలు) విడువ వలెనని కొందరి అభిప్రాయం,
చంద్రుడు జన్మతార, పరమ మిత్ర తారలయందు గాక విపత్తార, ప్రత్యక్తారల యందు
స్వోచ్చ స్వగతుడైన సర్వ కర్మలయందు శుభప్రదుడని కొందరి అభిప్రాయము.

తారలకు అధిపతులు  - ఫలములు

1. జన్మతార : అధిపతి సూర్యుడు , నెమలి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు. 
మనస్తాపము, అశాంతి, తలనొప్పి, తిండి, నిద్ర సరిగా లేకపోవుట జరుగును.
పరిహారం : గుమ్మడి పండు దానము చేసిన కొంత శాంతి కలుగును.
2. సంపత్తార : అధిపతి బుధుడు, వాహనము గుఱ్ఱము, 
అన్నివిధములుగా లాభించును. ధనాదాయము బాగుండును.
వ్యాపార, వ్యవహారములందు ప్రయత్నములు కలిసివచ్చును.
అన్ని విషయములలో యుక్తిగా వ్యవహరించుట జరుగును.
3. విపత్తార : అధిపతి రాహువు, వాహనము మేక, దోషకాలము సుమారు 1 గంట
అకారణ కలహము, హోదాకు తగని వ్యక్తులతో కలిసి తిరుగుట, శారీరక సంబంధమైన చికాకులు కలుగును.
పరిహారం :  బెల్లం దానం ఇవ్వవలెను.
4. క్షేమతార: అదిపతి గురుడు, ఏనుగు వాహనము
దైవ సంబంధమైన కార్యముల యందు పాల్గొనుట,
నూతన వ్యక్తులను కలుసుకొనుట, సంఘములో గౌరవ మర్యాదలు, ఆదరణ కలుగును,
ధనాదాయము బాగుండును.
5. ప్రత్యక్తార : అధిపతి  కేతువు,  కాకి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
ఇతరుల వలన మాటలు పడుట, ఏ పని కలిసి రాకపోవుట,
ప్రతి పనికి ఊహించని ఆటంకములు కలుగును.
పరిహారం :  ఉప్పును దానము ఇవ్వవలెను.
6. సాధనతార: అధిపతి చంద్రుడు,  నక్క వాహనము
గొప్పవారితో పరిచయము, మనస్సు ప్రశాంతముగా యుండుట,
నూతన స్త్రీలతో పరిచయము.
7. నైధనతార : అధిపతి శని, సింహము వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
అనవసర విషయములలో కలుగజేసుకొనుట, వాద ప్రతివాధములు చేయుట.
పరిహారం :  సువర్ణ దానము చేయుటవలన కొంత శాంతి కలుగును.
8. మిత్రతార: అధిపతి శుక్రుడు, వాహనము గరుత్మంతుడు
సంగీత సాహిత్యముల యందు అభిలాష, స్త్రీ సౌఖ్యం,
నూనత వ్యక్తులతో పరిచయం, ధనాదాయం బాగుండుట,
శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనుట జరుగును.
9. పరమ మైత్రతార: అధిపతి కుజుడు,  హంస వాహనము, 
ఊహించని చికాకులు, సాహసకార్యము చేయుటకు ఉత్సాహపడుట,
 వైరాగ్యము, ఇతరుల మీద కర్రపెత్తనం చేయుటకు ఆసక్తి చూపించెదరు.

 chandrabalam

మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి. చంద్రుడు రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున  ఒక నెలలో 12 రాశులలో సంచారం చేయును. ఒక వ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశినే అతని యొక్క జన్మరాశి అంటారు.  జన్మరాశి నుండి ప్రస్తుతం మీకు కావలసిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో లెక్కించనట్లయితే చంద్రబలం తెలుసుకోవచ్చను.

మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ చంద్రబలం తెలుసుకోవాలంటే  
చంద్రబలం  హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మరాశి లేదా నామరాశి  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న చంద్రుడు ఉన్నరాశి  వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా ఇక్కడ ఇవ్వబడిన  చంద్రబలం తెలుసుకునే విధానం చూడండి

జన్మరాశి  ఎలా తెలుసుకోవాలి ?

జన్మరాశిని తెలుసుకొనుటకు మీ పుట్టిన తేది క్యాలండర్ లేదా పంచాగం తీసుకోండి. ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. ఉదాహరణకు పుష్యమి నక్షత్రం అనుకుందాం (పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు ఉంటే ఆ రోజు చంద్రడు కర్కాటక రాశిలో ఉంటాడు) అపుడు మీ జన్మనక్షత్రం కర్కాటకం అవుతుంది. (మఖ, పుబ్బలో ఉంటే సింహరాశి అవుతుంది) ఇలా ఏయే నక్షత్రాలు ఉంటే ఏయే రాశి అవుతుందో ‘నామ నక్షత్రాలు’ అనే పోస్టులో మన ఈ బ్లాగు నందు ఇవ్వబడినవి కావలసిన వారు తెలుసుకోగలరని మనవి.
మరి పుట్టిన తేది లేనివారు వారి పేరులో ముందు అక్షరాన్ని బట్టి వారి రాశిని తెలిపే పట్టిక కొరకు ‘నామనక్షత్రములు’  పోస్టులో ఇవ్వబడినది  తెలుకోగలరు.

మరి చంద్రుడు ఉన్న రాశిని తెలుసుకోవడం ఎలా ?

చంద్రడు ఉన్న రాశిని తెలుసుకోవాడినికి కూడా ఇదే విధానం ఆ   రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. (ఉదాహరణకు హస్త నక్షత్రం అనుకుంటే కన్యరాశి అవుతుంది.)  (‘నామ నక్షత్రాలు’ పోస్టు చూడండి)

చంద్రబలం తెలుసుకునే విధానం:

జన్మరాశి నుండి చంద్రుడున్న రాశి వరకు గణన చేయగా 1, 3, 6, 7, 10, 11 రాశుల యందు చంద్రుడున్న ధనలాభము, కార్యసిద్ధి, శుభమును ఇచ్చును. మిగిలిన రాశుల యందు కార్యవిఘ్నము కలిగించును. 

ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మరాశి లేదా నామ రాశి తులా రాశి అనుకుందా, ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకుంటే తులారాశి నుండి, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, కర్కాటకం 10వ రాశి అవుతుంది. పై నంబర్లలలో 10 ఉంది కావున శుభం. ఇలా తెలుసోకవచ్చును.

శుక్లపక్షమున 2, 5, 9 రాశుల యందును, కృష్ణ పక్షమున 4, 8, 12 రాశుల యందును ఉన్న చంద్రడు తల్లి కుమారుడిని రక్షించునట్లు రక్షించునట్లుగా శుభమును కలుగ జేయును.

గమనిక: శుక్ల పక్షమున చంద్ర బలమును, కష్ణ పక్షమున తారా బలమును చూడవలెనని కొందరి అభిప్రాయము.
శుక్ల పక్షమి: అమావాస్య తదుపరి నుండి పౌర్ణమి వరకు ఉండే 15 రోజులు. 
కృష్ణ పక్షమి: పౌర్ణమి తదుపరి నుండి అమావస్య వరకు ఉండే 15 రోజులు.

తారా బలము, చంద్ర బలములలో ఏది మంచిది. ?

  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం వచ్చినచో అది చాలా శుభప్రదంగా భావించవచ్చును.
  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం రానిచో ఆ పని వాయిదా వేసుకొనుట కాని లేదా పరిహారము చేయుట కాని మంచిది.
  • తార బలము, చంద్ర బలములలో ఏదో ఒకటి అనుకూలముగా వచ్చినచో ఆ పనికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి తారాబలం కాని, చంద్రబలం కాని  శుభప్రదంగా భావించి ముందుకు వెళ్ళవచ్చును.
సర్వే జనా సుఖినోభవంతి

మీకు ఈ పోస్టు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ ను ఇవ్వండి, 
మరి ఇంత అమూల్యమైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి.

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels