చీకటి-వెలుగుకు మధ్య ఏముంటుంది ?
చీకటి అంటే ఏమిటి ? వెలుగు అంటే ఏమిటి ?
చీకటి వెలుగులు లేకపోతే ఏమవుతుంది. ?
భూమి తన చుట్టూతాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికి తెలిసిందే, దీనినే భూభ్రమనం, భూ పరిభ్రమనం అని అంటారు. భూభ్రమనం వలననే మనకు చీకటి వెలుగులు లేదా పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. భూపరిభ్రమనం వలన మనకు ఋతువులు, మాసములు (నెలలు) ఏర్పడుతున్నాయి. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగిరావడినికి ఒక సంవత్సర కాలం లేదా 365 (అర) రోజులు పడుతుంది. ఇది సహజంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. దీనిని ఎవరూ ఆపలేరు. చీకటి-వెలుగు (పగలు-రాత్రి) వలననే భూగోళం పై సమస్త జీవరాశుల మనుగడ జరుగుచున్నది. సూర్యుని వెలుగు వలన మొక్కలు కిరణజన్య సమ్యోజక క్రియ జరిపి తమ ఎదుగుదలకు, తద్వారా పలాలు, పుష్పాలు అందించి ఇతర జీవరాశులకు (మనుషులకు, జంతువులకు) ఆహారాన్ని సమకూర్చుతున్నాయి. రాత్రులందు వాతావరణంలోని కార్బన్ డై ఆకైడ్ (విషవాయువు) గ్రహించి ఆక్సిజన్ (ప్రాణవాయువును) విడుల చేస్తున్నాయి. చీకటి వెలుగులు లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది. చీకటి వెలుగులు లేకపోతే జీవన చక్రం గతి తప్పుతుంది. తద్వారా సమస్త జీవరాశి మనుగడ నశిస్తుంది.
ఇదంతా భౌతికంగా మనకు కనిపించే విషయాలు.. చీకటికి, వెలుగుకు మధ్య మనం గుర్తించలేనిది, మనకు కనిపించనిది ఒకటి వుంది. అదే భ్రమణం (తిరగడం) ఈ భ్రమణమే లేకపోతే ఈ వెలుగు చీకట్లు అనేవి ఉండనే ఉండవు.
అదేవిధంగా ఒక మనిషి జీవితంలో చీకటి-వెలుగులు అంటే అతనికి ఏర్పడే కష్ట-సుఖాలుగా మనం భావించుచున్నాము. మన కనులు (కండ్లు) వెలుగు, చీకటిలను గుర్తిస్తాయి. కనులు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది, కనులు మూసుకుంటే అంతా చీకటిగా ఉంటుంది. అంటే వెలుగుకు, చీకటి మధ్య మన కంటిపై కంటి రెప్ప ఉంది. అది తెరుచుకొని ఉన్నంతసేపు వెలుగు, మూసి ఉన్నంతసేపు చీకటి ఉంటింది. అంటే మనకు వెలుగు చీకట్లు మన కంటిరెప్ప పై ఆధారపడి ఉన్నట్లుగా, కంటి రెప్ప వెలుగు, చీకట్లను చీకట్లను నియంత్రించేదిగా మనకు అనిపిస్తుంది. మరి కంటి రెప్పను నియంత్రించేది ఏమిటి ?. మన మెదడు, మరి మన మెదడు నియంత్రించేది ఎవరు ?. అంటే మన మనస్సు, మరి మన మనస్సును నియంత్రించేది ఎవరు ? అంటే మనమే, అంటే.... వెలుగు చీకట్లను పొందడం మనమీదనే ఆధారపడి ఉందన్నమాట, ఆ విధంగా చూస్తే మన కష్టసుఖాలకు మనమే కారణం.. మన మనసు లో వెలుగు నిండితే అది సుఖం అవుతుంది. మన మనసులో చీకటి నిండితే అది కష్టం అవుతుంది. కష్టం వెంటే సుఖం, సుఖం వెంటే కష్టం కలిసే ఉంటాయి. జీవితంలో మొదటగా కష్టపడినవారికి తరువాత సుఖం తప్పక లభిస్తుంది. మొదట సుఖపడిన వారికి కష్టం చెప్పకుండా వస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకోవాలి అనేది నానుడి. అంటే వెలుగులో ఉన్నప్పుడే చీకటి విలువను గుర్తించాలి. చీకట్లో కలిగే ఇబ్బందులను గుర్తించినట్లే , సుఖంగా ఉన్నపుడే కష్టమొస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుండాలి. అలాకాకుండా కష్టాలకు కుంగిపోయి జీవితమే వ్యర్థం అనుకోకూడదు. వెలుగు చీకట్లను సమానంగా భావించి ముందుకు వెళితేనే మన మనుగడ సాధ్యమవుతుంది.
భూభ్రమనానికి కారణమై నిరంతరం భూభ్రమనాన్ని ఎవరు చేయిస్తున్నారో, వారే మన జీవితాలలో కష్టసుఖాలకు మూలం..
అతడే అంతర్యామి అయిన ఆ భగవంతుడు, అతడే ఆ సర్వేశ్వరుడు... చేయిస్తున్నది, చేస్తున్నది కూడా ఆయనే, తాను ఉన్నాడు అనుకునేవారికి ఉంటాడు. లేడు అనుకునేవారికి లేడు. ఉన్నాడు లో ఉంటాడు, లేడు లో లేడు ఆ లేనిది ఆయనే, ఉన్నదీ ఆయనే...
సర్వ ప్రాణులయందు తను ఉన్నాని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఈ విషయాన్ని భోదించాడు. మన మంచి చెడులకై మన చుట్టూ తల్లిగా, తండ్రిగా, గురువుగా, తోబుట్టువుగా, భార్యకు భర్తగా, భర్తకు భార్యగా, సంతానంగా, మిత్రునిగా, శత్రవుగా అన్ని రూపాలలో తనే వుండి మన మనుగడకు కారణమువతున్నాడు. వీరిలో ఎవరో ఒకరి రూపంలో వుండి, జ్నానబోధ చేస్తునే వుంటాడు. మనము ఆ విషయన్ని గ్రహించలేము. ఒక ఉదాహరణగా మీరు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారనుకుందాము. స్వామి నన్ను ధనవంతుడిని చేయి అంటూ నిత్యం ప్రార్ధిస్తూనే వుంటారు. అపుడు ఆ భగవంతుడు నీ గురువు రూంలోనో, నీ స్నేహితుడి రూపంలోనో ఎవరో ఒకరి రూంపంలో ఉండి నీకు మార్గనిర్ధేశం (సలహా) ఇస్తాడు, కాని మనం వారి మాట వినం, తెల్లవారికి తెల్లవారు మన ఇంట్లో డబ్బుల మూట పత్యక్షం కావాలని కోరుకుంటాం. ఇలా అందరికి డబ్బుల మూటలు ఇస్తే కష్టపడాలి అని ఎవరు అనుకుంటారు. అప్పడు ఎవరు ఏ పనిచేయరు. ఒక ఇల్లాలు వండుకోవడం ఎందుకు డబ్బులున్నాయి కదా హోటల్ కు వెళ్ళి తిందాం అంటుంది. మరి హోటల్ వాడికి కూడా ఆ భగవంతుడు డబ్బుల మూట ఇచ్చాడు. వాడు ఎందుకు వండుతాడు, వాడు డబ్బులు పడేసి ఎవరైనా వండిపెడితే తిందాం అనుకుంటాడు. కష్టపడవలసిన అవసరం వాడికి కూడా లేదే, ఈ విధంగానే అందరూ అనుకుంటే మనం డబ్బులనే తిని బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. మనము ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆ భగవంతున్ని తెలుసుకున్నట్లే...
- సర్వే జనా సుఖినోభవంతు :
ధన్యవాదములతో...
శ్రీరామ్ మనూహర్ (వెన్ను రాము)
Comments
Post a Comment