సూర్యగ్రహనము సందర్భముగా
చింతామణి జ్యోతిష్యాభిమానులకు, సభ్యులకు, అనుసరిస్తున్నవారందరికి ముఖ్యగమనిక
.......................................................................................................................................................
అదే విధంగా చింతామణి ప్రశ్నాశాస్త్రము (Chintaamani.co.in online Free Astrology) ఉపయోగిస్తున్నవారు గ్రహణము సందర్భముగా ఏ విధమైన ప్రశ్నలు అడుగరాదు. తేది. 22.06.2020 సోమవారం నుండి యధావిధిగా ప్రశ్నాశాస్త్రమును ఉపయోగించుకొనవచ్చును.
.......................................................................................................................................................
గ్రహణ సమయంలో చేయవసిన కార్యములు:
- యధావిధి స్నానాధులు ముగించుకొని ఇంటిలో దేవతలకు దీపారాధన చేయవచ్చను.
- గ్రహణ సమయమంతా దీపాలు వెలిగేవిధముగా చూసుకొనుట ఉత్తమము. అదే విధముగా అగరువత్తులు వెలిగించుట మంచిది.
- గ్రహణ సమయంలో దోషపరిహార్థం సూర్యభగవానుని మంత్రజపం, స్తోత్రములు పటించవచ్చును.
- ఈ రోజున మాంసాహార భోజన, మధుపానం కూడదు.
- గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకొనకపోవడం ఉత్తమం.
- వృద్దులు, పిల్లలు, అనారోగ్య సమస్యవున్న వారికి మినహాయింపు.
పఠించవలసని మంత్రం:
జపాకుసుమ సంకాశం - కాశ్యపేయం మహాధ్యుతిం, తమోరిం సర్వపాపఙం ప్రణతోస్మి దివాకరం.లేదా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పటించవచ్చును.
గ్రహణానంతరం చేయవలసని కార్యములు:
- స్నానము చేసి ఇంటి ఆవరణలో ఎనిమిది దిక్కులలో పసుపు కుంకుమ (లేదా పసుపు నీళ్ళు ) చల్లి కర్పూరం వెలిగించి ఇష్టదేవతలను ప్రార్ధించాలి.
శుభమస్తు
Comments
Post a Comment