అలభ్య పుణ్యకాలములు -2020-21

అలభ్య పుణ్యకాలములు -2020-21

శనివారం-త్రయోదశి/పౌర్ణమి
ఆదివారం-సప్తమి
సోమవారం-అమావాస్య
మంగళవారం-చతుర్థి
బుధవారం-అష్టమి
గురువారం-ఏకాదశి
శుక్రవారం-పంచమి


ఈ రోజులలో ఆయా తిధులు ఉన్నట్లయితే వాటిని అలభ్య పుణ్య కాలాలు అంటారు.
ఈరోజు లలో ఆయా దేవతా స్తోత్రాలు, గ్రహ స్తోత్రాలు అష్టకాలు పఠించినట్లయితే ఒకసారి చదివితే వెయ్యిసార్లు చదివిన ఫలితం ఉంటుంది.
గ్రహణ సమయంలో గ్రహణం పట్టిన దగ్గర్నుంచి గ్రహణం విడిచే వరకు సోత్రాలు పఠించినట్లయితే వేయి  రేట్లు ఫలితం ఉంటుంది.

నవంబర్ -8 (ఆదివారం -సప్తమి)
ఉదయం 07:21 నిమిషముల వరకు తదుపరి అష్టమి

నవంబర్ -28 (శనివారం- త్రయోదశి)
ఉదయం 10:21 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి.

డిసెంబరు -12 (శనివారం -త్రయోదశి)
తె.జా. 3:50 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి

డిసెంబర్ -14 (సోమవారం-అమావాస్య)
రాత్రి 9:46 నిమిషముల వరకు తదుపరి పాడ్యమి.

జనవరి-6 (బుధవారం-అష్టమి)
రాత్రి 2:06 నిమిషముల వరకు తదుపరి నవమి.

జనవరి-12 (మంగళవారం- చతుర్థి)
మ. 12: 22 నిమిషముల వరకు తదుపరి అమావాస్య.

మార్చి -21(ఆదివారం- సప్తమి)
ఉదయం 7 : 10 నిమిషముల వరకు తదుపరి అష్టమి.

మార్చి -25 (గురువారం- ఏకాదశి)
ఉదయం 9: 47 నిమిషాలు తదుపరి ద్వాదశి.

ఏప్రిల్ -2 (శుక్రవారం - పంచమి)
ఉదయం 8 : 15 నిమిషాలు తదుపరి షష్ఠి.

వ్యక్తులు జాతకరీత్యా గ్రహాల యొక్క మహాదశ, అంతర్దశలో గ్రహాలు పాప స్థానంలో ఉన్న లేదా నీచ స్థితిలో ఉన్నట్లయితే ఆ గ్రహాల దేవతలకు సంబంధించిన స్తోత్రాలు పై తెలిపిన తిథులలో పటించినట్లయితే ఫలితం ఎక్కువగా గా ఉంటుంది.

- ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని గోచారరీత్యా ఉన్నవారు శనికి సంబంధించిన స్తోత్రములు చదివినట్లయితే శుభఫలితం ఉంటుంది.

- జాతకరీత్యా కుజ దోషం ఉన్నవారు కూడా కుజునికి సంబంధించిన స్తోత్రములు పటించవచ్చు.

- రాహు కేతువులకు సంబంధించి కాలసర్ప దోషం లు ఉన్నవారు కూడా రాహు కేతువులకు సంబంధించిన స్తోత్రములు పఠించినట్లైతే  శుభ ఫలితం ఉంటుంది.

పుట్టిన తేదీ, సమయం, పుట్టిన స్థలం ఆధారంగా మీ జాతక పరిశీలన చేసి జన్మకుండలి నందు గ్రహములు ఏ ఏ స్థితిలో లో ఉన్నాయి. ఏ దశ నడుస్తోంది వంటి వివరాలు తెలుసుకొనుటకు ఈ రోజే సందర్శించండి.
చింతామణి ఫ్రీ ఆస్ట్రాలజీ.


మా యూట్యూబ్ ఛానల్:
https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Comments