chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Sunday, May 17, 2020

Rudrakavacham-రుద్రకవచమ్

రుద్రకవచమ్

free astrology - chintamani (Rudra kavacham)
free astrology-chintamani (lord shiva)

అస్యశ్రీ రుద్రకవచస్తోత్రమహామంత్రస్య దూర్వాస ఋషిః అనుష్టుప్ఛందః
త్ర్యంబకరుద్రో దేవతా ఓం బీజం, హ్రీం శక్తిః  క్రోం కీలకం
మమ మనోభీష్ట సిద్ధ్యర్ధే జపే వినియోగః  హ్రామిత్యాది షడ్దిర్ఘైప్షడంగన్యాసః

శాన్తం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్ర్తం త్రినేత్రమ్
శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తమ్
నాగంపాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తాం స్ఫటిక మణి నిభం పార్వతీశం నమామి.
దుర్వాస ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్. 1
రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షయే
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా. 2
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః 3
నేత్రయోస్త్ర్యంబకః  పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః 4
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్ 5
హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః 6
బాహుమథ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్. 7
వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః 8
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్ 9
శీతోష్ణా దథ కాలేషు తుహిన ద్రుమంకంటకే
నిర్మనుష్యే సమేమార్గే త్రాహిమాం వృషభధ్వజ 10
ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్
మహాదేవప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్ 11
మమాఖ్యాతం సమానేన న భయం విందతి క్వచిత్
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్యవర్దనమ్ 12
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ 13
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహిత్రయీమయ 14
త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ 15
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే 16
గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల
త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ధి స్త్వం పరాయణమ్ 17
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యథా సదా
జ్వరభయం ఛింది సర్వజ్వరభయం ఛింది గ్రహభయం ఛింది 18
సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్
అస్యరుద్రలోకం సగచ్ఛతి శ్రీరుద్రలోకం సగచ్ఛత్యోనమ ఇతి
ఇతి శ్రీ స్కాందపురాణే దూర్వాసః ప్రోక్తం శ్రీ రుద్రకవచమ్.

---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

raghu graha panchavimshathi-శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం

శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం

ఈ స్తోత్రం రాహువు యొక్క 25 నామాలతో కూడినది, రాహు దోషముతో బాధపడే వారు మరియు అనేక సమస్యలు, రుగ్మతలతో వేదన చెందేవారు రాత్రి 9 గంటలు దాటిన తరువాత తలస్నానం చేసి మీ దేవుని మందిరంలో కూర్చుని ఈ రాహు పంచవింశతి ని 22 సార్లు పారాయణ చేసినట్లయితే
మీమీ సమస్యలకు త్వరిత గతినమార్గం సుగమమం అగును.


free astrology- chintaamani
free astrology- chintamani (lord raghu)
రాహుర్దానవ మంత్రిచ సింహికా చిత్తానంద |
అర్ధకాయ సదాక్రోధి చంద్రాదిత్య విమర్థనా ||
రౌద్రో రుద్రప్రియో దైత్య స్వభానుర్భానుర్ భీతిదా |
గ్రహరాజా సుధాపాయి రాకాతిష్యాభిలాషుకా ||
కాలదృష్టి కాలరూప శ్రీకంఠ హృదయాశ్రయా |
విదంతుదా సింహికాయో ఘోరరూపో మహాబలా ||
గ్రహపీడకరో ద్రాంష్ర్టికర్తనేత్రో మదోదరా |
పంచవింశతి నామాని సృత్వా రాహుం సదానరః  ||
ఫతశ్రుతి :
యః పఠేత్ మహతి పీడా తస్య నాశయతి కేవలం
ఆరోగ్యం పుత్రం తులం శ్రీయం ధ్యానం పశుంతథా
దదతి రాహుతస్మై రహపఠేత్ స్తోత్రం ఉత్తమం
సతతం పఠేత్ యస్తు జీవత్ వర్షం శతం నరః



---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Thursday, April 30, 2020

తారాబలం - చంద్ర బలం అంటే ఏమిటి ? ఎలా తెలుసుకోవాలి. ?

తారాబలం - చంద్ర బలం అంటే ఏమిటి ? ఎలా తెలుసుకోవాలి. ?

What is Tarabalam-Chandrabalam ? How to Know ?

tarabalam

     మనకు జ్యోతిష్యం ప్రకారం 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములు ప్రతి దినము రోజుకు ఒక నక్షత్రము చొప్పున ఆకాశ గమనమున చంద్ర గ్రహము ఉన్న మార్గమున ఉదయిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి భూమి పై జన్మించిన సమయంలో ఆ రోజు అతను జన్మించిన సమయానికో, అంతకు ముందో ఒక నక్షత్రం ఉదయించి ఉంటుందిం. అదే అతని జన్మ నక్షత్రం అవుతుంది. మన ఇంట్లో ఉండే క్యాలెండర్ లేదా పంచాగం చూసినట్లయితే ఏ ఏ రోజులలో ఏయే నక్షత్రం ఉందో, ఎప్పుడు ప్రారంభమైనదో, ఎప్పుడు ముగుస్తుందో ఉంటుంది. దానిని బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు పుట్టిన సంవత్సం క్యాలెండర్ లేనట్లయితే ఇప్పుడు ఆన్ లైన్ లో 100 సం. ల వరకు తెలిపే వెబ్ సైట్లు, యాప్ లు ఉన్నాయి, వాటిని ట్రై చేయండి. లేదా మీ ఇంట్లో పెద్దవారు మీ జన్మకుండలి రాయించి దాచి ఉంచుతారు దానిని బట్టి మీ నక్షత్రం తెలుసుకోండి. ఒక వేళ మీకు పుట్టిన తేదీ సమయం వంటి  వివరాలు తెలియక పోతే మీ పేరును బట్టి మీ రాశి, నక్షత్రం తెలుసుకునే పట్టిక ఈ మన బ్లాగులో ‘నామ నక్షత్రాలు’ అని పోస్టు ఉంది ఆ పోస్టులో చూసి తెలుసుకోవచ్చును.
   ఇక విషయానికి వస్తే ఈ 27 నక్షత్రాలలో మనకు శుభకార్యములకు పనికి వచ్చే నక్షత్రాలు, శుభకార్యములకు పనిచేయని నక్షత్రములు ఉంటాయి. ఏయే నక్షత్రలముల వారికి ఏయే నక్షత్రములు పనికి వస్తాయో, ఏవేవి పనిచేయవో తెలియజేసేదే ‘తారాబలం’ మీరు ఏదైన శుభకార్యం కాని, ప్రయాణం కాని, నూతన కార్యక్రములుగాని, వాహనం కొనుగోలుగాని, భూమి, గృహం కొనుగోలుగాని, ఇంట్లో వివాహాది శుభకార్యములు గాని ఇతరత్రా  చేయాలనుకున్నప్పుడు ఈ తారాబలం చూసకొని చేసినట్లయిన విజయం చేకూరుతుంది.

ఎలా తెలుసుకోవచ్చు ?
మనము ఈ 27 నక్షత్రాలను నవకములలో ( నక్షత్రాలను 9 చొప్పున మూడు వరుసలలో రాసినట్లయితే దానిని నవకం అంటారు) రాసినపుడు 1. జన్మతార, 2. సంపత్తార, 3. విపత్తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్తార, 6. సాధనతార,
7. నైదనతార, 8. మిత్రతార, 9 పరమమిత్ర తారులగా ఏర్పడుతాయి. తారాబలం తెలుసుకోవాలంటే ఈ నవకంను పరిశీలించవలసి ఉంటుంది.
మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ తారాబలం తెలుసుకోవాలంటే  
తారాబలం హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మనక్షత్రం లేదా నామనక్షత్రం  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న నక్షత్రం వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా మీరు లెక్కించడం నేర్చుకొని తెలుసుకోవాలంటే ఇక్కడ రెండు పద్దతులు ఉన్నాయి. వాటిని ప్రయత్నించండి.

ముందుగా ఈ నక్షత్రముల పట్టకను పరిశీలించండి

ప్రథమ నవకం
ద్వితీయ నవకం
తృతీయ నవకం
తారాభలం
అశ్విని
మఖ
మూల
7 నైదనతార
భరణి
పుబ్బ (పూర్వఫల్గుని)
పూర్వాషాఢ
8 మిత్రతార
కృత్తిక
ఉత్తర (ఉత్తర ఫల్గుని )
ఉత్తరాషాఢ
9 పరమమిత్రతార
రోహిణి
హస్త
శ్రవణం
1  జన్మతార
మృగశిర
చిత్త
ధనిష్ఠం
2 సంపత్తార
ఆరుద్ర
స్వాతి
శతభిషం
3 విపత్తార
పునర్వసు
విశాఖ
పూర్వాభాద్ర
4 క్షేమతార
పుష్యమి
అనూరాధ
ఉత్తరాభాద్ర
5 ప్రత్యక్ తార
ఆశ్లేష
జ్యేష్ఠ
రేవతి
6 సాధనతార


తారాబలమును చూసుకునే  విధానం - 1

ఉదాహరణకు : ఒక వ్యక్తి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం హస్త  అనుకుందాం.
ఇపుడు మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ తీసుకొని మీకు కావలసిన రోజున ఏ నక్షత్రం ఉందో చూడండి.
ఉదా: తేది. 30.04.2020 గురువారం రోజున క్యాలండర్ లో పుష్యమి నక్షత్రం ఉంది.
ఇప్పుడు హస్త నక్షత్రం వారికి పుష్యమి నక్షత్రం ఏ వరసులో ఉందో పై పట్టికలో చూడండి.
హస్త నక్షత్రం 1వ (జన్మతార) వరుసలో ఉంది, పుష్యమి నక్షత్రం 5వ (ప్రత్యక్ తార) వరుసలో ఉంది
అంటే హస్త నక్షత్రం వారికి  ఆ రోజు పుష్యమి నక్షత్రం ప్రత్యక్ తార అవుతుంది.
దీనిని బట్టి ప్రత్యక్ తార ఫలితములు చూసుకోవాలి.
ఆ విధంగా ఏ నక్షత్రం వారైన వారి యెక్క జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం 1వ వరుసగా (జన్మతారగా) భావించి
అక్కడ నుండి మిగతా నక్షత్రాలు  2 , 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్లను మార్చకుంటూ పరిశీలించుకోవచ్చు.

మరొక విధానం (2) :

జన్మనక్షత్రం లేదా నామ నక్షత్రం నుండి మీకు కావలసిన రోజున ఉన్న నక్షత్రం (క్యాలెండర్ చూడండి) వరకు లెక్కించి వచ్చిన విలును 9 చే భాగించిగా వచ్చిన శేషము విలువను 1. జన్మతార, 2. సంపత్ తార, 3. విపత్ తార, 4. క్షేమతార, 5. ప్రత్యక్ తార, 6. సాధన తార, 7. నైదనతార, 8. మిత్రతార, 9. పరమ మిత్రతార గా భావించవలెను.
ఉదా : హస్త నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు లెక్కించిన 23 అవుతుంది 23 ను 9 చే భాగించిన 9x2=18,
23-18= 5 , శేషం 5 వచ్చింది, అంటే 5. ప్రత్యక్ తార అవుతుంది. ఈ విధంగా వారి వారి నక్షత్రములను బట్టి తారా బలము తెలుసుకోవచ్చు.
గమనిక : జన్మ నక్షత్రం తెలియని వారు నామ నక్షత్రం ప్రకారం చూసుకోవచ్చు. నామ నక్షత్రముల కొరకు
ఈ మన బ్లాగులోనే  నామ నక్షత్రముల పట్టిక (పోస్టు)లో ఇవ్వడం జరిగింది. కావలసిన వారు చూసుకోగలరు.

గమనిక -1: శుభకార్యముల విషయములలో
ప్రథమ నవకములో జన్మతార, ద్వితీయ నవకములో విపత్తార, తృతీయ నవకములో ప్రత్యక్తార,
మూడు నవకములలో నైధన తారను విడిచి పెట్టవలయును.
ఇతర నవకములలో ఆ తారలు వచ్చిన దానములు ఇచ్చి దొషకాలము వదిలి పనులు చేసుకోవచ్చను.

వివాహ సమయంలో వధూవరులకు జన్మతార, విపత్తార, ప్రత్యక్తారలు వచ్చిన దోషశాంతికి
జన్మతారకు శాకదానము (కూరగాయలు)
విపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పు దానము
ఇచ్చి వివాహము జరిపించవచ్చును.
గమనిక-2
జన్మతార యందు గం. 02:48 ని.లు (సుమారు 3 గంటలు)
విపత్తార యందు గం. 01.12 ని.లు (సుమారు 1 గంట)
ప్రత్యక్, నైధన తారల యందు గం. 03.12 ని.లు (సుమారు 3 గంటలు) విడువ వలెనని కొందరి అభిప్రాయం,
చంద్రుడు జన్మతార, పరమ మిత్ర తారలయందు గాక విపత్తార, ప్రత్యక్తారల యందు
స్వోచ్చ స్వగతుడైన సర్వ కర్మలయందు శుభప్రదుడని కొందరి అభిప్రాయము.

తారలకు అధిపతులు  - ఫలములు

1. జన్మతార : అధిపతి సూర్యుడు , నెమలి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు. 
మనస్తాపము, అశాంతి, తలనొప్పి, తిండి, నిద్ర సరిగా లేకపోవుట జరుగును.
పరిహారం : గుమ్మడి పండు దానము చేసిన కొంత శాంతి కలుగును.
2. సంపత్తార : అధిపతి బుధుడు, వాహనము గుఱ్ఱము, 
అన్నివిధములుగా లాభించును. ధనాదాయము బాగుండును.
వ్యాపార, వ్యవహారములందు ప్రయత్నములు కలిసివచ్చును.
అన్ని విషయములలో యుక్తిగా వ్యవహరించుట జరుగును.
3. విపత్తార : అధిపతి రాహువు, వాహనము మేక, దోషకాలము సుమారు 1 గంట
అకారణ కలహము, హోదాకు తగని వ్యక్తులతో కలిసి తిరుగుట, శారీరక సంబంధమైన చికాకులు కలుగును.
పరిహారం :  బెల్లం దానం ఇవ్వవలెను.
4. క్షేమతార: అదిపతి గురుడు, ఏనుగు వాహనము
దైవ సంబంధమైన కార్యముల యందు పాల్గొనుట,
నూతన వ్యక్తులను కలుసుకొనుట, సంఘములో గౌరవ మర్యాదలు, ఆదరణ కలుగును,
ధనాదాయము బాగుండును.
5. ప్రత్యక్తార : అధిపతి  కేతువు,  కాకి వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
ఇతరుల వలన మాటలు పడుట, ఏ పని కలిసి రాకపోవుట,
ప్రతి పనికి ఊహించని ఆటంకములు కలుగును.
పరిహారం :  ఉప్పును దానము ఇవ్వవలెను.
6. సాధనతార: అధిపతి చంద్రుడు,  నక్క వాహనము
గొప్పవారితో పరిచయము, మనస్సు ప్రశాంతముగా యుండుట,
నూతన స్త్రీలతో పరిచయము.
7. నైధనతార : అధిపతి శని, సింహము వాహనము, దోషకాలము సుమారు 3 గంటలు 
అనవసర విషయములలో కలుగజేసుకొనుట, వాద ప్రతివాధములు చేయుట.
పరిహారం :  సువర్ణ దానము చేయుటవలన కొంత శాంతి కలుగును.
8. మిత్రతార: అధిపతి శుక్రుడు, వాహనము గరుత్మంతుడు
సంగీత సాహిత్యముల యందు అభిలాష, స్త్రీ సౌఖ్యం,
నూనత వ్యక్తులతో పరిచయం, ధనాదాయం బాగుండుట,
శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనుట జరుగును.
9. పరమ మైత్రతార: అధిపతి కుజుడు,  హంస వాహనము, 
ఊహించని చికాకులు, సాహసకార్యము చేయుటకు ఉత్సాహపడుట,
 వైరాగ్యము, ఇతరుల మీద కర్రపెత్తనం చేయుటకు ఆసక్తి చూపించెదరు.

 chandrabalam

మనకు రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి. చంద్రుడు రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున  ఒక నెలలో 12 రాశులలో సంచారం చేయును. ఒక వ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏదైతే రాశిలో ఉంటాడో ఆ రాశినే అతని యొక్క జన్మరాశి అంటారు.  జన్మరాశి నుండి ప్రస్తుతం మీకు కావలసిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో లెక్కించనట్లయితే చంద్రబలం తెలుసుకోవచ్చను.

మీరు అత్యంత సులభంగా ఏ లెక్కలు చేయకుండా మీ చంద్రబలం తెలుసుకోవాలంటే  
చంద్రబలం  హెడ్డింగ్ పై ప్రెస్ చేసి మీ జన్మరాశి లేదా నామరాశి  మరియు ఆరోజు క్యాలెండర్ లో  
ఉన్న చంద్రుడు ఉన్నరాశి  వివరాలు ఇచ్చి వెంటనే ఉచితంగా తెలుసుకోవచ్చు.

లేదా ఇక్కడ ఇవ్వబడిన  చంద్రబలం తెలుసుకునే విధానం చూడండి

జన్మరాశి  ఎలా తెలుసుకోవాలి ?

జన్మరాశిని తెలుసుకొనుటకు మీ పుట్టిన తేది క్యాలండర్ లేదా పంచాగం తీసుకోండి. ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. ఉదాహరణకు పుష్యమి నక్షత్రం అనుకుందాం (పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రములు ఉంటే ఆ రోజు చంద్రడు కర్కాటక రాశిలో ఉంటాడు) అపుడు మీ జన్మనక్షత్రం కర్కాటకం అవుతుంది. (మఖ, పుబ్బలో ఉంటే సింహరాశి అవుతుంది) ఇలా ఏయే నక్షత్రాలు ఉంటే ఏయే రాశి అవుతుందో ‘నామ నక్షత్రాలు’ అనే పోస్టులో మన ఈ బ్లాగు నందు ఇవ్వబడినవి కావలసిన వారు తెలుసుకోగలరని మనవి.
మరి పుట్టిన తేది లేనివారు వారి పేరులో ముందు అక్షరాన్ని బట్టి వారి రాశిని తెలిపే పట్టిక కొరకు ‘నామనక్షత్రములు’  పోస్టులో ఇవ్వబడినది  తెలుకోగలరు.

మరి చంద్రుడు ఉన్న రాశిని తెలుసుకోవడం ఎలా ?

చంద్రడు ఉన్న రాశిని తెలుసుకోవాడినికి కూడా ఇదే విధానం ఆ   రోజు ఏ నక్షత్రం ఉందో చూడండి. (ఉదాహరణకు హస్త నక్షత్రం అనుకుంటే కన్యరాశి అవుతుంది.)  (‘నామ నక్షత్రాలు’ పోస్టు చూడండి)

చంద్రబలం తెలుసుకునే విధానం:

జన్మరాశి నుండి చంద్రుడున్న రాశి వరకు గణన చేయగా 1, 3, 6, 7, 10, 11 రాశుల యందు చంద్రుడున్న ధనలాభము, కార్యసిద్ధి, శుభమును ఇచ్చును. మిగిలిన రాశుల యందు కార్యవిఘ్నము కలిగించును. 

ఉదాహరణకు ఒక వ్యక్తి జన్మరాశి లేదా నామ రాశి తులా రాశి అనుకుందా, ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకుంటే తులారాశి నుండి, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, కర్కాటకం 10వ రాశి అవుతుంది. పై నంబర్లలలో 10 ఉంది కావున శుభం. ఇలా తెలుసోకవచ్చును.

శుక్లపక్షమున 2, 5, 9 రాశుల యందును, కృష్ణ పక్షమున 4, 8, 12 రాశుల యందును ఉన్న చంద్రడు తల్లి కుమారుడిని రక్షించునట్లు రక్షించునట్లుగా శుభమును కలుగ జేయును.

గమనిక: శుక్ల పక్షమున చంద్ర బలమును, కష్ణ పక్షమున తారా బలమును చూడవలెనని కొందరి అభిప్రాయము.
శుక్ల పక్షమి: అమావాస్య తదుపరి నుండి పౌర్ణమి వరకు ఉండే 15 రోజులు. 
కృష్ణ పక్షమి: పౌర్ణమి తదుపరి నుండి అమావస్య వరకు ఉండే 15 రోజులు.

తారా బలము, చంద్ర బలములలో ఏది మంచిది. ?

  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం వచ్చినచో అది చాలా శుభప్రదంగా భావించవచ్చును.
  • తారా బలము, చంద్రబలము రెండు చూసుకొనిన రెండింటా అనుకూలం రానిచో ఆ పని వాయిదా వేసుకొనుట కాని లేదా పరిహారము చేయుట కాని మంచిది.
  • తార బలము, చంద్ర బలములలో ఏదో ఒకటి అనుకూలముగా వచ్చినచో ఆ పనికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి తారాబలం కాని, చంద్రబలం కాని  శుభప్రదంగా భావించి ముందుకు వెళ్ళవచ్చును.
సర్వే జనా సుఖినోభవంతి

మీకు ఈ పోస్టు నచ్చినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ ను ఇవ్వండి, 
మరి ఇంత అమూల్యమైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి.



Share:

Gocharam-Gocharapalamulu- గోచార ఫలములు


Nava Grahalu

గోచార ఫలములు

జన్మరాశి లగాయతు గ్రహమున్న రాశివరకు చూచుకొనవలెను.

1. రవి : 3, 6, 10, 11 రాశుల యందుండిన 
- ఉద్యోగ ప్రయత్నములు అనుకూలించును.
- వ్యాపార వ్యవహారములందు లాభించును.
- నూతన స్త్రీలతో పరిచయం కలిగి, వారి వలన ఉపకారము కలుగును.
- స్తిరాస్తులు కలిసివచు్చను.
2. చంద్ర : 1, 3, 6, 7, 10, 11 రాశులలో యుండిన - ఉద్యోగప్రయత్నము చేయువారికి అధికారుల యొక్క రికమండేషన్ వలన
  ఉద్యోగము లభించును.
- వెండి, బంగారు వస్తువులు కొనుట జరుగును.
- గవర్నమెంట్ వారివలన రావలసిన సొమ్ము వసూలగును.
నూతన స్త్రీలతో స్నేహ లాభము కలుగును.
3. కుజ : 3, 6, 11 రాసులలో ఉన్న - పెండింగ్ వ్యవహారములు పరిష్కారమగును.
- పాత బాకీలు వసూలై, ధనాదాయము బాగుండును.
- శత్రువులు మిత్రులగుదురు.
- వ్యవసాయరీత్యా లాభించును.
- భూమిగాని, గృహముగాని కొనుట జరుగును.
4. బుధ : 2, 6, 11 రాసులలోయున్న - నూతన వ్యాపార ప్రయత్నములు అనుకూలించును.
- క్రయ విక్రయముల వలన ధనాదాయము బాగుండును.
- ప్రభుత్వ వ్యవహారములలో యుక్తిగా వ్యవహరించి లాభమును పొందుదురు.
- పాత బాకీలు వసూలగును.
5. గురు : 2, 5, 7, 9, 11 రాసులలోయున్న -  అప్రయత్న ధనలాభము,  కుటుంబ సంతానవృద్ది,
- గృహమునందు వివాహాది శుభకార్యములు జరుగుట.
- నూతన వ్యక్తులతో స్నేహలాభము.
- కోర్టు వ్యవహారములలో జయం, స్థిరాస్థిని అభివృద్ది చేయుట
- ప్రభుత్వము వారి వలన బహుమతులు, సన్మానములు పొందుట జరుగును.
6. శుక్ర : 1, 2, 3, 4, 5, 8, 9, 12 రాసులలోయున్న - సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి.
- అన్యస్త్రీ పరిచయం, నూతన వ్యక్తులతో స్నేహలాభములు.
- విలువైన వస్తువులు సేకరించుట జరుగును.
- వ్యసనములయందు ఆసక్తి పెరుగును.
7. శని : 3, 6, 11  రాసులలో యున్న -  ఉద్యోగరీత్యా అనకూల మార్పులు.
- బంధువర్గంలో గౌరవం.
- స్థిరాస్తిని అభివృద్దిచేయు ప్రయత్నములు, గృహనిర్మాణము ప్రయత్నములు
  అనుకూలించును.
- కోర్టు వ్యవహారములు పరిష్కారమగును.
8, 9. రాహువు, కేతువు : 3, 6, 11 రాసులలోయున్న - రాజకీయ వ్యవహారములయందు జయం. - అప్రయత్న లాభం,
- పుణ్యక్షేత్ర సందర్శనం. తీర్థయాత్రలు చేయుట.
- దైవసంబంధమైన కార్యములలో పాల్గొనుట జరుగును.
- శతృజయం కలుగును.
శని ప్రభావం :  
1, 2, 12 రాసులలోయున్న ఏలినాటి శని ( ఏడున్నర ఏండ్ల శని) 8లో ఉన్న అష్టమ శని,
4లో ఉన్న అర్థాష్టమ శని అంటారు. శని ఒక్కొక్కరాశిలో 2 సంవత్సరముల 6 నెలలు ఉండును.
ఫలితము:  ఈ సమయంలో ధనవ్యయం, అనారోగ్యం, జీవన భగం, స్థానచలనములు, అపమృత్యుభయం,
మనస్థిమితం తక్కువగాయుండుట, స్త్రీలతో అకారణ కలహములు, ఆకస్మిక ప్రమాదములు కలుగును.
Share:

Nama Nakshatramulu-నామ నక్షత్రములు

నామ నక్షత్రములు

సంఖ్య - నక్షత్రము పేరు   -  నక్షత్ర పాదాలు - రాశులు

1.        అశ్విని            - చూ  చే   చో  లా -1, 2, 3, 4 పాదాలు మేషం
2.       భరణి              - లీ   లూ   లే  లో 1, 2, 3, 4 పాదాలు  మేషం
3.       కృత్తిక             - ఆ          - 1వ పాదం మేషం 2, 3, 4 పాదాలు వృషభం
4.       రోహిణి            - ఒ    వి   వు   - 1, 2, 3, 4 పాదాలు వృషభం
5.       మృగశిర          - వే  వొ     కి   - 1, 2 పాదాలు వృషభం 3, 4 పాదాలు మిధునం
6.       ఆర్ద్ర               -  కు  కం       - 1, 2, 3, 4 పాదాలు మిధునం
7.       పునర్వసు        - కె  కొ    హి - 1, 2, 3 పాదాలు మిధునం 4వ పాదం కర్కాటకం
8.       పుష్యమి          - హు  హె  హో    - 1, 2, 3, 4 పాదాలు కర్కాటకం
9.       ఆశ్రేష             - డి  డు  డె  డొ  -1, 2, 3, 4 పాదాలు కర్కాటకం
10.      మఖ              - మ  మి  ము  మె -1, 2, 3, 4 పాదాలు సింహం
11.      పుబ్బ             -  మో  టా  టీ  టూ -1, 2, 3, 4 పాదాలు సింహం
12.      ఉత్తర              -  టే   టో   పా   పి  - 1వ పాదం సింహం 2, 3, 4 పాదాలు కన్య
13.      హస్త              - పూ    షం   ణా  ఠా - 1, 2, 3, 4 పాదాలు కన్య
14.      చిత్త               - పే   పో    రా  రి  - 1, 2 పాదాలు కన్య  3, 4 పాదాలు తుల
15.      స్వాతి             -  రూ  రే   రో     -  1, 2, 3, 4 పాదాలు తుల
16.      విశాఖ            -  తీ   తూ  తే    తో  -  1, 2, 3 పాదాలు తుల  4వ పాదం వృశ్చికం
17.      అనురాధ         -  నా   నీ    నూ   నె  - 1, 2, 3, 4 పాదాలు వృశ్చికం
18.      జ్యేష్ఠ              -  నో   యా  యీ  యూ - 1, 2, 3, 4 పాదాలు  వృశ్చికం
19.      మూల            -  యే    యో   బా   బి   - 1, 2, 3, 4 పాదాలు ధనస్సు
20.     పూర్వాషాఢ      - బూ    ధా   భా   ఢా   - 1, 2, 3, 4 పాదాలు ధనస్సు
21.      ఉత్తరాషాఢ        - బే    బో   జా   జి  - 1వ పాదం ధనస్సు 2, 3, 4 పాదాలు మకరం
22.     శ్రవణం            -  జూ   జే  జో   ఖా  - 1, 2, 3, 4 పాదాలు మకరం
23.     ధనిష్ఠ             - గా   గీ   గూ   గే   -  1, 2 పాదాలు మకరం 3, 4 పాదాలు కుంభం
24.     శతభిషం          -  గో  సా  సీ   సు    - 1, 2, 3, 4 పాదాలు కుంభం
25.     పూర్వాభాద్ర       -  సే   సా   దా  ది   -  1, 2, 3 పాదాలు కుంభం 4వ పాదం మీనం
26.     ఉత్తరాభాద్ర        -  దు  శ్యం  ఝూ   థా   1, 2, 3, 4 పాదాలు మీనం
27.     రేవతి              - దే   దో   చా  చి - 1, 2, 3, 4 పాదాలు మీనం
ఉదా:  పే - 1వ పాదం,  పో - 2వ పాదం  కన్య రాశిగా , రా - 3వ పాదం,   రి- 4వ పాదం తుల రాశి గా భావించాలి. అలా మిగత వాటికి నక్షత్రాలకు వరుసగా ఏ ఏ పాదాలు ఏ ఏ రాశులను సూచిస్తున్నాయో గమనించవచ్చ.

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels