![]() |
Nava Grahalu |
గోచార ఫలములు
జన్మరాశి లగాయతు గ్రహమున్న రాశివరకు చూచుకొనవలెను.
1. రవి : 3, 6, 10, 11 రాశుల యందుండిన
- ఉద్యోగ ప్రయత్నములు అనుకూలించును.- వ్యాపార వ్యవహారములందు లాభించును.
- నూతన స్త్రీలతో పరిచయం కలిగి, వారి వలన ఉపకారము కలుగును.
- స్తిరాస్తులు కలిసివచు్చను.
2. చంద్ర : 1, 3, 6, 7, 10, 11 రాశులలో యుండిన - ఉద్యోగప్రయత్నము చేయువారికి అధికారుల యొక్క రికమండేషన్ వలన
ఉద్యోగము లభించును.
- వెండి, బంగారు వస్తువులు కొనుట జరుగును.
- గవర్నమెంట్ వారివలన రావలసిన సొమ్ము వసూలగును.
నూతన స్త్రీలతో స్నేహ లాభము కలుగును.
3. కుజ : 3, 6, 11 రాసులలో ఉన్న - పెండింగ్ వ్యవహారములు పరిష్కారమగును.
- పాత బాకీలు వసూలై, ధనాదాయము బాగుండును.
- శత్రువులు మిత్రులగుదురు.
- వ్యవసాయరీత్యా లాభించును.
- భూమిగాని, గృహముగాని కొనుట జరుగును.
4. బుధ : 2, 6, 11 రాసులలోయున్న - నూతన వ్యాపార ప్రయత్నములు అనుకూలించును.
- క్రయ విక్రయముల వలన ధనాదాయము బాగుండును.
- ప్రభుత్వ వ్యవహారములలో యుక్తిగా వ్యవహరించి లాభమును పొందుదురు.
- పాత బాకీలు వసూలగును.
5. గురు : 2, 5, 7, 9, 11 రాసులలోయున్న - అప్రయత్న ధనలాభము, కుటుంబ సంతానవృద్ది,
- గృహమునందు వివాహాది శుభకార్యములు జరుగుట.
- నూతన వ్యక్తులతో స్నేహలాభము.
- కోర్టు వ్యవహారములలో జయం, స్థిరాస్థిని అభివృద్ది చేయుట
- ప్రభుత్వము వారి వలన బహుమతులు, సన్మానములు పొందుట జరుగును.
6. శుక్ర : 1, 2, 3, 4, 5, 8, 9, 12 రాసులలోయున్న - సంగీత సాహిత్యాది కళలయందు ఆసక్తి.
- అన్యస్త్రీ పరిచయం, నూతన వ్యక్తులతో స్నేహలాభములు.
- విలువైన వస్తువులు సేకరించుట జరుగును.
- వ్యసనములయందు ఆసక్తి పెరుగును.
7. శని : 3, 6, 11 రాసులలో యున్న - ఉద్యోగరీత్యా అనకూల మార్పులు.
- బంధువర్గంలో గౌరవం.
- స్థిరాస్తిని అభివృద్దిచేయు ప్రయత్నములు, గృహనిర్మాణము ప్రయత్నములు
అనుకూలించును.
- కోర్టు వ్యవహారములు పరిష్కారమగును.
8, 9. రాహువు, కేతువు : 3, 6, 11 రాసులలోయున్న - రాజకీయ వ్యవహారములయందు జయం. - అప్రయత్న లాభం,
- పుణ్యక్షేత్ర సందర్శనం. తీర్థయాత్రలు చేయుట.
- దైవసంబంధమైన కార్యములలో పాల్గొనుట జరుగును.
- శతృజయం కలుగును.
శని ప్రభావం :
1, 2, 12 రాసులలోయున్న ఏలినాటి శని ( ఏడున్నర ఏండ్ల శని) 8లో ఉన్న అష్టమ శని,
4లో ఉన్న అర్థాష్టమ శని అంటారు. శని ఒక్కొక్కరాశిలో 2 సంవత్సరముల 6 నెలలు ఉండును.
ఫలితము: ఈ సమయంలో ధనవ్యయం, అనారోగ్యం, జీవన భగం, స్థానచలనములు, అపమృత్యుభయం,
ఫలితము: ఈ సమయంలో ధనవ్యయం, అనారోగ్యం, జీవన భగం, స్థానచలనములు, అపమృత్యుభయం,
మనస్థిమితం తక్కువగాయుండుట, స్త్రీలతో అకారణ కలహములు, ఆకస్మిక ప్రమాదములు కలుగును.
Comments
Post a Comment