chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Wednesday, April 14, 2021

vrushikarashi vari rashipalalu-2021-22(వృశ్చికరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Vrushikam)

 వృశ్చికరాశి ఫలితాలు:

నక్షత్రాలు : విశాఖ: 4వ పాదం, అనురాధ : 1, 2, 3, 4, జ్యేష్ఠ : 1, 2, 3,4
నామ నక్షత్రాలు : తో, నా, నీ, నూ, నే, నో, యా, యూ

ఆధాయం :  08 వ్యయం : 14 రాజపూజ్యం : 4 అవమానం : 5

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(4లో)
(3లో)
(7లో)
(1లో)

ఫలితాలు:

  1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయడం కూడా సమస్యలకు కారణం అవుతుంది 

  2. మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలని నీ కోరిక నెరవేరుతుంది.

  3. ఆహార, లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, మత్స్యకారులకు, పాల వ్యాపారులకు పబ్లికేషన్స్ వారికి, మందుల షాపు వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం.

  4. ఆయుర్వేద వైద్యానికి మహర్దశ, ఆయుర్వేద వైద్యం బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది.

  5. ప్రతి చిన్న విషయానికి ఆటుపోట్లు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలే వస్తాయి. మీ విజయాన్ని సమర్ధత సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ.

  6. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పన్నులు వసూలు చేసే అధికారులతో సమస్యలు తప్పకపోవచ్చు.

  7. విందులు వినోదాలలో అపశృతులు ప్రతిష్టను దెబ్బ తీస్తాయి.

  8. క్రీడా సాంస్కృతిక కళా రంగాలకు చెందిన విషయంలో వ్యవహారాలు మీ కుటుంబ స్థాయికి అనుకూలిస్తాయి.

  9. ఆకర్షణీయమైన స్కీములలో చేరవద్దు. 

  10. ముఖ్య కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఎవరిక చెప్పవద్దు. 

  11. ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్లు ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి.

  12. సంబంధం లేని విషయాల కారణంగా మీ ప్రయోజనాలు కొంతకాలం నిలిచిపోతాయి.

  13. మీ మనసుకు సంతృప్తి కలిగే పని ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి.

  14. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవులు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి.

  15. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి.

  16. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో బ్యాంకు లోన్ తీసుకున్న రుణాలు చాలా కాలం వరకు తీరుస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని ఖర్చులు అదుపులో పెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తారు.

  17. ప్రభుత్వ సంబంధమైన పనులు లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెట్టే ఉంటారు. చాలా సందర్భాల్లో మీ మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.

  18. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. కీళ్ల నొప్పులు బాధిస్తాయి వైరల్ జ్వరాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

  19. మీరు కలలుకంటున్న స్వగృహ యోగం సఫలం అవుతుంది.

  20. మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. గత అనుభవాలే ఇందుకు కారణం.

  21. వివాహాది శుభకార్యాలు, పునర్ వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన సంవత్సరం.

  22. ఇంట్లో జరిగే పొరపాట్లు బయటకు తెలియకుండా ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు.

  23. మీడియా వల్ల ప్రచారసాధనాలు వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు.

  24. కనబడకుండా పోయిన ముఖ్యమైన కాగితాలు తిరిగి చేతికి వస్తాయి.

  25. మనసులో బాధలు కుటుంబంలో సమస్యలు ఉన్నా పైకి గంభీరంగానే కనిపిస్తారు. మీ అంతరంగం జీవనవిధానం భగవంతుడు తప్ప మరొకటి తెలియదు.

  26. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి

  27. వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తారు. సంప్రదాయబద్ధమైన శుభకార్యాలు పూర్తిచేస్తారు.

  28. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

  29. ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవడంతో వైరాగ్యం ఆవరిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంతో అవసరం. 

  30. ఉద్యోగ పరంగా మీకు రావలసిన ప్రమోషన్ పోరాడి సాధించుకుంటారు.. తరచుగా ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఉంది. 

  31. విసుగు విరామం లేకుండా పోటీ పరీక్షలలో విజయం కోసం కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు.

  32. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. 

  33. పునర్ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది.

  34. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే శ్రమిస్తారు. 

  35. మీరు చాలా మందికి అర్థం కాని మనిషి అవుతారు చాలా విషయాలు మీ నుండి ఇతరులకు అవసరమైన వివరణ లభించదు.మనసులో బాధ ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తారు.

  36.  మీ కార్యక్రమాలు ఎంతో వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు.

  37. ఆడిటింగ్, టాక్స్ చెల్లింపు రెన్యువల్ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభిస్తాయి.

  38. సామాజిక సంస్థ పరంగా అవార్డు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం ప్రాప్తి. 

  39. ప్రభుత్వ ఉద్యోగం లభించడం వంటి సంభవం. 

  40. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తోంది. విద్యా రంగంలో అనారోగ్య వాతావరణం వల్ల ఇబ్బందులు వస్తాయి.

  41. పంటి నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాధిస్తా.యి కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. 

  42. మీరు పొందలేని కొన్ని సౌకర్యాలను పొందలేని కొన్ని విషయాలను మీ కుటుంబ సభ్యులు సాధించడం సంతోషం కలిగిస్తుంది.

  43. రాజకీయ రంగంలో వారికి అనుకూలం, రాజకీయ పదవి లభిస్తుంది.


స్త్రీలకు:


  1. వృశ్చిక రాశి లో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

  2. కళా సాంస్కృతిక రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

  3. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చేదు అనుభవాలను మీ పిల్లలకు చెబుతారు.

  4. వివాహం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది.

  5. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  6. తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.

  7. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

  8. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న ఆర్థిక విషయాలలో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది.

  9. అలంకరణ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. 

  10. ఉన్నత విద్యను అభ్యసించగలరు, విదేశీయాన యోగ్యత కూడా ఉంది. మెరిట్ మార్కుల సాధిస్తారు.

  11. చాలా విషయాల్లో దైవానుగ్రహం ముఖ్యమని భావిస్తారు. దైవం మీద భారం వేస్తారు.

  12. ప్రేమ వివాహాలు గురించి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

  13. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంతానంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

  14. రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల మొండి బాకీలు తీరుస్తారు. రుణాలు తీరుస్తారు.

  15. ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. క్రీడా రంగంలో వారికి ప్రోత్సాహకాలు అవార్డు లభిస్తాయి.

  16. సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితం టీవీ రంగంలో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.

  17.  దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లపై అధికారులు సంతకం చేస్తారు.

  18.  ఉదర సంబంధమైన వ్యాధులు నిర్లక్ష్యం చేయవద్దు.

  19. ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో పెట్టుబడి పెట్టిన డబ్బు పోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు.

  20. మీ సహకారం వల్ల ఆరాటం వల్ల ఇంకొకరికి వివాహం పూర్తవుతుంది.

         
ధరించవలసని రత్నం: పగడం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (విశాఖ: కనకపుష్యరాగం, అనురాధ : నీలం, జ్యేష్ఠ : పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Tularashi Vari Rashipalm-2021-22 (తులరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Tula)

 తులరాశి ఫలితాలు:

నక్షత్రాలు : చిత్త: 3, 4 పాదాలు, స్వాతి: 1, 2, 3, 4 పాదాలు, విశాఖ: 1, 2,3 పాదాలు
నామ నక్షత్రాలు : రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే

ఆధాయం :  2 వ్యయం : 8 రాజపూజ్యం : 1 అవమానం : 5

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(4లో)
(3లో)
(8లో)
(2లో)

ఫలితాలు:
  1. తులా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 

  2. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. 

  3. స్టేషనరీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు లోహపు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

  4. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు. పూలతోట లకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి 

  5. చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది.మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

  6. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. 

  7. ఆదాయం ఉంటుంది చేతిలో మాత్రం ధనం నిలవదు.

  8. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

  9. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. 

  10. ఇతరులకు సలహాలు ఇవ్వడం వల్ల విరోదులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం.

  11. సంవత్సర ద్వితీయార్ధంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది.

  12. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగ పరంగా తృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటారు.

  13. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  14. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు బాధిస్తాయి.

  15. విలువైన వస్తువులు, డాక్యుమెంట్ సర్టిఫికెట్ల విషయంలో జాగ్రత్త వహించండి.

  16. ముఖ్యమైన అధికారులతో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడతాయి.

  17. ఇతరులకు సంబంధించిన తగవులలో తలదూర్చి తీర్పులు చెప్పవద్దు, అందరూ బాగానే ఉంటారు. మీరు ఒక్కరే అవుతారు.

  18. సంవత్సర ద్వితీయార్ధంలో సామాజిక పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం వుంది. కొంత ఆర్థిక లబ్ధి పొందుతారు.

  19. మీ స్నేహితులు చేసే రుణాలు మధ్యవర్తి సంతకాలు చేయవలసి వస్తుంది.

  20. మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్ల నష్టపోతారు. వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకటి చురుకుదనం లోపిస్తుంది.

  21. సంతానం విషయంలో జాగ్రత్త అవసరం.

  22. నూతన వ్యాపారాల్లో పెట్టుబడికి అనుకూల కాలం. జీవిత భాగస్వామి పేరు మీద మీరు చేసే వ్యాపారం లాభం ఉంటుంది.

  23. ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభాలు గడించడం ఇది మంచి అవకాశం.

  24. మీ ఓర్పు సహనం నీకు మేలు చేస్తాయి. రాని బాకీలు స్థిరాస్తి వ్యవహారాలు అమ్మకాలు అనుకూల వాతావరణంలోనే ఉంటాయి.

  25. ఖర్చులు అదుపు చేయడంలో విఫలం అవుతారు.

  26. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగిన వాటిని కొంతకాలం అమ్మడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది.

  27. ప్రభుత్వ కార్యాలయం లో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు.

  28. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు.

  29. స్థిరాస్తులు అమ్మే టప్పుడు కొనేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి.

  30. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం దొరుకుతుంది.

  31. రాజకీయ పదవి లభిస్తుంది. కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు.

  32. పశువుల పెంపకం, డైరీ ఔషధ సంబంధమైన కొన్ని వ్యాపారాలు మద్యం పప్పు నూనె వ్యాపారం ఈ రాశివారికి లాభాలు తెచ్చి పెడతాయి.

  33. లక్కీ డ్రా లకు ఫైనాన్స్ స్కీమ్ లకు దూరంగా ఉండండి.

  34. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేశానన్న సంతృప్తి కలుగుతుంది.

  35. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. ఎంతో శ్రమ చేసి ఒక్కమాటతో ఫలితాన్ని పోగొట్టుకోవద్దు. మీ ఓర్పు పరీక్ష ఎదురవుతాయి సంయమనం పాటించండి.

  36. ప్రభుత్వ పథకాల వల్ల మీరు లబ్ది పొందుతారు.

  37. గతంలో ఫైనాన్స్ కంపెనీలో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని భావిస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాదు.

  38. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకొని అనుకూల ఫలితాలు సాధిస్తారు.

  39. ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు మినహాయింపులు వస్తాయి.

  40. బ్యాంకు లోను తీసుకుని వ్యాపారం ప్రారంభిస్తారు.

  41. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు.

  42. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. 

  43. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.

  44.  ప్రేమ వివాహం విషయంలో సంయమనం పాటించండి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విద్య వ్యాపార రంగాలు బాగున్నాయి.

  2. రాజకీయ జీవితం బాగుంటుంది. 

  3. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ ఐఐటీ వంటి వాటికి ఎంపికవుతారు. 

  4. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. 

  5. జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి తో ఉన్న అనుబంధం శాశ్వతంగా చట్టపరంగా దూరమవుతుంది.

  6. పునర్ వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంది .

  7. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తోంది. 

  8. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  9. బ్యూటీ పార్లర్స్, అలంకార సామాగ్రి వస్తు సామాగ్రి విక్రయాలు పూజా సామాగ్రి అమ్మకం అనుకూలిస్తాయి.

  10. వీసా గ్రీన్ కార్డ్ వంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

  11. కళా రంగాల్లో వారికి సాంస్కృతిక రంగాలలో ఈ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

  12.  ప్రభుత్వ సంబంధమైన అవార్డులు లభిస్తాయి.

  13. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ ఎన్ టి సమస్యలు కీళ్ల నొప్పులు బాధించవచ్చు.

  14. మీ శక్తిసామర్థ్యాలకు గాను ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి.

  15.  పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలని మొండి తత్వం మంచి ఫలితాలను ఇస్తుంది.

  16. దూరదృష్టితో మీరు చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది. అన్ని సమస్యలను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు.


ధరించవలసని రత్నం: వజ్రం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (చిత్త: పగడం, స్వాతి: గోమేదికం, విశాఖ: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: లక్ష్మీదేవి స్తోత్రాలు
చేయవలసిన ధానం: బొబ్బెర్లు లేదా బొబ్బెర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు
----------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

Kanyarashi vari Palitalu-2021-22 (కన్యరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Kanya)

 కన్యరాశి ఫలితాలు:

నక్షత్రాలు : ఉత్తర: 2, 3, 4, పాదాలు, హస్త: 1, 2, 3, 4 పాదాలు, చిత్త: 1,2 పాదాలు
నామ నక్షత్రాలు : టో, పా, పీ, పూ, షం, ఠా, పే, పో

ఆధాయం :  5 వ్యయం : 05 రాజపూజ్యం : 6 అవమానం : 2

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(6లో)
(5లో)
(9లో)
 (3లో)

ఫలితాలు:
  1. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు జాగ్రత్తగా నడపడం కష్టతరమవుతుంది. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. పదోన్నతులు పొందుతారు పదోన్నతి ద్వారా లభించిన అధికారంతో సహచరులకు మీరు న్యాయం చేస్తారు.

  2. ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

  3. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలను పొందుతారు.

  4. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి షార్ట్ టర్మ్ కోర్స్ లు చేస్తారు.

  5. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలను పొందుతారు.

  6. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం. చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ పొందుతారు.

  7. పది మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహకారం వలన లభిస్తాయి. మీరు సాధించిన విజయాలు వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.

  8. రుణం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. శత్రువులు మిమ్మల్ని తక్కువగా అంచనావేసి భంగపడతారు.

  9. నూతన గృహం కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాల్లో ఉన్నదానితో తృప్తి పడతారు.

  10. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం  టెన్షన్ లోనవుతారు.

  11. కుటుంబంలో ఎదురైనా వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు పట్ల ఆకర్షితులవుతారు. ఆరోగ్య సూత్రాల కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సహోదర సహోదరీల తో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. కొంతకాలం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.

  12. విలువైన వస్తువులతో జాగ్రత్త అవసరం. చోరభయం పొంచి ఉంది.

  13. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తుంది తద్వారా ధనప్రాప్తి.

  14. దూర ప్రాంతాల నుండి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 

  15. నిర్మాణపరమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు.

  16.  వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.

  17. బంగారం వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

  18.  చెక్ బుక్స్ డాక్యుమెంట్స్ జారే అవకాశం ఉంది.

  19. సివిల్ సర్వీసెస్ ఐఐటీ వంటి పార్టీకి ఎంపిక అవుతారు.

  20. ఖర్చులు పెరుగుతాయి. రుణంగా ఇచ్చిన ధనం ఎట్టకేలకు అవుతుంది.

  21. మీ ఉపన్యాసాలు ప్రసంగాల ద్వారా అందరి ప్రశంసలు పొందుతారు. మీ ద్వారా ప్రయోజనం పొంది వాగ్దానం చేసిన వ్యక్తులు వాగ్దానాన్ని మర్చిపోయి  శత్రువులు అవుతారు.

  22. ఆత్మస్థైర్యంతో చేయవలసిన పనిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.

  23. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. 

  24. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో పరోక్షంగానో లభిస్తుంది.

  25. పని పూర్తి కాకుండా ఎవరికీ మీ వ్యూహం చెప్పవద్దు, అందువల్ల నష్టం ఏర్పడుతుంది.

  26.  భూసంబంధమైన వ్యాపారాలు లభిస్తాయి. మీ అంచనాలు ఉంటాయి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు.

  27. మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదే వలసి వస్తుంది కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉపశమనం లభిస్తుంది.

  28.  కోర్టులో ఉన్న వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. 

  29. ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మీ కోరిక నెరవేరుతుంది.

  30. అన్ని విషయాలను గోప్యంగా వ్యవహరిస్తారు. విదేశాలలో చదువుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది.

  31.  ఉద్యోగులకు ఉద్యోగంలో బదలీలు తప్పకపోవచ్చు, వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

  32. సంవత్సర ప్రథమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ సంవత్సరం బాగుంది.

  2. అలంకారానికి హుందాగా కనబడడానికి ప్రాధాన్యతను ఇస్తారు.

  3. సంప్రదాయబద్ధమైన దుస్తుల పట్ల మనసు లాగుతుంది.

  4. విద్య విదేశీయాన సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి.

  5. మీ చిరకాల వాంఛ అయిన వైద్య విద్యను అభ్యసించడం నెరవేరుతుంది.

  6. వీసా లభిస్తుంది గ్రీన్కార్డు లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది.

  7. గృహం కొనుగోలు చేస్తారు, రుణాలు తీరుతాయి.

  8. సాంస్కృతిక కళా రంగాల్లో రాణిస్తారు. అవార్డులు రివార్డులు లభిస్తాయి.

  9. నామినేటెడ్ పదవి లభిస్తుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

  10. అవివాహితులకు వివాహ ప్రాప్తి,  సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  11. పాత రుణాలు తీసివేస్తారు. భూముల మీద పెట్టుబడులు పెడతారు.

  12. కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

  13. మీ జీవితంలోకి నూతన వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు.

  14. పూర్వజన్మ పుణ్య ఫలం కొంత భగవంతుడి కరుణ కొంత మేలు చేస్తాయి.

         
ధరించవలసని రత్నం: పచ్చ (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (ఉత్తర: కెంపు, హస్త: ముత్యం, చిత్త: పగడం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: శ్రీమహావిష్ణవు (నారాయణుడు) స్తోత్రములు
చేయవలసిన ధానం: పెసర్లు లేదా పెసర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు


---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels