![]() |
Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Vrushikam) |
వృశ్చికరాశి ఫలితాలు:
ఆధాయం : 08 వ్యయం : 14 రాజపూజ్యం : 4 అవమానం : 5
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(4లో) | (3లో) | (7లో) | (1లో) |
ఫలితాలు:
ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయడం కూడా సమస్యలకు కారణం అవుతుంది
మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలని నీ కోరిక నెరవేరుతుంది.
ఆహార, లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, మత్స్యకారులకు, పాల వ్యాపారులకు పబ్లికేషన్స్ వారికి, మందుల షాపు వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం.
ఆయుర్వేద వైద్యానికి మహర్దశ, ఆయుర్వేద వైద్యం బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది.
ప్రతి చిన్న విషయానికి ఆటుపోట్లు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలే వస్తాయి. మీ విజయాన్ని సమర్ధత సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ.
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పన్నులు వసూలు చేసే అధికారులతో సమస్యలు తప్పకపోవచ్చు.
విందులు వినోదాలలో అపశృతులు ప్రతిష్టను దెబ్బ తీస్తాయి.
క్రీడా సాంస్కృతిక కళా రంగాలకు చెందిన విషయంలో వ్యవహారాలు మీ కుటుంబ స్థాయికి అనుకూలిస్తాయి.
ఆకర్షణీయమైన స్కీములలో చేరవద్దు.
ముఖ్య కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఎవరిక చెప్పవద్దు.
ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్లు ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి.
సంబంధం లేని విషయాల కారణంగా మీ ప్రయోజనాలు కొంతకాలం నిలిచిపోతాయి.
మీ మనసుకు సంతృప్తి కలిగే పని ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి.
రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవులు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి.
సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి.
సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో బ్యాంకు లోన్ తీసుకున్న రుణాలు చాలా కాలం వరకు తీరుస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని ఖర్చులు అదుపులో పెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తారు.
ప్రభుత్వ సంబంధమైన పనులు లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెట్టే ఉంటారు. చాలా సందర్భాల్లో మీ మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. కీళ్ల నొప్పులు బాధిస్తాయి వైరల్ జ్వరాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
మీరు కలలుకంటున్న స్వగృహ యోగం సఫలం అవుతుంది.
మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. గత అనుభవాలే ఇందుకు కారణం.
వివాహాది శుభకార్యాలు, పునర్ వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన సంవత్సరం.
ఇంట్లో జరిగే పొరపాట్లు బయటకు తెలియకుండా ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు.
మీడియా వల్ల ప్రచారసాధనాలు వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు.
కనబడకుండా పోయిన ముఖ్యమైన కాగితాలు తిరిగి చేతికి వస్తాయి.
మనసులో బాధలు కుటుంబంలో సమస్యలు ఉన్నా పైకి గంభీరంగానే కనిపిస్తారు. మీ అంతరంగం జీవనవిధానం భగవంతుడు తప్ప మరొకటి తెలియదు.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి
వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తారు. సంప్రదాయబద్ధమైన శుభకార్యాలు పూర్తిచేస్తారు.
బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవడంతో వైరాగ్యం ఆవరిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంతో అవసరం.
ఉద్యోగ పరంగా మీకు రావలసిన ప్రమోషన్ పోరాడి సాధించుకుంటారు.. తరచుగా ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఉంది.
విసుగు విరామం లేకుండా పోటీ పరీక్షలలో విజయం కోసం కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు.
కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి.
పునర్ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది.
భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే శ్రమిస్తారు.
మీరు చాలా మందికి అర్థం కాని మనిషి అవుతారు చాలా విషయాలు మీ నుండి ఇతరులకు అవసరమైన వివరణ లభించదు.మనసులో బాధ ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తారు.
మీ కార్యక్రమాలు ఎంతో వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు.
ఆడిటింగ్, టాక్స్ చెల్లింపు రెన్యువల్ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభిస్తాయి.
సామాజిక సంస్థ పరంగా అవార్డు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం ప్రాప్తి.
ప్రభుత్వ ఉద్యోగం లభించడం వంటి సంభవం.
పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తోంది. విద్యా రంగంలో అనారోగ్య వాతావరణం వల్ల ఇబ్బందులు వస్తాయి.
పంటి నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాధిస్తా.యి కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి.
మీరు పొందలేని కొన్ని సౌకర్యాలను పొందలేని కొన్ని విషయాలను మీ కుటుంబ సభ్యులు సాధించడం సంతోషం కలిగిస్తుంది.
రాజకీయ రంగంలో వారికి అనుకూలం, రాజకీయ పదవి లభిస్తుంది.
స్త్రీలకు:
వృశ్చిక రాశి లో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కళా సాంస్కృతిక రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
మీ చిన్ననాటి జ్ఞాపకాలు చేదు అనుభవాలను మీ పిల్లలకు చెబుతారు.
వివాహం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న ఆర్థిక విషయాలలో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది.
అలంకరణ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి.
ఉన్నత విద్యను అభ్యసించగలరు, విదేశీయాన యోగ్యత కూడా ఉంది. మెరిట్ మార్కుల సాధిస్తారు.
చాలా విషయాల్లో దైవానుగ్రహం ముఖ్యమని భావిస్తారు. దైవం మీద భారం వేస్తారు.
ప్రేమ వివాహాలు గురించి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంతానంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల మొండి బాకీలు తీరుస్తారు. రుణాలు తీరుస్తారు.
ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. క్రీడా రంగంలో వారికి ప్రోత్సాహకాలు అవార్డు లభిస్తాయి.
సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితం టీవీ రంగంలో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లపై అధికారులు సంతకం చేస్తారు.
ఉదర సంబంధమైన వ్యాధులు నిర్లక్ష్యం చేయవద్దు.
ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో పెట్టుబడి పెట్టిన డబ్బు పోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు.
మీ సహకారం వల్ల ఆరాటం వల్ల ఇంకొకరికి వివాహం పూర్తవుతుంది.
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment