![]() |
Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Kanya) |
కన్యరాశి ఫలితాలు:
ఆధాయం : 5 వ్యయం : 05 రాజపూజ్యం : 6 అవమానం : 2
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(6లో) | (5లో) | (9లో) | (3లో) |
ఫలితాలు:
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు జాగ్రత్తగా నడపడం కష్టతరమవుతుంది. ఉద్యోగ పరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. పదోన్నతులు పొందుతారు పదోన్నతి ద్వారా లభించిన అధికారంతో సహచరులకు మీరు న్యాయం చేస్తారు.
ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలను పొందుతారు.
ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి షార్ట్ టర్మ్ కోర్స్ లు చేస్తారు.
స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలను పొందుతారు.
కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం. చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ పొందుతారు.
పది మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహకారం వలన లభిస్తాయి. మీరు సాధించిన విజయాలు వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.
రుణం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. శత్రువులు మిమ్మల్ని తక్కువగా అంచనావేసి భంగపడతారు.
నూతన గృహం కొనుగోలు చేస్తారు. చాలా సందర్భాల్లో ఉన్నదానితో తృప్తి పడతారు.
వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డు కోసం టెన్షన్ లోనవుతారు.
కుటుంబంలో ఎదురైనా వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు పట్ల ఆకర్షితులవుతారు. ఆరోగ్య సూత్రాల కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సహోదర సహోదరీల తో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. కొంతకాలం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.
విలువైన వస్తువులతో జాగ్రత్త అవసరం. చోరభయం పొంచి ఉంది.
పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తుంది తద్వారా ధనప్రాప్తి.
దూర ప్రాంతాల నుండి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
నిర్మాణపరమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు.
వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
బంగారం వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
చెక్ బుక్స్ డాక్యుమెంట్స్ జారే అవకాశం ఉంది.
సివిల్ సర్వీసెస్ ఐఐటీ వంటి పార్టీకి ఎంపిక అవుతారు.
ఖర్చులు పెరుగుతాయి. రుణంగా ఇచ్చిన ధనం ఎట్టకేలకు అవుతుంది.
మీ ఉపన్యాసాలు ప్రసంగాల ద్వారా అందరి ప్రశంసలు పొందుతారు. మీ ద్వారా ప్రయోజనం పొంది వాగ్దానం చేసిన వ్యక్తులు వాగ్దానాన్ని మర్చిపోయి శత్రువులు అవుతారు.
ఆత్మస్థైర్యంతో చేయవలసిన పనిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.
బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి.
వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో పరోక్షంగానో లభిస్తుంది.
పని పూర్తి కాకుండా ఎవరికీ మీ వ్యూహం చెప్పవద్దు, అందువల్ల నష్టం ఏర్పడుతుంది.
భూసంబంధమైన వ్యాపారాలు లభిస్తాయి. మీ అంచనాలు ఉంటాయి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు.
మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదే వలసి వస్తుంది కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉపశమనం లభిస్తుంది.
కోర్టులో ఉన్న వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారతాయి.
ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మీ కోరిక నెరవేరుతుంది.
అన్ని విషయాలను గోప్యంగా వ్యవహరిస్తారు. విదేశాలలో చదువుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది.
ఉద్యోగులకు ఉద్యోగంలో బదలీలు తప్పకపోవచ్చు, వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.
సంవత్సర ప్రథమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి.
స్త్రీలకు:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ సంవత్సరం బాగుంది.
అలంకారానికి హుందాగా కనబడడానికి ప్రాధాన్యతను ఇస్తారు.
సంప్రదాయబద్ధమైన దుస్తుల పట్ల మనసు లాగుతుంది.
విద్య విదేశీయాన సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి.
మీ చిరకాల వాంఛ అయిన వైద్య విద్యను అభ్యసించడం నెరవేరుతుంది.
వీసా లభిస్తుంది గ్రీన్కార్డు లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది.
గృహం కొనుగోలు చేస్తారు, రుణాలు తీరుతాయి.
సాంస్కృతిక కళా రంగాల్లో రాణిస్తారు. అవార్డులు రివార్డులు లభిస్తాయి.
నామినేటెడ్ పదవి లభిస్తుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పాత రుణాలు తీసివేస్తారు. భూముల మీద పెట్టుబడులు పెడతారు.
కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
మీ జీవితంలోకి నూతన వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తారు.
పూర్వజన్మ పుణ్య ఫలం కొంత భగవంతుడి కరుణ కొంత మేలు చేస్తాయి.
---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment