![]() | |
|
తులరాశి ఫలితాలు:
ఆధాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 1 అవమానం : 5
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(4లో) | (3లో) | (8లో) | (2లో) |
ఫలితాలు:
తులా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు.
స్టేషనరీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు లోహపు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు. పూలతోట లకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి
చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది.మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది.
ఆదాయం ఉంటుంది చేతిలో మాత్రం ధనం నిలవదు.
వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం.
ఇతరులకు సలహాలు ఇవ్వడం వల్ల విరోదులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం.
సంవత్సర ద్వితీయార్ధంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది.
కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగ పరంగా తృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటారు.
వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు బాధిస్తాయి.
విలువైన వస్తువులు, డాక్యుమెంట్ సర్టిఫికెట్ల విషయంలో జాగ్రత్త వహించండి.
ముఖ్యమైన అధికారులతో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడతాయి.
ఇతరులకు సంబంధించిన తగవులలో తలదూర్చి తీర్పులు చెప్పవద్దు, అందరూ బాగానే ఉంటారు. మీరు ఒక్కరే అవుతారు.
సంవత్సర ద్వితీయార్ధంలో సామాజిక పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం వుంది. కొంత ఆర్థిక లబ్ధి పొందుతారు.
మీ స్నేహితులు చేసే రుణాలు మధ్యవర్తి సంతకాలు చేయవలసి వస్తుంది.
మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్ల నష్టపోతారు. వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకటి చురుకుదనం లోపిస్తుంది.
సంతానం విషయంలో జాగ్రత్త అవసరం.
నూతన వ్యాపారాల్లో పెట్టుబడికి అనుకూల కాలం. జీవిత భాగస్వామి పేరు మీద మీరు చేసే వ్యాపారం లాభం ఉంటుంది.
ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభాలు గడించడం ఇది మంచి అవకాశం.
మీ ఓర్పు సహనం నీకు మేలు చేస్తాయి. రాని బాకీలు స్థిరాస్తి వ్యవహారాలు అమ్మకాలు అనుకూల వాతావరణంలోనే ఉంటాయి.
ఖర్చులు అదుపు చేయడంలో విఫలం అవుతారు.
కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగిన వాటిని కొంతకాలం అమ్మడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వ కార్యాలయం లో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు.
స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు.
స్థిరాస్తులు అమ్మే టప్పుడు కొనేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి.
వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం దొరుకుతుంది.
రాజకీయ పదవి లభిస్తుంది. కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు.
పశువుల పెంపకం, డైరీ ఔషధ సంబంధమైన కొన్ని వ్యాపారాలు మద్యం పప్పు నూనె వ్యాపారం ఈ రాశివారికి లాభాలు తెచ్చి పెడతాయి.
లక్కీ డ్రా లకు ఫైనాన్స్ స్కీమ్ లకు దూరంగా ఉండండి.
వివాహాది శుభకార్యాలు ఘనంగా చేశానన్న సంతృప్తి కలుగుతుంది.
వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. ఎంతో శ్రమ చేసి ఒక్కమాటతో ఫలితాన్ని పోగొట్టుకోవద్దు. మీ ఓర్పు పరీక్ష ఎదురవుతాయి సంయమనం పాటించండి.
ప్రభుత్వ పథకాల వల్ల మీరు లబ్ది పొందుతారు.
గతంలో ఫైనాన్స్ కంపెనీలో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని భావిస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాదు.
ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకొని అనుకూల ఫలితాలు సాధిస్తారు.
ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు మినహాయింపులు వస్తాయి.
బ్యాంకు లోను తీసుకుని వ్యాపారం ప్రారంభిస్తారు.
వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు.
ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
ప్రేమ వివాహం విషయంలో సంయమనం పాటించండి.
స్త్రీలకు:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విద్య వ్యాపార రంగాలు బాగున్నాయి.
రాజకీయ జీవితం బాగుంటుంది.
ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ ఐఐటీ వంటి వాటికి ఎంపికవుతారు.
మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది.
జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి తో ఉన్న అనుబంధం శాశ్వతంగా చట్టపరంగా దూరమవుతుంది.
పునర్ వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంది .
పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తోంది.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
బ్యూటీ పార్లర్స్, అలంకార సామాగ్రి వస్తు సామాగ్రి విక్రయాలు పూజా సామాగ్రి అమ్మకం అనుకూలిస్తాయి.
వీసా గ్రీన్ కార్డ్ వంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కళా రంగాల్లో వారికి సాంస్కృతిక రంగాలలో ఈ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
ప్రభుత్వ సంబంధమైన అవార్డులు లభిస్తాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ ఎన్ టి సమస్యలు కీళ్ల నొప్పులు బాధించవచ్చు.
మీ శక్తిసామర్థ్యాలకు గాను ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి.
పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలని మొండి తత్వం మంచి ఫలితాలను ఇస్తుంది.
దూరదృష్టితో మీరు చేసే ప్రతి పని మీకు కలిసి వస్తుంది. అన్ని సమస్యలను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు.
----------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
చాలా బాగుంది మీ వివరణ
ReplyDelete