chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Sunday, October 12, 2025

గురుబలం పెరగడానికి అద్భుతమైన 16 ప్రక్రియలు



జ్యోతిష్యశాస్త్రంలో గురుగ్రహం (బృహస్పతి) అత్యంత ముఖ్యమైన మరియు శుభప్రదమైన గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇతతని దేవ గురువు అని కూడా పిలుస్తారు. వ్యక్తి యొక్క జాతకంలో గురువు యొక్క స్థితిని బట్టి , ప్రాముఖ్యతను బట్టి అనుగ్రహం పొందడానికి ఆచరించవలసిన పరిహారాల తెలుసుకుందాం.


శ్రీ గురుగ్రహం ప్రాముఖ్యత (Brihaspati / Jupiter Importance)

నవగ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభగ్రహం. గురువు బలమైన స్థానంలో ఉంటే, ఆ వ్యక్తికి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.

  • కారకత్వాలు : రుగ్రహం ప్రధానంగా జ్ఞానం, వివేకం, విద్య, సంపద (ధనం), అదృష్టం, సంతానం, వివాహం, ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత మరియు విస్తరణ (Growth) ను సూచిస్తుంది.
  • గురుబలం ప్రభావం: జాతకంలో గురుబలం బలంగా ఉన్నవారు మంచి పాండిత్యం, దైవభక్తి, న్యాయబుద్ధి కలిగి ఉంటారు. వీరికి జీవితంలో సుఖ సౌఖ్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగం, వివాహం, ధనలాభం వంటి శుభకార్యాలు సరైన సమయానికి జరుగుతాయి.
  • అధిదేవతలు: గురు గ్రహానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు మరియు దక్షిణామూర్తి (శివుడి రూపం). గురువారం ఈ దేవతల పూజకు ఎంతో శ్రేష్ఠమైనది.


గురు గ్రహ అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలు

1. గురువారం ఆచరించాల్సిన ముఖ్య పూజలు
2. మంత్ర జపం మరియు స్తోత్ర పారాయణం
3. దానాలు మరియు సేవ
4. రావి చెట్టుకు ప్రదక్షణలు
5. ఇతర పద్దతులు 

జాతకంలో గురు బలం పెంచుకోవడానికి, గురు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి ఈ కింది పరిహారాలను ఆచరించడం మంచిది.

గురు గ్రహ అనుకూలత కోసం గురువారం రోజున ఈ కింది పూజలు మరియు నియమాలను పాటించాలి.

  • పసుపు రంగు వస్తువులు: గురు గ్రహానికి పసుపు రంగు ప్రీతికరమైనది కాబట్టి, ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువు లేదా గురు గ్రహానికి పసుపు రంగు పూలు, పసుపు పండ్లు, పసుపు వస్త్రాలు సమర్పించి పూజ చేయాలి.

  • స్నానం: గురువారం ఉదయం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడం వలన గురు బలం పెరుగుతుందని విశ్వసిస్తారు.

  • విష్ణువు/దత్తాత్రేయుడు/ దక్షిణామూర్తి పూజ: గురువారం శ్రీ మహావిష్ణువును లేదా దక్షిణామూర్తిని పూజించడం వలన గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది.

  • విష్ణు మంత్రం: గురువారం రోజున పవిత్రమైన మనసుతో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు కలుగుతాయి.

  • దక్షిణామూర్తి స్తోత్రం: ఓం నమో భగవతే దక్షణామూర్తే మహ్యం మేధాం, ప్రజ్ఘాం ప్రయచ్చ స్వాహా:  అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే గురు గ్రహ దోషాలు తొలగి, విద్య, ఉద్యోగం, సంపద పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా గురువారం రోజున పారాయణం చేయవచ్చు. విద్యార్థులకు ఇది చాలా మంచిది.

  • హయగ్రీవ స్తోత్రం: ‘‘ జ్ఘానానంద మయం నిర్మలం దేవం,  స్పటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే : ’’ అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే  ఉన్నత విద్య, విదేశీ విద్య మరియు జ్ఞానశక్తిని పెంపొందుతుంది. గురుగ్రహ అధిదేవత అయిన హయగ్రీవుని స్తోత్రాన్ని ప్రతిరోజూ చదవడం మంచిది.

  • దత్తాత్రేయ స్తోత్రం : దత్తాత్రేయుడికి ‘‘ద్రాం ’’ అనేది బీజాక్షరం. ఈ  భీజాక్షరాన్ని ‘‘ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ: ’’ అంటూ ప్రతి రోజు లేదా ముఖ్యంగా గురువారం రోజున 108 సార్లు చదవాలి. ఇందువల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం పెరిగి ధనరాబడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. 

  • నిమ్మపండు తో పరిహారం : ఒక స్వచ్చమైన గాజు గ్లాసులో స్వచ్చమైన నీరు పోసి అందులో పసుపురంగ నిమ్మ పండు తీసకొని దానిపై ఎరుపు రంగు మార్కర్ లేదా పెన్ తో పైన ఓం అని చిన్నగా వ్రాసి దాని కింద ‘‘ద్రాం’’ అని పెద్దగా వ్రాసి నీటి గ్లాసులో వేసి  ఉత్తరం దిక్కులో లేదా ఈశాన్యం దిక్కులో ఉంచడవ వలన కూడా గురుబలం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు తొలుగుతాయి. గురువారం రోజున పెట్టవచ్చు లేదా  ఈ నిమ్మపండును ప్రతిరోజు పెట్టిన మంచిది,  మరుసటి రోజు ఆ నిమ్మపండును, నీటిని ఇంట్లో మొక్కలకు లేదా చెట్టకు పోయాలి. తొక్కుడులో వేయకూడదు.

  • దానం: గురు బలం పెంచుకోవడానికి శక్తి మేరకు శనగలు, పసుపు రంగు వస్త్రాలు, నెయ్యి, పసుపు, చక్కెర (స్వీట్స్)  లేదా బంగారం వంటి వాటిని గురువారం రోజున దానం చేయవచ్చు.

  • గురువుల సేవ: నిజ జీవితంలో గురువులు, పెద్దలు, పండితులు మరియు ఉపాధ్యాయులను గౌరవించి, వారి సేవ చేయడం వలన గురు గ్రహ అనుగ్రహం త్వరగా కలుగుతుంది.

  • రావి చెట్టుకు ప్రదక్షణలు : రావి చెట్టను అశ్వద్ద వృక్షము అని కూడా అంటారు. ప్రతి రోజు రావి చెట్టుకు 11 లేదా 108 ప్రదక్షిణలు చేయడం వలన గురుబలము పెరుగుతుంది. ప్రదక్షణలు చేస్తన్నపుడు ‘‘ఓం శ్రీ అశ్వద్ద వృక్షాయ నమ:’’ అంటూ ప్రదక్షణలు చేయాలి.

  • నేతి దీపం : ప్రత్యేకించి గురువారం రోజున రావి చెట్టువద్ద నేతి దీపం వెలించినట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. దీపపు ప్రమిదలో నేయిపోసి పసుపురంగు వత్తివేసి వెలిగించాలి. పసురంగు పూలు, శనిగలు, బెల్లం, పాయసం లేదా స్వీట్స్ వంటి తీపి పదార్ధాలు నైవేద్యంగా పెట్టవచ్చు. 

  • గోవుకు ఆహారం : ప్రతి రోజుల లేదా ప్రత్యేకించి గురువారం రోజున తెల్లని లేదా కపిల వర్ణం  (ఎరుపు రంగు) ఆవులకు నానపెట్టిన శనగలు నేరుగా కాని ఉడిచింకి అన్నంలో కలిపిగాని తినిపించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా శక్తిని భట్టి 9 లేదా 11 వారాలు చేయాలి.

  • జపం-దానం : ‘‘ ఓం  హ్రాం హ్రీం హ్రౌం స: బృ హస్పతయే నమ: ’’ అను మంత్రాన్ని ఒక  గరువారం లేదా శుభతిథి లేదా గురు నక్షత్రాలు (పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర) ఉన్న సమయానికి గురు జపాన్ని ప్రారంభించి 40 రోజులలో  16 వేల సార్లు పూర్తి  అగునట్లుగా జపం చేయాలి. 41వ రోజు ఒక పసపు రంగు వస్త్రంలో శక్తిని బట్టి 16 పిడికిల్ల, 16 దోసిస్లు శనగలు పోసి మూట్టకట్టి బ్రహ్మణునికి దానం ఇవ్వాలి. 

  • గురుగాయత్రి స్తోత్రం : ‘‘ఓం సురాచార్య విద్మహే - దేవపూజ్యాయ దీమహి తన్నో గురు: ప్రచోదయాత్ ’’ ఈ గాయత్రి మంత్రమును గురువారం రోజున 108 సార్లు పటించిన గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.

  • కనకపుష్యరాగం రత్నం ధరించుట : అనుభవఘ్నులైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతకములో కనకపుష్యరాగం రత్నమును ధరించవచ్చునో లేదో తెలుసుకొని ఉంగరం ధరించడం.

  • రుద్రాక్షమాల ధరించుట : సప్తముఖి రుద్రాక్షణు మెడలో హారంగా ధరించిన్లయిన గురుబలం పెరిగి ధనం, సంపద, ఆరోగ్యం, జీవన వృద్ది, వ్యవహార జయాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. 

పైన తెలిపిన పరిహారాలను శ్రద్ధాభక్తులతో పాటించడం వలన గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పెరిగి, విద్య, వివాహం, ఉద్యోగం మరియు సంపద వంటి జీవిత లక్ష్యాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, ఏదైనా పరిహారం ప్రారంభించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి, మీ జాతకాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం.

- By SreeRam Manuhar, 

Astrologer (Vedic and KP)

Chintamani Astrology Service 

Share:

Sunday, September 21, 2025

రాహుకాలంలో నిమ్మ పండు దీపం

రాహుకాలంలో నిమ్మ పండు దీపం వెలిగించే సమయాలు, పూజా విధానం.

రాహుకాలంలో నిమ్మ పండు దీపం వెలిగించడం ప్రత్యేకంగా శక్తివంతమైన పూజా విధి. ఇది పెద్దగా కుజ, రాహు, కాలసర్ప దోషాలు, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగించడంలో ఉపయోగపడుతుంది[1][2].

 రాహుకాలం సమయాలు

- ఆదివారం: సా. 4:30 - 6:00
- సోమవారం: ఉ. 7:30 - 9:00
- మంగళవారం: మ. 3:00 - 4:30
- బుధవారం: మ. 12:00 - 1:30
- గురువారం: మ. 1:30 - 3:00
- శుక్రవారం: ఉ. 10:30 - 12:00
- శనివారం: ఉ. 9:00 - 10:30

# నిమ్మ పండు దీపం పూజా విధానం

- రాహు కాలం (Rahukalam) సమయంలో గుడి లేదా ఇంట్లో పూజ స్థలంలో దీపం వెలిగించాలి.
- పచ్చ నిమ్మకాయ ను తీసుకొని మధ్యలో భాగాన్ని అడ్డంగా కట్ చేయాలి (అరిలోగా).
- నిమ్మ రసాన్ని పూర్తిగా తీసేయాలి. నిమ్మను లోపలికాడ తిప్పి, లోపలి భాగాన్ని వట్టిగా పొగిలి, కప్పుగా తయారుచేయాలి.
- ఆ కప్పులో నూనె లేదా నెయ్యి నింపి, . విక్స్ కోసం కొత్త పసుపు గుడ్డ, మూస్లెట్ లేదా పత్తి వాడవచ్చు.
- దీపాన్ని ఉత్తర దిశలో వెలిగించాలి.
- ఒక రాగి ప్లేట్ ,  కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకోవాలి.  నిమ్మపై పెట్టి వెలిగించాలి.
- దీపానికి మన కోరిక, సమస్య తెలియజేస్తూ ద్వాదశ కన్నులు గల అమ్మవారికి పూజ చేయాలి.
- పూజ పూర్తయిన తర్వాత నిమ్మ రసాన్ని నీటిలో కలిపి చెట్టు దిగుగా పోయాలి లేదా ముదు మీద పెట్టాలి.
- దీపాలు ఆరిపోయిన తర్వాత, లెమన్ కప్పులను ఉత్తర దిశలో, చిన్న గోతిలో పెట్టి మట్టి వెదజల్లాలి.

# పాటించవలసిన నియమాలు

- నిమ్మ పండు దీపాలు ఎప్పుడూ బేసిన సంఖ్యలో (1, 3, 5, 7, 9) వెలిగించాలి.
- నెయ్యి లేదా నునె వాడినప్పుడు శుద్ధమైనదిగా ఉండాలి.
- Rahu Kala Deepam పూజ 9 రోజులు చేయాలి, పూర్తిగా స్థిరమైన కోరిక నెరవేర్చడంలో సహాయపడుతుంది.
- Rahu kala పూజ కోసం Tuesday, Friday, Sunday ప్రధానంగా ఉత్తమం.
- దీపాలు ఆరిపోయిన తరువాత Disposal కూడా Rahu Kalam లోనే చేయాలి.

# పూజా ఫలితాలు

- Rahu, Kuja, Kala Sarpa dosha సమస్యలు తగ్గుతాయి.
- వ్యాపార, కుటుంబ, ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
- విద్య, వివాహం, సంతానం, కోరిక నెరవేరే అవకాశాలు పెరుగుతాయి.

ఈ విధంగా Rahu Kalam లో నిమ్మ పండు దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


Share:

Sunday, September 14, 2025

ఉద్యోగ ప్రయత్నాలకు శ్రీ హనుమాన్ మంత్రసాధన

జై హనుమాన్  ఆరాధన 
(ఉద్యోగ ప్రయత్నాలకు మంత్రసాధన)

త్వమస్మిన్ కార్య నిరుయోగే
ప్రమాణం హరిసత్తమ 
హనుమాన్ యత్నమాస్తాయి 
దుఃఖ క్షయ కరోబవబవ ll
అసాధ్యసాధక స్వామిన్
అసాధ్యం తవ కిమ్ వద 
రామదూత కృపాసిందో 
మత్కార్యం సాదయ ప్రబో ll

ఈ మంత్రమును
ఒక మంగళవారం ప్రారంభించాలి.
 హనుమాన్ గుడికి వెళ్లి స్వామికి ఐదు అరటి పండ్లు నివేదన చేసి 108 ప్రదక్షిణలు (వీలుకానిచో 11 ప్రదక్షిణాలు) చేసి తర్వాత గుడిలో ఒకపక్కగా కూర్చుని పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు పటించాలి. తర్వాత ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇంట్లో గాని గుడికి వెళ్లి గాని వరుసగా 108 సార్లు 41 రోజులు భక్తిశ్రద్ధలతో చదవాలి. 
ఇలా చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి తప్పకుండా ఉద్యోగాన్ని వచ్చేలా చేస్తాడు.
Share:

Saturday, November 23, 2024

శ్రీకృష్ణాష్టకమ్

శ్రీకృష్ణాష్టకమ్

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం | 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం || అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం । 
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥ కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం | విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥ మన్దారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపింఛావచూడాంగం కృష్ణంవందే జగద్గురుమ్ ॥ ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగుద్గురుం ॥ 
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం | 
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం ॥ 
గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం | 
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం ॥ శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం | 
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥

ఫలశ్రుతి :

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ | 
కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ॥


సంతాన గోపాల మంత్రం

|| ఓం దేవకీ సుత గోవిందా వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణా త్వా మహం శరణం గతః ||
Share:

Saturday, September 21, 2024

ఎవరితోనైనా గొడవలు తగ్గడానికి శివుడి అద్భుతైన స్తోత్రం



ఓం 

భగవాన్ విశ్వేశ్వరాయ ః

మహాదేవాయః 

త్రియంభకాయః

త్రిపురాంతకాయః

త్రికాలాగ్నికాలాయః

కాలాగ్ని రుద్రాయః

నీలకంఠాయః

మృత్యుంజయాయః

సర్వేశ్వరాయః

సదాశివాయః

శ్రీమాన్ మహాదేవాయం నమః


ఫలితము : ఈ స్తోత్రము ప్రతి రోజు 11 స్తార్లు చదివిన వారికి ఆపదలు రావు, ఎవరైనై కారణంగానైన, అకారణంగానైన గొడవ పడుతున్న, దూషిస్తున్న పై స్తోత్రాన్ని చదివితే రాను రాను వారి కోపం తగ్గి మీ పట్ల ప్రేమగా ఉంటారు.

చదివే విధానము : శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేసేటపుడు చదువాలి, లేదా గుడికి వెళ్ళలేక పోతే మన ఇంట్లోనే (అంగుష్ట ప్రమాణం వున్న)  చిన్న శివలింగాన్ని తెచ్చుకొని (స్పటిక లింగం అయితే మంచిది) ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు. అభిషేకం చేసే ముందు ఒక పాత్రలో ఉంచి అభిషేకం చేయాలి. ప్రతి రోజు అభిషేకం చేస్తూ 11 సార్లు చదువాలి. అభిషేకం చేసాక మళ్ళీ యదా స్తానంలో పెట్టాలి. పాత్రలోని నీటి పూల మొక్కలు పోయాలి. తరువాత చిన్న ప్లేట్ లో చిన్న బెల్లం ముక్క కానీ మీకు నచ్చన నైవేద్యం కానీ పెట్టవచ్చు. ప్రతి రోజు పెట్టాలి. అలాగే భక్తితో పూలు కూడా సమర్మించ వచ్చు.

గమనిక : ఒక సారి మీ ఇంటికి ఉత్తరం దిశలో ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయో చూడండి. అవి పెరిగేతే తీసివేయండి.



Share:

Saturday, September 14, 2024

లక్ష్మీ గణపతి స్తోత్రం

లక్ష్మీ గణపతి స్తోత్రం

-------------------------

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ 
నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి
ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం..!

Result :

ఆరోగ్యం మరియు ఆర్ధికంగా స్థిరముగా ఉండుటకు.. 
అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం
శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం
Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels