జ్యోతిష్యశాస్త్రంలో గురుగ్రహం (బృహస్పతి) అత్యంత ముఖ్యమైన మరియు శుభప్రదమైన గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇతతని దేవ గురువు అని కూడా పిలుస్తారు. వ్యక్తి యొక్క జాతకంలో గురువు యొక్క స్థితిని బట్టి , ప్రాముఖ్యతను బట్టి అనుగ్రహం పొందడానికి ఆచరించవలసిన పరిహారాల తెలుసుకుందాం.
శ్రీ గురుగ్రహం ప్రాముఖ్యత (Brihaspati / Jupiter Importance)
నవగ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభగ్రహం. గురువు బలమైన స్థానంలో ఉంటే, ఆ వ్యక్తికి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.
- కారకత్వాలు : రుగ్రహం ప్రధానంగా జ్ఞానం, వివేకం, విద్య, సంపద (ధనం), అదృష్టం, సంతానం, వివాహం, ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత మరియు విస్తరణ (Growth) ను సూచిస్తుంది.
- గురుబలం ప్రభావం: జాతకంలో గురుబలం బలంగా ఉన్నవారు మంచి పాండిత్యం, దైవభక్తి, న్యాయబుద్ధి కలిగి ఉంటారు. వీరికి జీవితంలో సుఖ సౌఖ్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగం, వివాహం, ధనలాభం వంటి శుభకార్యాలు సరైన సమయానికి జరుగుతాయి.
- అధిదేవతలు: గురు గ్రహానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు మరియు దక్షిణామూర్తి (శివుడి రూపం). గురువారం ఈ దేవతల పూజకు ఎంతో శ్రేష్ఠమైనది.
గురు గ్రహ అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలు
1. గురువారం ఆచరించాల్సిన ముఖ్య పూజలు
2. మంత్ర జపం మరియు స్తోత్ర పారాయణం
3. దానాలు మరియు సేవ
4. రావి చెట్టుకు ప్రదక్షణలు
5. ఇతర పద్దతులు
జాతకంలో గురు బలం పెంచుకోవడానికి, గురు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి ఈ కింది పరిహారాలను ఆచరించడం మంచిది.
గురు గ్రహ అనుకూలత కోసం గురువారం రోజున ఈ కింది పూజలు మరియు నియమాలను పాటించాలి.
పసుపు రంగు వస్తువులు: గురు గ్రహానికి పసుపు రంగు ప్రీతికరమైనది కాబట్టి, ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువు లేదా గురు గ్రహానికి పసుపు రంగు పూలు, పసుపు పండ్లు, పసుపు వస్త్రాలు సమర్పించి పూజ చేయాలి.
స్నానం: గురువారం ఉదయం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడం వలన గురు బలం పెరుగుతుందని విశ్వసిస్తారు.
విష్ణువు/దత్తాత్రేయుడు/ దక్షిణామూర్తి పూజ: గురువారం శ్రీ మహావిష్ణువును లేదా దక్షిణామూర్తిని పూజించడం వలన గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది.
విష్ణు మంత్రం: గురువారం రోజున పవిత్రమైన మనసుతో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు కలుగుతాయి.
దక్షిణామూర్తి స్తోత్రం: ఓం నమో భగవతే దక్షణామూర్తే మహ్యం మేధాం, ప్రజ్ఘాం ప్రయచ్చ స్వాహా: అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే గురు గ్రహ దోషాలు తొలగి, విద్య, ఉద్యోగం, సంపద పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా గురువారం రోజున పారాయణం చేయవచ్చు. విద్యార్థులకు ఇది చాలా మంచిది.
హయగ్రీవ స్తోత్రం: ‘‘ జ్ఘానానంద మయం నిర్మలం దేవం, స్పటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే : ’’ అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే ఉన్నత విద్య, విదేశీ విద్య మరియు జ్ఞానశక్తిని పెంపొందుతుంది. గురుగ్రహ అధిదేవత అయిన హయగ్రీవుని స్తోత్రాన్ని ప్రతిరోజూ చదవడం మంచిది.
దత్తాత్రేయ స్తోత్రం : దత్తాత్రేయుడికి ‘‘ద్రాం ’’ అనేది బీజాక్షరం. ఈ భీజాక్షరాన్ని ‘‘ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ: ’’ అంటూ ప్రతి రోజు లేదా ముఖ్యంగా గురువారం రోజున 108 సార్లు చదవాలి. ఇందువల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం పెరిగి ధనరాబడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.
నిమ్మపండు తో పరిహారం : ఒక స్వచ్చమైన గాజు గ్లాసులో స్వచ్చమైన నీరు పోసి అందులో పసుపురంగ నిమ్మ పండు తీసకొని దానిపై ఎరుపు రంగు మార్కర్ లేదా పెన్ తో పైన ఓం అని చిన్నగా వ్రాసి దాని కింద ‘‘ద్రాం’’ అని పెద్దగా వ్రాసి నీటి గ్లాసులో వేసి ఉత్తరం దిక్కులో లేదా ఈశాన్యం దిక్కులో ఉంచడవ వలన కూడా గురుబలం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు తొలుగుతాయి. గురువారం రోజున పెట్టవచ్చు లేదా ఈ నిమ్మపండును ప్రతిరోజు పెట్టిన మంచిది, మరుసటి రోజు ఆ నిమ్మపండును, నీటిని ఇంట్లో మొక్కలకు లేదా చెట్టకు పోయాలి. తొక్కుడులో వేయకూడదు.
దానం: గురు బలం పెంచుకోవడానికి శక్తి మేరకు శనగలు, పసుపు రంగు వస్త్రాలు, నెయ్యి, పసుపు, చక్కెర (స్వీట్స్) లేదా బంగారం వంటి వాటిని గురువారం రోజున దానం చేయవచ్చు.
గురువుల సేవ: నిజ జీవితంలో గురువులు, పెద్దలు, పండితులు మరియు ఉపాధ్యాయులను గౌరవించి, వారి సేవ చేయడం వలన గురు గ్రహ అనుగ్రహం త్వరగా కలుగుతుంది.
రావి చెట్టుకు ప్రదక్షణలు : రావి చెట్టను అశ్వద్ద వృక్షము అని కూడా అంటారు. ప్రతి రోజు రావి చెట్టుకు 11 లేదా 108 ప్రదక్షిణలు చేయడం వలన గురుబలము పెరుగుతుంది. ప్రదక్షణలు చేస్తన్నపుడు ‘‘ఓం శ్రీ అశ్వద్ద వృక్షాయ నమ:’’ అంటూ ప్రదక్షణలు చేయాలి.
నేతి దీపం : ప్రత్యేకించి గురువారం రోజున రావి చెట్టువద్ద నేతి దీపం వెలించినట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. దీపపు ప్రమిదలో నేయిపోసి పసుపురంగు వత్తివేసి వెలిగించాలి. పసురంగు పూలు, శనిగలు, బెల్లం, పాయసం లేదా స్వీట్స్ వంటి తీపి పదార్ధాలు నైవేద్యంగా పెట్టవచ్చు.
గోవుకు ఆహారం : ప్రతి రోజుల లేదా ప్రత్యేకించి గురువారం రోజున తెల్లని లేదా కపిల వర్ణం (ఎరుపు రంగు) ఆవులకు నానపెట్టిన శనగలు నేరుగా కాని ఉడిచింకి అన్నంలో కలిపిగాని తినిపించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా శక్తిని భట్టి 9 లేదా 11 వారాలు చేయాలి.
జపం-దానం : ‘‘ ఓం హ్రాం హ్రీం హ్రౌం స: బృ హస్పతయే నమ: ’’ అను మంత్రాన్ని ఒక గరువారం లేదా శుభతిథి లేదా గురు నక్షత్రాలు (పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర) ఉన్న సమయానికి గురు జపాన్ని ప్రారంభించి 40 రోజులలో 16 వేల సార్లు పూర్తి అగునట్లుగా జపం చేయాలి. 41వ రోజు ఒక పసపు రంగు వస్త్రంలో శక్తిని బట్టి 16 పిడికిల్ల, 16 దోసిస్లు శనగలు పోసి మూట్టకట్టి బ్రహ్మణునికి దానం ఇవ్వాలి.
గురుగాయత్రి స్తోత్రం : ‘‘ఓం సురాచార్య విద్మహే - దేవపూజ్యాయ దీమహి తన్నో గురు: ప్రచోదయాత్ ’’ ఈ గాయత్రి మంత్రమును గురువారం రోజున 108 సార్లు పటించిన గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
కనకపుష్యరాగం రత్నం ధరించుట : అనుభవఘ్నులైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతకములో కనకపుష్యరాగం రత్నమును ధరించవచ్చునో లేదో తెలుసుకొని ఉంగరం ధరించడం.
రుద్రాక్షమాల ధరించుట : సప్తముఖి రుద్రాక్షణు మెడలో హారంగా ధరించిన్లయిన గురుబలం పెరిగి ధనం, సంపద, ఆరోగ్యం, జీవన వృద్ది, వ్యవహార జయాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
పైన తెలిపిన పరిహారాలను శ్రద్ధాభక్తులతో పాటించడం వలన గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పెరిగి, విద్య, వివాహం, ఉద్యోగం మరియు సంపద వంటి జీవిత లక్ష్యాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, ఏదైనా పరిహారం ప్రారంభించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి, మీ జాతకాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం.
Comments
Post a Comment