chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Wednesday, April 14, 2021

Dhanushrashi vari Rashipalam -2021-22 (ధనస్సురాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Dhanussu)

 ధనస్సురాశి ఫలితాలు:

నక్షత్రాలు : మూల: 1, 2, 3, 4 పాదాలు, పూ.ఆ : 1, 2, 3, 4 పాదాలు, ఉ.ఆ: 1వ పాదం
నామ నక్షత్రాలు : యె, యే, బా, బీ, భూ, దా, డా, బే

ఆధాయం :  11 వ్యయం : 05 రాజపూజ్యం : 07 అవమానం : 05

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(3లో)
(2లో)
(6లో)
(12లో)

ఫలితాలు:
  1. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి స్థిరత్వం కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

  2. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది.

  3. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

  4. విద్యార్థలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

  5. సహోదర సహోదరీ వర్గం వల్ల మేలు కలుగుతుంది.

  6. రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఉన్నత అధికారులు గుర్తిస్తారు.

  7. సభలలో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు మీకు వస్తాయి. మీరు ఊహించిన అటువంటి మంచి అవకాశం వస్తుంది. నూతన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు.

  8. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదీలీలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది.

  9. కార్యాలయంలో ఉద్యోగుల తగాదాలు నిదానంగా పరిష్కరించుకుంటారు.

  10. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు.

  11. టీవీ సినీ రంగాల్లో వారికి కళాకారులకు సాంస్కృతిక సిబ్బందికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు.

  12. దుబారాలకు, విందు వినోదాలకు దూరంగా ఉంటారు. అయినా కొన్ని సందర్భాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్య కళలపై ఆసక్తి చూపుతారు.

  13. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలిక ఉద్యోగాలు, పార్ట్టైమ్ ఉద్యోగాలు లభిస్తాయి.

  14. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.

  15. వాహనం యోగ్యత, స్వగృహ యోగ్యత కలుగుతాయి.

  16. అసూయా ద్వేషాలకు దూరంగా ఉంటారు. మంచి జరిగినా చెడు జరిగినా ఏ మాత్రం చెలించరు. మీకు మీరుగా తెచ్చుకున్న మార్పు ఇది.

  17. కష్టపడడం లో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని భావిస్తారు. మీరు చెప్పే మంచి మాటలు బోధనలు అందరికీ నచ్చుతాయి. అందరూ ఆచరిస్తారు. మీ ఇంట్లో వాళ్లకు మాత్రం మీ మాటలు రుచించవు.

  18. ఈ రాశి వారికి ప్రబలమైన ఏలినాటి శని నడుస్తున్నది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి, ఎనిమిది శనివారాలు పాటు నలుపు ఒత్తులతో దీపారాధన చేయండి. 11 మంగళవారాలు పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి, వడమాల సమర్పించండి. కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

  19. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు.

  20. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి.

  21. దైవ సంకల్పం ముందు మానవుడు చాలా బలహీనుడు అని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.

  22. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి భయం పొంచి ఉంది.

  23. ఫ్యాన్సీ షాప్ ల వారికి ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయలకు, స్టేషనరీ వ్యాపారస్తులకు బ్యూటీపార్లర్లో వారికి చేతివృత్తుల పనివారికి సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి హోల్సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది.

  24. విలువైన భూములు, వస్తువులను గతంలో కొనుగోలు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వాటి విలువ చాలా పలుకుతుంది. 

  25. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలలో ఉన్న వారికి అనుకూలం వ్యాపారంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఫలితాలనిస్తాయి.

  26. నిర్మాణ రంగంలో రాణిస్తారు. గుడ్ విల్ బాగా పెరుగుతుంది. 

  27. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి.

  28.  కోర్టు వ్యవహారాలలో విజయం సాదిస్తారు. అనుకూలమైన తీర్పు వస్తాయి.

  29. ట్రావెల్స్ ఆటోమొబైల్స్  వ్యాపారాలు బాగుంటాయి.

  30. రుణాలు తీరుతాయి. రోగాలు తగ్గుతాయి.

  31. పాల ఉత్పత్తులు, ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాల వ్యాపారాలు చాలా బాగుంటాయి.

  32. షేర్స్ వ్యాపారం ఆన్లైన్ వ్యాపారాలు జోలి వెళ్లవద్దు.

  33. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. శుభకార్యాలు చేస్తారు. 

  34. మీ మీద ఉన్న బరువు బాధ్యతలు పెరుగుతాయి. 

  35. పునర్వివాహ యోగ సంబంధ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి.

  36.  కంప్యూటర్ దగ్గర అవసరానికి మించి ఎక్కువ కూర్చోవద్దు. సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

  37. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు.

  38. కీలకమైన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

  39. అవివాహితులైన వారికి వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  40. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు.మేనేజ్మెంట్లో రాణిస్తారు.

  41. కొన్ని సందర్భాల్లో చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. 

  42. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వీలైనంతవరకు సెల్ఫ్ డ్రైవింగ్ కు దూరంగా ఉండండి.

  43. ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు వస్తాయి..

  44. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కంటి సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తాయి.

  45. నిష్కారణంగా స్త్రీలతో విరోధం ఏర్పడుతుంది.

  46. స్నేహితులు, సన్నిహితులు నడుపుతున్న వాహనాలలో ప్రయాణం చేయవద్దు.

  47. జల సంబంధమైన విషయాలు అందరూ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బావుంటాయి.

  48. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉంటాయి.

  49. వైద్య వృత్తిలో ఉన్న వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కీర్తి, ధనం లభిస్తాయి.

  50. బంగారం, వెండి వంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి.

  51. ఆహారధాన్యాలు, ఎరువులు, వ్యవసాయం, వైద్యం విద్య డిస్ట్రిబ్యూషన్ వ్యాపారులకు అనుకూల కాలం.

  52. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది.

  53. సమాధానాలు పరిష్కారాలు లేని కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో నిర్మాణంతో వ్యవహరించి ప్రయోజనాలు కాపాడుకుంటారు. విశేషించి అన్ని పనులు సకాలంలో నిర్వర్తిస్తారు.

  54. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువ అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

  2. జీవితాశయం సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

  3. మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది 

  4. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

  5. ఎంతో కష్టతరమైన కార్యాలను ఎవరికీ ప్రోత్సాహం లేకుండా ఒంటరిగా పోరాడి సాధిస్తారు.

  6. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, జాగ్రత్త వహించండి.

  7. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయడం కష్టమవుతుంది.

  8. క్రీడా సాంస్కృతిక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

  9. విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

  10. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పోటీలలో అధికారం కలిగిన ఉద్యోగాన్ని సంపాదిస్తారు.

  11. సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు. ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూలలో ప్రతిభ చెబుతారు కానీ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి.

  12. ఇష్టపడ్డ వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించాలని మీ ప్రయత్నాలు ఫలించవు.

  13. కలలు రాజకీయ రంగాల్లో రాణిస్తారు.

  14. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు బదిలీలు సంభవిస్తాయి.

         
ధరించవలసని రత్నం: కనకపుష్యరాగం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మూల: వైడూర్యం, పూర్వాషాడ : వజ్రం, ఉ.ఆ: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: బ్రహ్మ లేక శివుడు స్తోత్రాలు
చేయవలసిన ధానం: శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

vrushikarashi vari rashipalalu-2021-22(వృశ్చికరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Vrushikam)

 వృశ్చికరాశి ఫలితాలు:

నక్షత్రాలు : విశాఖ: 4వ పాదం, అనురాధ : 1, 2, 3, 4, జ్యేష్ఠ : 1, 2, 3,4
నామ నక్షత్రాలు : తో, నా, నీ, నూ, నే, నో, యా, యూ

ఆధాయం :  08 వ్యయం : 14 రాజపూజ్యం : 4 అవమానం : 5

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(4లో)
(3లో)
(7లో)
(1లో)

ఫలితాలు:

  1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుటివారికి సహాయం చేయడం కూడా సమస్యలకు కారణం అవుతుంది 

  2. మనోహరమైన సుందర ప్రదేశాలు సందర్శించాలని నీ కోరిక నెరవేరుతుంది.

  3. ఆహార, లోహపు వ్యాపారులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, మత్స్యకారులకు, పాల వ్యాపారులకు పబ్లికేషన్స్ వారికి, మందుల షాపు వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం.

  4. ఆయుర్వేద వైద్యానికి మహర్దశ, ఆయుర్వేద వైద్యం బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది.

  5. ప్రతి చిన్న విషయానికి ఆటుపోట్లు ఎదురైనా చివరికి విజయవంతమైన ఫలితాలే వస్తాయి. మీ విజయాన్ని సమర్ధత సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు తక్కువ.

  6. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పన్నులు వసూలు చేసే అధికారులతో సమస్యలు తప్పకపోవచ్చు.

  7. విందులు వినోదాలలో అపశృతులు ప్రతిష్టను దెబ్బ తీస్తాయి.

  8. క్రీడా సాంస్కృతిక కళా రంగాలకు చెందిన విషయంలో వ్యవహారాలు మీ కుటుంబ స్థాయికి అనుకూలిస్తాయి.

  9. ఆకర్షణీయమైన స్కీములలో చేరవద్దు. 

  10. ముఖ్య కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఎవరిక చెప్పవద్దు. 

  11. ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్లు ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి.

  12. సంబంధం లేని విషయాల కారణంగా మీ ప్రయోజనాలు కొంతకాలం నిలిచిపోతాయి.

  13. మీ మనసుకు సంతృప్తి కలిగే పని ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి.

  14. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవులు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీపై పడతాయి.

  15. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి.

  16. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో బ్యాంకు లోన్ తీసుకున్న రుణాలు చాలా కాలం వరకు తీరుస్తారు. ఆర్ధిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని ఖర్చులు అదుపులో పెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తారు.

  17. ప్రభుత్వ సంబంధమైన పనులు లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెట్టే ఉంటారు. చాలా సందర్భాల్లో మీ మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.

  18. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. కీళ్ల నొప్పులు బాధిస్తాయి వైరల్ జ్వరాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

  19. మీరు కలలుకంటున్న స్వగృహ యోగం సఫలం అవుతుంది.

  20. మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. గత అనుభవాలే ఇందుకు కారణం.

  21. వివాహాది శుభకార్యాలు, పునర్ వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇది అనుకూలమైన సంవత్సరం.

  22. ఇంట్లో జరిగే పొరపాట్లు బయటకు తెలియకుండా ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు.

  23. మీడియా వల్ల ప్రచారసాధనాలు వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు.

  24. కనబడకుండా పోయిన ముఖ్యమైన కాగితాలు తిరిగి చేతికి వస్తాయి.

  25. మనసులో బాధలు కుటుంబంలో సమస్యలు ఉన్నా పైకి గంభీరంగానే కనిపిస్తారు. మీ అంతరంగం జీవనవిధానం భగవంతుడు తప్ప మరొకటి తెలియదు.

  26. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి

  27. వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తారు. సంప్రదాయబద్ధమైన శుభకార్యాలు పూర్తిచేస్తారు.

  28. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

  29. ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవడంతో వైరాగ్యం ఆవరిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంతో అవసరం. 

  30. ఉద్యోగ పరంగా మీకు రావలసిన ప్రమోషన్ పోరాడి సాధించుకుంటారు.. తరచుగా ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి ఉంది. 

  31. విసుగు విరామం లేకుండా పోటీ పరీక్షలలో విజయం కోసం కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు.

  32. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. 

  33. పునర్ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది.

  34. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే శ్రమిస్తారు. 

  35. మీరు చాలా మందికి అర్థం కాని మనిషి అవుతారు చాలా విషయాలు మీ నుండి ఇతరులకు అవసరమైన వివరణ లభించదు.మనసులో బాధ ఉంచుకొని పైకి నవ్వుతూ కనిపిస్తారు.

  36.  మీ కార్యక్రమాలు ఎంతో వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు.

  37. ఆడిటింగ్, టాక్స్ చెల్లింపు రెన్యువల్ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభిస్తాయి.

  38. సామాజిక సంస్థ పరంగా అవార్డు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం ప్రాప్తి. 

  39. ప్రభుత్వ ఉద్యోగం లభించడం వంటి సంభవం. 

  40. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన ఆదరణ లభిస్తోంది. విద్యా రంగంలో అనారోగ్య వాతావరణం వల్ల ఇబ్బందులు వస్తాయి.

  41. పంటి నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాధిస్తా.యి కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. 

  42. మీరు పొందలేని కొన్ని సౌకర్యాలను పొందలేని కొన్ని విషయాలను మీ కుటుంబ సభ్యులు సాధించడం సంతోషం కలిగిస్తుంది.

  43. రాజకీయ రంగంలో వారికి అనుకూలం, రాజకీయ పదవి లభిస్తుంది.


స్త్రీలకు:


  1. వృశ్చిక రాశి లో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

  2. కళా సాంస్కృతిక రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

  3. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చేదు అనుభవాలను మీ పిల్లలకు చెబుతారు.

  4. వివాహం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది.

  5. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  6. తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.

  7. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

  8. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్న ఆర్థిక విషయాలలో మాత్రం ఏకాభిప్రాయం ఉంటుంది.

  9. అలంకరణ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. 

  10. ఉన్నత విద్యను అభ్యసించగలరు, విదేశీయాన యోగ్యత కూడా ఉంది. మెరిట్ మార్కుల సాధిస్తారు.

  11. చాలా విషయాల్లో దైవానుగ్రహం ముఖ్యమని భావిస్తారు. దైవం మీద భారం వేస్తారు.

  12. ప్రేమ వివాహాలు గురించి విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

  13. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంతానంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

  14. రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల మొండి బాకీలు తీరుస్తారు. రుణాలు తీరుస్తారు.

  15. ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. క్రీడా రంగంలో వారికి ప్రోత్సాహకాలు అవార్డు లభిస్తాయి.

  16. సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితం టీవీ రంగంలో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.

  17.  దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫైళ్లపై అధికారులు సంతకం చేస్తారు.

  18.  ఉదర సంబంధమైన వ్యాధులు నిర్లక్ష్యం చేయవద్దు.

  19. ప్రైవేట్ ఆర్థిక సంస్థలలో పెట్టుబడి పెట్టిన డబ్బు పోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు.

  20. మీ సహకారం వల్ల ఆరాటం వల్ల ఇంకొకరికి వివాహం పూర్తవుతుంది.

         
ధరించవలసని రత్నం: పగడం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (విశాఖ: కనకపుష్యరాగం, అనురాధ : నీలం, జ్యేష్ఠ : పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels