Dhanushrashi vari Rashipalam -2021-22 (ధనస్సురాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Dhanussu)

 ధనస్సురాశి ఫలితాలు:

నక్షత్రాలు : మూల: 1, 2, 3, 4 పాదాలు, పూ.ఆ : 1, 2, 3, 4 పాదాలు, ఉ.ఆ: 1వ పాదం
నామ నక్షత్రాలు : యె, యే, బా, బీ, భూ, దా, డా, బే

ఆధాయం :  11 వ్యయం : 05 రాజపూజ్యం : 07 అవమానం : 05

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(3లో)
(2లో)
(6లో)
(12లో)

ఫలితాలు:
  1. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి స్థిరత్వం కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

  2. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది.

  3. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

  4. విద్యార్థలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

  5. సహోదర సహోదరీ వర్గం వల్ల మేలు కలుగుతుంది.

  6. రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఉన్నత అధికారులు గుర్తిస్తారు.

  7. సభలలో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు మీకు వస్తాయి. మీరు ఊహించిన అటువంటి మంచి అవకాశం వస్తుంది. నూతన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు.

  8. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదీలీలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది.

  9. కార్యాలయంలో ఉద్యోగుల తగాదాలు నిదానంగా పరిష్కరించుకుంటారు.

  10. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు.

  11. టీవీ సినీ రంగాల్లో వారికి కళాకారులకు సాంస్కృతిక సిబ్బందికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు.

  12. దుబారాలకు, విందు వినోదాలకు దూరంగా ఉంటారు. అయినా కొన్ని సందర్భాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్య కళలపై ఆసక్తి చూపుతారు.

  13. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలిక ఉద్యోగాలు, పార్ట్టైమ్ ఉద్యోగాలు లభిస్తాయి.

  14. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.

  15. వాహనం యోగ్యత, స్వగృహ యోగ్యత కలుగుతాయి.

  16. అసూయా ద్వేషాలకు దూరంగా ఉంటారు. మంచి జరిగినా చెడు జరిగినా ఏ మాత్రం చెలించరు. మీకు మీరుగా తెచ్చుకున్న మార్పు ఇది.

  17. కష్టపడడం లో ఉన్న ఆనందం మరెందులోనూ లేదని భావిస్తారు. మీరు చెప్పే మంచి మాటలు బోధనలు అందరికీ నచ్చుతాయి. అందరూ ఆచరిస్తారు. మీ ఇంట్లో వాళ్లకు మాత్రం మీ మాటలు రుచించవు.

  18. ఈ రాశి వారికి ప్రబలమైన ఏలినాటి శని నడుస్తున్నది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి, ఎనిమిది శనివారాలు పాటు నలుపు ఒత్తులతో దీపారాధన చేయండి. 11 మంగళవారాలు పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి, వడమాల సమర్పించండి. కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

  19. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు.

  20. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి.

  21. దైవ సంకల్పం ముందు మానవుడు చాలా బలహీనుడు అని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి.

  22. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి భయం పొంచి ఉంది.

  23. ఫ్యాన్సీ షాప్ ల వారికి ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయలకు, స్టేషనరీ వ్యాపారస్తులకు బ్యూటీపార్లర్లో వారికి చేతివృత్తుల పనివారికి సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి హోల్సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది.

  24. విలువైన భూములు, వస్తువులను గతంలో కొనుగోలు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వాటి విలువ చాలా పలుకుతుంది. 

  25. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలలో ఉన్న వారికి అనుకూలం వ్యాపారంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఫలితాలనిస్తాయి.

  26. నిర్మాణ రంగంలో రాణిస్తారు. గుడ్ విల్ బాగా పెరుగుతుంది. 

  27. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి.

  28.  కోర్టు వ్యవహారాలలో విజయం సాదిస్తారు. అనుకూలమైన తీర్పు వస్తాయి.

  29. ట్రావెల్స్ ఆటోమొబైల్స్  వ్యాపారాలు బాగుంటాయి.

  30. రుణాలు తీరుతాయి. రోగాలు తగ్గుతాయి.

  31. పాల ఉత్పత్తులు, ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాల వ్యాపారాలు చాలా బాగుంటాయి.

  32. షేర్స్ వ్యాపారం ఆన్లైన్ వ్యాపారాలు జోలి వెళ్లవద్దు.

  33. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. శుభకార్యాలు చేస్తారు. 

  34. మీ మీద ఉన్న బరువు బాధ్యతలు పెరుగుతాయి. 

  35. పునర్వివాహ యోగ సంబంధ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి.

  36.  కంప్యూటర్ దగ్గర అవసరానికి మించి ఎక్కువ కూర్చోవద్దు. సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

  37. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు.

  38. కీలకమైన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

  39. అవివాహితులైన వారికి వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  40. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు.మేనేజ్మెంట్లో రాణిస్తారు.

  41. కొన్ని సందర్భాల్లో చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. 

  42. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. వీలైనంతవరకు సెల్ఫ్ డ్రైవింగ్ కు దూరంగా ఉండండి.

  43. ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు వస్తాయి..

  44. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కంటి సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తాయి.

  45. నిష్కారణంగా స్త్రీలతో విరోధం ఏర్పడుతుంది.

  46. స్నేహితులు, సన్నిహితులు నడుపుతున్న వాహనాలలో ప్రయాణం చేయవద్దు.

  47. జల సంబంధమైన విషయాలు అందరూ సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బావుంటాయి.

  48. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉంటాయి.

  49. వైద్య వృత్తిలో ఉన్న వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి కీర్తి, ధనం లభిస్తాయి.

  50. బంగారం, వెండి వంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి.

  51. ఆహారధాన్యాలు, ఎరువులు, వ్యవసాయం, వైద్యం విద్య డిస్ట్రిబ్యూషన్ వ్యాపారులకు అనుకూల కాలం.

  52. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది.

  53. సమాధానాలు పరిష్కారాలు లేని కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో నిర్మాణంతో వ్యవహరించి ప్రయోజనాలు కాపాడుకుంటారు. విశేషించి అన్ని పనులు సకాలంలో నిర్వర్తిస్తారు.

  54. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువ అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.

  2. జీవితాశయం సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

  3. మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది 

  4. అవివాహితులైన స్త్రీలకు వివాహమగును, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

  5. ఎంతో కష్టతరమైన కార్యాలను ఎవరికీ ప్రోత్సాహం లేకుండా ఒంటరిగా పోరాడి సాధిస్తారు.

  6. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, జాగ్రత్త వహించండి.

  7. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయడం కష్టమవుతుంది.

  8. క్రీడా సాంస్కృతిక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు.

  9. విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

  10. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పోటీలలో అధికారం కలిగిన ఉద్యోగాన్ని సంపాదిస్తారు.

  11. సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు. ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూలలో ప్రతిభ చెబుతారు కానీ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి.

  12. ఇష్టపడ్డ వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించాలని మీ ప్రయత్నాలు ఫలించవు.

  13. కలలు రాజకీయ రంగాల్లో రాణిస్తారు.

  14. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు బదిలీలు సంభవిస్తాయి.

         
ధరించవలసని రత్నం: కనకపుష్యరాగం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మూల: వైడూర్యం, పూర్వాషాడ : వజ్రం, ఉ.ఆ: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: బ్రహ్మ లేక శివుడు స్తోత్రాలు
చేయవలసిన ధానం: శనగలు లేదా శనగలతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Comments