chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Monday, February 22, 2021

Sri Medaram Sammakka - Saralamma Pujavidanam - శ్రీమేడారం సమ్మక్క షష్టోత్తర దశ నామావళి

Sri Medaram Sammakka - Saralamma Pujavidanam 

Medaram Sammaka Saralamma

శ్రీమేడారం సమ్మక్క షష్టోత్తర దశ నామావళి 

(66 నామాలతో పూజించుట)

1) ఓం శ్రీ సమ్మక్క దేవతాయ నమః
2) ఓం శ్రీ సారలమ్మ మాతయే నమః
3) ఓం పగిడిద్దరాజు ధర్మపత్నియే నమః
4) ఓం  శ్రీమేడారం నివాసినే నమః
5) ఓం వనవాసినే నమః
6) ఓం వనదుర్గయే నమః
7) ఓం వనమాతయే నమః
8) ఓం చిలకలగుట్ట నివాసినే నమః
9) ఓం కుంకుమ భరణి రూపినే నమః
10) ఓం బండారు రూపినే నమః
11) ఓం వీరవనితనే నమః
12) ఓం కాకతి రూపినే నమః
13) ఓం ఏకవీర రూపినే నమః
14)  ఓం నెమలినార వృక్ష నివాసినే నమః
15) ఓం సిలాథరాజు వర పుత్రికయే నమః
16) ఓం సిరిమల్లెగూడ జన్మస్థల వాసినే నమః
17) ఓం గిరిజన సేవితే నమః
18) ఓం భక్తజనహృదయినే నమః
19) ఓం జంపన్న మాతయే నమః
20) ఓం నాగులమ్మ మాతయే నమః
21) ఓం వడిబియ్యం పూజితే నమః
22) ఓం సువర్ణ ప్రసాద స్వీకరనే నమః
23) ఓం సువర్ణ ప్రసాద సేవితే నమః
24) ఓం మాగశుద్ద మాస పూజితే నమః
25) ఓం పౌర్ణమిదిన పూజితే నమః
26) ఓం వృక్షరూప సన్నిధియే నమః
27) ఓం సహస్త్రబాహువే నమః
28) ఓం త్రిశక్తిరూపిణే నమః
29) ఓం నవదుర్గయే నమః
30) ఓం మనోవాంఛఫల సిద్దయే నమః
31) ఓం కలియుగ ప్రత్యక్షదేవతయే నమః
32) ఓం కలి నివారినే నమః
33) ఓం సకల వరప్రదాయినే నమః
34) ఓం కోయజన భక్తహృదయ నివాసినే నమః
35) ఓం మన్నెం నివాసినే నమః
36) ఓం సకలజన పూజితే నమః
37) ఓం శక్తిస్వరూపినే నమః
38) ఓం వ్యాఘ్రవాహన సేవితదారినే నమః
39) ఓం సంతాన ప్రదాయినే నమః
40) ఓం సౌభాగ్య ప్రదాయినే నమః
41) ఓం ఐశ్వర్య ప్రదాయినే నమః
42) ఓం ధనధాన్య ప్రదాయినే నమః
43) ఓం లోకమాతయే నమః
44) ఓం లోక సంరక్షినే నమః
45) ఓం సిద్దిబుద్దిదాయినే నామః 
46) ఓం సకల విద్యప్రదాయినే నమః 
47) ఓం సాంమ్రాజ్యదాయినే నమః 
48) ఓం మహారౌద్రే నమః
49) ఓం మహాశక్తియే నమః 
50) ఓం శతృసంహారినే నమః
51) ఓం ఋణవిముక్తిదాయినే నమః 
52) ఓం ఆదిదేవతయే నమః 
53) ఓం ఆదిమాతయే నమః 
54) ఓం తేజోదాయినే నమః
55) ఓం ఆనందదాయినే నమః
56) ఓం అమృతాంశవే నమః 
57) ఓం సకలదేవతాసేవితాయ నమః 
58) ఓం మృత్యభయ  నివారినే నమః
59) ఓం ఆరోగ్యదాయినే నమః 
60) ఓం సర్వరోగపీడ నివారినే నమః
61) ఓం భక్తాభయప్రదాయినే నమః 
62) ఓం భూతభవిష్యద్భార్తితయే నమః
63) ఓం భూతప్రేతపిచాచభయ నివారినే నమః 
64) ఓం సర్వమంగళస్వరూపినే నమః 
65) ఓం సన్మార్గదాయినే నమః
66) ఓం క్షేమస్థైర్యదైర్యప్రదాయినే నమః

శ్రీ సమ్మక్క దేవతా షష్గోత్తదశనామ పూజాం సమర్పయామి.

కొన్నిపదాలకు అర్ధములు :

బండారు (పసుపు) , సువర్ణం (బంగారం, బెల్లం)

వ్యాఘ్రం - పులి, సన్నిది - పీఠం (గద్దెలు)

షష్టమ - 6, దశమ - పది


Share:

Thursday, October 22, 2020

అలభ్య పుణ్యకాలములు -2020-21

అలభ్య పుణ్యకాలములు -2020-21

శనివారం-త్రయోదశి/పౌర్ణమి
ఆదివారం-సప్తమి
సోమవారం-అమావాస్య
మంగళవారం-చతుర్థి
బుధవారం-అష్టమి
గురువారం-ఏకాదశి
శుక్రవారం-పంచమి


ఈ రోజులలో ఆయా తిధులు ఉన్నట్లయితే వాటిని అలభ్య పుణ్య కాలాలు అంటారు.
ఈరోజు లలో ఆయా దేవతా స్తోత్రాలు, గ్రహ స్తోత్రాలు అష్టకాలు పఠించినట్లయితే ఒకసారి చదివితే వెయ్యిసార్లు చదివిన ఫలితం ఉంటుంది.
గ్రహణ సమయంలో గ్రహణం పట్టిన దగ్గర్నుంచి గ్రహణం విడిచే వరకు సోత్రాలు పఠించినట్లయితే వేయి  రేట్లు ఫలితం ఉంటుంది.

నవంబర్ -8 (ఆదివారం -సప్తమి)
ఉదయం 07:21 నిమిషముల వరకు తదుపరి అష్టమి

నవంబర్ -28 (శనివారం- త్రయోదశి)
ఉదయం 10:21 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి.

డిసెంబరు -12 (శనివారం -త్రయోదశి)
తె.జా. 3:50 నిమిషముల వరకు తదుపరి చతుర్దశి

డిసెంబర్ -14 (సోమవారం-అమావాస్య)
రాత్రి 9:46 నిమిషముల వరకు తదుపరి పాడ్యమి.

జనవరి-6 (బుధవారం-అష్టమి)
రాత్రి 2:06 నిమిషముల వరకు తదుపరి నవమి.

జనవరి-12 (మంగళవారం- చతుర్థి)
మ. 12: 22 నిమిషముల వరకు తదుపరి అమావాస్య.

మార్చి -21(ఆదివారం- సప్తమి)
ఉదయం 7 : 10 నిమిషముల వరకు తదుపరి అష్టమి.

మార్చి -25 (గురువారం- ఏకాదశి)
ఉదయం 9: 47 నిమిషాలు తదుపరి ద్వాదశి.

ఏప్రిల్ -2 (శుక్రవారం - పంచమి)
ఉదయం 8 : 15 నిమిషాలు తదుపరి షష్ఠి.

వ్యక్తులు జాతకరీత్యా గ్రహాల యొక్క మహాదశ, అంతర్దశలో గ్రహాలు పాప స్థానంలో ఉన్న లేదా నీచ స్థితిలో ఉన్నట్లయితే ఆ గ్రహాల దేవతలకు సంబంధించిన స్తోత్రాలు పై తెలిపిన తిథులలో పటించినట్లయితే ఫలితం ఎక్కువగా గా ఉంటుంది.

- ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని గోచారరీత్యా ఉన్నవారు శనికి సంబంధించిన స్తోత్రములు చదివినట్లయితే శుభఫలితం ఉంటుంది.

- జాతకరీత్యా కుజ దోషం ఉన్నవారు కూడా కుజునికి సంబంధించిన స్తోత్రములు పటించవచ్చు.

- రాహు కేతువులకు సంబంధించి కాలసర్ప దోషం లు ఉన్నవారు కూడా రాహు కేతువులకు సంబంధించిన స్తోత్రములు పఠించినట్లైతే  శుభ ఫలితం ఉంటుంది.

పుట్టిన తేదీ, సమయం, పుట్టిన స్థలం ఆధారంగా మీ జాతక పరిశీలన చేసి జన్మకుండలి నందు గ్రహములు ఏ ఏ స్థితిలో లో ఉన్నాయి. ఏ దశ నడుస్తోంది వంటి వివరాలు తెలుసుకొనుటకు ఈ రోజే సందర్శించండి.
చింతామణి ఫ్రీ ఆస్ట్రాలజీ.


మా యూట్యూబ్ ఛానల్:
https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Tuesday, October 6, 2020

చీకటి-వెలుగుకు మధ్య ఏముంటుంది ? (day and night)

చీకటి-వెలుగుకు మధ్య ఏముంటుంది ?

చీకటి అంటే ఏమిటి ? వెలుగు అంటే ఏమిటి ?

చీకటి వెలుగులు లేకపోతే ఏమవుతుంది. ?

chintamani free astrolog


చీకటి-వెలుగులనే మనము  రాత్రి-పగలు అంటున్నాము.  వెలుగుకు మూలం, వెలుగును అందించేది సూర్యభగవానుడు.

భూమి తన చుట్టూతాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికి తెలిసిందే, దీనినే భూభ్రమనం, భూ పరిభ్రమనం అని అంటారు. భూభ్రమనం వలననే మనకు చీకటి వెలుగులు లేదా పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. భూపరిభ్రమనం వలన మనకు ఋతువులు, మాసములు (నెలలు) ఏర్పడుతున్నాయి. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగిరావడినికి ఒక సంవత్సర కాలం లేదా 365 (అర) రోజులు పడుతుంది.  ఇది సహజంగా నిరంతరంగా జరిగే ప్రక్రియ. దీనిని ఎవరూ ఆపలేరు.  చీకటి-వెలుగు (పగలు-రాత్రి) వలననే భూగోళం పై సమస్త జీవరాశుల మనుగడ జరుగుచున్నది. సూర్యుని వెలుగు వలన మొక్కలు కిరణజన్య సమ్యోజక క్రియ జరిపి తమ ఎదుగుదలకు, తద్వారా పలాలు, పుష్పాలు అందించి ఇతర జీవరాశులకు (మనుషులకు, జంతువులకు) ఆహారాన్ని సమకూర్చుతున్నాయి. రాత్రులందు వాతావరణంలోని కార్బన్ డై ఆకైడ్ (విషవాయువు) గ్రహించి ఆక్సిజన్ (ప్రాణవాయువును) విడుల చేస్తున్నాయి.  చీకటి వెలుగులు లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది. చీకటి వెలుగులు లేకపోతే జీవన చక్రం గతి తప్పుతుంది. తద్వారా సమస్త జీవరాశి మనుగడ నశిస్తుంది.

ఇదంతా భౌతికంగా మనకు కనిపించే విషయాలు.. చీకటికి, వెలుగుకు మధ్య మనం గుర్తించలేనిది, మనకు కనిపించనిది ఒకటి వుంది. అదే భ్రమణం (తిరగడం) ఈ భ్రమణమే లేకపోతే ఈ వెలుగు చీకట్లు అనేవి ఉండనే ఉండవు.

   అదేవిధంగా ఒక మనిషి జీవితంలో చీకటి-వెలుగులు అంటే అతనికి ఏర్పడే కష్ట-సుఖాలుగా మనం భావించుచున్నాము. మన కనులు (కండ్లు) వెలుగు, చీకటిలను గుర్తిస్తాయి. కనులు తెరిస్తే వెలుగు కనిపిస్తుంది, కనులు మూసుకుంటే అంతా చీకటిగా ఉంటుంది. అంటే వెలుగుకు, చీకటి మధ్య మన కంటిపై కంటి రెప్ప ఉంది.  అది తెరుచుకొని ఉన్నంతసేపు వెలుగు, మూసి ఉన్నంతసేపు చీకటి ఉంటింది. అంటే మనకు వెలుగు చీకట్లు మన కంటిరెప్ప పై ఆధారపడి ఉన్నట్లుగా, కంటి రెప్ప వెలుగు, చీకట్లను చీకట్లను నియంత్రించేదిగా మనకు అనిపిస్తుంది. మరి కంటి రెప్పను నియంత్రించేది ఏమిటి ?. మన మెదడు, మరి మన మెదడు నియంత్రించేది ఎవరు ?. అంటే మన మనస్సు, మరి మన మనస్సును నియంత్రించేది ఎవరు ? అంటే మనమే, అంటే.... వెలుగు చీకట్లను పొందడం మనమీదనే  ఆధారపడి ఉందన్నమాట, ఆ విధంగా చూస్తే మన కష్టసుఖాలకు మనమే కారణం.. మన మనసు లో వెలుగు నిండితే అది సుఖం అవుతుంది. మన మనసులో చీకటి నిండితే అది కష్టం అవుతుంది. కష్టం వెంటే సుఖం, సుఖం వెంటే కష్టం కలిసే ఉంటాయి. జీవితంలో మొదటగా కష్టపడినవారికి తరువాత సుఖం తప్పక లభిస్తుంది. మొదట సుఖపడిన వారికి కష్టం చెప్పకుండా వస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకోవాలి అనేది నానుడి. అంటే వెలుగులో ఉన్నప్పుడే చీకటి విలువను గుర్తించాలి. చీకట్లో కలిగే ఇబ్బందులను గుర్తించినట్లే , సుఖంగా ఉన్నపుడే కష్టమొస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుండాలి. అలాకాకుండా కష్టాలకు కుంగిపోయి జీవితమే వ్యర్థం అనుకోకూడదు. వెలుగు చీకట్లను సమానంగా భావించి ముందుకు వెళితేనే మన మనుగడ సాధ్యమవుతుంది. 

  భూభ్రమనానికి కారణమై నిరంతరం భూభ్రమనాన్ని ఎవరు చేయిస్తున్నారో, వారే మన జీవితాలలో కష్టసుఖాలకు మూలం..

అతడే అంతర్యామి అయిన ఆ భగవంతుడు, అతడే ఆ సర్వేశ్వరుడు... చేయిస్తున్నది, చేస్తున్నది కూడా ఆయనే, తాను ఉన్నాడు అనుకునేవారికి ఉంటాడు. లేడు అనుకునేవారికి లేడు. ఉన్నాడు లో ఉంటాడు, లేడు లో లేడు ఆ లేనిది ఆయనే, ఉన్నదీ ఆయనే... 

సర్వ ప్రాణులయందు తను ఉన్నాని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఈ విషయాన్ని భోదించాడు. మన మంచి చెడులకై  మన చుట్టూ తల్లిగా, తండ్రిగా, గురువుగా, తోబుట్టువుగా, భార్యకు భర్తగా, భర్తకు భార్యగా, సంతానంగా,  మిత్రునిగా, శత్రవుగా అన్ని రూపాలలో తనే వుండి మన మనుగడకు కారణమువతున్నాడు. వీరిలో ఎవరో ఒకరి రూపంలో వుండి, జ్నానబోధ చేస్తునే వుంటాడు. మనము ఆ విషయన్ని గ్రహించలేము. ఒక ఉదాహరణగా మీరు ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారనుకుందాము. స్వామి నన్ను ధనవంతుడిని చేయి అంటూ నిత్యం ప్రార్ధిస్తూనే వుంటారు. అపుడు ఆ భగవంతుడు నీ గురువు రూంలోనో, నీ స్నేహితుడి రూపంలోనో ఎవరో ఒకరి రూంపంలో ఉండి నీకు మార్గనిర్ధేశం (సలహా) ఇస్తాడు, కాని మనం వారి మాట వినం, తెల్లవారికి తెల్లవారు మన ఇంట్లో డబ్బుల మూట పత్యక్షం కావాలని కోరుకుంటాం. ఇలా అందరికి డబ్బుల మూటలు ఇస్తే కష్టపడాలి అని ఎవరు అనుకుంటారు. అప్పడు ఎవరు ఏ పనిచేయరు. ఒక ఇల్లాలు వండుకోవడం ఎందుకు డబ్బులున్నాయి కదా హోటల్ కు వెళ్ళి తిందాం అంటుంది. మరి హోటల్ వాడికి కూడా ఆ భగవంతుడు డబ్బుల మూట ఇచ్చాడు. వాడు ఎందుకు వండుతాడు, వాడు డబ్బులు పడేసి ఎవరైనా వండిపెడితే తిందాం అనుకుంటాడు. కష్టపడవలసిన అవసరం వాడికి కూడా లేదే, ఈ విధంగానే అందరూ అనుకుంటే మనం డబ్బులనే తిని బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది.  మనము ఈ సత్యాన్ని గ్రహిస్తే ఆ భగవంతున్ని తెలుసుకున్నట్లే...

- సర్వే జనా సుఖినోభవంతు :

ధన్యవాదములతో...

శ్రీరామ్ మనూహర్ (వెన్ను రాము)

Share:

Monday, September 14, 2020

Sree Gurudatta Stotram - శ్రీ దత్తస్తవము

chintamani free astrology

శ్రీ దత్తస్తవము

1. ఓం దత్తాత్రేయం మహాత్మానం | వరదం భక్తవత్సలం 

ప్రపన్నార్తిహరం వందే | స్మర్తృగామీ సనో వతు 

2. దీనబంధుం కృపాసింధుం | సర్వకారణ కారణం 

సర్వరక్షాకరం వందే | స్మర్తృగామీ సనో వతు 

3.శరణాగత దీనార్త | పరిత్రాణ పరాయణం 

నారాయణం విభుం వందే | స్మర్తృగామీ సనో వతు

4 సర్వానర్థ హరం దేవం | సర్వమంగళ మంగళం 

సర్వక్లేశహరం వందే | స్మర్తృగామీ సనో వ వతు 

5. బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞులు | భక్తి కీర్తి వివర్ధనం

భక్తాభీష్టప్రదం వందే | స్మర్తృగామీ సనో వతు 

6. శోషణం పాప పంకస్య | దీపనం జ్ఞాన తేజసః 

తాప ప్రశమనం వందే | స్మర్తృగామీ సనో వతు 

7. సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం 

ఆపదుద్ధరణం వందే | స్మరామీ సనో వతు 

8. జన్మసంసార బంధఘ్నం | స్వరూపానంద దాయకం 

నిశ్రేయసపదం వందే | స్మర్తృగామీ సనో వతు

9. జయలాభ యశఃకామ | దాతుర్ధత్తస్యయత్స్తవం 

భోగమోక్ష ప్రదస్యేమం | ప్రపఠేత్ సుకృతీ భవేత్


If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService


Share:

Sree Subrahmanya Karavalam Stotram- శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

 శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం


హే స్వామినాథ కరుణాకర దీనబంధో !

శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో ॥


శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 

దేవాధి దేవసుత దేవగణాధినాథ 

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ॥ 

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే| 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||2

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ |

తస్మాత్ర్పదాన   పూరిత భక్త కామ ॥ 

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప | 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||౩

 క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల |

(చాపాది)పాశాది శస్త్ర పరమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4


దేవాది దేవ రథమండల మధ్యవేద్య |

దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం |

శూరం నిహత్య సురకోటిభి రీద్యమానః 

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 

హారాదిరత్న మణియుక్త కిరీటహార | 

కేయూర కుండల లసత్కవచాభిరామ ||

హేవీర తారక జయామర బృందవంద్య |

వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ || 6 

పంచాక్షరాది మను మంత్రితగాంగతోయైః 

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రా

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ ః 

వల్లీసనాథ మమదేహికరావలంబమ్ || 7

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||

భక్త్వాతు మా మవ కళాధర కాంతి కాంత్యా |

వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ || 8 

ఫలశ్రుతి: సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః॥ 9 

సుబ్రహ్మణ్యాష్టక మిదం పాత్ర రుత్థాయ యః పఠేత్ | 

కోటి జన్మ కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి|| 10


If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Tuesday, September 8, 2020

Sree Aadithyadi Navagraha Pancha Sloki Stotramulu

శ్రీ నవగ్రహ దేవతా పంచశ్లోకి స్తోత్రములు

రవి

సోమ

మంగళ

బుధ

గురువు

శుక్ర

శని

రాహువు

కేతువు


అన్ని నక్షత్రాలవారు, రాశుల వారు గోచార రీత్యాకాని, మహాదశ నడుస్తున్న సమయంలో ఆయా గ్రహాలకు సంబంధించిన పంచశ్లోకాలను పఠించినట్లయి గ్రహదోశ విముక్తి కలిగి శుభాలు కలుగుతాయి. 

శ్లోకాల కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి.

If you like this Post Please Comment and Share your Near and Dear
.............................. 
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Free Astrology Consultation
Online Free Astrology, Online free Astrology in telugu, Online Free Astrology Consultation
Prashana Jatakam, Tarabalam and Chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Dharma Sandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: https://chintamani-free-astrology.blogspot.com
Our Website : http://www.chintaamani.co.in
Our Youtube Channel: http://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels