chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Tuesday, April 28, 2020

Manidweepa Varnana-మణిద్వీప వర్ణన

మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన 

Manidweepavarnana- free astrology- chintamani
Manidwepeswari

1. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది
2. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబుగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
4. గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనింయించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం 
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు
6. అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
7. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు
8. కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటిచంద్రులచల్లని వెలుగులు
కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
9. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
11. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
12. సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||భువ||
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
14. కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
15. భక్తిజ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
17. మంత్రిణి దండిని శక్తిసేవలు కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు
19.  సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు  కల్పతరువులు
సృష్టిస్థితిలయాకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు
21. కోటి పకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
22. దివ్య ఫలముల దివ్యాస్త్రములు దిష్య పురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఙానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
24. పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
26. దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు
27. పదనాలు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం
28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
30. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2||
31. నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2||
 32. శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలనుసమకూర్చుకొనుటకై
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం.  ||భువ||

మంగళహారతి

శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
"ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
ఆపదలు బాపేటి సపందలనొసగేటి శ్రీనగరవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ | |
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కటి శ్రీరత్నసింహాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||


free astrology in telugu
free astrology - chintamani

Share:

Sunday, April 26, 2020

Maheswara Struthi - మహేశ్వర స్తుతి

మహేశ్వర స్తుతి

bo shambo shiva shambo lyrics
హరహర మహాదేవ
ప. భో శంభో శివ శంభో స్వయంభో

అ.ప. గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగరా తారక .. భో శంభో ...

చ1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంత అనంత
ఆంనద అతిశయ అక్షయ లింగ .. భో శంభో ...

చ2. దిమిత దిమిత దిమి
దిమికిట తకిటతోం...
తోం తోం తమికిట తరికిట కిటతోం...
మంతంగ మునివర వందిత ఈశా
సర్వదిగంబర వేష్టిత వేష
నిత్యనిరంజన నిత్యనటేశ
ఈశ సభేశ సర్వేశ.. .. భో శంభో ...

... మతంగ ...
మతంగ మునివర వందిత ఈశా
శర్వదిగంబర వేష్టిత వేష - 2
నిత్యనిరంజన నిత్యనటేశ - 2
ఈశ సభేశ సర్వేశ ... ... భో శంభో ...

free astrology - chintamani
free astrology - chintaamani.co.in


Share:

Sree Kanakadara Sthoram - శ్రీ కనకధారా స్తోత్రమ్

శ్రీ కనకధారా స్తోత్రమ్

kanakadara Sthotram - free astrology - chintamani
Kanakamahalaxmi

వన్దే వన్దారుమన్దారమిన్దిరానన్ద కన్దలమ్ అమన్దానన్దసన్దోహబన్ధురం సిన్ధురాననమ్
అజ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ భృజ్గాజ్గనేవ ముకులాభరణం తమాలమ్
అజ్గికృతాఖిల విభూతిరపాజ్గలీలామాజ్గల్యదాఽస్తు మమ మజ్గళ దేవతాయః 1
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమపాత్ర ప్రణహితాని గతగతాని
మాలదృశోర్మధకరీవ మహోత్పలే యా సా మేశ్రియం దిశతు సాగరసమ్భవాయాః 2
విశ్వామరేన్ద్ర పదవిభ్రమదానదక్ష మానన్ద హేతురధికం మురవిద్విషోఽపి
ఈషన్ని షీదతు మయి క్షణమీక్షణార్థ మిన్దీవరోదరసహోదరమిన్దిరాయాః 3
అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద మానన్దకన్దమని మేషమనజ్గతన్త్రం
అకేకరస్థిరకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భజజ్గశయాజ్గనాయాః 4
కాలమ్బుదాళిలలితోరసి కైటభారే ర్ధారాధరే స్ఫురతియా తటిజ్గనేవ
మాతస్సమస్తజగతాం మహనీయమూర్తిర్భద్రాణి మే దిశతు భార్గవ నన్దనాయాః 5
బాహ్యాన్తరే మురజితః శ్రితకస్తుభే యా హారావళీవ హరినిలయమయీవిభాతి
కామప్రదా భగవతో2పి కటాక్షమాలాకల్యాణమావహతు మే కమలాలయాయాః 6
ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాజ్గల్యభాజి మధుమర్దని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మన్ధరమీక్షణార్ధం మన్దాలసం చ మకరాలయకన్యకాయాః 7
ఉద్యద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్నకిఇ్చనవిహజ్గ శిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మ మపనీయచిరాయదూరం నారాయణ ప్రణయినీ నయనామ్బువాహః 8
ఇష్టావిశిష్టమతయోఽపినరా యయా దయార్ధ్ర దృష్టాస్త్రివిష్ట పదం సులభం భజన్తే
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః 9
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై 10
శ్రుత్యైనమోఽస్తు సుభకర్మఫల ప్రసూత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై
శక్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై 11
నమోఽస్తు నాళీక నిభాననాయై నమోఽస్తు దుగ్గోదధిజన్మభూమ్యై
నమోఽస్తు సోమామృత సోదరాయై నమోఽస్తు నారాయణ వల్లభాయై 12
నమోఽస్తు హేమామ్బుజ పీఠికాయై నమోఽస్తు భూమణ్డల నాయికయై
నమోఽస్తు దేవాదిదయా పరాయై నమోఽస్తు శార్ ఙ్గాయుధ వల్లభాయై 13
నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై
నమోఽస్తు లక్ష్మె కమలాలయాయై నమోఽస్తు దామోదర వల్లభాయై 14
నమోఽస్తు కన్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోఽస్తు దేవాది భిరర్చితాయై నమోఽస్తు నన్దాత్మజ వల్లభాయై 15
సమ్పత్కరాణి సకలేన్ద్రియ నన్దనాని సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వన్దనాని దురితా హరణోద్యతాని మామేవమాత రనిశం కలయన్తుమాన్యే 16
యత్కటాక్ష సముపాననావిధిః సేవకన్య సకలార్థ సంపదః
సన్తనోతి వచనాఙ్గ మానసై స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే 17
సరసిజనయనే సరోజహస్తేధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఙే త్రిభువన భూతికరీ ప్రసీదమహ్యమ్ 18
దిగ్దన్తిభిః కనకకుమ్భముఖావసృష్టస్వర్వాహినీ విమలచారుజల ప్లుతాజ్గీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ 19
కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరజ్గితైరపాజ్గెః
అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా 20
బిల్వాటనీ మధ్య లసత్సరోజే సహస్ర పత్రే సుఖ సన్నివిష్ణామ్
అష్టాప దామ్భోరుహ పాణి పద్మాం సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ 21
కమలాలస పాణినాలలాటే లిఖితామక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే ధనికద్వార నివాస దుఃఖ దోగ్ద్రీమ్ 22
అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందమ్ 23
స్తువన్తి యేస్తుతిభిరమా భీరన్వహం త్రయీమయీం త్రిభువమాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్య భాజినో భవన్తి తే బుధభావితాశయాః 24

కనధారా స్తవం య చ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః  పఠేన్నిత్యం స కుబేర సమోభవేత్.

free astrology - chintamani
free astrolog - chintaamani.co.in


Share:

Sree Mahalaxmi Atakam - శ్రీ మహాలక్ష్మష్టకమ్

శ్రీ మహాలక్ష్మష్టకమ్

online free astrology - chintamani
Mahalaxmi


ఓం నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే 1
నమస్తే గరుడారూఢే కో(డో)లాసురభయంకరీ
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోఽస్తుతే 2
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ
సర్వదుఃఖహరే దేవీ మహాలక్ష్మీ నమోఽస్తుతే 3
సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తిప్రదాయినీ
మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మీ నమోఽస్తుతే 4
ఆద్యన్తరహితే దేవీ ఆద్యశక్తిమహేశ్వరీ
యోగజ్గే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే 5
స్థూల సూక్ష్మమహారౌద్రే మహాశక్తిమహోదరే
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోఽస్తుతే 6
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణీ
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోఽస్తుతే 7
శ్వేతామ్బరధరే దేవి నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోఽస్తుతే 8
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యఃపఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధిమవాప్రోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా 9
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యఃపఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః 10
త్రికాలం యఃపఠేన్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా 11

free astrology - chintaamani.co.in
free astrology - chintaamani

Share:

Astalaxmi Sthoram-అష్టలక్ష్మీ స్తోత్రమ్

అష్టలక్ష్మీ స్తోత్రమ్


free astrlogy - chintaamani.co.in
Astalaxmi sthotram

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయజయహే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదాపాలయమాం

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం

జయ వరవర్ణని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురుగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఙానవికాసిని శస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాప నివారిణి పాదయుతే
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయమాం

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర మానవ వందిత పాదయతే
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం

ధిమి ధిమి ధింధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనేతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం

online free astrology in telugu
free astrology - chintamani.co.in


Share:

Pippalada Maharshi Vruttantam- శనిదేవుని బాధలను తొలగించే శనైశ్చర వ్రతం- పిప్పలాద మహర్షి వృత్తాంతం

శనిదేవుని బాధలను తొలగించే శనైశ్చర వ్రతం- పిప్పలాద మహర్షి వృత్తాంతం

(భవిష్య పురాణం నందు చెప్పబడిన దానినుండి)


free astrology in telugu- chintamani.co.in
Pippalada Magarshi Vruttanatam
     పూర్వం త్రేతాయుగంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి కరువుకాటకాలు సంభవించాయి. ఆ బాధలు తట్టుకోలేక కౌశికుడనే ముని తన భార్యపుత్రులతో మరో ప్రాంతానికి బయలుదేరాడు. వారు వెళుతుండగా దారిలో ఒక కుమారుడు తప్పిపోయాడు. అది గమనించకుండా వారంతా ముందుకువెళ్ళిపోయారు.
తప్పిపోయిన బాలడు ఏడుస్తూ అక్కడే ఉన్న ఒక చెట్టు క్రిందకి చేరాడు. అది ఒక రావుచెట్టు, నిత్యం ఆ చెట్టు పళ్ళనే తింటూ పక్కనే ఉన్న చెరువులో నీళ్ళని తాగుతూ ఆ చెట్టుకింధే ధ్యానం చేసుకోసాగాడు ఆ బాలుడు. కొన్నాళ్ళకి నారదమహర్షి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ బాలుడి వినయ విధేయతలని, భక్తి తత్పరతని గమనించి అతడికి అన్ని సంస్కారాలూ చేసి వేదాల్ని అధ్యయనం చేయించాడు. తరువాత ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు ద్వాదశాక్షర మహామంత్రాన్ని ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ ఉపదేశించాడు. 
   నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని ఆ బాలుడు ఎంతో శ్రద్ధగా జపించసాగాడు. నారదుడు అక్కడే వుండి అతడి పట్టుదలని, దీక్షని శ్రద్ధని, గమనిస్తన్నాడు. కొన్నాళ్ళకి శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడినెక్కి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడి తపస్సకి మెచ్చుకుని జ్ఙానాన్ని యోగాన్ని ప్రసాదించాడు. క్రమంగా ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.
   ఒకనాడు మహర్షి అయిన ఆ బాలుడు నారదుడితో స్వామీ!  నేను నా చిన్నతనంలో ఎన్నో కష్టాలుపడ్డాను. దీనికి కారణం ఏమిటి ? ఏవో గ్రహాలు నన్ను పట్టి పీడించడం వల్లనే కదా నా తల్లిదండ్రుల నుంచి నాకు వియోగం సంభవించింది. అసలు ఏ గ్రహ ప్రభావం వల్ల నాకీ దుర్గతి కలిగింది? అని ప్రశ్నించాడు.
   నాయనా! నీ దుఃఖస్థితికి కారణం శనైశ్చర గ్రహం. ఆ గ్రహప్రభావంతోనే నీకీ దురవస్థ ప్రాప్తించింది. అదిగో చూడు పైన ఆ శనిగ్రహం తనకి ఎదురేలేదని ఎలా గర్వంగా నిలిచవుందో సరిగ్గా చూడు అన్నాడు నారదుడు. నారదుడిమాటలు వినగానే మహర్షి అయిన బాలకుడులో ఒక్కసారిగా ఆగ్రహం పెలు్లబికింది. తన తపఃశక్తి అగ్ని జ్వాలల్లా మారి ాయన కంట్లోకి ప్రవేశించాయి. ఒక్కసారిగా ఆకాశంలో వున్న శనిగ్రహం వైపు ాయన తేరిపార చూసాడు. అంతే పైనున్న శనైశ్చరుడు సరాసరి ఒక కొండమీదు కొచ్చి పడిపోయాడు. ఆ దెబ్బకు ఆయన కాలు ఒకటి విరిగిపోయింది.
   ఆదృశ్యాన్ని చూసి శనైశ్చరుడికి గర్వభంగమైందని ఆనందించిన నారదుడు అందరు దేవతల్ని స్మరించాడు. వెంటనే వారంతా ఆయన దగ్గరకొచ్చారు. వారితో ’’ ఇదుగో ఇతనే నా అభిమాన పుత్రుడు. ఈ పిప్పలాదుడి తపోబలంతోనే శనైశ్చరుడు క్రిందపడ్డాడు అని వారికి పరిచయం చేసాడు.
  మహర్షిగా మారిన ఆ బాలకుడు అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడికి భక్తిగా నమస్కరించాడు. ఆయన అతన్ని ఆశీర్వదించి. ‘‘ నాయనా నీకు నారదుడు పెట్టిన పేరు సార్థకంగా వుంది. నీవు పీపల ఫలాలు తిని పెరిగావు కాబట్టి నిన్ను పిప్పలాదుడు అన్నాడు. నేటి నుంచి నీవు పిప్పలాద మహర్షిగా లోకంలో విఖ్యాతా చెందుతావు. ఈ రోజు నుంచి ప్రతి శనివారం ఏ దైవుడినైనా పూజించిన తరువాత పిప్పలాదా! అని నీ దివ్య నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు వారికి శనిగ్రహ బాధలుండవు అని పలికాడు. తరువాత పిప్పలాదుణ్ణి దగ్గరకి పలిచి ‘‘ నాయనా ! మానవుల మీద ప్రభావాన్ని చూపి కష్టాలకి గురిచేయడంలో శనైశ్చరుడి ప్రత్యక్షప్రమేయం ఉండదు. వారి వారి కర్మానుసారం ఆయన వారికి బాధల్ని కలుగుజేస్తాడు. ఈ శనైశ్చరుడు లేకపోతే గ్రహగతులు అల్లకల్లోలమౌతాయి. కనుక నీవు శనైశ్చరుడిని యథాస్థానంలో ప్రవేశపెట్టు’’ అని కోరాడు. బ్రహ్మ దేవుని మాటలు విని పిప్పలాదుడు తన తపో శక్తితో శనైశ్చరుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి పంపించాడు.

శనైశ్చర వ్రతం

శనిగ్రహదోశనివారణ కోరేవారు శనివారం రోజు స్వయంగా నూనెతో అభ్యంగనం చేసుకొని, బ్రాహ్మణులకి కూడా అభ్యంగనం చేసుకోవడానికి నువ్వుల నూనెని దానం ఇవ్వాలి. ఇనుముతో శని భగవానుడి ప్రతిమని తయారుచేయించి, దాన్ని నువ్వు నూనెని నింపిన పాత్రలో ఉంచాలి. ఆ పాత్రని ఒక సంవత్సరం పాటు ప్రతి శనివారం పూజించి చివరి శనివారం నాడు నల్లనిపూలు, నల్లని వస్త్రాలు, నువ్వులు మొదలైన ద్రవ్యాలతో శనీశ్వరుణ్ణి పూజించాలి. పూజానంతరం బ్రాహ్మణుల్ని పిలిచి వారికి నల్ల ఆవుని, నల్ల కంబళిని అప్పుడే నువ్వుల నుంచి తీయించిన నూనెని దక్షిణతో సహా దానం చేయాలి. వీటితో పాటు సంవత్సరమంతా పూజించిన నూనె పాత్రని కూడా దానం ఇచ్చేయ్యాలి.

శనిదేవుని స్తుతి

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమస్రజం ।
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం ।।       1
నమోఽర్కపుత్రాయశనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ ।
శ్రత్వారహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవసూర్యపుత్రః ।।       2
నమోఽస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయవైనమః ।
శనైశ్చరాయ క్రూరాయ శుద్ధి బుద్ధి ప్రదాయినే ।।        3
య ఏభిర్నామభిః సౌతితస్య తుష్టో భవామ్యహం ।
మదీయంతు భయం తస్య స్వప్నేఽ పి న భవిష్యతి ।।        4
(ఉత్తర పర్వ. అధ్యా  114, శ్లో. 39-42)

పిప్పలాదకృత శనిస్తుతి

కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోఽంతకోయమః ।
సౌరిః శనైశ్చరో మందః ప్రీయతాం మే గ్రహోత్తమః ।।
(అధ్యా - 114, శో: 47)
వ్రతఫలం: ఒక సంవత్సరం పాటు ప్రతి శనివారం ఈ శనైశ్చరవ్రతాన్ని చేయాలి. ముందు తెలిపిన విధంగా వ్రతానికి ఉద్యాయప చేసిన వారికి శనిగ్రహ బాధవలు ఎప్పటికీ కలగవు. అధేవిధంగా పై తెలిపిన శనిగ్రహస్తోత్రాల్ని ప్రతి శనివారం పఠిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ  ఉపాఖ్యానాన్ని చదివినవారికీ, విన్నవారికీ, చెప్పినవారికీ కూడా శనిగ్రహ బాధలుండవు.

స్వస్తి
సర్వేజనాః సుఖినోభవన్తు


online free astrology in telugu-chintaamani.co.in
Online freeastrology- chintamani.co.in









Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels