మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన
![]() |
Manidwepeswari |
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది
2. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబుగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు
పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
4. గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనింయించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు
6. అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
7. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు
8. కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటిచంద్రులచల్లని వెలుగులు
కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
9. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
11. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
12. సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ||భువ||
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
14. కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
15. భక్తిజ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
17. మంత్రిణి దండిని శక్తిసేవలు కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు
19. సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయాకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు
21. కోటి పకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
22. దివ్య ఫలముల దివ్యాస్త్రములు దిష్య పురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఙానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
24. పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
26. దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు
27. పదనాలు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం
28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
30. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2||
31. నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2||
32. శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలనుసమకూర్చుకొనుటకై
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం. ||భువ||
మంగళహారతి
శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి |మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
"ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
ఆపదలు బాపేటి సపందలనొసగేటి శ్రీనగరవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ | |
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కటి శ్రీరత్నసింహాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||
![]() |
free astrology - chintamani |
dhanyavadalu... manidweepa varnana english lo kavalante chudandi..
ReplyDelete