Astalaxmi Sthoram-అష్టలక్ష్మీ స్తోత్రమ్

అష్టలక్ష్మీ స్తోత్రమ్


free astrlogy - chintaamani.co.in
Astalaxmi sthotram

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయజయహే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదాపాలయమాం

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం

జయ వరవర్ణని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురుగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఙానవికాసిని శస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాప నివారిణి పాదయుతే
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయమాం

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర మానవ వందిత పాదయతే
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం

ధిమి ధిమి ధింధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనేతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం

online free astrology in telugu
free astrology - chintamani.co.in


Comments