Pippalada Maharshi Vruttantam- శనిదేవుని బాధలను తొలగించే శనైశ్చర వ్రతం- పిప్పలాద మహర్షి వృత్తాంతం

శనిదేవుని బాధలను తొలగించే శనైశ్చర వ్రతం- పిప్పలాద మహర్షి వృత్తాంతం

(భవిష్య పురాణం నందు చెప్పబడిన దానినుండి)


free astrology in telugu- chintamani.co.in
Pippalada Magarshi Vruttanatam
     పూర్వం త్రేతాయుగంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి కరువుకాటకాలు సంభవించాయి. ఆ బాధలు తట్టుకోలేక కౌశికుడనే ముని తన భార్యపుత్రులతో మరో ప్రాంతానికి బయలుదేరాడు. వారు వెళుతుండగా దారిలో ఒక కుమారుడు తప్పిపోయాడు. అది గమనించకుండా వారంతా ముందుకువెళ్ళిపోయారు.
తప్పిపోయిన బాలడు ఏడుస్తూ అక్కడే ఉన్న ఒక చెట్టు క్రిందకి చేరాడు. అది ఒక రావుచెట్టు, నిత్యం ఆ చెట్టు పళ్ళనే తింటూ పక్కనే ఉన్న చెరువులో నీళ్ళని తాగుతూ ఆ చెట్టుకింధే ధ్యానం చేసుకోసాగాడు ఆ బాలుడు. కొన్నాళ్ళకి నారదమహర్షి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ బాలుడి వినయ విధేయతలని, భక్తి తత్పరతని గమనించి అతడికి అన్ని సంస్కారాలూ చేసి వేదాల్ని అధ్యయనం చేయించాడు. తరువాత ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు ద్వాదశాక్షర మహామంత్రాన్ని ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ ఉపదేశించాడు. 
   నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని ఆ బాలుడు ఎంతో శ్రద్ధగా జపించసాగాడు. నారదుడు అక్కడే వుండి అతడి పట్టుదలని, దీక్షని శ్రద్ధని, గమనిస్తన్నాడు. కొన్నాళ్ళకి శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడినెక్కి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడి తపస్సకి మెచ్చుకుని జ్ఙానాన్ని యోగాన్ని ప్రసాదించాడు. క్రమంగా ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మహర్షిగా రూపుదిద్దుకున్నాడు.
   ఒకనాడు మహర్షి అయిన ఆ బాలుడు నారదుడితో స్వామీ!  నేను నా చిన్నతనంలో ఎన్నో కష్టాలుపడ్డాను. దీనికి కారణం ఏమిటి ? ఏవో గ్రహాలు నన్ను పట్టి పీడించడం వల్లనే కదా నా తల్లిదండ్రుల నుంచి నాకు వియోగం సంభవించింది. అసలు ఏ గ్రహ ప్రభావం వల్ల నాకీ దుర్గతి కలిగింది? అని ప్రశ్నించాడు.
   నాయనా! నీ దుఃఖస్థితికి కారణం శనైశ్చర గ్రహం. ఆ గ్రహప్రభావంతోనే నీకీ దురవస్థ ప్రాప్తించింది. అదిగో చూడు పైన ఆ శనిగ్రహం తనకి ఎదురేలేదని ఎలా గర్వంగా నిలిచవుందో సరిగ్గా చూడు అన్నాడు నారదుడు. నారదుడిమాటలు వినగానే మహర్షి అయిన బాలకుడులో ఒక్కసారిగా ఆగ్రహం పెలు్లబికింది. తన తపఃశక్తి అగ్ని జ్వాలల్లా మారి ాయన కంట్లోకి ప్రవేశించాయి. ఒక్కసారిగా ఆకాశంలో వున్న శనిగ్రహం వైపు ాయన తేరిపార చూసాడు. అంతే పైనున్న శనైశ్చరుడు సరాసరి ఒక కొండమీదు కొచ్చి పడిపోయాడు. ఆ దెబ్బకు ఆయన కాలు ఒకటి విరిగిపోయింది.
   ఆదృశ్యాన్ని చూసి శనైశ్చరుడికి గర్వభంగమైందని ఆనందించిన నారదుడు అందరు దేవతల్ని స్మరించాడు. వెంటనే వారంతా ఆయన దగ్గరకొచ్చారు. వారితో ’’ ఇదుగో ఇతనే నా అభిమాన పుత్రుడు. ఈ పిప్పలాదుడి తపోబలంతోనే శనైశ్చరుడు క్రిందపడ్డాడు అని వారికి పరిచయం చేసాడు.
  మహర్షిగా మారిన ఆ బాలకుడు అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడికి భక్తిగా నమస్కరించాడు. ఆయన అతన్ని ఆశీర్వదించి. ‘‘ నాయనా నీకు నారదుడు పెట్టిన పేరు సార్థకంగా వుంది. నీవు పీపల ఫలాలు తిని పెరిగావు కాబట్టి నిన్ను పిప్పలాదుడు అన్నాడు. నేటి నుంచి నీవు పిప్పలాద మహర్షిగా లోకంలో విఖ్యాతా చెందుతావు. ఈ రోజు నుంచి ప్రతి శనివారం ఏ దైవుడినైనా పూజించిన తరువాత పిప్పలాదా! అని నీ దివ్య నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు వారికి శనిగ్రహ బాధలుండవు అని పలికాడు. తరువాత పిప్పలాదుణ్ణి దగ్గరకి పలిచి ‘‘ నాయనా ! మానవుల మీద ప్రభావాన్ని చూపి కష్టాలకి గురిచేయడంలో శనైశ్చరుడి ప్రత్యక్షప్రమేయం ఉండదు. వారి వారి కర్మానుసారం ఆయన వారికి బాధల్ని కలుగుజేస్తాడు. ఈ శనైశ్చరుడు లేకపోతే గ్రహగతులు అల్లకల్లోలమౌతాయి. కనుక నీవు శనైశ్చరుడిని యథాస్థానంలో ప్రవేశపెట్టు’’ అని కోరాడు. బ్రహ్మ దేవుని మాటలు విని పిప్పలాదుడు తన తపో శక్తితో శనైశ్చరుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి పంపించాడు.

శనైశ్చర వ్రతం

శనిగ్రహదోశనివారణ కోరేవారు శనివారం రోజు స్వయంగా నూనెతో అభ్యంగనం చేసుకొని, బ్రాహ్మణులకి కూడా అభ్యంగనం చేసుకోవడానికి నువ్వుల నూనెని దానం ఇవ్వాలి. ఇనుముతో శని భగవానుడి ప్రతిమని తయారుచేయించి, దాన్ని నువ్వు నూనెని నింపిన పాత్రలో ఉంచాలి. ఆ పాత్రని ఒక సంవత్సరం పాటు ప్రతి శనివారం పూజించి చివరి శనివారం నాడు నల్లనిపూలు, నల్లని వస్త్రాలు, నువ్వులు మొదలైన ద్రవ్యాలతో శనీశ్వరుణ్ణి పూజించాలి. పూజానంతరం బ్రాహ్మణుల్ని పిలిచి వారికి నల్ల ఆవుని, నల్ల కంబళిని అప్పుడే నువ్వుల నుంచి తీయించిన నూనెని దక్షిణతో సహా దానం చేయాలి. వీటితో పాటు సంవత్సరమంతా పూజించిన నూనె పాత్రని కూడా దానం ఇచ్చేయ్యాలి.

శనిదేవుని స్తుతి

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణ సమస్రజం ।
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం ।।       1
నమోఽర్కపుత్రాయశనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ ।
శ్రత్వారహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవసూర్యపుత్రః ।।       2
నమోఽస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయవైనమః ।
శనైశ్చరాయ క్రూరాయ శుద్ధి బుద్ధి ప్రదాయినే ।।        3
య ఏభిర్నామభిః సౌతితస్య తుష్టో భవామ్యహం ।
మదీయంతు భయం తస్య స్వప్నేఽ పి న భవిష్యతి ।।        4
(ఉత్తర పర్వ. అధ్యా  114, శ్లో. 39-42)

పిప్పలాదకృత శనిస్తుతి

కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోఽంతకోయమః ।
సౌరిః శనైశ్చరో మందః ప్రీయతాం మే గ్రహోత్తమః ।।
(అధ్యా - 114, శో: 47)
వ్రతఫలం: ఒక సంవత్సరం పాటు ప్రతి శనివారం ఈ శనైశ్చరవ్రతాన్ని చేయాలి. ముందు తెలిపిన విధంగా వ్రతానికి ఉద్యాయప చేసిన వారికి శనిగ్రహ బాధవలు ఎప్పటికీ కలగవు. అధేవిధంగా పై తెలిపిన శనిగ్రహస్తోత్రాల్ని ప్రతి శనివారం పఠిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ  ఉపాఖ్యానాన్ని చదివినవారికీ, విన్నవారికీ, చెప్పినవారికీ కూడా శనిగ్రహ బాధలుండవు.

స్వస్తి
సర్వేజనాః సుఖినోభవన్తు


online free astrology in telugu-chintaamani.co.in
Online freeastrology- chintamani.co.in









Comments