chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Friday, October 17, 2025

శివుడుకి అత్యంత ప్రీతి పదమైన ప్రదోశ పూజావిధానం




ఈ నెల అక్టోబర్ 18వ తేదీన శనివారం రోజున శని ప్రదోశం ఏర్పడనుంది.  శనిప్రదోశం పూజవల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. 

చేసిన పాపాలు తొలిగి కోరిన కోర్కెలు నెరవేరడానికి ప్రదోశ పూజ అనేది అత్యంత ప్రభావతంమైనది. మనము శివరాత్రికి, కార్తీక మాసాలలో చేసే శివారాధలలాగే ప్రదోశ పూజ కూడా ఒకటి. ఇది శివుడి చాలా ఇష్టమైన పూజ, ఆ రోజు సాయంకాలం శివుని ఆరాధనకు చక్కని సమయం. ప్రదోషకాలంలో శివార్చన శక్తివంతమైనదిగా, పాప విమోచనం కలిగిస్తుందని పురాణాలు చెప్పుకుంటాయి. 

మరి ఈ ప్రదోశపూజ ఎలా చేయాలి. ప్రదోశం అంటే ఏమిటి ? ప్రదోశకాలం అంటే ఏమిటి.  ప్రదోశానికి, ప్రదోశ కాలాని తేడా ఏమిటీ అనే విశయాల గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

ప్రదోశం వేరు.. ప్రదోశ కాలం వేరు. ఈ రెండూ వేరు వేరు అయినప్పటికీ ఈ రెండు కూడా శివారాధన కోసం ఏర్పడినవే..  మనకు సంకష్ట చతుర్ధి  ఎలాగో అలాగే,  ‘‘ ప్రదోషం ’’ కూడా హిందూ ధర్మంలో ఎంతో పవిత్రమైన రోజుగా భావిచవచ్చు. సంకష్టి రోజు గణపతిని ఎలా పూజిస్తామో అలాగే ప్రదోశం రోజున శివుడిని పూజిస్తాము. 

ప్రదోశం ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది. ప్రతీ పక్షంలో (శక్ల పక్షం, కృష్ణ పక్షం ) త్రయోదశి ( తిథులలో13వ తిధి) నాడు  ఏర్పడుతుంది.  త్రయోదశి  ఆదివారం రోజున వస్తే భాను ప్రదోశం అని, సోమవారం రోజన వస్తే సోమ ప్రదోశం అని ఇలా శనివార రోజన వస్తే శని ప్రదోశం అని పిలుస్తారు. 

ఈసారి ప్రదోశం శనివారం రోజున రావడం, శనివారం, త్రయోదశి కలిసిన రోజున శనిత్రయోదశి అంటామని తెలుసు కదా. ఈ రోజున శనిత్రయోదశి, ధన త్రయోదశి రెండూ కూడా కలిసి రావడం విశేషం. ఇలాంటి రోజున శివుడికి, శని గ్రహానికి చేసే పూజలు అత్యంత ప్రభావింతమైనవి చెప్పవచ్చు. 

ప్రదోషం అంటే ఏమిటి?

  • ప్రదోషం అంటే హిందూ క్యాలెండరులో ప్రతి పక్షంలో ఉన్న పదమూడవ రోజు (త్రయోదశి)ను సూచిస్తుంది.

  • ఈ రోజు ప్రధానంగా శివపూజకు, ఉపవాసానికి అంకితం.

ప్రదోషకాలం అంటే ఏమిటి?

  • సూర్యాస్తమయం అయిన తరువాత ( ఉన్న 2 గంటల 24 నిమిషాలు, లేదా కొన్ని సంప్రదాయాలలో ముందునుండి 24 నిమిషాలు, తరువాత 24 నిమిషాల వరకు) వచ్చే ప్రత్యేకమైన సమయాన్ని ప్రదోషకాలంగా పేర్కొంటారు.

  • ఇంకొంతమంది సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు తీసుకుంటారు (48 నిమిషాలు).

  • కొన్ని ప్రాంథిక సంప్రదాయాల్లో సూర్యాస్తమయం నుంచి 1.5 గంటలు (90 నిమిషాలు) తర్వాతి వరకు 'ప్రదోషకాలం'గా భావిస్తారు.

ఉదాహరణ

ఉదాహరణకు, ఒక పట్టణంలో సూర్యాస్తమయం 6:00 PM అయితే:

  • సాధారణ గణన: 6:00 PM నుంచి 8:24 PM వరకు (2 గంటల 24 నిమిషాలు)

  • కొంతమంది: 6:00 PM నుంచి 7:30 PM వరకు (1.5 గంటలు) లేదా 5:36 PM నుంచి 6:24 PM వరకు (ఒక గంట ముందు, ఒక గంట తర్వాత).

  • ప్రదోషకాలంలో చేసే శివపూజకు ఎంతో ఫలం ఉంటుందని నమ్మకం.

ప్రదోషకాలంలో ఏం చేయాలి?

  • శివుని ధ్యానం, నమక-చమక చదువుట, శివేసాయని భజనలు, ఆలయంలో లేదా ఇంట్లో శివ లింగాభిషేకం చేయడము మంచిది.

  • ఆవుపాలను, నెయ్యిని, గంధాన్ని ఉపయోగించి అభిషేకం చేయడం, బిల్వదళాలతో సంపూర్ణ పూజ చేయడం శుభప్రదం.

  • ఉపవాసం చేయడం, పవిత్రతతో ఉండడం, స్తోత్రపఠనం చెయ్యడం కల్యాణప్రదం. 

  • శుచిగా ఉండి, సాయంత్రం శివుని మందిరానికి వెళ్లడం లేదా ఇంట్లో శివారాధన చేయడం.

  • ఉపవాసం పాటించడం లేదా సాయంత్రం తక్కువాహారం తీసుకోవడం.

  • శివలింగాన్ని ఆవుపాల, నీటితో అభిషేకించడం; బిల్వదళాలు సమర్పించడం.

  • "ఓం నమః శివాయ" మరియు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం.

  • శివపురాణ పఠనం లేదా శివ కథలు వినడం, పాటలు, భజనలు వినడం/పాడడం.

  • ఆలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించడం, పుష్పాలంకరణ చేయడం, నైవేద్యం సమర్పించడం కూడా మంచిది.

  • కుటుంబసభ్యులతో కలిసి శాంతిగా దివ్య వాతావరణాన్ని ప్రతిష్ఠించడం.

ప్రదోషకాలంలో ఏమి చేయకూడదు?

  • రూఢిగల పని లేదా వాదప్రయాసంలో ఉండటాన్ని మానవచ్చు.

  • మాంసాహారం, మద్యపానం వంటి అపవిత్ర చర్యలను దూరంగా నిర్వహించాలి.

  • ఉద్వేగపూరితంగా, కోపంగా ఉండకూడదు. పవిత్రత, నిర్జలశుద్ధి పాటించాలి.

  • అపవిత్రంగా ఉండకూడదు; ప్రదోషానికి ముందు శుద్ధిగా స్నానం చేయాలి.

  • మాంసాహారం, మద్యం, ధూళివంట పదార్థాలు దూరంగా నివ్వాలి.

  • కోపం, అసూయ, అలజడి వంటి నమ్మనీయని భావాలు నివారించాలి.

  • శబ్దం, హడావిడి చేయకూడదు, ధ్యానావస్థలో ఉండాలి.

  • పెట్టుబడులు,  కొత్త పనులు ప్రారంభించడం మంచిది. 

  • విద్వేషాది వ్యవహారాలు, అనవసర ప్రయాణాలు వంటివి నివారించవచ్చు


తేదీవారముసమయం
అక్టోబర్ 4శనిసాయంత్రం 6:03 - 8:30
అక్టోబర్ 18శనిసాయంత్రం 5:48 - 8:20

**నోటు:**స్థానిక పంచాంగంలో అపురూపంగా కొన్ని నిమిషాల తేడా ఉండవచ్చు. పై సమయాలు న్యూఢిల్లీ ఆధారంగా ఉన్నాయి, మీ పట్టణానికి తగిన సూర్యాస్తమయ సమయాన్ని బట్టి 2-2.5 గంటల పరిధిలో పూజ, ఉపవాసం చేపట్టండి.

ప్రదోషకాల శివపూజా విధానం :

  • ఉదయాన్నే లేచి శుద్ధిగా స్నానం చేయాలి.

  • ఉపవాసం పాటించాలి లేదా తక్కువాహారం తీసుకోవచ్చు.

  • ప్రదోషపు సాయంత్రం (సూర్యాస్తమయం తర్వాత) ఇంట్లో లేదా ఆలయంలో శివపూజ కోసం సన్నద్ధమవ్వాలి.

  • శివలింగాన్ని (లేనిది సాంబారాలుగా శివపటాన్ని) ఆవుపాలు, నీరు, గంధం, తేనె, పెరుగు, నెయ్యి, పసుపు, చక్కెర, కర్పూరం, కలిపి అభిషేకం చేయాలి.

  • బిల్వపత్రాలు, సమర్పించడం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.

  • వివిధ పువ్వులతో అలంకరించి, దీపం వెలిగించి ఆపాదమస్తకం శివుని నమస్కరించాలి.

  • "ఓం నమః శివాయ" మంత్రం లేదా మహామృతుంజయ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి.

  • శివ పురాణం నుండి కథలు వినడం, శివాష్టకం, శివ స్తోత్రాలు పఠించడం మంచిదిగా భావించబడుతుంది.

  • ఆలయాల్లెయితే, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, కొబ్బరికాయ కొట్టు నమస్కరించడం, భక్తిశ్రద్ధలతో హారతులు ఇవ్వడం చేస్తారు.

  • శివపూజ అనంతరం, నైవేద్యం సమర్పించి, ఉపవాసాన్ని విరమించవచ్చు.

మరికొనన్ని సూచనలు :

  • ఉదయం గణపతి పూజతో మొదలు పెట్టాలి.

  • నంది దేవునికి అభిషేకం కూడా మంచిదని పురాణ నమ్మకం.

  • మహిళలు, పురుషుల భేదం లేకుండా అందరూ ప్రదోష వ్రత పూజ చేయవచ్చు.

ఈ విధంగా ప్రదోషకాలంలో శుద్ధి, ఉపవాసం, అర్చన, అభిషేకం, మంత్రపఠనం మిళితం చేసిన సంపూర్ణ శివపూజ చేయడం శుభప్రదంగా ఉంది.


శివప్రదోషస్తోత్రము:

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః


శుభమస్తు ..



Share:

Sunday, October 12, 2025

గురుబలం పెరగడానికి అద్భుతమైన 16 ప్రక్రియలు



జ్యోతిష్యశాస్త్రంలో గురుగ్రహం (బృహస్పతి) అత్యంత ముఖ్యమైన మరియు శుభప్రదమైన గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇతతని దేవ గురువు అని కూడా పిలుస్తారు. వ్యక్తి యొక్క జాతకంలో గురువు యొక్క స్థితిని బట్టి , ప్రాముఖ్యతను బట్టి అనుగ్రహం పొందడానికి ఆచరించవలసిన పరిహారాల తెలుసుకుందాం.


శ్రీ గురుగ్రహం ప్రాముఖ్యత (Brihaspati / Jupiter Importance)

నవగ్రహాలలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది శుభగ్రహం. గురువు బలమైన స్థానంలో ఉంటే, ఆ వ్యక్తికి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.

  • కారకత్వాలు : రుగ్రహం ప్రధానంగా జ్ఞానం, వివేకం, విద్య, సంపద (ధనం), అదృష్టం, సంతానం, వివాహం, ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత మరియు విస్తరణ (Growth) ను సూచిస్తుంది.
  • గురుబలం ప్రభావం: జాతకంలో గురుబలం బలంగా ఉన్నవారు మంచి పాండిత్యం, దైవభక్తి, న్యాయబుద్ధి కలిగి ఉంటారు. వీరికి జీవితంలో సుఖ సౌఖ్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగం, వివాహం, ధనలాభం వంటి శుభకార్యాలు సరైన సమయానికి జరుగుతాయి.
  • అధిదేవతలు: గురు గ్రహానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు మరియు దక్షిణామూర్తి (శివుడి రూపం). గురువారం ఈ దేవతల పూజకు ఎంతో శ్రేష్ఠమైనది.


గురు గ్రహ అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలు

1. గురువారం ఆచరించాల్సిన ముఖ్య పూజలు
2. మంత్ర జపం మరియు స్తోత్ర పారాయణం
3. దానాలు మరియు సేవ
4. రావి చెట్టుకు ప్రదక్షణలు
5. ఇతర పద్దతులు 

జాతకంలో గురు బలం పెంచుకోవడానికి, గురు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి ఈ కింది పరిహారాలను ఆచరించడం మంచిది.

గురు గ్రహ అనుకూలత కోసం గురువారం రోజున ఈ కింది పూజలు మరియు నియమాలను పాటించాలి.

  • పసుపు రంగు వస్తువులు: గురు గ్రహానికి పసుపు రంగు ప్రీతికరమైనది కాబట్టి, ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహావిష్ణువు లేదా గురు గ్రహానికి పసుపు రంగు పూలు, పసుపు పండ్లు, పసుపు వస్త్రాలు సమర్పించి పూజ చేయాలి.

  • స్నానం: గురువారం ఉదయం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడం వలన గురు బలం పెరుగుతుందని విశ్వసిస్తారు.

  • విష్ణువు/దత్తాత్రేయుడు/ దక్షిణామూర్తి పూజ: గురువారం శ్రీ మహావిష్ణువును లేదా దక్షిణామూర్తిని పూజించడం వలన గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది.

  • విష్ణు మంత్రం: గురువారం రోజున పవిత్రమైన మనసుతో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన అదృష్టం కలిసి వచ్చి సకల శుభాలు కలుగుతాయి.

  • దక్షిణామూర్తి స్తోత్రం: ఓం నమో భగవతే దక్షణామూర్తే మహ్యం మేధాం, ప్రజ్ఘాం ప్రయచ్చ స్వాహా:  అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే గురు గ్రహ దోషాలు తొలగి, విద్య, ఉద్యోగం, సంపద పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా గురువారం రోజున పారాయణం చేయవచ్చు. విద్యార్థులకు ఇది చాలా మంచిది.

  • హయగ్రీవ స్తోత్రం: ‘‘ జ్ఘానానంద మయం నిర్మలం దేవం,  స్పటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే : ’’ అనే మంత్రమును 108 పార్లు పఠించినట్లయితే  ఉన్నత విద్య, విదేశీ విద్య మరియు జ్ఞానశక్తిని పెంపొందుతుంది. గురుగ్రహ అధిదేవత అయిన హయగ్రీవుని స్తోత్రాన్ని ప్రతిరోజూ చదవడం మంచిది.

  • దత్తాత్రేయ స్తోత్రం : దత్తాత్రేయుడికి ‘‘ద్రాం ’’ అనేది బీజాక్షరం. ఈ  భీజాక్షరాన్ని ‘‘ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ: ’’ అంటూ ప్రతి రోజు లేదా ముఖ్యంగా గురువారం రోజున 108 సార్లు చదవాలి. ఇందువల్ల గురుగ్రహం యొక్క అనుగ్రహం పెరిగి ధనరాబడి పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. 

  • నిమ్మపండు తో పరిహారం : ఒక స్వచ్చమైన గాజు గ్లాసులో స్వచ్చమైన నీరు పోసి అందులో పసుపురంగ నిమ్మ పండు తీసకొని దానిపై ఎరుపు రంగు మార్కర్ లేదా పెన్ తో పైన ఓం అని చిన్నగా వ్రాసి దాని కింద ‘‘ద్రాం’’ అని పెద్దగా వ్రాసి నీటి గ్లాసులో వేసి  ఉత్తరం దిక్కులో లేదా ఈశాన్యం దిక్కులో ఉంచడవ వలన కూడా గురుబలం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు తొలుగుతాయి. గురువారం రోజున పెట్టవచ్చు లేదా  ఈ నిమ్మపండును ప్రతిరోజు పెట్టిన మంచిది,  మరుసటి రోజు ఆ నిమ్మపండును, నీటిని ఇంట్లో మొక్కలకు లేదా చెట్టకు పోయాలి. తొక్కుడులో వేయకూడదు.

  • దానం: గురు బలం పెంచుకోవడానికి శక్తి మేరకు శనగలు, పసుపు రంగు వస్త్రాలు, నెయ్యి, పసుపు, చక్కెర (స్వీట్స్)  లేదా బంగారం వంటి వాటిని గురువారం రోజున దానం చేయవచ్చు.

  • గురువుల సేవ: నిజ జీవితంలో గురువులు, పెద్దలు, పండితులు మరియు ఉపాధ్యాయులను గౌరవించి, వారి సేవ చేయడం వలన గురు గ్రహ అనుగ్రహం త్వరగా కలుగుతుంది.

  • రావి చెట్టుకు ప్రదక్షణలు : రావి చెట్టను అశ్వద్ద వృక్షము అని కూడా అంటారు. ప్రతి రోజు రావి చెట్టుకు 11 లేదా 108 ప్రదక్షిణలు చేయడం వలన గురుబలము పెరుగుతుంది. ప్రదక్షణలు చేస్తన్నపుడు ‘‘ఓం శ్రీ అశ్వద్ద వృక్షాయ నమ:’’ అంటూ ప్రదక్షణలు చేయాలి.

  • నేతి దీపం : ప్రత్యేకించి గురువారం రోజున రావి చెట్టువద్ద నేతి దీపం వెలించినట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. దీపపు ప్రమిదలో నేయిపోసి పసుపురంగు వత్తివేసి వెలిగించాలి. పసురంగు పూలు, శనిగలు, బెల్లం, పాయసం లేదా స్వీట్స్ వంటి తీపి పదార్ధాలు నైవేద్యంగా పెట్టవచ్చు. 

  • గోవుకు ఆహారం : ప్రతి రోజుల లేదా ప్రత్యేకించి గురువారం రోజున తెల్లని లేదా కపిల వర్ణం  (ఎరుపు రంగు) ఆవులకు నానపెట్టిన శనగలు నేరుగా కాని ఉడిచింకి అన్నంలో కలిపిగాని తినిపించడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా శక్తిని భట్టి 9 లేదా 11 వారాలు చేయాలి.

  • జపం-దానం : ‘‘ ఓం  హ్రాం హ్రీం హ్రౌం స: బృ హస్పతయే నమ: ’’ అను మంత్రాన్ని ఒక  గరువారం లేదా శుభతిథి లేదా గురు నక్షత్రాలు (పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర) ఉన్న సమయానికి గురు జపాన్ని ప్రారంభించి 40 రోజులలో  16 వేల సార్లు పూర్తి  అగునట్లుగా జపం చేయాలి. 41వ రోజు ఒక పసపు రంగు వస్త్రంలో శక్తిని బట్టి 16 పిడికిల్ల, 16 దోసిస్లు శనగలు పోసి మూట్టకట్టి బ్రహ్మణునికి దానం ఇవ్వాలి. 

  • గురుగాయత్రి స్తోత్రం : ‘‘ఓం సురాచార్య విద్మహే - దేవపూజ్యాయ దీమహి తన్నో గురు: ప్రచోదయాత్ ’’ ఈ గాయత్రి మంత్రమును గురువారం రోజున 108 సార్లు పటించిన గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.

  • కనకపుష్యరాగం రత్నం ధరించుట : అనుభవఘ్నులైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జాతకములో కనకపుష్యరాగం రత్నమును ధరించవచ్చునో లేదో తెలుసుకొని ఉంగరం ధరించడం.

  • రుద్రాక్షమాల ధరించుట : సప్తముఖి రుద్రాక్షణు మెడలో హారంగా ధరించిన్లయిన గురుబలం పెరిగి ధనం, సంపద, ఆరోగ్యం, జీవన వృద్ది, వ్యవహార జయాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. 

పైన తెలిపిన పరిహారాలను శ్రద్ధాభక్తులతో పాటించడం వలన గురు గ్రహం యొక్క శుభ ఫలితాలు పెరిగి, విద్య, వివాహం, ఉద్యోగం మరియు సంపద వంటి జీవిత లక్ష్యాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, ఏదైనా పరిహారం ప్రారంభించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి, మీ జాతకాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం.

- By SreeRam Manuhar, 

Astrologer (Vedic and KP)

Chintamani Astrology Service 

Share:

Sunday, September 21, 2025

రాహుకాలంలో నిమ్మ పండు దీపం

రాహుకాలంలో నిమ్మ పండు దీపం వెలిగించే సమయాలు, పూజా విధానం.

రాహుకాలంలో నిమ్మ పండు దీపం వెలిగించడం ప్రత్యేకంగా శక్తివంతమైన పూజా విధి. ఇది పెద్దగా కుజ, రాహు, కాలసర్ప దోషాలు, కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగించడంలో ఉపయోగపడుతుంది[1][2].

 రాహుకాలం సమయాలు

- ఆదివారం: సా. 4:30 - 6:00
- సోమవారం: ఉ. 7:30 - 9:00
- మంగళవారం: మ. 3:00 - 4:30
- బుధవారం: మ. 12:00 - 1:30
- గురువారం: మ. 1:30 - 3:00
- శుక్రవారం: ఉ. 10:30 - 12:00
- శనివారం: ఉ. 9:00 - 10:30

# నిమ్మ పండు దీపం పూజా విధానం

- రాహు కాలం (Rahukalam) సమయంలో గుడి లేదా ఇంట్లో పూజ స్థలంలో దీపం వెలిగించాలి.
- పచ్చ నిమ్మకాయ ను తీసుకొని మధ్యలో భాగాన్ని అడ్డంగా కట్ చేయాలి (అరిలోగా).
- నిమ్మ రసాన్ని పూర్తిగా తీసేయాలి. నిమ్మను లోపలికాడ తిప్పి, లోపలి భాగాన్ని వట్టిగా పొగిలి, కప్పుగా తయారుచేయాలి.
- ఆ కప్పులో నూనె లేదా నెయ్యి నింపి, . విక్స్ కోసం కొత్త పసుపు గుడ్డ, మూస్లెట్ లేదా పత్తి వాడవచ్చు.
- దీపాన్ని ఉత్తర దిశలో వెలిగించాలి.
- ఒక రాగి ప్లేట్ ,  కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకోవాలి.  నిమ్మపై పెట్టి వెలిగించాలి.
- దీపానికి మన కోరిక, సమస్య తెలియజేస్తూ ద్వాదశ కన్నులు గల అమ్మవారికి పూజ చేయాలి.
- పూజ పూర్తయిన తర్వాత నిమ్మ రసాన్ని నీటిలో కలిపి చెట్టు దిగుగా పోయాలి లేదా ముదు మీద పెట్టాలి.
- దీపాలు ఆరిపోయిన తర్వాత, లెమన్ కప్పులను ఉత్తర దిశలో, చిన్న గోతిలో పెట్టి మట్టి వెదజల్లాలి.

# పాటించవలసిన నియమాలు

- నిమ్మ పండు దీపాలు ఎప్పుడూ బేసిన సంఖ్యలో (1, 3, 5, 7, 9) వెలిగించాలి.
- నెయ్యి లేదా నునె వాడినప్పుడు శుద్ధమైనదిగా ఉండాలి.
- Rahu Kala Deepam పూజ 9 రోజులు చేయాలి, పూర్తిగా స్థిరమైన కోరిక నెరవేర్చడంలో సహాయపడుతుంది.
- Rahu kala పూజ కోసం Tuesday, Friday, Sunday ప్రధానంగా ఉత్తమం.
- దీపాలు ఆరిపోయిన తరువాత Disposal కూడా Rahu Kalam లోనే చేయాలి.

# పూజా ఫలితాలు

- Rahu, Kuja, Kala Sarpa dosha సమస్యలు తగ్గుతాయి.
- వ్యాపార, కుటుంబ, ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
- విద్య, వివాహం, సంతానం, కోరిక నెరవేరే అవకాశాలు పెరుగుతాయి.

ఈ విధంగా Rahu Kalam లో నిమ్మ పండు దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


Share:

Sunday, September 14, 2025

ఉద్యోగ ప్రయత్నాలకు శ్రీ హనుమాన్ మంత్రసాధన

జై హనుమాన్  ఆరాధన 
(ఉద్యోగ ప్రయత్నాలకు మంత్రసాధన)

త్వమస్మిన్ కార్య నిరుయోగే
ప్రమాణం హరిసత్తమ 
హనుమాన్ యత్నమాస్తాయి 
దుఃఖ క్షయ కరోబవబవ ll
అసాధ్యసాధక స్వామిన్
అసాధ్యం తవ కిమ్ వద 
రామదూత కృపాసిందో 
మత్కార్యం సాదయ ప్రబో ll

ఈ మంత్రమును
ఒక మంగళవారం ప్రారంభించాలి.
 హనుమాన్ గుడికి వెళ్లి స్వామికి ఐదు అరటి పండ్లు నివేదన చేసి 108 ప్రదక్షిణలు (వీలుకానిచో 11 ప్రదక్షిణాలు) చేసి తర్వాత గుడిలో ఒకపక్కగా కూర్చుని పైన చెప్పిన మంత్రాన్ని 108 సార్లు పటించాలి. తర్వాత ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇంట్లో గాని గుడికి వెళ్లి గాని వరుసగా 108 సార్లు 41 రోజులు భక్తిశ్రద్ధలతో చదవాలి. 
ఇలా చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి తప్పకుండా ఉద్యోగాన్ని వచ్చేలా చేస్తాడు.
Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels