బ్రతికి ఉన్నవారికి పిండప్రధానం చేయవచ్చా...?
ఇలా చేస్తే దోషమా....?
చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు ? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? ప్రేతాత్మ దేవతగా ఎలా మారుతుంది ? పిండాలవల్ల ప్రయోజనం ఏమిటి అని ?
వీటికి సమాధానాలు ఉపనిషత్తులలో ఉన్నాయి. పిండోపనిషత్తు ఇది అథర్వన వేదానికి చెందినది. ఈ వేదం కర్మ యోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యఘ్నాలు ఎలా చేయాలో చెప్పారు.
దేవతలు, మహర్షులు బ్రహ్మదేవుని ఈ విధంగా అడిగారు.
మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు అని, అందుకు బ్రహ్మదేవుడు జీవి దేహం దేహి గురించి ఈ విధంగా చెప్పాడు.
మరణించిన తరువాత పంచభౌతికమైన ఈ శరీరం పంచభూతాలు (భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) విడిపోతాయి. ఎప్పడుదైతే దేహి శరీరం నుంచి విడిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలా వెళ్ళిపోతాయి. ముందు గా ఊపిరి (గాలి), తరువాత అగ్ని ( శరీరం చల్ల బడడం) ఆ తరువాత నీరు వెళ్ళిపోతాయి. తరువాత మిగిలిన దాతువులు, ఎముకలు, వెంట్రుకలు, చర్మం ఇవి భూమిలో ( దహనం చేసిన తరువాత), ఆకాశంలో కలిసిపోతాయి. క్లుప్తంగా జరిగేది ఇదే.
మనకు కనిపించే బాహ్మ శరీరంతోపాటు, కారణ శరీరం, యాతనా శరీరం అని రెండు వుంటాయి. కారణ శరీరం పాపపుణ్యాలతో మరో జన్మకు వెళితే, యాతన శరీరం స్వర్గానికో, నరకానికో వెలుతుంది. ఇలా వెల్లిపోగా మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత పది రోజులు తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తుల చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో చేసే నిత్య పిండం కాకి రూపంలో (పక్షి రూపం)లో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రికులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి చెందిన ప్రేత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెలుతుంది. దహన సంస్కారాది 12 రోజులు, మాసికాలు, సపిండీకరణం తరువాత తన తాతలు, తండ్రులతో కలిసి పితృస్థనాం పొందుతుంది. వీరినే పితృదేవలు అంటారు.
మృతుని కుటుంబీకులు ఇచ్చే పిండ ప్రదానం వలన మరో జన్మకు కొత్త శరీరం ఏర్పడుతుంది.
వారు పెట్టే పది పిండప్రధానాల ద్వారా కొత్త జీవితానికి అవసరమైన సంపూర్ణ శరీరం ఏర్పడుతుంది.
ఇది చనిపోయిన వారికి చేసే పిండప్రధానం వల్ల కలిగే ఫలితాలు.
అయితే కొంత మంది మానసిక స్థితి బాగోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్ళన వారి జాడ తెలియక పోవడం వలన చాలా కాలం వేచివున్న కుటుంబీలు వారు చనిపోయారో, బ్రతికువున్నారో తెలియక కొంతకాలనికి వారు చనిపోయివుంటారని నిర్ణయించకుని పిండప్రదానం చేస్తువుంటారు.
మరి కొందరు ఇతరులపై శత్రుత్వంతో పిండం వదులుతారు. మరి బ్రతికి వున్నవారికి పిండప్రధానం చేస్తే ఏమవుతుంది. అంటే బ్రతికి ఉన్న వారికి చేసే పిండ ప్రధానం వలన ఎలాంటి ఫలితం ఉండదు.
ఎందుకంటే ఉదాహరణకు మనం ఒక బ్యాంకు ఎకౌంట్ తీసుకుందామని, మన పేరు, అడ్రస్, మన గుర్తింపు కార్డులు వంటి అన్ని ఆధారాలు ఇస్తాం. ఇవన్ని ఇచ్చినంత మాత్రాన బ్యాంకు ఎకౌంటు రాదు. సంబంధిత బ్యాంకు అధికారి ధృవకరించినపుడే ఎకౌంట్ వస్తుంది. అప్పడు మనం మన కాతాలో డబ్బులు వేయడం తీయడం జరుతుంది. అధికారి ఏకౌంట్ నెంబర్ ఇవ్వనంత వరకు లావాదేవీలు చేయలేం.
అలాగే మనిషి చనిపోయిన తారువాత స్వర్గంలోనో, నరకంలోనో మనకు ఎకౌంటు ఏర్పడుతుంది. ఇక్కడ యమధర్మరాజును అధికారి అనుకోవచ్చు. అయన మనకు మరణాన్ని ప్రదసాదిస్తేనే మనం చనిపోయినట్లు లెక్క. అంతే కాని ఎవరో మన పేరు, గోత్రం, చిరుణామ చెప్పి పిండప్రదానం చేసినంతమాత్రాన అవి మన ఎకౌంటుకు చేరవు.
అది మనం గిట్టనివాలు చేసినా అది వారికి మానసిక ఆనందం తప్ప వేరొకటి లేదు.
మానసిక ఆనందానికి ఒక ఉదాహరణ ఒక వ్యక్తి ఒక సౌందర్యవతిని ( సినీ నటి అనుకుందాం) ఆమెతో తను శారీరక సుఖం పొందినట్లు మనసులో ఊహించుకున్నాడు అనుకుందాం. అంత మాత్రాన ఆ సౌందర్యవతి అతినితో గడిపిందా లేదు కదా... అయితే ఇలా పర స్ర్తీని మనుసులో ఊహించున్నా పాపమే అని కురాన్ లోనూ ఉంది.
ఎవరైన బ్రదికి వున్నవారికి పిండ ప్రధానం చేస్తే అది చేసిన వారికే ఆ పాపం చుట్టకుంటుంది. పిండ ప్రదానం పొందినవారు ఛింతించవలసిన పనిలేదు. ఒక వేల ఆవేదనగా అని పిస్తే ఈ విధంగా చేయండి.
మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కిడి పూజారిని అడిగి అతనికి దీపదానం చేయండి. మీకు ఎలాంటి దోషాలు అంటవు. దీపాదానం ఎలా చేయాలంటే గోదుమ పిండితో చేసిన తొమ్మిది ప్రమిదలలో నూనే పోసి ఒక్కొక్క ప్రమిదలో మూడు వత్తులు వేసి వెలిగించి ఒక ప్లేటులో పెట్ట ఏవైన ఫలం, పుష్పం ఉంచి దక్షణతో సమర్పించండి. మానసిక ప్రశాంతకు మీ ఇష్టదేవతను (స్తోత్రాలు, అష్టోత్తరాలతో ) స్తుతించండి.
ఈ కార్తీక మాసంలో చేసే దీపదానం ఎంతో విశిష్టమైనది.
దేవతలకు సంబంధించి కొన్ని స్తోత్రాలను ఈ బ్లాగు నందు పొందు పరచడమైనది. మరికొన్ని ముందు ముందు ప్రచురించ గలము. కావున మీకు నచ్చినట్లయితే మా బ్లాగును ఫాలో అవుతూ వుండగలరు.
సర్వేజనా సుఖినో భవంతుః
![]() |
chintamani free astrology |

For free astrology Click Here |

Comments
Post a Comment