chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Friday, May 31, 2024

ఒకసారి ఆలోచించండి

Free Astrology Consultation

ఈ కలియుగంలో మనుషులకు అన్నీ చేయడానికి సమయం ఉంటుంది ( ఇష్టమైన క్రికెట్ ఆడడానికి, క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, షికార్లు, ఫ్రెండ్స్ తో పార్టీలు, షాపింగ్ లు చేయడానికి టైం ఉంటుంది, ఫోన్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికి టైం ఉంటుంది, రీల్స్ షాట్స్ వీడియోలు చూడడానికి టైం ఉంటుంది ) కానీ భగవంతుని పూజించడానికి మాత్రం సమయం ఉండదు. ఎంతసేపు మనకున్న కష్టాలకు గ్రహాలను, భగవంతుని దూషించడం తప్ప.. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అని ఆత్మ విమర్శన చేసుకోవడం ఎంతైనా అవసరం. 

మీకు టైం ఉంటే .. కనీసం ఈ ఆర్టికల్ ఒకసారైనా చదువండి..

హైదరాబాదులో ఉదయం 6 గంటలకు బయలుదేరిన కృష్ణ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది. అంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 320 కిలోమీటర్లు చేరడానికి 7.30 గంటలు పట్టింది.( ట్రైన్ ప్రయాణాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే జరిగేది ఇదే) సాధారణ ప్రయాణికుడికి గంటకి ఎంత వేగంగా వెళుతుంది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇది అంతా అనవసరం, అతనికి కావాల్సింది కృష్ణ ఎక్స్ప్రెస్ విజయవాడకు ఎన్ని గంటలకు వస్తుంది. అంతే.. అయితే ఒక్కొక్కసారి ట్రైను గంట రెండు, మూడు గంటలు ఆలస్యంగా వస్తుంది. ఒక్కోసారి రద్దు అవుతుంది. ట్రైను ఆలస్యం ఎందుకయింది అని స్టేషన్ మాస్టర్ ని అడిగితే అతను మాత్రం ఏం చెప్తాడు, ట్రైన్ ఆలస్యానికి అతనికి ఏమైనా సంబంధం ఉందా, ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉంటాయి. ట్రైన్ ఇంజన్లో ప్రాబ్లం ఉండొచ్చు, అదే రూట్ లో వేరే ట్రైన్లను ముందుగా పంపొచ్చు, రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉండవచ్చు, వర్షాలు వరదల కారణంగా ఆలస్యం కావచ్చు, ఇలా చాలా కారణాలే ఉంటాయి, ఏది ఏమైనా నాలుగైదు గంటలు ఆలస్యం అయినా చివరకు ట్రైను వస్తుంది, ఆరోజు రద్దు అయితే మరుసటి రోజు వస్తుంది. అలాగని ట్రైన్ ను తిట్టుకున్నంత మాత్రాన ముందుగా వస్తుందా, ఏ సమస్య లేకుంటే సరైన సమయానికి వస్తుంది. సమస్య ఉంటే ఆలస్యం అవుతుంది, అంతేగాని అసలుకే రాకుండా అయితే పోదు కదా, (ఇక్కడ ప్రయాణికుడు చేయవలసింది ఏంటి అంటే దేవుడా ట్రైను సమయానికి వచ్చేలా చేయి అని వేడుకోవడమే తప్ప అతను చేయగలిగేది ఏమీ ఉండదు)
పైన ట్రైన్ సమయాన్ని ఎలాగైతే క్యాలిక్యులేషన్ చేసామో జ్యోతిష్యుడు కూడా గ్రహాల యొక్క గమనాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇస్తే ఆలస్యంగా ఇస్తారా, సరైన సమయంలో ఇస్తారా అనేది చూస్తాడు. గ్రహాలు శుభంగా ఉంటే మంచి ఫలితాలు సమయానికి ఇస్తారు అని చెప్తాడు, గ్రహాలకు దోషాలు ఉంటే ప్రతికూల ఫలితాలు ఇస్తాయి (ఆలస్యంగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు). అని చెబుతాడు, అంతేగాని జ్యోతిష్యుడు వ్యక్తి యొక్క తలరాతను, కర్మ ఫలాన్ని మార్చలేడు. 

యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తినీ హాస్పిటల్ కి తీసుకువెళ్తే , డాక్టరు తన శక్తి వంచన లేకుండా అతన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాడు అంతేకానీ బాగా గాయాలు అయ్యాయి, ఇతడు ఇక బ్రతకడు, అనవసరంగా చికిత్స వృధా అని, సమయం వృధా అని చూడడు కదా, ఒకవేళ చికిత్స చక్కగా జరిగి అతడు కోలుకుంటే, పేషెంట్ తల్లిదండ్రులు, బంధువులు డాక్టర్ని - డాక్టర్ గారు మీరు దేవుడండి మా బాబుని రక్షించారు అని అంటే అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే నాదేముందండి గాడ్ ఈస్ గ్రేట్ అంటాడు. అంతే తప్పించి ఆ క్రెడిట్ ని తను తీసుకోడు. 
పై ఉదాహరణలో ఏ విధంగా అయితే డాక్టరు సహాయం చేశాడో.. జ్యోతిష్యుడు కూడా జాతకుని యొక్క జాతకంలో ఉన్న దోషాలని చెప్పి భయపెట్టకుండా పరిహారాలు (రెమెడీస్) చేయమని చెబుతాడు. తర్వాత వచ్చే ఫలితం దైవాదీనం. త్రికరణశుద్ధిగా భగవంతుని నమ్మి పూజిస్తే మనకున్న ఇబ్బందులను తొలగించి కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. 

   ఈ కలియుగంలో మనుషులకు అన్నీ చేయడానికి సమయం ఉంటుంది ( ఇష్టమైన క్రికెట్ ఆడడానికి, క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, షికార్లు, ఫ్రెండ్స్ తో పార్టీలు, షాపింగ్ లు చేయడానికి టైం ఉంటుంది, ఫోన్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికి టైం ఉంటుంది, రీల్స్ షాట్స్ వీడియోలు చూడడానికి టైం ఉంటుంది ) కానీ భగవంతుని పూజించడానికి మాత్రం సమయం ఉండదు. ఎంతసేపు మనకున్న కష్టాలకు గ్రహాలను, భగవంతుని దూషించడం తప్ప.. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అని ఆత్మ విమర్శన చేసుకోవడం ఎంతైనా అవసరం. 
- ఒక చీమ గోడ ఎక్కుతున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడిన లేచి మళ్లీ ఎక్కుతుంది. తన ప్రయత్నాన్ని మానదు చివరికి గోడ ఎక్కి తీరుతుంది. 

- సాలీడు రాత్రి అంతా కష్టపడి కట్టుకున్న తన గూడు ( Net) మరుసటి రోజుకు తెగిపోయిన మళ్లీ కట్టుకుంటుంది. 

- పల పుష్పాలను ఇచ్చే చెట్లు తమ పళ్ళని పువ్వులని ఇతరులు కోసుకుపోయినా మళ్లీమళ్లీ పువ్వులని పండ్లని ఇస్తూనే ఉంటాయి. 

- తేనెటీగలు రోజంతా కష్టపడి సేకరించిన తేనెను, ఎవరో లాకెళ్ళిన మళ్ళీ తేనె తొట్టెను పేరుస్తాయి. తమ ప్రయత్నాన్ని ఆపవు. 


- జీవితంలో విజయాలను సాధించిన వారు ఒకప్పుడు ఎంతో కష్టపడి, బాధలను అనుభవించి పైకొచ్చిన వారే కానీ, రాత్రికి రాత్రి ఎవరు గొప్పవారు కాలేదు. 

- విజయానికి అడ్డదారులు ఉండవు, కష్టించి పని చేయడం తప్ప

నేను  ఈ మద్యకాలంలో ఒకటి గమనించా.. చాలా మంది జాతకం చెప్పించుకోవడానిక ముందు. మేము చాలా చేసామండి. అయినా మార్పు రాలేదండి.. ఏ పనులు కావడం లేదు అని చెపుతున్నారు. 

- మనకు విజయం (success) అందటం లేదంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో గ్రహించాలి, గ్రహించి సరిదిద్దుకోవాలి. 

- రోగం తగ్గాలంటే (జబ్బు తగ్గేవరకు) మందులు సరిగా వాడాలి. అలాగే జాతకంలో గ్రహదోషాలు పోవాలంటే గ్రహాలకు సరైన పరిహారాలు (remedies) చేయాలి..

- కాలాన్ని (సమయాన్ని) గౌరవించాలి. తొందరపాటు కూడదు, దేవుడైనా.. మనిషి జన్మ ఎత్తాలంటే తల్లి కడుపులో 9 నెలలు ఉండాల్సిందే. నవ మాసాలు మోసాకే తల్లి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. 

- మనం  వేసుకునే బట్టలు రోజు మురికి పడుతాయి.. కొన్ని సందర్భాలలో మరకలు కూడా అంటుకుంటాయి.. బాగా మరక  అంటుకుందనుకోండి.. ఒక సారి ఉతకగానే పోతుందా.. మళ్ళీ మళ్ళీ ఉతుకు తుంటే మరకపోతుంది. ( సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అని మాత్రం అనకండి. అలా అంటే మీ చేసే పరిహారాలు (పూజలు) సర్ఫ ఎక్సెల్ అంత స్గ్రాంగ్ గా ఉండాలి) 

ఒకసారి ఆలోచించండి ..

మన మేమైనా గుడులు కట్టించామా బడులు, సత్రాలు కట్టించామా.. చెరువులు బావులు తవ్వించామా.. పేదవారికి చదువులు (ఆర్థిక సహాయం) చెప్పించామా, అన్నదానం, గోదానం, భూదానం, కన్యాదానం (పేద ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయించడం) చేసామా.. ఎవరికైనా పట్టేడు అన్నం పెట్టి కడుపు నింపామా.. ఒకడి పొట్ట కొట్టడం తప్పించి.. ఏం చేశాం.. దేవాలయాలకు వెళ్తున్నామా.. పుణ్య నది స్నానాలు చేస్తున్నావా.. నోములు వ్రతాలు ఆచరిస్తున్నామా.. యజ్ఞ యాగాలు నిర్వర్తిస్తున్నామా.. పితృ కర్మలు సరిగా చేస్తున్నామా.. అనాధలను, వృద్ధులను, వికలాంగులను చేరదీస్తున్నామా.. వారికి ఇంత సహాయం చేస్తున్నామా.. చెట్లను పెంచుతున్నామా.. పచ్చని చెట్లను కొట్టేస్తున్నాం.. పక్షులకు, జంతువులకు ఆవాసం లేకుండా చేస్తున్నాం.. ఇలా చేస్తే మరి పుణ్యం ఎలా వస్తుంది. ఎక్కడ నుండి వస్తుంది. మనిషి చేసుకున్న పుణ్యమే ప్రతి జన్మలో తనకు తోడుగా వస్తుంది, తనను కాపాడుతూ ఉంటుంది. ( పైన వివరించిన పుణ్య కర్మలను బట్టి జాతకంలో 1, 2, 4, 5 ,9,10 స్థానాలలో శుభగ్రహాలు చేరి పూర్వ పుణ్యాన్ని, భోగభాగ్యాలను అందిస్తారు) 
పుణ్యకార్యాలు చేస్తే మనము దేవుని గురించి వెతకనవసరం లేదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. 
పుణ్యం మాట ఉంచి, అకారణంగానైనా.. కారణంగానైనా ఒకరిని దూషించినా, నిందించిన (వాక్ దోషము), భార్యాభర్తలను, స్నేహితులను విడదీసిన, అప్పులు, రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు గుంచుకున్న, పొలాలు, భూములు లాక్కున్న, పనిచేయించుకుని వేతనము ఇవ్వకున్నా, పదార్థాలకు కల్తీలు నకిలీలు చేసి అమ్మిన, ఇతరుల బాగును చూసి ఓర్వ లేకున్నా, పిల్లలను, మహిళలను, వృద్ధులను, వికలాంగులను, తల్లిదండ్రులను, బలహీనులను హింసించిన, పెద్దలను, గురువులను, దైవాన్ని దూషించిన, పశుపక్షాదులను హింసించిన, చెట్లను అడవులను దహించిన, పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టిన, దొంగతనాలు హత్యలు దోపిడీలు చేసిన ఘోరమైన పాపమును మూట కట్టుకుంటారు, ప్రతి జన్మలో అష్ట కష్టాలు అనుభవిస్తారు. ( పై కర్మలను బట్టి జాతకంలో 3, 7, 11 - 6, 8, 12 స్థానాలలో పాపగ్రహాలు చేరి కర్మ ఫలాన్ని అందిస్తాయి)

చివరగా..

ఎవరి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, కర్మ ఫలం బాగున్న బాగో లేకపోయినా.. మనిషి తన సంకల్ప బలంతో, సానుకూల దృక్పథంతో (positive thinking) నిరాశా నిస్పృహలకు లోను కాకుండా మనసా వాచా భగవంతున్ని నమ్మి నడక సాగించాలి. అప్పుడే విజయాలు అందుకోగలుగుతారు, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 


రచన : 
శ్రీరామ్ మనూహర్ వెన్ను, Astrologer.
B.Sc (PGDCA)
Both Free and Premium Astrology Services
చింతామణి జ్యోతిష్యం, (ప్రశ్నా శాస్త్రం)
Website: https://chintamani.co.in/
Blog: https://chintamani-free-astrology.blogspot.com/
YouTube channel :
https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

For Consultation contact on :
WhatsApp: 903 2686 233
Share:

Sunday, February 18, 2024

శ్రీ గాయత్రి మహా మంత్రములు


ఓం శ్రీ గణేశాయనమః 
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః


ఓం భూర్భువ స్వః
త త్సవితు ర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ !!

సర్వవిజ్ఞాన, శబ్దశాస్త్రముల రహస్యమయాధారముపై గాయత్రీ మహా మంత్రాక్షరముల సంపుటి జరిగింది. ఈ మహామంత్రోచ్ఛారణ మాత్రముచే సూక్ష్మ దేహము నందున్న శక్తికేంద్రములు అనేకములైనవి. స్వయముగా మేలుకొనుచుండును. సూక్ష్మ దేహములోని అంగప్రత్యంగములలో అనేక చక్రోపచక్రాలూ, గ్రంధులూ, మాతృకలూ - ఉపత్యక, మేరుభ్రమరాదిగాగల రహస్య సంస్థానములున్నవి. వీటి వికాసమాత్రముచే సాధారణుడు సైతము అగణిత శక్తులకు అధినేత కాగలుగును. గాయత్రీ పవిత్ర మంత్రోచ్ఛారణా క్రమమును అనుసరించు కంఠము, జిహ్వ, దంతములు, తాలువులు, ఓష్ఠములు, మూర్థము మొదలైన వాటి నుండి గుప్తస్పందనము విశేషముగా జరుగుచుండును. ఏతత్ స్పందనము అనేక శక్తి కేంద్రములను స్మృశించి, వాటి నిద్రావస్థను రూపుమాపి చైతన్యమును కలుగజేయుచుండును. యోగీశ్వరులు, మునీశ్వరులు మొదలైన మహాత్ములు తపస్సు ద్వారా దీర్ఘకాలమున సాధించునట్టి మహా కార్యములను గాయత్రీ మహా మంత్రోపాసకులైన వారు అనతికాల వ్యవధిలోనే సాధించగలుగుచున్నారు.

భగవత్యాధకుల మధ్యగల విశేష దూరమును దూరమొనర్చుటకు చతుర్వింశత్యక్షరయుక్త మగు ఈ గాయత్రీ మహామంత్రమే మహత్తరమైన  దివ్యాధారమైయున్నది. భూతములపై నున్నవారు మెట్ల సహకారముతో మహోన్నత సౌధము నధిరోహించ గలుగునట్లు గాయత్రీ మహా మంత్రోపాసకుడు 24 బీజాక్షరముల సహకారముతో భూమికలను క్రమక్రమముగా దాటుచూ గాయత్రీ మహామాతృ చరణారవింద సన్నిధిని చేరుకొనగలుగును. మహోత్తమమై పరమ పవిత్రమైన గాయత్రీ మహామంత్రములోని ప్రత్యేక బీజాక్షరము ఒక్కొక్క మంత్రసమమై మహత్తర శక్తి సంపన్నమైయున్నది. ఇందు ధర్మశాస్త్రము తేజరిల్లు చున్నది. ఇయ్యక్షరముల వ్యాఖ్యాన మూర్తి అయిన బ్రహ్మదేవుడు వేదచతుష్టయ ప్రచారార్థము మహత్తర తపస్సు చేసెను. ఆ బీజాక్షరముల మహత్తరార్థములను వ్యక్తము చేయవలెనని మహర్షులు ధర్మశాస్త్ర గ్రంథములును ప్రాదుర్భవింప జేసినారు. విశ్వవ్యాప్తమై యున్న విజ్ఞాన సర్వస్వము ఈ 24 బీజాక్షరములలో  నిక్షిప్తమై యున్నది


శ్రీ శివగాయత్రి మంత్రములు

గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి 
తన్నశ్శివః ప్రచోదయాత్ ॥

శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి 
తన్నశ్శివః ప్రచోదయాత్ ॥ 

తన్నహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి 
తన్నశ్శివః ప్రచోదయాత్ ||


గురు గాయత్రి : 
సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి
తన్నో గురుః ప్రచోదయాత్ ॥

శుక్రగాయత్రి : 
భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి 
తన్న శుక్రః ప్రచోదయాత్ ॥ 

శని గాయత్రి : 
రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి 
తన్నశనిః ప్రచోదయాత్॥

రాహు గాయత్రి: 
శీర్షరూపాయవిద్మహే వక్రః పంథాయ ధీమహి 
తన్నరాహుః ప్రచోదయాత్||

కేతు గాయత్రి : 
తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి 
తన్న కేతుః ప్రచోదయాత్||


సూర్య గాయత్రి : 
భాస్కరాయవిద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్న ఆదిత్యః ప్రచోదయాత్ ॥

చంద్ర గాయత్రి : 
అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్! 

కుజ గాయత్రి : 
అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్న కుజః ప్రచోదయా 

బుధ గాయత్రి: చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్న బుధః ప్రచోదయాత్ |

యంత్ర గాయత్రి:
యంత్ర రాజాయ విద్మహే మహా యంత్రాయ ధీమహి
తన్నో యంత్ర ప్రచోదయాత్


మంత్ర గాయత్రి:
మంత్ర రాజాయ విద్మహే
మహా మంత్రాయ ధీమహి
తన్నో మంత్ర : ప్రచోదయాత్

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం:
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి 
తన్నో నాగ: ప్రచోదయాత్
కార్తికేయ విద్మహే వల్లి నాదాయ ధీమహి
తన్నో నాగ: ప్రచోదయాత్

Share:

Saturday, September 30, 2023

వెంకటేశ్వరునికి ముడుపు వేస్తే.. కుబేర కటాక్షమే..!

వెంకటేశ్వరునికి ముడుపు వేస్తే.. కుబేర కటాక్షమే..!

కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎ ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా..? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మ

నం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం. మీరు ముడుపు కట్టే ముం దు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాన్ని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది. ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్లీ ఆరబెట్టి, అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయి పోతుంది. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత 11 రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయి బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో మీ ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి. అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామి వారికి చెప్పుకుంటూ ఆ మూళ్లను వేయాలి. ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతయే నమః అంటూ 21 సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి. మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వరస్వా మిని అష్టోత్తరం ని చదవాలి. 108 గోవింద నామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపు లో ఉన్నటువంటి దనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వరస్వామిని ముడుపు కట్టుకున్నట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభముగా బయటపడవచ్చు. దీంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
Share:

Saturday, July 30, 2022

పరీక్షలలో ప్రథములుగా (1st ర్యాంక్) వచ్చేలా చేసే అద్భుత మహాసరస్వతి మంత్రం

  • శ్రీమహాసరస్వతి మంత్రం
  • ప్రతి ఒక్క విద్యార్థి పఠించవలసిన మంత్రం
  • కేవలం విద్యార్థులే కాక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కొరకు, పోటీ పరీక్షలలో తలపడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రం.
  • పోటీ పరీక్షలలో ప్రథములుగా నిలిపే మంత్రం.

నేటి పరిస్థితలలో ప్రభుత్వ లేదా ప్రయివేటు ఉద్యోగం సాధించాలంటే ఎంతో పోటీని ఎదుర్కొనవలసి ఉంటుంది. అందుకు పోటీ పరీక్షలను (Competitive Exams)  వ్రాయవలసి ఉంటుంది. పోటీ పరీక్షలలో ప్రథమంగా నిలిచినవారికే ఉద్యోగం లభిస్తుంది. ఇలా పోటీ పరీక్షలలోనే కాదు, చదువుకు సంబంధించి ఎలాంటి పరీక్షలలోనైనా ప్రథమంగా నిలిపేలా చేసే అద్భుత మంత్రం శ్రీ మహాసరస్వతి మంత్రం.  ఈ మంత్రాన్ని ప్రతి రోజు.. రాత్రి పడుకొనబోయే ముందు శుచియై 108 సార్లు భక్తి శ్రద్దలతో, నమ్మకంతో జపంచినట్లయితే విద్యార్థలు రాసే అన్ని పరీక్షలలోనే కాక పోటీ పరీక్షలలో కూడా ప్రథములు( ఫస్ట్ క్లాస్) గా వచ్చేలా చేస్తుంది. తద్వారా ఉద్యోగము లభిస్తుంది.

మంత్రాన్ని తెలుసుకోబోయే ముందు ఈ క్రింది వివరణ చదవడం అవసరం. అప్పుడే మంత్ర ప్రయోజనం తెలుస్తుంది.

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.?. చదువుకోకుండా మంత్రాలు జపిస్తే ఫస్ట్ క్లాస్ లో పాసవుతామా..? అని ప్రశ్నించేవారు, వితండ వాదం చేసేవారు లేకపోలేదు. మంత్రాలకు చింకాయలు రాలకపోవచ్చు.. అయితే అలాంటి బావన ఉన్న వాల్లు ఈ మంత్రాన్ని నేర్చుకోకపోవడమే మంచిది. ఎవరికైతే సనాతన ధర్మం, భారతీయ సంప్రదాయాలు, వేదాలు, వేద విద్య మీద, దైవం మీద నమ్మకం ఉంటాయో అలాంటి వారు మాత్రమే ఈ మంత్రాన్ని నేర్చుకోవలసినదిగా మనవి, నమ్మకం లేని వారి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు..

ఒక నది ఆవల సుందరమైన నగరం ఉంది, ఆ నగరంలోకి వెళ్ళిన వారికి అనుకున్నవన్ని దొరుకుతాయి, సుఖసంతోషాలు లభిస్తాయి. ఆనందానికి అంతే ఉండదు.. ఆ నగరంలో కి వెళ్ళినవారికి అన్ని సమృద్దిగా లభిస్తాయి. అయితే ఆ నగరంలోకి వెళ్ళాలంటే ఒక నది దాటవలసి ఉంటుంది. నది దాటడమంటే చిన్న పనా కాదు కదా.. ఈత రావాలి, నదిలో మొసల్లు ఉండవచ్చు, వాటిని ఎదుర్కొనాలి, లేదా తప్పించుకోవాలి. చాలా ప్రయాసపడాలి కదా.. కొందరు ఈత వచ్చినవారు, నది ఈదగలిగిన సామర్థ్యం ఉన్న వారు వారి సామర్థ్యంతో నదిలో ఈది ఒడ్డుకు చేరి నగరాన్నిచేరుకుటుంటారు. మరి ఈత రాని వారు, ఈత వచ్చి ఈదగలిగే సామర్థ్యం లేనివారు వెళ్ళాలంటే ఎలా.. కొంత తెలివిగా ఆలోచిస్తే.. ఆ ఏముందు ఒక పడవ తయారు చేసుకొని అందులో వెలితే సరి అంటారా..? అవును మీ సమాధనం సరియైనదే.. మనం కొంత శ్రమ చేసి దుంగలనో, చెక్కలనో తెచ్చి పడవ తయరు చేసుకోవచ్చ... పడవ తయారు చేయగానే సరిపోతుందా.. పడవను ముందుకు నడపడాకి తెడ్లు కూడా కావాలి కదా... అవి కూడా తయారు చేసుకోవాలి... సరే అవన్నీ తయారు చేసాం పడవ తయారయింది. నీళ్ళలో వేసాం.. పడవలో కూర్చున్నాము. మరి పడవ ముందుకు కదులుతుందా.. కూర్చుంటే కదలదు కాదా... తెడ్లను మనమే ఆడించాలి.. అప్పుడు మాత్రమే పడవ ముందకు సాగుతుంది. మన గమ్యాన్ని అంటే నగరాన్ని చేరుకుంటాం..

ఈ కథంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే...  ఇక్కడ నగరం అంటే ఉద్యోగం (ప్రభుత్వ లేదా ప్రైవేటు). ఉద్యోగం సంపాదించాలంటే మాటలా.. పోటీ పరీక్షలను ఎదుర్కొనాలి. పోటీ పరీక్షలలో గెలవాలంటే బాగా చదవాలి, కష్టపడి చదవాలి, చదివింది జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపక శక్తి ఉండి, చదివే సామర్థ్యం ఉన్నవారు బాగా చదివి ఉద్యోగం సంపాదిస్తారు. కొంత మందికి జన్మతహ భగవంతుడు శక్తిసామర్థ్యాలను, అపారమైన జ్ఞాపక శక్తిని, ప్రతిభను కలుగజేస్తాడు, కొంత పూర్వజన్మ పుణ్యం, సుకృతం వారికి ఉపయోగపడుతుంది. అయితే కొంత మందికి పైన చెప్పిన వారకి వలె అదృష్టం, భగవంతుని సహకారం ఉండదు. పూర్వజన్మలో చేసిన పాపాలు, స్వయంకృతాపరాదాలు, గ్రహచారం వంటివి వాళ్ళను వెనుబడేలా చేస్తాయి.. యుద్దంలో గెలవాలంటే ఆయుధం ఏవిధంగా అవసరమో జీవితంలో గెలవాలంటే మంత్రం అనే ఆయుధం మన వద్ద ఉండాలి. అందకే వాటిని అధిగమించడానికి మంత్ర సాధన అవసరం... మనం కృషితో ఏ విధంగానైతే పడవ తెడ్లను కదిలిస్తూ పడవను నడుపుకుంటూ నదిని దాటుతామో.. ఆ విధంగా మన కృషికి భగవంతుని సహకారం తప్పని సరి.. ఇక్కడ పడవను భగవంతుడు మనుకు చేసే సహాయంగాను,  తెడ్లను భగవంతుని కొలిచే సాధనంగా అంటే మంత్రంగాను భావించాలి. తెడ్లు ఎలా అయితే పడవను ముందుకు కదిలేలా చేసాయో.. మంత్ర జపం భగవంతుడు సహాయపడగలిగేలా చేస్తాయి.. అదీ మంత్ర జపం వల్ల మనకు కలిగే ఫలితం..

చిన్న గమనిక : ఇక్కడ పడవను నడపడానికి తెడ్లను ఎన్ని సార్లు కదిలిస్తామో లెక్కించండి. కొన్ని వందల సార్లో, వేల సార్లో ఉంటాయో కదా... అదే విధంగా మంత్ర జపం కూడా ఒక రోజుకు కనీసం 108 సార్లు జపించాలి. (మనసులో ధ్యానం చేసుకోవాలి) బయటికి పలుక కూడదు. బయటకు వినబడేలా చదివితే అధమం, పెదవులు మాత్రమే కదిలేలా చదివితే మధ్యమము, మనసులో ధ్యానం చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది.

ముఖ్య గమనిక:

మూల మంత్రాన్నిధ్యానం చేయాలంటే ఎవరైనా గురువు ఆ మంత్రాన్ని ఉపదేశించాలి. ఉపదేశం పొందినాకే మంత్ర సాధన చేయాలి. అప్పుడే ఫలితం లభిస్తుంది. నేను మన (chintaamani free Astrology Youtube Channal) ఛానల్లో మంత్రాన్ని పలికి ఉపదేశించాను. నేను మంత్రాన్ని చెపుతున్నపుడు ఏ విధంగా నైతే అంటున్నానో.. నేను అన్నాక.. మీరు కూడా విని అదే విధంగా పలకండి. అలా 3 సార్లు చేయాలి. తద్వారా ఉపదేశం పొందినవారు అవుతారు. తరువాత సాధన చేయండి.  మీరు మంత్రోపదేశం పొందేటపడు కాని ధ్యానం చేసేటపుడు గాని మనసు నిర్మలంగా ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి.

మూల మంత్రం :

ఓం హ్రీం అర్హం నమోకుఠ్ఠ బుద్దినం

ఓం శ్రాం శ్రీం శ్రూం శ్రః హంసం ఠః ఠః ఠః

సరస్వతి భగవతీ విద్యాప్రసాదం కురు కురు స్వాహాః

 --------------------

మీ అందరికి ఆ మహా సరస్వతి అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటూ..

సర్వేజనా సుకినో భవంతుః  సర్వసన్మంగళాని సంతుః లోకా సమస్తా సుఖినోభవంతుః

ఓం శాంతిః శాంతిః శాంతిహీః

--------

-      - మీ శ్రీరాం మనోహర్, జ్యోతిష్యనిపుణులు

-      చింతామణి జ్యోతిష్యం

     Chintaamani Astrology Youtube Channel




Share:

Sunday, April 3, 2022

సరస్వతి దేవి ప్రార్ధన


శ్లో || సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

     విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు మే సదా ॥

    పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణనీ

   నిత్యం పద్మాలయాం దేవీ సా మాం పాతు

   సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా ॥


యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా |

యా వీణా వరదండ మండితికరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా |

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా  ||

దోర్భిర్యుక్తా చతుర్భి: స్ఫటికమణినిభై రక్షమాలాన్దధానా |

హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ |

భాసా కుందేందు శంఖస్పటిక మణి నిభా భాసమానా సమానా |

సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||

సురావరైస్సేవిత పాడపంకజాకరే విరాజత్కమనీయ పుస్తకా |

విరించి పత్నీ కమలాసన  స్థితా సరస్వతీ నృత్యతు వాచిమేసదా  ||


సరస్వతీ సరసిజ కేసర ప్రభఆ తపస్వినీ సితకమలాసనప్రియా |

ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ||

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |

శాంతిరూపే శశిధరే సర్వయోగే నమో నమః |

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః  |

విద్యాధరే విళాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||

శుద్ధస్ఫటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః | 

శబ్దబ్రహ్మి చతుర్ఘస్తే సర్వ సిద్ద్యై నమో నమః ॥ 

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః | 

మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః ॥ 

మనోన్మని మహాభోగే వాగీశ్వరీ నమో నమః | 

వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః || 

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః | 

గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః ॥ 

సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః | 

సంపన్నాయై కుమార్యైచ సర్వజ్ఞేతే నమో నమః ॥ 

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః | 

దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్యై నమో నమః || 

అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః | 

చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః | 

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః | 

అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ॥ 

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః | 

నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ॥ 

పద్మదా పద్మవంశా చ పద్మరూపే నమో నమః | 

పరమేష్ఠ్యై   పరమూర్యై నమస్తే పాప నాశినీ ॥ | 

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః | 

బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మ నార్యై నమో నమః ॥ 

కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః | 

కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ॥ 

సాయం ప్రాతః పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్దిరుచ్యతే || 

చోరవ్యాఘ్ర భయం నాస్తి పఠతాం శృణ్వతామపి ॥ 

ఇత్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకమ్ । 

సర్వసిద్ధి కరం నౄణాం సర్వపాప ప్రణాశనమ్ ॥



Share:

Friday, February 4, 2022

సరస్వతీ దేవి అష్టోత్తర శతనామావళి

సరస్వతీ దేవి అష్టోత్తర శతనామావళి

ॐ సరస్వత్యై నమః । 1
ॐ మహాభద్రాయ నమః । 2
ॐ మహామాయై నమః । 3
ॐ వరప్రదాయై నమః । 4
ॐ శ్రీప్రదాయై నమః । 5
ॐ పద్మనిలయాయ నమః । 6
ॐ పద్మాక్ష్యై నమః । 7
ॐ పద్మవక్త్రాకాయై నమః । 8
ॐ శివానుజాయై నమః । 9
ॐ పుస్తకభృతే నమః । 10

ॐ జ్ఞానముద్రాయై నమః । 11
ॐ రమాయై నమః.  12
ॐ పరాయై నమః.  13
ॐ కామరూపాయై నమః ।  14
ॐ మహావిద్యాయ నమః ।  15
ॐ మహాపాతక నాశిన్యై నమః ।  16
ॐ మహాశ్రయాయ నమః ।  17
ॐ మాలిన్యై నమః ।  18
ॐ మహాభోగాయై నమః ।  19
ॐ మహాభుజాయై నమః ।  20

ॐ మహాభాగాయై నమః. 21
ॐ మహోత్సాహాయై నమః ।  22
ॐ దివ్యాంగాయై నమః ।  23
ॐ సురవన్దితాయై నమః ।  24
ॐ మహాకాళ్యై నమః.  25
ॐ మహాపాశాయై నమః ।  26
ॐ మహాకారాయై నమః.  27
ॐ మహాంకుశాయై నమః ।  28
ॐ పీతాయై నమః ।  29
ॐ విమలాయ నమః ।  30

ॐ విశ్వాయ నమః ।  31
ॐ విద్యున్మాలాయై నమః ।  32
ॐ వైష్ణవ్యై నమః ।  33
ॐ చంద్రికాయై నమః ।  34
ॐ చన్ద్రవదనాయై నమః ।  35
ॐ చంద్రలేఖావిభూషితాయై నమః ।  36
ॐ సావిత్ర్యై నమః ।  37
ॐ సురసాయ నమః ।  38
ॐ దేవ్యై నమః.  39
ॐ దివ్యాలంకారాభూషితాయై నమః ।  40

ॐ వాగ్దేవ్యై నమః ।  41
ॐ వసుధాయై నమః ।  42
ॐ తీవ్రాయై నమః ।  43
ॐ మహాభద్రాయ నమః ।  44
ॐ మహాబలాయై నమః.  45
ॐ భోగదాయై నమః ।  46
ॐ భారత్యై నమః ।  47
ॐ భామాయై నమః.  48
ॐ గోవిందాయై నమః ।  49
ॐ గోమత్యై నమః ।  50

ॐ శివాయ నమః.  51
ॐ జటిలాయై నమః ।  52
ॐ విన్ధ్యావాసాయ నమః ।  53
ॐ విన్ధ్యాచలవిరాజితాయై నమః ।  54
ॐ చండికాయై నమః ।  55
ॐ వైష్ణవ్యై నమః ।  56
ॐ బ్రహ్మయై నమః ।  57
ॐ బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ।  58
ॐ సౌదామిన్యై నమః ।  59
ॐ సుధామూర్త్యై నమః ।  60

ॐ శుభద్రాయై నమః ।  61
ॐ సురపూజితాయై నమః ।  62
ॐ సువాసిన్యై నమః ।  63
ॐ సునాసాయ నమః ।  64
ॐ వినిద్రాయై నమః ।  65
ॐ పద్మలోచనాయై నమః ।  66
ॐ విద్యారూపాయై నమః ।  67
ॐ విశాలక్ష్యై నమః ।  68
ॐ బ్రహ్మజాయై నమః ।  69
ॐ మహాఫలాయ నమః ।  70

ॐ త్రయీమూర్త్యై నమః ।  71
ॐ త్రికాలజ్ఞానై నమః ।  72
ॐ త్రిగుణాయై నమః । 73
ॐ శాస్త్రరూపిణ్యై నమః ।  74
ॐ శుమ్భాసురప్రమథిన్యై నమః ।  75
ॐ శుభదాయై నమః ।  76
ॐ స్వరాత్మికాయై నమః ।  77
ॐ రక్తబీజనిహంత్ర్యై నమః ।  78
ॐ చాముండాయై నమః ।  79
ॐ అంబికాయై నమః ।  80

ॐ ముండకాయప్రహరణాయై నమః ।  81
ॐ ధూమ్రలోచనమర్దనాయై నమః ।  82
ॐ సర్వదేవస్తుతాయై నమః ।  83
ॐ సౌమ్యాయై నమః ।  84
ॐ సురాసుర నమస్కృతాయై నమః ।  85
ॐ కాలరాత్ర్యై నమః ।  86
ॐ కలాధారాయై నమః ।  87
ॐ రూపసౌభాగ్యదాయిన్యై నమః ।  88
ॐ వాగ్దేవ్యై నమః ।  89
ॐ వరారోహాయై నమః ।  90

ॐ వారాహ్యై నమః ।  91
ॐ వారిజాసనాయై నమః ।  92
ॐ చిత్రామ్బరాయై నమః ।  93
ॐ చిత్రగన్ధాయై నమః ।  94
ॐ చిత్రమాల్యవిభూషితాయై నమః ।  95
ॐ కాన్తాయై నమః ।  96
ॐ కామప్రదాయై నమః ।  97
ॐ వన్ద్యాయ నమః ।  98
ॐ విద్యాధరసుపూజితాయై నమః ।  99
ॐ శ్వేతాననాయై నమః ।  100

ॐ నీలభుజాయై నమః ।  101
ॐ చతుర్వర్గఫలప్రదాయై నమః । 102
ॐ చతురానన్ సామ్రాజ్యాయ నమః ।  103
ॐ రక్తమధ్యాయ నమః ।  104
ॐ నిరఞ్జనాయై నమః ।  105
ॐ హంసాసనాయై నమః ।  106
ॐ నీలజఞ్ఘాయై నమః । 107
ॐ బ్రహ్మవిష్ణుశివాన్మికాయై నమః ।  108

॥ ఇతి శ్రీసరస్వతీ అష్టోత్తరశతనామావలీ సమ్పూర్ణా ॥


Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels