ఈ కలియుగంలో మనుషులకు అన్నీ చేయడానికి సమయం ఉంటుంది ( ఇష్టమైన క్రికెట్ ఆడడానికి, క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, షికార్లు, ఫ్రెండ్స్ తో పార్టీలు, షాపింగ్ లు చేయడానికి టైం ఉంటుంది, ఫోన్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికి టైం ఉంటుంది, రీల్స్ షాట్స్ వీడియోలు చూడడానికి టైం ఉంటుంది ) కానీ భగవంతుని పూజించడానికి మాత్రం సమయం ఉండదు. ఎంతసేపు మనకున్న కష్టాలకు గ్రహాలను, భగవంతుని దూషించడం తప్ప.. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అని ఆత్మ విమర్శన చేసుకోవడం ఎంతైనా అవసరం.
మీకు టైం ఉంటే .. కనీసం ఈ ఆర్టికల్ ఒకసారైనా చదువండి..
పైన ట్రైన్ సమయాన్ని ఎలాగైతే క్యాలిక్యులేషన్ చేసామో జ్యోతిష్యుడు కూడా గ్రహాల యొక్క గమనాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఇస్తే ఆలస్యంగా ఇస్తారా, సరైన సమయంలో ఇస్తారా అనేది చూస్తాడు. గ్రహాలు శుభంగా ఉంటే మంచి ఫలితాలు సమయానికి ఇస్తారు అని చెప్తాడు, గ్రహాలకు దోషాలు ఉంటే ప్రతికూల ఫలితాలు ఇస్తాయి (ఆలస్యంగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు). అని చెబుతాడు, అంతేగాని జ్యోతిష్యుడు వ్యక్తి యొక్క తలరాతను, కర్మ ఫలాన్ని మార్చలేడు.
యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తినీ హాస్పిటల్ కి తీసుకువెళ్తే , డాక్టరు తన శక్తి వంచన లేకుండా అతన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాడు అంతేకానీ బాగా గాయాలు అయ్యాయి, ఇతడు ఇక బ్రతకడు, అనవసరంగా చికిత్స వృధా అని, సమయం వృధా అని చూడడు కదా, ఒకవేళ చికిత్స చక్కగా జరిగి అతడు కోలుకుంటే, పేషెంట్ తల్లిదండ్రులు, బంధువులు డాక్టర్ని - డాక్టర్ గారు మీరు దేవుడండి మా బాబుని రక్షించారు అని అంటే అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడంటే నాదేముందండి గాడ్ ఈస్ గ్రేట్ అంటాడు. అంతే తప్పించి ఆ క్రెడిట్ ని తను తీసుకోడు.
పై ఉదాహరణలో ఏ విధంగా అయితే డాక్టరు సహాయం చేశాడో.. జ్యోతిష్యుడు కూడా జాతకుని యొక్క జాతకంలో ఉన్న దోషాలని చెప్పి భయపెట్టకుండా పరిహారాలు (రెమెడీస్) చేయమని చెబుతాడు. తర్వాత వచ్చే ఫలితం దైవాదీనం. త్రికరణశుద్ధిగా భగవంతుని నమ్మి పూజిస్తే మనకున్న ఇబ్బందులను తొలగించి కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు.
ఈ కలియుగంలో మనుషులకు అన్నీ చేయడానికి సమయం ఉంటుంది ( ఇష్టమైన క్రికెట్ ఆడడానికి, క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, టీవీ సీరియల్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, షికార్లు, ఫ్రెండ్స్ తో పార్టీలు, షాపింగ్ లు చేయడానికి టైం ఉంటుంది, ఫోన్ లో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడానికి టైం ఉంటుంది, రీల్స్ షాట్స్ వీడియోలు చూడడానికి టైం ఉంటుంది ) కానీ భగవంతుని పూజించడానికి మాత్రం సమయం ఉండదు. ఎంతసేపు మనకున్న కష్టాలకు గ్రహాలను, భగవంతుని దూషించడం తప్ప.. మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అని ఆత్మ విమర్శన చేసుకోవడం ఎంతైనా అవసరం.
- ఒక చీమ గోడ ఎక్కుతున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడిన లేచి మళ్లీ ఎక్కుతుంది. తన ప్రయత్నాన్ని మానదు చివరికి గోడ ఎక్కి తీరుతుంది.
- సాలీడు రాత్రి అంతా కష్టపడి కట్టుకున్న తన గూడు ( Net) మరుసటి రోజుకు తెగిపోయిన మళ్లీ కట్టుకుంటుంది.
- పల పుష్పాలను ఇచ్చే చెట్లు తమ పళ్ళని పువ్వులని ఇతరులు కోసుకుపోయినా మళ్లీమళ్లీ పువ్వులని పండ్లని ఇస్తూనే ఉంటాయి.
- తేనెటీగలు రోజంతా కష్టపడి సేకరించిన తేనెను, ఎవరో లాకెళ్ళిన మళ్ళీ తేనె తొట్టెను పేరుస్తాయి. తమ ప్రయత్నాన్ని ఆపవు.
- జీవితంలో విజయాలను సాధించిన వారు ఒకప్పుడు ఎంతో కష్టపడి, బాధలను అనుభవించి పైకొచ్చిన వారే కానీ, రాత్రికి రాత్రి ఎవరు గొప్పవారు కాలేదు.
- విజయానికి అడ్డదారులు ఉండవు, కష్టించి పని చేయడం తప్ప
నేను ఈ మద్యకాలంలో ఒకటి గమనించా.. చాలా మంది జాతకం చెప్పించుకోవడానిక ముందు. మేము చాలా చేసామండి. అయినా మార్పు రాలేదండి.. ఏ పనులు కావడం లేదు అని చెపుతున్నారు.
- మనకు విజయం (success) అందటం లేదంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో గ్రహించాలి, గ్రహించి సరిదిద్దుకోవాలి.
- రోగం తగ్గాలంటే (జబ్బు తగ్గేవరకు) మందులు సరిగా వాడాలి. అలాగే జాతకంలో గ్రహదోషాలు పోవాలంటే గ్రహాలకు సరైన పరిహారాలు (remedies) చేయాలి..
- కాలాన్ని (సమయాన్ని) గౌరవించాలి. తొందరపాటు కూడదు, దేవుడైనా.. మనిషి జన్మ ఎత్తాలంటే తల్లి కడుపులో 9 నెలలు ఉండాల్సిందే. నవ మాసాలు మోసాకే తల్లి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది.
- మనం వేసుకునే బట్టలు రోజు మురికి పడుతాయి.. కొన్ని సందర్భాలలో మరకలు కూడా అంటుకుంటాయి.. బాగా మరక అంటుకుందనుకోండి.. ఒక సారి ఉతకగానే పోతుందా.. మళ్ళీ మళ్ళీ ఉతుకు తుంటే మరకపోతుంది. ( సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా అని మాత్రం అనకండి. అలా అంటే మీ చేసే పరిహారాలు (పూజలు) సర్ఫ ఎక్సెల్ అంత స్గ్రాంగ్ గా ఉండాలి)
ఒకసారి ఆలోచించండి ..
మన మేమైనా గుడులు కట్టించామా బడులు, సత్రాలు కట్టించామా.. చెరువులు బావులు తవ్వించామా.. పేదవారికి చదువులు (ఆర్థిక సహాయం) చెప్పించామా, అన్నదానం, గోదానం, భూదానం, కన్యాదానం (పేద ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయించడం) చేసామా.. ఎవరికైనా పట్టేడు అన్నం పెట్టి కడుపు నింపామా.. ఒకడి పొట్ట కొట్టడం తప్పించి.. ఏం చేశాం.. దేవాలయాలకు వెళ్తున్నామా.. పుణ్య నది స్నానాలు చేస్తున్నావా.. నోములు వ్రతాలు ఆచరిస్తున్నామా.. యజ్ఞ యాగాలు నిర్వర్తిస్తున్నామా.. పితృ కర్మలు సరిగా చేస్తున్నామా.. అనాధలను, వృద్ధులను, వికలాంగులను చేరదీస్తున్నామా.. వారికి ఇంత సహాయం చేస్తున్నామా.. చెట్లను పెంచుతున్నామా.. పచ్చని చెట్లను కొట్టేస్తున్నాం.. పక్షులకు, జంతువులకు ఆవాసం లేకుండా చేస్తున్నాం.. ఇలా చేస్తే మరి పుణ్యం ఎలా వస్తుంది. ఎక్కడ నుండి వస్తుంది. మనిషి చేసుకున్న పుణ్యమే ప్రతి జన్మలో తనకు తోడుగా వస్తుంది, తనను కాపాడుతూ ఉంటుంది. ( పైన వివరించిన పుణ్య కర్మలను బట్టి జాతకంలో 1, 2, 4, 5 ,9,10 స్థానాలలో శుభగ్రహాలు చేరి పూర్వ పుణ్యాన్ని, భోగభాగ్యాలను అందిస్తారు)
పుణ్యకార్యాలు చేస్తే మనము దేవుని గురించి వెతకనవసరం లేదు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు.
పుణ్యం మాట ఉంచి, అకారణంగానైనా.. కారణంగానైనా ఒకరిని దూషించినా, నిందించిన (వాక్ దోషము), భార్యాభర్తలను, స్నేహితులను విడదీసిన, అప్పులు, రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు గుంచుకున్న, పొలాలు, భూములు లాక్కున్న, పనిచేయించుకుని వేతనము ఇవ్వకున్నా, పదార్థాలకు కల్తీలు నకిలీలు చేసి అమ్మిన, ఇతరుల బాగును చూసి ఓర్వ లేకున్నా, పిల్లలను, మహిళలను, వృద్ధులను, వికలాంగులను, తల్లిదండ్రులను, బలహీనులను హింసించిన, పెద్దలను, గురువులను, దైవాన్ని దూషించిన, పశుపక్షాదులను హింసించిన, చెట్లను అడవులను దహించిన, పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టిన, దొంగతనాలు హత్యలు దోపిడీలు చేసిన ఘోరమైన పాపమును మూట కట్టుకుంటారు, ప్రతి జన్మలో అష్ట కష్టాలు అనుభవిస్తారు. ( పై కర్మలను బట్టి జాతకంలో 3, 7, 11 - 6, 8, 12 స్థానాలలో పాపగ్రహాలు చేరి కర్మ ఫలాన్ని అందిస్తాయి)
చివరగా..
ఎవరి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, కర్మ ఫలం బాగున్న బాగో లేకపోయినా.. మనిషి తన సంకల్ప బలంతో, సానుకూల దృక్పథంతో (positive thinking) నిరాశా నిస్పృహలకు లోను కాకుండా మనసా వాచా భగవంతున్ని నమ్మి నడక సాగించాలి. అప్పుడే విజయాలు అందుకోగలుగుతారు, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
రచన :
శ్రీరామ్ మనూహర్ వెన్ను, Astrologer.
B.Sc (PGDCA)
Both Free and Premium Astrology Services
చింతామణి జ్యోతిష్యం, (ప్రశ్నా శాస్త్రం)
Website: https://chintamani.co.in/
Blog: https://chintamani-free-astrology.blogspot.com/
YouTube channel :
https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
For Consultation contact on :
WhatsApp: 903 2686 233
Comments
Post a Comment