chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Wednesday, April 14, 2021

Simharashi Vari Palitalu-2021-22 (సింహరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Simha)

 సింహరాశి ఫలితాలు:

నక్షత్రాలుం : మఘ: 1,2,3,4 పాదాలు, పుబ్బ: 1, 2, 3,4 పాదాలు, ఉత్తరం: 1వ పాదం
నామ నక్షత్రాలు : మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే

ఆధాయం :  02 వ్యయం : 14 రాజపూజ్యం : 2 అవమానం : 2

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(7లో)
(6లో)
(10లో)
 (4లో)

ఫలితాలు:
  1. సింహ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో మానవీయ కోణంలో మీరు గడుపుతున్న జీవితం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది.

  2. ఎంతో కాలంగా నడుస్తున్న కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి.

  3. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి బదిలీ వంటివి సంభవిస్తాయి. కార్యాలయంలో మీ స్థాయి స్థానం పదిలంగా ఉంటుంది. పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది.

  4. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి.

  5. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగప్రయత్నాలు ఫలితాలను అందిస్తాయి.

  6. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు.

  7. పోటీ పరీక్షకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ గౌరవం నిలబెడతారు. తల్లిదండ్రుల సంతోషానికి కారణం అవుతారు.

  8. ఉపాధ్యాయ వృత్తిలో, విద్యా సంస్థల నిర్వహణలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తారు లభిస్తాయి.

  9. సినిమా రంగాల వారికి అన్ని విధాలా కష్టకాలం. చిత్ర కళాకారులకు, డిజైనింగ్ చేసే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేసి వ్యాపారం చేస్తారు.

  10. భూ సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. మీ అంచనాలకు సరిపోతాయి.

  11. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు.

  12. ఇతరులతో సంప్రదించకుండా దైవం పైన భారం వేసి సొంత నిర్ణయాలు తీసుకుంటారు.

  13. సంవత్సర ద్వితీయార్ధంలో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. జీర్ణకోశం పనితీరు మెరుగుపడుతుంది.

  14. మీకు ఉపయోగపడే పత్రాలు డాక్యుమెంట్ అనూహ్యంగా మీ చేతికి అందుతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

  15. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి.

  16. చాలాకాలంగా వివాహం కాక ఇక వివాహం కాదు అనుకునే సమయంలో ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వివాహం అవుతుంది. 

  17. స్వగృహం కల నెరవేరుతుంది. రుణాలు తీరుస్తారు. 

  18. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

  19. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు

  20. స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తున్నాయి సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి.

  21. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందుతారు. అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి.

  22. మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది.


స్త్రీలకు: 


  1. సింహ రాశి లో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 

  2. క్రీడా రంగంలో అవార్డు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి.

  3. అలంకార సంబంధ బ్యూటీపార్లర్ కు సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి.

  4. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వీసా లభిస్తుంది. గ్రీన్కార్డు కూడా లభిస్తుంది.

  5. మనోధైర్యం, మానసిక ఉత్సాహం కలుగుతుంది .

  6. సాంకేతిక విద్యా రంగాల్లో రాణిస్తారు.

  7. సన్నిహితులతో, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.

  8. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మోకాళ్లనొప్పులు వైరస్ వల్ల గుండె ఆరోగ్యం చికాకు పరుస్తుంది.

  9. ప్రేమ వివాహాలు సఫలం కావు,

  10. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

  11. మీ వ్యక్తిగత విషయాల్లో విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.

  12. మాటకన్నా వృత్తి ఉద్యోగాల పట్ల నిబద్ధత కట్టుబడి ఉంటారు.

         
ధరించవలసని రత్నం: మాణిక్యం (కెంపు) (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మఘ: వైడూర్యం, పుబ్బ: వజ్రం, ఉత్తరం: కెంపు)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: రుధ్రుడు (శివుడు) స్తోత్రములు
చేయవలసిన ధానం: గోదుమలు లేదా గోదుమలతో చేసిన పదార్థాలు, పిండివంటలు


-------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
-------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, 
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darmasandehalu, 
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in



Share:

Karkatakarashi Vari Rashi Palam - 2021-22 (Karkatakam కర్కాటరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Karkataka)

 కర్కాటరాశి ఫలితాలు:

నక్షత్రాలుం : పునర్వసు: 4వ పాదాం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష : 1, 2, 3, 4 పాదాలు
నామ నక్షత్రాలు : హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో

ఆధాయం :  14 వ్యయం : 02 రాజపూజ్యం : 6 అవమానం : 6

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(8లో)
(7లో)
(11లో)
 (5లో)

ఫలితాలు:
  1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య ఆర్థిక సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు సన్నిహితులు అండగా ఉంటారు.

  2. రాజకీయ జీవితంలో ఒడి దుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతోంది.

  3. సంతాన పురోగతికి కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు బలపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

  4. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పై అధికారుల మన్ననలను పొందుతారు.

  5. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. రుణంగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది.

  6. బంగారం, భూములు వంటివి కొనుగోలు కలిసివస్తుంది.

  7. కోర్టు వ్యవహారాలు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దాని వలన కొంత ఊరట కలుగుతుంది.

  8. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఒత్తిడి  ఉంటుంది. ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు.

  9. క్రయ విక్రయాలు కొనుగోళ్లలో జాగ్రత్త వహించడం అవసరం.

  10. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కంటి సంబంధ సమస్యల తో బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

  11. నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు.

  12. కొద్ది పెట్టుబడితో చేసే వ్యాపారం లో ఎక్కువ లాభాలు సాధిస్తారు. పొదుపు పథకాలను ప్రారంభించి ధనాన్ని ఆచితూచి ఖర్చు పెడతారు.

  13. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకొని పనులు పూర్తి చేయగలుగుతారు.

  14. రాజకీయ సాహిత్య కళ సాంస్కృతిక రంగాల వారికి అనుకూలం.

  15. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దు.

  16. వివాహ పునర్ వివాహ ప్రయత్నాలు సఫలమౌతాయి.

  17. క్రీడా రంగంలోని వారికి క్యాతి లభిస్తుంది.

  18. ఆర్థికంగా అదనపు భారం, ఆకస్మిక భారం తప్పకపోవచ్చు, రుణాలు చేస్తారు.

  19. ప్రేమ వివాహాది విషయాలలో సంయమనం పాటించండి మేలు జరుగుతుంది.

  20. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారులకు అనుకూలం.

  21. విలువైన పత్రాలు బంగారం ఆభరణాల పట్ల జాగ్రత్త అవసరం.

  22. సంవత్సరంలో ద్వితీయార్థం ఆర్ధికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి.

  23. విజయవంతం అయ్యే ప్రతి పనికి ఆటంకాలు కలుగుతాయి. స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి మధ్యస్తంగా లభిస్తాయి.

  24. ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది.

  25. బదిలీలు విదేశీ ఉద్యోగం విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్సాహంతో ముందుకు వెళ్దామని ఎంత ప్రయత్నించినా వెనక్కి లాగే వారు అధికము అవుతారు.

  2. కళ సాంస్కృతిక రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది, బ్యూటీ పార్లర్ లు నడిపే వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

  3. వివాహ విషయంలో  సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగు వేయాలి.

  4. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు.

  5. వ్యాపార పరంగా వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

  6. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  7. భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

  8. ప్రభుత్వ సంబంధ పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. రెండవ ప్రయత్నంలో సానుకూల పరిణామాలు కలుగుతాయి.


ధరించవలసని రత్నం: ముత్యం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (పునర్వసు: కనకపుష్యరాగం, పుష్యమి: నీలం, ఆశ్లేష :పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: జగన్మాత (పార్వతీదేవి) స్తోత్రములు
చేయవలసిన ధానం: బియ్యం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Midhunarashi Vari Rashipalalu-2021-22 (మిధునరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Midunam)

 మిధునరాశి ఫలితాలు:

నక్షత్రాలు : మృగశిర: 3, 4 పాదాలు, ఆరుద్ర : 4 పాదాలు, పునర్వసు: 1, 2, 3 పాదాలు
నామ నక్షత్రాలు : కా, కీ, కూ, ఖం, జ, చ, కే, కో, హ

ఆధాయం :  05 వ్యయం : 05 రాజపూజ్యం : 03 అవమానం : 06

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(9లో)
(8లో)
(12లో)
 (6లో)

ఫలితాలు:
  1. మిధున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులు అభివృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు.

  2. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.

  3. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. భాగస్వాములు నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు.

  4. విద్యార్ధులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ పరువు ప్రతిష్టలు పెంచుతారు.

  5. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సంస్థల పరంగా రావలసిన పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. వ్యాపారంలో రొటేషన్ ఇబ్బంది ఉండదు.

  6. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.

  7. ఏ పనికి హామీ పదడ వద్దు, మధ్యవర్తి సంతకాలు చేయవద్దు.

  8. రాజకీయ రంగాల వారికి అనుకూలం.

  9. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడిన వాటిని  ఏదోవిధంగా అధిగమిస్తారు.

  10.  నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి.

  11. స్త్రీల వల్ల లాభం చేకూరుతుంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మీ కోరికలను వారు ఆమోదిస్తారు.

  12. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోష పరుస్తాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.

  13. చట్ట పరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

  14. దూరప్రాంత విద్య ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు, ఆదాయానికి మించి ఖర్చులు ఇబ్బందులు పెడతాయి. ఆడంబరాలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

  15. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కంటి సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.మనో నిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు.

  16. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ టాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం.

  17. పత్రికల వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల లాభపడతారు. సాహస నిర్ణయాలు అనుకూలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.

  18. సంవత్సర ద్వితీయార్ధంలో పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. ఆ థనాన్ని వ్యాపారంలో రహస్యంగా పెట్టుబడి పెడతారు.

  19. ఆహార ధాన్యాల వ్యాపారం లభిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు సంతృప్తికరంగా ఉండవు.

  20. స్త్రీలతో వివాదాస్పద అంశాలు సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఫలించవు.

  21. స్థిరాస్తి కొనుగోలు, భూముల కొనుగోలు కలిసివస్తుంది.

  22. మారుతున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మీ వ్యూహాన్ని మార్చుకుంటారు.


స్త్రీలకు: 

  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బావుంది. ఉన్నత విధ్యలకు ఎంపికవుతారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

  2. ప్రేమ సంబంధం వ్యవహారాలన్నీ మోసమని గ్రహిస్తారు.

  3. క్రీడ సాంస్కృతిక రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది.

  4. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కల నెరవేరుతుంది. 

  5. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  6. ఉద్యోగంలో బాధ్యతలు అధికారం పెరుగుతాయి. రాజకీయ జీవితం బాగుంటుంది.

  7. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి రుణం తీర్చు కుంటారు. 

  8. విడిపోవాలి అనుకున్న వారితో శాశ్వతంగా విడిపోతారు.

  9. ఉద్యోగావకాశాలకు సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి, వాటిని అధిగమించగలరు తారు.

  10. ఆదాయ వ్యయాలకు సంబంధించిన పుస్తకాలు భద్రపరచండి.

  11. సంతాన పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు ముడిపడతాయి. 

  12.  మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రతిష్ఠాత్మక ఉద్యోగం లభిస్తుంది.

  13. సంవత్సరంలో ద్వితీయార్థం కొత్త పంథాలో నడుస్తుంది. కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు.

  14. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.

  15. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన జనాదరణ లభిస్తుంది లభిస్తుంది, తద్వారా ధనప్రాప్తి

  16.  వ్యాపార సంబంధ విషయాలు చాలా బాగుంటాయి.

  17. తెలివిగా ఆలోచించి అన్ని సమస్యలను అధిగమిస్తారు. అందరి మన్ననలను పొందగలుగుతారు.

  18. ఆధ్యాత్మిక చింతనతో, ధ్యానంతో భగవంతుని ఆరాధించడం వలన మీకు ఎదురయ్యే పరీక్షల్ని అవలీలగా అధిగమిస్తారు.


గమనిక: అష్టమ శని నడుస్తున్నది. కావున శని గ్రహ సంబంధ దోషనివారణలు పాఠించండి. లేదా దాష్ట నివారణ పద్దతులకు కొరకు మమ్మల్ని సంప్రదించండి.


ధరించవలసని రత్నం: పచ్చ (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మృగశిర: పగడం, ఆరుద్ర : గోమేధికం, పునర్వసు: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: శ్రీమహావిష్ణువు (నారాయణుడు)
చేయవలసిన ధానం: పెసర్లు లేదా పెసర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels