Karkatakarashi Vari Rashi Palam - 2021-22 (Karkatakam కర్కాటరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Karkataka)

 కర్కాటరాశి ఫలితాలు:

నక్షత్రాలుం : పునర్వసు: 4వ పాదాం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష : 1, 2, 3, 4 పాదాలు
నామ నక్షత్రాలు : హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో

ఆధాయం :  14 వ్యయం : 02 రాజపూజ్యం : 6 అవమానం : 6

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(8లో)
(7లో)
(11లో)
 (5లో)

ఫలితాలు:
  1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విద్య ఆర్థిక సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు సన్నిహితులు అండగా ఉంటారు.

  2. రాజకీయ జీవితంలో ఒడి దుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతోంది.

  3. సంతాన పురోగతికి కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు బలపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

  4. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి పై అధికారుల మన్ననలను పొందుతారు.

  5. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. రుణంగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది.

  6. బంగారం, భూములు వంటివి కొనుగోలు కలిసివస్తుంది.

  7. కోర్టు వ్యవహారాలు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దాని వలన కొంత ఊరట కలుగుతుంది.

  8. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఒత్తిడి  ఉంటుంది. ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు.

  9. క్రయ విక్రయాలు కొనుగోళ్లలో జాగ్రత్త వహించడం అవసరం.

  10. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కంటి సంబంధ సమస్యల తో బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

  11. నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు.

  12. కొద్ది పెట్టుబడితో చేసే వ్యాపారం లో ఎక్కువ లాభాలు సాధిస్తారు. పొదుపు పథకాలను ప్రారంభించి ధనాన్ని ఆచితూచి ఖర్చు పెడతారు.

  13. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకొని పనులు పూర్తి చేయగలుగుతారు.

  14. రాజకీయ సాహిత్య కళ సాంస్కృతిక రంగాల వారికి అనుకూలం.

  15. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దు.

  16. వివాహ పునర్ వివాహ ప్రయత్నాలు సఫలమౌతాయి.

  17. క్రీడా రంగంలోని వారికి క్యాతి లభిస్తుంది.

  18. ఆర్థికంగా అదనపు భారం, ఆకస్మిక భారం తప్పకపోవచ్చు, రుణాలు చేస్తారు.

  19. ప్రేమ వివాహాది విషయాలలో సంయమనం పాటించండి మేలు జరుగుతుంది.

  20. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారులకు అనుకూలం.

  21. విలువైన పత్రాలు బంగారం ఆభరణాల పట్ల జాగ్రత్త అవసరం.

  22. సంవత్సరంలో ద్వితీయార్థం ఆర్ధికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి.

  23. విజయవంతం అయ్యే ప్రతి పనికి ఆటంకాలు కలుగుతాయి. స్పెక్యులేషన్ షేర్లు మొదలైనవి మధ్యస్తంగా లభిస్తాయి.

  24. ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది.

  25. బదిలీలు విదేశీ ఉద్యోగం విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.


స్త్రీలకు:


  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్సాహంతో ముందుకు వెళ్దామని ఎంత ప్రయత్నించినా వెనక్కి లాగే వారు అధికము అవుతారు.

  2. కళ సాంస్కృతిక రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది, బ్యూటీ పార్లర్ లు నడిపే వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

  3. వివాహ విషయంలో  సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగు వేయాలి.

  4. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు.

  5. వ్యాపార పరంగా వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

  6. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  7. భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

  8. ప్రభుత్వ సంబంధ పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. రెండవ ప్రయత్నంలో సానుకూల పరిణామాలు కలుగుతాయి.


ధరించవలసని రత్నం: ముత్యం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (పునర్వసు: కనకపుష్యరాగం, పుష్యమి: నీలం, ఆశ్లేష :పచ్చ)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: జగన్మాత (పార్వతీదేవి) స్తోత్రములు
చేయవలసిన ధానం: బియ్యం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Comments