chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Wednesday, April 14, 2021

Midhunarashi Vari Rashipalalu-2021-22 (మిధునరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Midunam)

 మిధునరాశి ఫలితాలు:

నక్షత్రాలు : మృగశిర: 3, 4 పాదాలు, ఆరుద్ర : 4 పాదాలు, పునర్వసు: 1, 2, 3 పాదాలు
నామ నక్షత్రాలు : కా, కీ, కూ, ఖం, జ, చ, కే, కో, హ

ఆధాయం :  05 వ్యయం : 05 రాజపూజ్యం : 03 అవమానం : 06

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(9లో)
(8లో)
(12లో)
 (6లో)

ఫలితాలు:
  1. మిధున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులు అభివృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు.

  2. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు.

  3. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. భాగస్వాములు నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు.

  4. విద్యార్ధులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ పరువు ప్రతిష్టలు పెంచుతారు.

  5. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ సంస్థల పరంగా రావలసిన పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. వ్యాపారంలో రొటేషన్ ఇబ్బంది ఉండదు.

  6. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి.

  7. ఏ పనికి హామీ పదడ వద్దు, మధ్యవర్తి సంతకాలు చేయవద్దు.

  8. రాజకీయ రంగాల వారికి అనుకూలం.

  9. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడిన వాటిని  ఏదోవిధంగా అధిగమిస్తారు.

  10.  నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి.

  11. స్త్రీల వల్ల లాభం చేకూరుతుంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మీ కోరికలను వారు ఆమోదిస్తారు.

  12. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోష పరుస్తాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు పట్టుదలతో పూర్తి చేస్తారు.

  13. చట్ట పరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

  14. దూరప్రాంత విద్య ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు, ఆదాయానికి మించి ఖర్చులు ఇబ్బందులు పెడతాయి. ఆడంబరాలకు డబ్బు వృధా ఖర్చు చేస్తారు.

  15. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కంటి సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.మనో నిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు.

  16. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇన్కమ్ టాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం.

  17. పత్రికల వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల లాభపడతారు. సాహస నిర్ణయాలు అనుకూలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.

  18. సంవత్సర ద్వితీయార్ధంలో పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. ఆ థనాన్ని వ్యాపారంలో రహస్యంగా పెట్టుబడి పెడతారు.

  19. ఆహార ధాన్యాల వ్యాపారం లభిస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు సంతృప్తికరంగా ఉండవు.

  20. స్త్రీలతో వివాదాస్పద అంశాలు సర్దుబాటు చేసే ప్రయత్నాలు ఫలించవు.

  21. స్థిరాస్తి కొనుగోలు, భూముల కొనుగోలు కలిసివస్తుంది.

  22. మారుతున్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మీ వ్యూహాన్ని మార్చుకుంటారు.


స్త్రీలకు: 

  1. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బావుంది. ఉన్నత విధ్యలకు ఎంపికవుతారు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

  2. ప్రేమ సంబంధం వ్యవహారాలన్నీ మోసమని గ్రహిస్తారు.

  3. క్రీడ సాంస్కృతిక రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది.

  4. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కల నెరవేరుతుంది. 

  5. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

  6. ఉద్యోగంలో బాధ్యతలు అధికారం పెరుగుతాయి. రాజకీయ జీవితం బాగుంటుంది.

  7. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి రుణం తీర్చు కుంటారు. 

  8. విడిపోవాలి అనుకున్న వారితో శాశ్వతంగా విడిపోతారు.

  9. ఉద్యోగావకాశాలకు సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి, వాటిని అధిగమించగలరు తారు.

  10. ఆదాయ వ్యయాలకు సంబంధించిన పుస్తకాలు భద్రపరచండి.

  11. సంతాన పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు ముడిపడతాయి. 

  12.  మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రతిష్ఠాత్మక ఉద్యోగం లభిస్తుంది.

  13. సంవత్సరంలో ద్వితీయార్థం కొత్త పంథాలో నడుస్తుంది. కొత్త వ్యక్తులు జీవితంలో ప్రవేశిస్తారు.

  14. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.

  15. పరిస్థితుల ప్రభావం వలన విశేషమైన జనాదరణ లభిస్తుంది లభిస్తుంది, తద్వారా ధనప్రాప్తి

  16.  వ్యాపార సంబంధ విషయాలు చాలా బాగుంటాయి.

  17. తెలివిగా ఆలోచించి అన్ని సమస్యలను అధిగమిస్తారు. అందరి మన్ననలను పొందగలుగుతారు.

  18. ఆధ్యాత్మిక చింతనతో, ధ్యానంతో భగవంతుని ఆరాధించడం వలన మీకు ఎదురయ్యే పరీక్షల్ని అవలీలగా అధిగమిస్తారు.


గమనిక: అష్టమ శని నడుస్తున్నది. కావున శని గ్రహ సంబంధ దోషనివారణలు పాఠించండి. లేదా దాష్ట నివారణ పద్దతులకు కొరకు మమ్మల్ని సంప్రదించండి.


ధరించవలసని రత్నం: పచ్చ (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (మృగశిర: పగడం, ఆరుద్ర : గోమేధికం, పునర్వసు: కనకపుష్యరాగం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: శ్రీమహావిష్ణువు (నారాయణుడు)
చేయవలసిన ధానం: పెసర్లు లేదా పెసర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Monday, April 12, 2021

Vrushabharashi Vari Palitalu-2021-22 (వృశభరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Vrushabam)

 వృశభరాశి ఫలితాలు:

నక్షత్రాలు : కృత్తిక : 2, 3, 4 పాదాలు, రోహిణి: 4 పాదాలు, మృగశిర: 1, 2 పాదాలు
నామ నక్షత్రాలు : ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వె, వో

ఆధాయం :  02 వ్యయం : 08 రాజపూజ్యం : 07 అవమానం : 03

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(10లో)
(9లో)
(1లో)
 (7లో)

ఫలితాలు:
  1. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది, ఆర్థికంగా పుంజుకుంటారు.

  2. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది.

దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

  1. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి.

  2. ఆర్థిక సహాయం అందుతుంది.

  3. రాజకీయాలలో ఉన్నవారికి ఊహించని విధంగా పదివి ప్రాప్తి కలుగుతుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాల చిరకాల వాంఛ నెరవేరుతుంది ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం, శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటిలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఐఏఎస్, ఐపిఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపికవుతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.

  4. వ్యాపార రంగంలో వారికి బాగుంటుంది. రొటేషన్ పెరుగుతుంది, లాభాలు బాగుంటాయి. నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం అవుతుంది.

  5. కాంట్రాక్టులు, లీజులు మీకు  లాభిస్తాయి. వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరుచుకొంటారు.

  6. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాలకు నూటికి 90% కాలం బాగుంది. గనులు, ఇసుక  సంబంధించిన వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి.

  7. కలలు, సాహిత్య సాంస్కృతిక రంగాల వారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు,బిరుదులు లభిస్తాయి.

  8. కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి.

  9. క్రమశిక్షణతో పొదుపు చేసి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తారు.

  10. స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది. వ్యసనాలకు ధనం పెట్టుబడి పెడతారు. బెట్టింగ్లు, కోడిపందాలు పేకాటకు దూరంగా ఉండండి.

  11. వివాహ సంబంధ విషయాల్లో కొంత మానసిక సంఘర్షణకు గురి అవుతారు. చివరకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

  12. చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేసే అవకాశం ఉంది. సామాన్యుడి చేతిలో మోసపోయి అవకాశం ఉంది.  స్త్రీల విషయంలో జాగ్రత్త అవసరం.

  13. ఇష్టమైన స్వగృహాని ఏర్పరచుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు.

  14. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది.

  15. రాజకీయ పరపతి పెరుగుతుంది. ఇదే విధంగా గతంలో పెట్టిన పెట్టుబడి రకరకాల అంశాలు ఇప్పుడు కొండంత అండగా నిలబడతాయి. స్థిరాస్తి విలువ బాగా పెరుగుతుంది.

  16. మొండి బాకీలు వసూలవుతాయి. లోన్లు తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా సంస్థ పరంగా రావాల్సిన ధనం అతికష్టం మీద వస్తుంది.

  17. పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి.

  18. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతకాలం సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉంటే మంచిది.

  19. రుణాలు గడువుకు ముందే ఋణాలు తీర్చివేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తారు.

  20. ప్రేమ వివాహం విషయంలో కఠినంగా ఉంటారు. అవివాహితులకు వివాహం మంచి సంబంధం దొరుకుతుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

  21. నిరుద్యోగులకు అర్హతకు తగిన ప్రభుత్వ లేదా దానికి సమానమైన ఉద్యోగం లభిస్తుంది. ధనసంపాదన కోసం అహర్నిశలు కష్టపడతారు. శ్రమకు తగిన ఫలితం మూడు వంతులు అందుతుంది.

  22. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్ కి, లాయర్ కి, చార్టెడ్ అకౌంట్, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కు అనుకూలం. వ్యాపారస్తులకు అనుకూలం. నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి.

  23. కోర్టు వ్యవహారాన్ని మధ్యవర్తుల ద్వారా బయట పరిష్కరించుకుంటారు. కిష్టమైన సమస్యల నుండి బయటపడతారు. ఒక చోట బలహీనపడిన మరొక చోట బాలపడతారు నిరాశ పడవద్దు.


స్త్రీలకు:


  1. ఈ రాశి వారికి బరువు బాధ్యతలు అధికం.

  2. విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. సివిల్ సర్వీస్కుకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

  3. కోర్టు తీర్పులో ఫలితాలు అనుకూలంగా వచ్చిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణ లోకి వస్తాయి.

  4. ఒక వ్యక్తి పరిచయంతో మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి.

  5. స్వయం సంపాదన కొండంత అండగా నిలుస్తుంది. యోగా మెడిటేషన్ వల్ల లాభపడతారు. చాలా విషయాల్లో ఓర్పు సహనం కనబరుస్తారు.

  6. వివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది.

  7. ఉద్యోగులకు అనుకూలం ప్రమోషన్లు అనుకూలిస్తాయి.

  8. తొందరపాటు నిర్ణయాలతో తెలిసి తెలియని ఆకర్షణతో పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దూరప్రాంతాల్లో చదువుకునే వారికి అవకాశాలు కలిసివస్తాయి.


ధరించవలసని రత్నం: వజ్రం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (కృత్తిక :కెంపు, రోహిణి: ముత్యం, మృగశిర: పగడం)
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: లక్ష్మీదేవి స్తోత్రాలు
చేయవలసిన ధానం: బొబ్బెర్లు లేదా బొబ్బెర్లతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

Sunday, April 11, 2021

Mesharashi Vari palitalu-2021-22 (మేషరాశి ఫలితాలు)

Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Mesham)

 మేషరాశి ఫలితాలు:

నక్షత్రాలు అశ్వని: 4 పాదాలు, భరణి: 4 పాదాలు, కృత్తిక : 1వ ఫాదం
నామ నక్షత్రాలు : చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ

ఆధాయం :  08 వ్యయం : 14 రాజపూజ్యం : 04 అవమానం : 03  

గురువు:
శని:
రాహువు:
కేతువు:
(11లో)
(10లో)
(2లో)
 (8లో)

ఫలితాలు:
1) అన్ని రంగాల వారికి ఆర్ధకాభివృద్ది బాగుంటుంది.  స్తిరాస్తులు కొనుగోలు చేస్తారు.
2) మానసిక స్థితి (మానసిక ప్రశాంతత) బాగుంటుంది. 
3) కుటుంబంలో సంతోషం, బంధుమిత్ర లాభం, ఆరోగ్యం
4) దైర్యంగా ముందడుగువేస్తారు. .ఏ పని తలపెట్టినా పూర్తి అభివృద్ది
5) వ్యవహారం జయం, గృహంలో శుభకార్యాలు 
6) ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మీ ఫైల్లపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు.
7) మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది.
8) విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక, ఉద్యోగం ప్రయత్నం ఈ సంవత్సరం నెరవేరుతుంది.
9) విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి ఫలితాలు. 
10) ఉద్యోగంలో ప్రమోషం లభింస్తుంది.
11) వాహన యోగం, గృహయోగం అనుకూలం
12) రాజకీయ రంగంలో వారి పైరవీలు, టెండర్లు లాబిస్తాయి.
13) ఈ రాశి వారికి వ్యాపార రీత్యా అనుకూలం, జాగ్రత్త వహించాలి.
14) సివిల్, క్రిమిల్ కోర్టు కేసులు అనూకలంగా వున్నపట్టికి, కొంత అశాంతి వుంటుంది.
15) ఆధాయం మించి ఖర్చులు ఉంటాయి. డబ్బులు పొదుపు తప్పని సరి
16) విద్యా, క్రీడలు, సాంసృతిక, కళారంగాల వారికి అనుకూల పరిణామాలు
17) స్నేహితులు, బంధువుతలతో విబేధాలు పరిష్కారం అవుతాయి.
18) ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సంబంధ వ్యాధులతో జాగ్రత్త అవసరం.
19) బ్యాంకు లోను, ఋణాలు లభిస్తాయి.
20) ఆకర్షణీయమైన స్కీంలు, చిట్టీలలో షేర్ మార్కెట్ వంటి వాటిలో నష్ట పోయే అవకాశం వుంది.
21) ఆహార ధాన్యాలు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత అనూకూల వాతావరణం
22) కుటుంబ సభ్యలు మధ్య సఖ్యత లోపం, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు.
23) ప్రయాణాలలో, స్త్రీల విషయంలో జాగ్రత్త అవసరం, స్త్రీలతో అకాలవైరం.
24) చేతివృత్తులు, హోల్ సేల్ వ్యాపారులకు సామాన్యం.
25) విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్ ల పట్ల జాగ్రత్త అవసరం.


స్త్రీలకు : 
1) అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతాన భాగ్యం
2) ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలనే కోరిక నెరవేరుతుంది.
3) దైవభక్తి, మేధస్సు, కఠోర శ్రమతో అనుకున్నది సాధించగలుగుతారు.
4) క్రమశిక్షణ, మంచితనంతో సంఘంలో గౌరవం పెరుగుతుంది.
5) వినూత్న వ్యాపారంలో, శ్రధ్ధ రాణింపు వుంటుంది.
6) ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం వుంది.

ధరించవలసని రత్నం: పగడం (రాశి ప్రకారం)
నక్షత్రం ప్రకారం (అశ్విని నక్షత్రం : వైడూర్యం, భరణి నక్షత్రం: వజ్రం, కృత్తిక నక్షత్రం: మాణిక్యం (కెంపు))
ఆరాధించవలసని దేవతలు స్తోత్రాలు: కార్తికేయ స్తోత్రం లేదా గణపతి స్తోత్రాలు
చేయవలసిన ధానం: కందులు లేదా కందులతో చేసిన పదార్థాలు, పిండివంటలు

----------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:

Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Wednesday, March 10, 2021

Shiva Panchakshari Stotram - శివ పంచాక్షరీ స్తోత్రమ్

శివ పంచాక్షరీ స్తోత్రమ్

Shiva Panchakshari Stotram



నాగేంద్రహారాయ త్రిలోచనాయ | భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ | తస్మై 'న' కారాయ నమశ్శివాయ |

మందాకిని సలిల చందన చర్చితాయ | నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ | తస్మై 'మ' కారాయ నమశ్శివాయ ॥

శివాయ గౌరీ వదనారవింద | సూర్యాయ దక్షాధ్వర నాశనాయ |
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ | తస్మై 'శి' కారాయ నమశ్శివాయ |

వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై 'వ' కారాయ నమశ్శివాయ |

యక్షస్వరూపాయ జటాధరాయ | పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ | తస్మై 'య' కారాయ నమశ్శివాయ |

పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే |

---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Shiva Stuthi - దారిద్ర్య దుఃఖ దహన శివస్తుతి

దారిద్ర్య దుఃఖ దహన శివస్తుతి

(వసిష్ఠ విరచితం)

Shiva Stuthi
chintaamani free astrology



విశ్వేశ్వరాయ, నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ, శశిశేఖర ధారణాయ |
కర్పూరకాంతి ధవళాయ, జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ |
గౌరీప్రియాయ, రజనీశ కళాధరాయ కాలాంతకాయ, భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ, గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ ||
భక్తప్రియాయ, భవరోగ భయాపహాయ ఉగ్రాయ, దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ, గుణనామ సున్నత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ ||
చర్మాబరాయ, శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ, మణికుండల మండితాయ |
మంజీర పాదయుగళాయ, జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ ||
పంచాననాయ, ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ, భువన త్రయమండతాయ |
ఆనందభూమి వరదాయ, తమోపహ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ ||
భానుప్రియాయ, భవసాగర తారణాయ కాలన్తకాయ, కమలాసన పూజితాయ
నేత్రత్రాయాయ, శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ || 2 ||
రామప్రియాయ, రఘునాథ వరప్రదాయ నామ ప్రియాయ, నరకార్ణవ తారనాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ, సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ ॥
ముక్తిశ్వరాయ, ఫలదాయ, గణేశ్వరాయ గీతప్రియాయ, వృషభేశ్వర వాహనాయ
మాతాంగ చర్మవసనాయ, మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమిశ్శివాయ || 3 ||
నమశ్శివాయ, నమశ్శివాయ - 2
వసిస్టేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |
త్రిసంధ్యం యం: పఠేన్నిత్యం, స హి స్వర్గ మవాప్నయాత్ |



---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Share:

Mettugutta-Sriramalingeswara Swamy Chartra - మెట్టుగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి చరిత్ర

Mettugutta Temple


శ్లో॥     శాస్త్రం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్తం త్రినేత్రమ్ 

శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహస్తమ్ 

నాగంపాశం చ ఘణాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే 

నానాలంకారయుక్తం స్పటిక మణి నిభం పార్వతీశం నమామి ||

శ్రీ మెట్టు రామప్ప క్షేత్ర చరిత్ర

శివకేశవుల మధ్య బేధములేదని చాటే అద్వైత మతానికి ప్రత్యక్ష నిలయమైన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయము వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ కు 2 కి.మీ. దూరములో వరంగల్-హైద్రాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన మడికొండ గ్రామ సమీపంలోని అతి పెద్ద గుట్టపైనున్నది. మెట్టుగుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని కాకతీయ ప్రభువులు నిర్మించారు దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో మొదట చాళుక్య రాజులు, శ్రీ వీరభద్ర స్వామి ఆలయము నిర్మించినట్లు చరిత్ర తెలుపుచున్నది.కాకతీయుల కాలంలో ఈ క్షేత్రాన్ని మణిగిరిగా పిలిచేవారు. క్రమంగా అది మారుతూ వచ్చి ప్రస్తుతము మెట్టుగుట్టగా పిలువబడుచున్నది మనోహరమైన పర్వతశ్రేణి పై 55 ఎకరాల స్థలంలో విస్తరించియున్న ఈ గుట్టపై శివకేశవుల ఆలయాలతోపాటు వీరభద్రస్వామి ఆలయం, హనుమంతుని ఆలయం సంతాన వేణుగోపాలస్వామి, నవగ్రహ, అన్నపూర్ణ, గణపతి ఆలయాలున్నాయి.

స్థల పురాణం - క్షేత్ర మహాత్యము

పూర్వము మునులు, సాధువులు, సిద్దులు కైలాసమున కొలువుదీరివున్న శివున్ని దర్శించి భక్తితో స్తోత్రము చేసి ప్రసన్నుని చేసుకొనిరి. కరువు కాటకాలతో, వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను కాపాడి ఆధ్యాత్మిక, ఆదిభౌతికాది బాధలను తొలగించుటకు భూలోకమున అవతరించుమని ప్రార్థించారు. వారి అభ్యర్థనకు సంతసించిన పరమశివుడు అభయమిస్తు వారందరిని ఈ సమీప ప్రాంతంలో నివసించుటకు ఆనతిచ్చెను. అచ్చటనే స్వయంభూ లింగముగా వెలుస్తానని, అభిషేకాదులతో ఆర్చించమని సెలవిచ్చెను. కొంతకాలమైన పిమ్మట మాండవయ్య శాండిల్యాది తొమ్మండుగురు సిద్ధులు శివుని గూర్చి తపమాచరించగా పరమశివుడు స్వయంభూవుగా ఈ గుట్టపై వెలిసెను. వనవాసము చేస్తున్న శ్రీరాముడు ఈ ప్రాంతములో విహరించి శివున్ని అభిషేకించాడట. ఆనాటి నుండి ఈ స్వామి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామిగా వ్యవహరించబడుచున్నాడు. చాలా కాలము తర్వాత ఈ ప్రాంతంలో అనావృష్టి యేర్పడి ఆకలిబాధలు పెరిగాయి. ఒకరోజు రాత్రి తెల్లవారుజామున ఒక శివభక్తునికి శివుడు స్వప్నములో సాక్షాత్కరించి మెట్టుగుట్టపై తాను వెలసిన విధము తెలపి అభిషేకించవలసినదిగా ఆజ్ఞాపించెను. నిద్రనుండి మేల్కొన్న ఆ భక్తుడు ఈ కొండ నెక్కి స్వయంభూః లింగమును కనుగొని భక్తి ప్రపత్తులతో అభిషేకించెను. వెంటనే శుభ సూచకముగా చిరుజల్లు ఒకటి కురిసెనట. ఆ తర్వాతి కాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖంగా వున్నారట. అది మొదలు ఈ భక్తుడు నిత్యము శివార్చన చేస్తూ చివరకు ముక్తిని పొందెనట. ఆ భక్తుని వంశస్థులే నేటికినీ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ భక్తునికి ముక్తినిచ్చినందువల్ల ముక్తి లింగముగా కూడా ఇక్కడి స్వయంభూః లింగం ప్రసిద్ధి నొందినది.

అభినవ పోతన బిరుదాంకితులైన వానమామలై వరదాచార్యులవారు మండలము రోజులు మెట్టుగుట్టపై వాగీశ్వరి మంత్రోపాసన చేయగా చదువులతల్లి సరస్వతీ దేవి ప్రత్యక్ష్యమైనది. ఈ సంఘటన 1925 సం||ల జరిగినది. ప్రస్తుతము భక్తులు మెట్టుగుట్టపై శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ ఆలయ నిర్మాణానికి నడుంబిగించారు. రెండవ ప్రోలరాజు కాలమున ఈ ప్రాంతములో నివసించిన త్రిదండి మహాముని కలలో శ్రీరాముడు కనిపించి పూర్వము తాను మెట్టుగుట్టపై విహరించి స్వయంభూఃశివలింగాన్ని అభిషేకించిన విషయమును తెలిపి, ఆలయనిర్మాణమునకు ఆదేశించాడట ఆ ముని ఈ సంగతి చక్రవర్తికి విన్నవించగా అతడు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణము కావించాడని చరిత్ర చెబుతున్నది. మెట్టుగుట్టపై వున్న నవగుండాలలో పాలగుండము, జీడి గుండము, కన్ను గుండము, కత్తిగుండము, బ్రహ్మగుందము, రామగుండము, గిన్నె గుండము చాలా ప్రసిద్ధమైనవి. పాల గుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపనాశినిగా భక్తులు భావిస్తారు. దీనికి పాతాళ ఊట కలదని అంటారు. జీడి గుండంలో (వరసిద్ధిగుండం) సంతానార్థులైన స్త్రీలు వరసిద్ధి పొందుతారనే నమ్మకం, పాలగుండం నుండి కాశీ వరకు అనుసంధానమున్నదని భక్తులు చెబుతుంటారు. జీడిగుండం ప్రక్కన భీముని పాదముద్రలు కనిపిస్తాయి.

చారిత్రక ప్రాధాన్యము

క్రీ.శ. 950 లో మణిగిరి గ్రామాన్ని ఒకనాడు వేంగీ దేశ చాళుక్య రాజు పెద్దకొడుకగు సుకుమాయుధునాధుడు పరిపాలించినట్లు 'కొరివి' శాసనాల ద్వారా తెలుస్తున్నది. చాళుక్యరాజుల అనంతరము మణిగిరి ప్రాంతము కాకతీయ రాజుల వశమైనది. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండివుండేది. ఆనాడు ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ ప్రభువులలో నాల్గవ వాడైన రెండవ ప్రోలరాజు సహకారంతో క్రీ.శ. 1000-1158 మధ్యకాలంలో మెట్టుగుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. క్రీ.శ. 1198 నుండి 1261 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన గణపతిదేవ చక్రవర్తి ఈ కొండపై గల రామాలయంలో విగ్రహాలు నెలకొల్పి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముందే శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. శివాలయం గర్భగుడిలోని స్వయంభూః శివలింగము కాశీలోని స్వయంభూః శివలింగము మాదిరిగా వుండి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ద్వారపాలకుల విగ్రహాలు నాగపాశబద్ధములై చూపరులను ఆకర్షిస్తాయి. గోల్కొండ నవాబు కాలమున సుబేదారుగా వున్న సితాబుఖాన్ శివాలయమునకు 4 ఎకరములు, రామాలయమునకు 36 ఎకరములు తరి, 412 ఎకరములు ఖుష్కి ఇనాముగా ప్రకటించినట్లు 1192 ఫసలీ నటరాజ శాసనము ద్వారా తెలియుచున్నది 

దొంతులమ్మ గుండ్లు 

మెట్టుగుట్టపై 165 అడుగుల ఎత్తులో రెండు శిఖరాల జంట భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భీముడి భార్య హిడింభి గచ్చకాయలు ఆడుకొని వాటిని ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఘటోత్కజుని జననం ఇక్కడే జరిగినట్లు ఒక కథ ఈ ప్రాంతములో ప్రచారంలో నున్నది. ఈ శిఖరాలలోని ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుండి సుమారు 15 కి.మీ. దూరం వరకు కనపడతాయి. ఇంతటి ప్రాశస్త్యము కలిగిన మెట్టుగుట్ట పై కార్తీక మాస పూజలు, వరలక్ష్మి పూజలు, శ్రీ గణపతి, దసరా ఉత్సవాలను ప్రతి యేటా వైభవంగా జరుపుతారు. ముఖ్యంగా మహాశివరాత్రినాడు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కళ్యాణము, శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణము వైభవంగా జరుపుతారు. ఇక్కడే బమ్మెరపోతనను భిక్షకుడి వేషములో సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి భాగవత రచనకు ఘంటమునిచ్చినాడని ప్రసిద్ధి. మెట్టుగుట్ట పుణ్యక్షేత్రము ప్రకృతి సుందర దృశ్యములచే సకల పుణ్య తీర్థములకు ఆలవాలమై శైవ, వైష్ణవ సంప్రదాయ సమన్వయానురూపమై, భక్తులకు కొంగు బంగారమై, ఉత్సవ మహావైభవోపేతమై, లోక కళ్యాణ హేతువై దిన దినాభివృద్ధి నొందుతూ భక్తులను, యాత్రికులను, సందర్శకులను ఆకర్షిస్తూ తరింపజేస్తున్నది. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్ర సందర్శన చేసి తరించండి. ఈ దేవాలయములో స్వామి వారికి ప్రతి దినము శైవాగము ప్రకారముగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. స్వామి వారికి భక్తుల ద్వారా జరిగే ముఖ్య కార్యక్రమములు వివాహం, సంతానం, దాంపత్య జీవితం, ఆరోగ్యం బాగుండాలని స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరము స్వామి వారి బ్రహ్మోత్సవాలు శైవాగమోక్తంగా పాంచాహ్నిక దీక్షతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడుచున్నది.


Mettugutta


---------------------------------------------------------------------------------------
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService

Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels