![]() |
Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Vrushabam) |
వృశభరాశి ఫలితాలు:
ఆధాయం : 02 వ్యయం : 08 రాజపూజ్యం : 07 అవమానం : 03
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(10లో) | (9లో) | (1లో) | (7లో) |
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది, ఆర్థికంగా పుంజుకుంటారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది.
దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.
మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి.
ఆర్థిక సహాయం అందుతుంది.
రాజకీయాలలో ఉన్నవారికి ఊహించని విధంగా పదివి ప్రాప్తి కలుగుతుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాల చిరకాల వాంఛ నెరవేరుతుంది ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం, శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటిలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఐఏఎస్, ఐపిఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపికవుతారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
వ్యాపార రంగంలో వారికి బాగుంటుంది. రొటేషన్ పెరుగుతుంది, లాభాలు బాగుంటాయి. నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం అవుతుంది.
కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరుచుకొంటారు.
ఎగుమతులు, దిగుమతుల వ్యాపారాలకు నూటికి 90% కాలం బాగుంది. గనులు, ఇసుక సంబంధించిన వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి.
కలలు, సాహిత్య సాంస్కృతిక రంగాల వారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు,బిరుదులు లభిస్తాయి.
కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి.
క్రమశిక్షణతో పొదుపు చేసి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తారు.
స్నేహితుల ప్రభావం కొంత పెడదోవ పట్టించే అవకాశం ఉంది. వ్యసనాలకు ధనం పెట్టుబడి పెడతారు. బెట్టింగ్లు, కోడిపందాలు పేకాటకు దూరంగా ఉండండి.
వివాహ సంబంధ విషయాల్లో కొంత మానసిక సంఘర్షణకు గురి అవుతారు. చివరకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేసే అవకాశం ఉంది. సామాన్యుడి చేతిలో మోసపోయి అవకాశం ఉంది. స్త్రీల విషయంలో జాగ్రత్త అవసరం.
ఇష్టమైన స్వగృహాని ఏర్పరచుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు.
వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది.
రాజకీయ పరపతి పెరుగుతుంది. ఇదే విధంగా గతంలో పెట్టిన పెట్టుబడి రకరకాల అంశాలు ఇప్పుడు కొండంత అండగా నిలబడతాయి. స్థిరాస్తి విలువ బాగా పెరుగుతుంది.
మొండి బాకీలు వసూలవుతాయి. లోన్లు తీసుకుంటారు. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా సంస్థ పరంగా రావాల్సిన ధనం అతికష్టం మీద వస్తుంది.
పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి.
వృత్తి ఉద్యోగాల పరంగా కొంతకాలం సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉంటే మంచిది.
రుణాలు గడువుకు ముందే ఋణాలు తీర్చివేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తారు.
ప్రేమ వివాహం విషయంలో కఠినంగా ఉంటారు. అవివాహితులకు వివాహం మంచి సంబంధం దొరుకుతుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు అర్హతకు తగిన ప్రభుత్వ లేదా దానికి సమానమైన ఉద్యోగం లభిస్తుంది. ధనసంపాదన కోసం అహర్నిశలు కష్టపడతారు. శ్రమకు తగిన ఫలితం మూడు వంతులు అందుతుంది.
చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్ కి, లాయర్ కి, చార్టెడ్ అకౌంట్, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కు అనుకూలం. వ్యాపారస్తులకు అనుకూలం. నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి.
కోర్టు వ్యవహారాన్ని మధ్యవర్తుల ద్వారా బయట పరిష్కరించుకుంటారు. కిష్టమైన సమస్యల నుండి బయటపడతారు. ఒక చోట బలహీనపడిన మరొక చోట బాలపడతారు నిరాశ పడవద్దు.
స్త్రీలకు:
ఈ రాశి వారికి బరువు బాధ్యతలు అధికం.
విద్యా రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. సివిల్ సర్వీస్కుకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.
కోర్టు తీర్పులో ఫలితాలు అనుకూలంగా వచ్చిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణ లోకి వస్తాయి.
ఒక వ్యక్తి పరిచయంతో మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి.
స్వయం సంపాదన కొండంత అండగా నిలుస్తుంది. యోగా మెడిటేషన్ వల్ల లాభపడతారు. చాలా విషయాల్లో ఓర్పు సహనం కనబరుస్తారు.
వివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది.
ఉద్యోగులకు అనుకూలం ప్రమోషన్లు అనుకూలిస్తాయి.
తొందరపాటు నిర్ణయాలతో తెలిసి తెలియని ఆకర్షణతో పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దూరప్రాంతాల్లో చదువుకునే వారికి అవకాశాలు కలిసివస్తాయి.
If you like this Post Please Comment and Share your Near and Dear
----------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Comments
Post a Comment