సూర్య భగవానునికి అర్గ్య ప్రధానం
ఓం మిత్రాయ నమః
ఓం రవయే నమః
ఓం సూర్యాయ నమః
ఓం భానవే నమః
ఓం ఖగాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం మారీచయే నమః
ఓం ఆదిత్యా య నమః
ఓం సావిత్రే నమః
ఓం అర్కాయ నమః
ఓం భాస్కరా య నమః
సూర్యుడి 12 నామాలతో కూడిన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో అర్గ్య ప్రదానం చేస్తూ పటించాలి.
విధానం :
చక్కగా స్నానం చేసి ఎర్రని వస్త్రములు అంటే ఎర్రని పంచ కండువా ధరించి ఒక రాగి పాత్ర ,రాగి గ్లాసు లేదా చెంబు తీసుకొని తూర్పు వైపుగా ఒక స్టూలు ఉంచి ఆ స్కూలు పై రాగి ప్లేటు పెట్టి రాగి గ్లాసులో స్తోత్రములు చదువుతూ నీటిని రాగి పాత్రలోకి వదలాలి. ముందుగా ఈ రాగి గ్లాసులోకి ఎర్రని అక్షంతలు, ఎర్రని పూలు వేయాలి.
తరువాత పాత్రలో వదిలిన జలమును శ్రీ సూర్యనారాయణ అనుగ్రహమస్తు అంటూ మూడుసార్లు తలపై చల్లుకోవాలి.
మిగిలిన జలమును ఏవైనా చెట్లకు గాని మొక్కలకు పోయవచ్చు.
ఇలా 21 రోజులు నిష్టగా చేయాలి. సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి సంపూర్ణ ఆయురారోగ్యములు, ఆత్మస్థైర్యం, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత , స్థిర నివాసము కలుగుతుంది.
ముఖ్య గమనిక: ఆదివారం నాడు మధ్య మాంసము తినడం మానివేయాలి.
Comments
Post a Comment