chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Saturday, November 2, 2019

అదృష్టం కలగాలంటే - Be a Luck - Chintamani free astrology

అదృష్టం కలగాలంటే :  
chintamani free astrology
chintamani free Astrology

అన్ని కష్టాలు తీరి, అన్ని భాద్యతలు తేలికగా నెరవేరాలంటే, ఆదాయం బాగావుండాలన్నా ఇంట్లో ఈ క్రింది గ్రంధాలు కొని పెట్టకోండి. వాటిని చదివినా, చదవక పోయినా వాట మహత్తువలన అంతులేని అదృష్టాలు కలుగుతాయి. గృహయోగం, వాహనయోగం, సకాలంలో వివాహాలు, మంచి సంతానాలు కలుగుతాయి.
1. మహాభారతం
2. రామాయణం
3. మహాభాగవతం
4. భగవద్గీత
వీటికి తోడు అష్టాదశ పురాణాలు కూడా ఇంట్లోగానీ, ఆఫీసులోగానీ పెట్టుకొనిన మంఛి ఫలితాలు కలుగుతాయి.


chintamani free astrlogy
For Free Astrology Click Here


Share:

Friday, November 1, 2019

శ్రీ మంగళ చండికా స్తోత్రమ్ - Mangala chandika stotram - chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
శ్రీ మంగళ చండికా స్తోత్రమ్

రక్ష రక్ష జగన్మతః దేవి చండికే |
హరికే విపదాం హర్ష మంగళ కారికే ||
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే |
శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ||
మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే |
సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ||
పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే |
పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ||
మంగళా ధిష్టితా దేవి మంగళానాం చ మంగళే |
సంసార మంగళధరే మోక్ష మంగళదాయినీ ||
సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా |
ప్రతిమంగళ వారేచ పూజ్య మంగళ సుఖప్రదే ||

ఫలితం : 
ధన,ధాన్య, వ్యాపార అభివృద్దికి, కోర్టు వ్యవహారాల అనుకూలతకు, సకల సమస్యల పరిష్కారానికి.


For Free Astrology Click Here


Share:

కార్తవీర్యార్జున స్తోత్రమ్ - karthaveeryarjuna stotram - chintamani free astrology

karthaveerya stotram - chitamani
karthaveerya - chintamani free astrology
కార్తవీర్యార్జున స్తోత్రమ్

ఓం కార్త వీర్యా ఖలద్వేషీ కృతవీర్యో సుతోబనీ
సహస్రబాహుః శతృఘ్నోర్తవాసా ధనుర్థరః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తురభీష్టదః
సంపదస్తస్య జాయంతే జనాః సరేవవశం గతాః
రాజానో దాసతాం యాన్తి అరిపక్షో వశ్యతాంగతః
ఆనయత్యాశు దూరస్థః క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం జప్తూ ప్త్రుణాం సర్వకామదమ్
కార్తవీర్యో మహావీర్యో సర్వశతృ వినాశకః
సర్వత్ర సర్వదా తిష్ఠ దృష్టాన్ నాశయ పాహిమాం
ఉత్తిష్ఠ దుష్టదమన సప్తద్వీపైక పాలకః
త్వమేవ శరణం ప్రాప్తం సర్వతో రక్షరక్షమాం
దుష్టఘ్ను కిం త్వ స్వరూపిణి కింతిష్ఠసి కించిరాయసి
పాహినః సర్వదా సర్వభయేభ్యః స్వసుతానిచ
మతి భంగః స్వరోహీనః శతౄణాం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు సభాయం మే జయంకురు
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖక్షయే భవేత్
తం నమామి మహావీరమర్జునం కృత వీర్యజమ్
హైహయాధిపతేః స్తోత్రం సహస్రవృత్తికం కృతమ్
వాంచితార్థ ప్రదం లాణాం శూద్రాద్యైన శృతం యది.
కార్తవీర్యార్జునో నామ రాజాబాహ్వోః సహస్రవాన్
తస్య సంస్మరణా దేవ హృతం

ఫలితం : మీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి,  (మనిషి గాని, పెంపుడు జంతువుగాని, మీకు ఇష్టమైన వస్తువు కాని, మీకు రావల్సిన బాకీలు కాని, భూమిగాని, మీ ఇంట్లో దొంగిలించబడిన వస్తువుగాని మరేదైనా కానియండి, ) మరల తిరిగి  రావాలంటే  అమృతతుల్యమైన ఈ మంత్రాన్ని అనుష్ఠించండి. ఫలితం మీకే తెలుస్తుంది.
గమనిక: మీ శక్తి అనుసారం రోజుకు ఒకసారి నుంచి ఎన్నిసార్లయినా స్తోత్రాన్ని ఫఠించండి. ఫలితం తొందరగా రావాలంటే వీలైనంత ఎక్కువ సార్లు పఠించండి.

chintamani free astrology
For free astrology click here


Share:

Tuesday, October 29, 2019

ఆదిత్య హృదయం -chintamani free astrology

chintamani free astrology
chintamani free astrology
ఆదిత్య హృదయం
- అనారోగ్య సమస్యలు దూరం 
భయంకరమైన జబ్బులు కలిగినప్పుడు వైద్యం చేయించుకోవడంతోపాటు ప్రతీరోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. భవిష్యత్ లో అనారోగ్య సూచనలు జాతక చక్ర ప్రకారం ఉన్నప్పుడు ఆదిత్య హృదయం పారాయణం చేసినట్లయితే అనారోగ్యాలు దరిచేరవు.

ధ్యానం
ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ స్సరసిజాసన సన్నివిష్ణః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్దృత శంఖచక్రః

స్తోత్రమ్
తతోయుద్ధ పరిశ్రాంతం । సమరేచింతయా స్థితమ్
రావణం చగ్రతో దృష్ట్యా । యుద్దాయ సముపస్థితమ్ 1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపాగమ్యాఽ బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః         2
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి        3
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్
జయావహం జపేన్నిత్యం మక్షయం పరమం శివమ్ 4
సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్
చిన్తాశోక ప్రశమన మాయుర్వర్థన ముత్తమమ్ 5
రశ్మిమన్తం సముద్యన్తం దేవాసుర నమస్కృతమ్
పూజయస్వ వివస్తన్తం భాస్కరం భువనేశ్వరమ్ 6
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏషదేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః         7
ఏషబ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలోయమస్సోమోహ్యపాంపతిః 8
పితరో వసన స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః 9
ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషాగభస్తిమాన్
సువర్ణ సదృశోభానుః స్వర్ణరేతా దివాకరః               10
హరిదశ్వ స్సహస్రార్చి సప్తసప్తి ర్మరీచిమాన్
తిమిరోన్మథన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్ 11
హిరణ్యగర్భ శ్శిశిర స్తవనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽ దితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః         12
వ్యోమనాథ స్తమోభేది ఋగ్యజు స్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమః          13
ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
రవి (కవి)ర్విశ్వో మహాతేజా రక్తః స్సర్వభవోద్భవః 14
నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ నమోస్తుతే            15
నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః            16
జయాయ జయభద్రాయ హర్వశ్వాయ నమో నమః
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః     17
నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః    18
బహ్మేశానాఽ చ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః             19
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః        20
తప్త చామీకరా భాయ వహ్నయే వశ్వకర్మణే
నమస్తమోఽభి విఘ్నాయ రవయే (రుచయే) లోకసాక్షిణే         21
నాశయ త్వేషవై భూతం తథైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః                         22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏషచైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణామ్           23
వేదాశ్చ క్రతవైశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వఏష రవిః ప్రభుః                 24
ఏవమాపత్సుకృచ్చేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ                 25
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పితిమ్
ఏత త్రిగుణితం జప్త్యా యుద్ధేషు విజయిష్యసి                 26
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్యా తధాగతస్త్యో జగామ చ యధాగతమ్           27
ఏతచ్ర్ఛుత్ర్వా మహాతేజా నష్టశోకోఽ భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్            28
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్యాతు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్           29
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతావధే తస్యధృతో (తో)ఽ భవత్           30
అథరవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచ స్త్వరేతి.               31

chintamani free astrology
For Free Astrology Click Here


Share:

Saturday, October 26, 2019

రాహుకాలం-యమగండం-దుర్ముహూర్తం chintamani free astrology

రాహుకాలం- యమగండం-దుర్ముహూర్తం
chintamani free astrology
chintamani free astrology


ముఖ్య కార్యాలకు, ప్రయాణాలకు, శుభకార్యాలకు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయాలు చూసుకొని చేయవలయును.
సంవత్సర కాలంలో ఆయా నెలలను బట్టి  28, 29 30 మరియు 31 రోజులు ఉంటుంటాయి. అయితే వారలు నిర్ధిష్టంగా  ఆదివారం నుండి శనివారం వరకు మాత్రమే ఉంటాయి. అంతే కాని నెలలో ఒక రోజు ఎక్కవ వచ్చినా తక్కువ వచ్చినా వారాలు మాత్రం  మారవు. అందువల్ల మనం చేయబోయే పనులకు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం వంటివి వారంలో ఎలావుంటాయో చూసుకొని చేయడం మంచిది.  రాహుకాలం, యమగండం ఎప్పుడు అవే సమయాలలో ఉంటాయి. దుర్ముహూర్తం, వర్జం వంటివి మారుతూవుంటాయి. గమనించగలరు.
రాహుకాలం:
ఆదివారం : సా. 4.30 నుండి 6.00 గం. ల వరకు
సోమవారం : ఉ. 7.30 నుండి. 9.00 గం. ల వరకు
మంగళవారం : మ. 3.00 నుండి 4. గం. 30 ని.ల వరకు
బుధవారం : మ. 12.00 నుండి 1 గం. 30 ని. ల వరకు
గురువారం : మ. గం. 1.30 నుండి 3.00 గం.ల వరకు
శుక్రవారం : మ. గం. 10.30 ని.ల నుండి 12.00 గం. ల వరకు
శనివారం : ఉ. 9.00  నుండి. 10.30 ని. ల వరకు.

యమగండం :
ఆదివారం : మ. 12.00 నుండి 1.30 గం. ల వరకు
సోమవారం : ఉ. 10.30 నుండి. 12.00 గం. ల వరకు
మంగళవారం : ఉ. 9.00 నుండి 10. గం. 30 ని.ల వరకు
బుధవారం : ఉ. 7.30 నుండి  9.00 గం. ల వరకు
గురువారం : ఉ 6.00 నుండి 7.30 గం.ల వరకు
శుక్రవారం : మ. గం. 3.00 ని.ల నుండి 4.30 గం. ల వరకు
శనివారం : మ.1.30  నుండి. 3.00 ని. ల వరకు.
దుర్ముహూర్తం:
దుర్ముహూర్తం కొరకు కేలండర్ గానీ, పంచాంగం గానీ చూసుకోవలెను.

chintamani free astrology
For free Astrology Now Click Here


Share:

జాతక దోషాలు (శనిదోషాలు) -shanigraha dosham - chintamani free strology

జాతక దోషాలు

శనిదోషాలు- పరిహారాలు

chintamani free astrology
chintamani free astrology
జాతక దోషం : 
శని లగ్నంలో గాని, 7 లోగానీ, చంద్రునితో గానీ కలిసి ఉంటే వివాహం ఆలస్యంగా కావడం,  వివాహానంతరం తగారాలు రావడం, భార్యాభర్తలు విడిపోవడం వంటి నష్టాలు ఉంటాయి. తలపెట్టిన ప్రతి పనిలో ఆలస్యాలు ఆటంకాలు ఉంటాయి.
శని 12వ ఇంట ఉంటే, (12,6,2,9) హౌసెస్ ప్రభావితం అవుతాయి అందువల్ల ధన వ్యయం, వృధా ఖర్చులు, అనారోగ్యాలు, శత్రువుల వలన బాధలు, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చెడు మాటలు, అనవసర వాదనలు, వాగ్విధానాలు, ఏదీ కలిసి రాకపోవుట పెద్దలను తక్కువ చేయుట, పూజా పునస్కారాల లోపం, సోమరితనం వంటివి జరుగుతాయి. 
ఏలినాటి శని :
జన్మరాశి మీద (జన్మరాశికి ముందు రాశిలో, జన్మరాశి తర్వాత రాశిలో) శని సంచారాన్ని ఏలినాటి శని అంటారు. (ఒక్కొక్క రాాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాలు) ఈ శని దోషాన్నే ఏడున్నర ఏండ్ల శనిదోషం (సాడే సాత్) అంటారు. ఏలినాటి శని కాలంలో అనారోగ్యాలు, తగాదాలు, గ్యారంటీలు  ఉండి నష్టపోవడం, కోర్టు కేసులు, అవమానాలు, ఉద్యోగుల వలన సమస్యలు, భర్యాభర్తల మధ్య గొడవలు, దండగ ఖర్చులు ఉంటాయి.
అష్టమ శని :
జన్మరాశి నుండి 8వ స్థానంలో సంచరించటాన్ని అష్టమ శని అంటారు. ఆనారోగ్యం, ఆపరేషన్లు, ఉన్నచోటు నుండి మారడం, ఆర్ధిక నష్టాలు, గౌరవ భంగం, ప్రాణ భయం మొదలైన సమస్యలు ఉంటాయి. అష్టమ శని దోషం  2 1/2 సంవత్సర కాలం ఉంటుంది.
అర్ధాషమ శని:
జన్మరాశి నుండి శని 4వ స్థానంలో సంచరించటాన్ని అర్ధాష్టమ శని అంటారు. మనశ్శాంతి లేకపోవడం, తీవ్రమైన భయాందోళనలు కలగడం, భార్యాభర్తల మధ్య  ఎడబాటు, తల్లికి అనారోగ్యం, గ్రుహ సంపదలకు నష్టం,  వాహనాలకు యాక్సిడెంట్లు లేదా వాహన నష్టం  వంటి సమస్యలు ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం 2 1/2 సంవత్సరాలు ఉంటుంది.

గోచార రీత్యా శని గ్రహ ఫలితాలు:

లోహ (ఇనుము) పాదం ఫలితాలు:
(చంద్రుడు 4, 8, 12వ ఇంట్లో ఉన్నప్పుడు)

ఈ కాలంలో శని అత్యంత కఠినంగా ప్రభావితం చేస్తాడు.
ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు మరియు వైవాహిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి.

శని దోష నివారణలు తప్పనిసరిగా పాటించాలి.

తామ్ర (తాంబో) పాదం ఫలితాలు:
(చంద్రుడు 3, 7, 10వ ఇంట్లో ఉన్నప్పుడు)

ఫైనాన్షియల్ పరిస్థితి మందగిస్తుంది, అయినా అంతంత మాత్రమే అనిపించే ధనం పుంజుకుంటుంది.

ఖర్చులు అధికంగా ఉంటాయి, మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.

వెండి (సిల్వర్) పాదం ఫలితాలు:
(చంద్రుడు 2, 5, 9వ ఇంట్లో ఉన్నప్పుడు)

ఈ సమయంలో సాధారణం కన్నా కొంత మంచిగా ఉంటుంది.
కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, పెరుగుదల, ఆదాయం లభించవచ్చు.

స్వర్ణ (గోల్డ్) పాదం ఫలితాలు: 
(చంద్రుడు 1, 6, 11వ ఇంట్లో ఉన్నప్పుడు)

క్రొత్త అవకాశాలు, ధనం, పేరు, విజయం లభించవచ్చును.

ఇది శనిదేవుడి అనుగ్రహం గా పరిగణిస్తారు.

పరిష్కారం, పరిహార మార్గాలు (రెమెడీస్) :
శని వలన పైన చెప్పిన ఏ దోషాలు కలిగినప్పటికీ ఈ క్రింది శాంతి పూజలు, పరిష్కారాలు ఉపశమనం కలగజేస్తాయి.

🎯 ఇంద్ర నీలం లేదా మయూర నీలం ఉంగరం ధరించడం.
(గమనిక: శని పాలితులు మాత్రమే ధరించాలి, లగ్న పంచమా, నవమాధిపతిగా వచ్చినప్పుడు)
(శనివారం రోజున పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజున)

🎯గురుపాలితులు మాత్రం పరిహారాలు చేయాలి, నీలం ఉంగరం ధరించరాదు.

🎯 శని గ్రహ దోష పరిహారార్థం శనివారం రోజున నవగ్రహ శాంతి పూజ లేదా నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం. 
🎯 శని త్రయోదశి నాడు శని పరిహారార్థం నవగ్రహ శాంతి పూజ చేయించడం.
 
🎯 స్వతహాగా ఖర్చు లేకుండా శనికి పూజా విధానం: 
9 శనివారాలు లేదా 11 శనివారాలు చేయాలి. 
ఇనుప లేదా మట్టి పాత్రలో నల్లని వత్తివేసి నల్ల నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. నైవేద్యంగా బెల్లం, నల్లని నువ్వులు సమర్పించాలి. ఈ క్రింది స్తోత్రాన్ని చదువుతూ శనికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి.

స్తోత్రం:
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం 
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం. 

అదేవిధంగా నీలిరంగు పుష్పాలు సమర్పించాలి, శని భగవానునికి నల్లని వస్త్రం కప్పి సమర్పించాలి. అగర్బత్తి వెలిగించి  ధూపం వేయాలి.

(లేదా)

శనీశ్వర జపం:
శుభతిథి గల శనివారం నందు ప్రారంభించవలెను.
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః శనయే నమః 
అను మంత్రమును 40 రోజులలో 19000 సార్లు పూర్తి అయ్యేవిధంగా జపము చేసి 41 వ రోజున నల్లనువ్వులు నల్లని బట్టలో వేసి మూట కట్టి బ్రాహ్మణులకు దానం చేసిన శనిగ్రహదోశ నివారణ జరుగును.

ఇతర పరిహారాలు:
1. బ్రాహ్మణునికి నువ్వుల దానం చేయడం లేదా  ఒక శనివారం నాడు లేదా శని త్రయోదశినాడు శని భగవానునికి తైలాభిషేకం  చేయడం.
2. శనివారం అన్నధానం, నల్లని వస్త్రాలు దానం, పండ్లు, ప్రసాదాలు పంచండం.
3. శనివారం నాడు  ఓపికను బట్టి 9, 18, 27, 54, 108 ప్రదక్షిణాలు ఏదో ఒక దేవాలయలయం చుట్టూ చేయడం.
4. శని దోషం తొలగేవరకూ విస్తరాకు భోజనం చేయడం. నేలపై పడుకోవడం.
5. శని దోషం తొలగేవరకూ మాంసాహారం మానివేయడం.
6. సోమవారాలు శివాలయంలో లేదా ఇంట్లో రుద్రాభిషేకాలు చేయడం.
7. నల్ల  ఆవుకు నువ్వులు బెల్లం కలిపి తొక్కిన పిండి తినిపించడం.
8. తలనీలాలు ఏదో ఒక దేవునికి ఒక శనివారం సమర్పించడం.
9. శనివారం నాడు శ్రీశైలంలో శివుని దర్శనం.
10. శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం.
11. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, చేయించడం, వినడం
12. సుందరకాండ పారాయణం చేయడం, చేయించడం, వినడం.
13. వెంకటేశ్వరస్వామి కీర్తనలు, పాటలు పాడటం, వినడం.
14. ఇంటి సంహద్వారం వద్ద బైట నువ్వుల నూనె దీపం సాయంకాలం వెలిగించి ఉంచడం.
15. అయ్యప్ప స్వామి మాల ధరించడం, శబరిమలై యాత్ర చేయడం.
16. శివ దీక్షతీసుకొని శ్రీశైలం వెళ్లడం. పాదయాత్రలు చేయడం.
17. ప్రతి రోజూ ఆంజనేయ స్వామి దండకం, హనుమాన్ చాలీసా ఫఠించడం.
18. ప్రతీ రోజూ శనీశ్వర జపం పఠించడం.
19. శని క్షేత్రాలు శనివారం దర్శించడం.
20. శివపురాణం చదవడం, విష్ణుపురాణం చదవడం.
21. శని వారం రోజున నల్లని వస్తాలు దానం చేయడం.

chintamani free astrology
For free Astrology click here

శని గ్రహ దేవతా అనుగ్రహ స్తోత్రం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి


Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Blog Archive

Contact form

Name

Email *

Message *

Followers

Labels