chintaamani.co.in - chintamani is a free astrology service in india, It is very powerful and useful for all, It helps freely those who are facing common problems in their daily life. Now it is working through online (website), Here in this blog we are given only suggestions and Remedies. If you want free Astrology visit our website : chintaamani.co.in

Translate

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

  • Chintamani Free Astrology

    చింతామణి ప్రశ్నాజాతకం జ్యోతిష్యానికి స్వాగతం.

Monday, October 11, 2021

అన్నపూర్ణాదేవి

*_నేటి విశేషం_*

_*ఈరోజు నవరాత్రులలో భాగంగా - ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి - అన్నపూర్ణాదేవి అలంకరణ*_
                                                                                                         *"ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ*
*నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ*
*సాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ*
*భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"*

కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు...

వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం...
ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. 
అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు.
పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. 
ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి , నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే, కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే , ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. 
ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని నమ్మకం... 

*​అన్నపూర్ణా దేవి కథ*

కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ  ప్రచారంలో ఉంది.
మన పవిత్ర గ్రంధాల , పురాణాల ప్రకారం... 
ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. 
భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీ దేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. 
దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది, ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. 
చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీ దేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. 
అప్పటి నుండి పార్వతీ దేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు...

*పూజా*
అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. 
*"హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా"*  
అనే మంత్రాన్ని జపించడం మంచిది... అమ్మవారికి నైవేద్యంగా దధ్ధోజనం , పొంగలి నివేదించాలి, అన్నపూర్ణ అష్టోత్తరం , స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది,

_ఈరోజు కొంతమంది పేదలకు, వస్త్రాలు, నిత్యావసర వస్తువులు, అన్నం దానం చేయడం చాలా ఉత్తమం ..._

*శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి*
                                                                                 ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై / దేవ్యై నమః
ఓం భీమాయై /పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై / సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై / దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్ర్యై / విశారదాయై నమః
ఓం కుమార్యై / త్రిపురాయై నమః
ఓం లక్ష్మ్యై / భయహారిణ్యై నమః
ఓం భ్వాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మదిజనన్యై నమః
ఓం గణేశ జనన్యై / శక్త్యై నమః
ఓం కౌమారజనన్యై / శుభాయై నమః
ఓం భోగప్రదాయై / భగవత్యై నమః
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై / శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
ఓం భ్వాన్యై / చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలక్ష్యై / విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై / ఆర్యాయై నమః
ఓం కల్యాణ నిలయాయై నమః
ఓం ర్ద్రాణ్యై కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై /శుభాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం మత్తపీనపయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణు సేవితాయై నమః
ఓం సిద్దాయై / బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానంద జనన్యై నమః
ఓం పరానంద ప్రదాయిన్యై నమః
ఓం పరోపకార నిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాబ్భవదనాయై నమః
ఓం పూర్ణచందనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
ఓం శుభానంద గుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమదనాయై నమః
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతుకవర్థిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితి సంహార కారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్దచిత్తాయై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మహాభగవత్యై / దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థ దాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటింబిన్యై నమః
ఓం నిత్యసుందరస్ర్వాంగై నమః
ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
ఓం శంకరప్రియవల్లభాయై నమః
ఓం సర్వధారాయై నమః
ఓం మహాసాధ్వ్యై నమః
ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః

                     *_🍃శుభమస్తు🍃_*
             🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
Share:

About Me

My photo
Chintamani gives you free Astrology Service for each and every one.

Contact form

Name

Email *

Message *

Followers

Labels