![]() | |
|
మీనరాశి ఫలితాలు:
ఆధాయం : 11 వ్యయం : 05 రాజపూజ్యం : 02 అవమానం : 04
గురువు | శని | రాహువు | కేతువు |
(12లో) | (11లో) | (3లో) | (9లో) |
మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి శుభకార్యాలు పూర్తిచేస్తారు.
ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.కీళ్ల నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలర్జీ సమస్యలు బాధిస్తాయి.
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.చిన్నతరహా వ్యాపారం చేసుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి.
విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం చేకూరుతుంది.
ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు.
మిమల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉంటారు.
ప్రభుత్వాల వల్ల కానీ చట్టాల వల్ల కానీ మీకు ఏమాత్రం లాభం కలగదు.
సంతానం యోగక్షేమాల పైన అధిక శ్రద్ధ కనబరుస్తారు.
వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల పడతాయి.
జీవిత భాగస్వామితో, సహోదరీ వర్గంతో భేదాభిప్రాయాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రతికూలమైన కాలానికి ఎదురీది అనుకూల ఫలితాలు సాధించడానికి ఎంతగానో శ్రమిస్తారు.
వ్యాపారస్తులకు నూతన జీఎస్టీ ప్రభుత్వ నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి.
సంవత్సర ద్వితీయార్ధంలో కోర్టు కేసులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. నీ సన్నిహిత వర్గం బంధువర్గం చేసిన తెలివితక్కువ పనులకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇతరులపై అతిగా ఆధారపడకూడదు నీ నిర్ణయం తీసుకుంటారు.
పనులు పూర్తి అయ్యేవరకు, ఒక కొలిక్కి వచ్చే వరకు మీ మనసులోని మాట బయట పెట్టవద్దు.
పేర్లు, అడ్రస్ లోపాలవల్ల ఫోన్ నెంబర్ పొరపాటు వల్ల మీకు అందవలసిన సమాచారం ఆలస్యం అవుతుంది.
లిటిగేషన్ లో ఉన్న భూమి అని తెలియక కొని నష్టపోతారు. మీ బాటలోనే కొంతమంది నడిచి నష్టపోతారు.
రాజకీయ పరంగా కలిసి వస్తుంది. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి.
కొంత మంది నీటిపై అపవాదులు వేసే అవకాశం ఉంది. విష ప్రచారం చేస్తారు. వాటిని లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకోవడం మంచిది.
రహస్య ప్రయాణాలు, రహస్య చర్చలు ఫలిస్తాయి.
ప్రేమవివాహాలు, స్త్రీలతో వివాదాస్పద వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా ఉండవు.
నీటి నూనె సంబంధిత వ్యాపారాలు, గ్రానైట్ వ్యాపారాలు లాభిస్తాయి.హెర్బల్ పూజాద్రవ్యాణి సంబంధ వ్యాపారాలు బాగుంటాయి.సీజనల్ వ్యాపారులు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి.
అదనపు సంపాదన కోసం సమకూర్చుకునే విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.
రాని బాకీలు రాకపోగా వివాదాస్పదం అవుతాయి.
దైవానుగ్రహం లేదని నిరాశ పడవద్దు. దైవం బలం తప్పక ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ద్వితీయార్థంలో బాగుంటుంది.
స్త్రీల భాగస్వామ్యం సహాయ సహకారాలు కీలక సమయంలో మీకు అండగా నిలుస్తారు.
ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష వాదనలు ఆధారంగా నిర్ణయాలు చేయవద్దు. అన్ని వైపుల నుండి వాస్తవాలు గ్రహించండి. ఏమి చేయాలో మీకే అవగతం అవుతుంది.
ఆహార, లోహపు వ్యాపారులకు, చార్టెడ్ అకౌంట్స్లకు, ఫైనాన్స్ వ్యాపారులకు, కిరానా వ్యాపారులకు, పాల వ్యాపారులకు, మందులషాపు వారికి, పాదరక్షల వ్యాపారులకు అనుకూలమైన కాలం.
ఆయుర్వేద వైద్యానికి మహర్దశ, ఆయుర్వేద వైద్యులకు బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది.
మీ మనసుకి సంతృప్తి కలిగే పని ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తుంది.
ఫైనాన్సు స్కీములు, లక్కీడ్రాలు, షెర్లు, కోడిపందాలు, గుర్రపు పందాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది.
భార్యాభర్తల మధ్య ఓర్పు సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పట్టుదలతో పాటు పట్టువిడుపు కూడా ఉంటే మంచిది.
రాజకీయ నాయకులకు రాజకీయంగా బాగుంటుంది.
వృత్తి ఉద్యోగులకు సంబంధించి కోర్టు తీర్పులు ఉపశమనం కలిగిస్తాయి.
మీ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎవరు సహకరించలేదని విధిలేని పరిస్థితుల్లో లంచాలు ఇచ్చి కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటారు.
దైవ సంబంధమైన మొక్కలను తీరుస్తారు.
టెండర్లు, జాబ్ వర్కులు, ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి.
మనోధైర్యంతో మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్ప పోతుందని ఆ క్షణం మీకు తెలియదు అయిన వాళ్ళు ఆత్మీయులు వద్దని వారించిన మీ ఆత్మసాక్షిగా విరుద్ధంగా నిర్ణయం చేయలేక మీ మనసు చెప్పిందే చేస్తారు. అది ఒక సాధారణ నిర్ణయమని మాత్రమే మీరు భావిస్తారు. కానీ అది అసాధారణ నిర్ణయమని నిరూపిస్తుంది.
ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ఇది అర్థం బాగుంటుంది.
స్త్రీలకు:
ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యా సాంస్కృతిక క్రీడా రంగంలో విశేషంగా రాణిస్తారు.
రాజకీయ సంబంధమైన జీవితం బాగుంటుంది.
మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పరంగా గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది.
విద్యార్థులు పోటీపరీక్షలను సవాలుగా తీసుకుంటారు. ఎలాగైనా విజయం సాధించాలని విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది.
ప్రేమ వివాహాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని తాటి వేయడానికి సమయం ఉండదు.
సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు.
ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి.
వైవాహిక జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడవచ్చు.
మీరు కోరుకున్న ఉద్యోగం లభించడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది.
ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
వివాహాది శుభకార్యాలు ముడిపడుతాయి.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సహోదర సోదరి వర్గానికి అండగా నిలవాల్సి వస్తుంది.
బ్యూటీ పార్లర్లు, వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది.
పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటాయి.
స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సామెత విషయంలో నిజమవుతుంది.
వ్యాపారం మీ అంచనాలకు మించి పెరుగుతుంది. లాభాలు ఉంటాయి.
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి.
ఈ సంవత్సరం ప్రథమార్థంలో ద్వితీయార్థం బాగుంటుంది.
గృహయోగం ఏర్పడుతుంది. కొద్దిపాటి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
ప్రతిష్టాత్మకమైన, ఉన్నత చదువులకు ఎంపికవుతారు.
ఆర్థిక ప్రయోజనాలు మీ జీవితానికి ఉపయోగపడే అన్ని విషయాలు లాభిస్తాయి.
If you like this Post Please comment and share your near and dear
--------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu,
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau,
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment