![]() | |
|
మకరరాశి ఫలితాలు:
ఆధాయం : 14 వ్యయం : 14 రాజపూజ్యం : 3 అవమానం : 1
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(2లో) | (1లో) | (5లో) | (11లో) |
ఫలితాలు:
మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనికి అధికంగా స్పందించవలసిన పరిస్థితిని ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మధ్యస్తంగా ఉంటుంది.
శుభకార్యాల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
భూ సంబంధమైన వ్యవహారాలకు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దైవానుగ్రహం వలన కొన్ని విషయాలు అనుకూలపడతాయి. తల్లిదండ్రులతో పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు దూరంగా ఉంటారు.
వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి.
స్త్రీలతో విభేదాల వల్ల కొన్ని ప్రయోజనాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నిష్కారణమైన ఈర్ష్యాద్వేషాలు విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేసారు అవసరమైన విషయాల మీద దృష్టి సాధిస్తారు.
వ్యాపారస్తులకు నూతన జీఎస్టీ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి.
నూతన వ్యాపారాలకు, నూతన భాగస్వాముల కల్పనకు ప్రయత్నాలకు కాలం కలిసి వస్తుంది.
రాజకీయ పదవి ప్రాప్తి, మీ శక్తికి మించిన పని చేస్తారు.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి.
వైద్య వృత్తిలో ఉన్నవారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ధనాదాయం సూచిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొకచోట లాభాలు వస్తాయి.
ఫాస్ట్ ఫుడ్స్ కు సంబంధించి వ్యాపారాలకు ప్రతికూల కాలం.
బంగారం వెండి వంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి.
సోదరీ సోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి.
మీరు గతంలో ప్రయత్నించి విఫలం చెందిన సాంకేతిక ఉద్యోగం కోసం తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు.
అవివాహితులైన వారు అనేక సంబంధాలు చూసి మురిసిపోతారు కొంత ఒదిగి ఉంటే సంబంధాలు దొరుకుతాయి.
నూతన గృహం కళ తీరుతుంది, లేక అపార్ట్మెంటయినా కొనుగోలు చేస్తారు.
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం వస్తుంది. శక్తిసామర్థ్యాలు ఉండి కూడా సరైన గుర్తు గుర్తింపు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఆత్మీయులు దూరమయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. ఉద్యోగుల తో విభేదాలు వివాదాలు సంభవిస్తాయి.
ప్రింటింగ్ వ్యాపారాలు లాభిస్తాయి. లీజులు లైసెన్సులు అగ్రిమెంట్ లో లభిస్తాయి. మధ్యవర్తిత్వం చేయడం వల్ల లాభం పొందుతారు.
తక్కువ వ్యవధిలో తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టి సారించి లాభాలు గడిస్తారు.
భూమి కొనుగోలు అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు కలుగుతుంది.
రిటైల్ మార్కెటింగ్ బావుంటుంది. టీవీ పరిశ్రమలకు సంబంధించిన అంశాలు కలిసివస్తాయి.
కళా సాంస్కృతిక క్రీడా రంగాల్లో రాణిస్తారు.
లక్కీ డ్రా లో ఫైనాన్స్ స్కీమ్ వల్ల నష్టపోతారు.
ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యంగా చేతికి వస్తాయి.
అవివాహితులైన వారికి వివాహం జరగడానికి కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో రాజీ పడని అంతకాలం వివాహం కష్టమే.
సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
స్టేషనరీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు లోహపు హెర్బల్స్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయపరంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు, పండ్లు పూలతోటలు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి.
స్త్రీలతో విభేదాలు, అనారోగ్యం రెండు ఇబ్బంది కలుగజేస్తాయి.
మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కొన్ని కారణాల వల్ల వాటిని పూర్తిగా వినియోగించుకో లేరు.
మెడిసిన్ వ్యాపారులకు, వైద్యులకు, మద్యం షాపుల వారికి, కల్తీ వస్తువులు, విద్యార్థులకు చేతివృత్తుల వారికి విద్యా రంగంలో ఉన్న వారికి కూరగాయల వ్యాపారులకు ఈ సంవత్సరం బాగుంటుంది.
వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని ఎటూ తేలక చికాకు కలిగిస్తాయి.
ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. పైరవీలు చేసి ప్రభుత్వ పరమైన వ్యాపారాలు సంపాదిస్తారు.
కోళ్ల ఫారాలు, పశువుల పెంపకం మొదలైనవి లాభిస్తాయి.
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
చేజారి పోయింది అనుకున్న ఒక ఆస్తి తిరిగి మీ చేతికి వస్తుంది. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని మీ విషయం రుజువు చేస్తుంది.
ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని నడుస్తున్నది. కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. పదకొండు మంగళవారాలు పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి వడమాల సమర్పించండి. కాలభైరవ స్వామి రూపుని మెడలో ధరించండి.ప్రతి రోజు కాలబైరవాష్టం చదువండి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి.
రచన వ్యాసంగాలు మంచి పేరు ప్రఖ్యాతలు లకు కారణం అవుతాయి.
సాంకేతిక రంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ తగ్గించండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.
స్త్రీలకు:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. జీవిత ఆశయాన్ని సాధిస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మీద ఉన్న బాధ్యతలు సక్రమంగా నెరవేర్చు కలుపుతారు.
కొన్ని విషయాలు సంబంధించి జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు కలగవచ్చు ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు.
సాంకేతిక విద్యా వైద్య రంగాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీకు ఇష్టమైన ఉద్యోగాన్ని పొందుతారు.
రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి సన్మానం సత్కారాలు పొందుతారు.
అండగా ఎవరూ లేరు అన్న భావన కృంగదీస్తుంది. కొంతకాలం సన్నిహితంగా మెలిగిన వ్యక్తితో శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది.(అందరి విషయంలో కాదు)
వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం దొరుకుంది.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
పునర్ వివాహ ప్రయత్నాలు తీసుకునే వారికి కూడా అనుకూల కాలం.
రాజకీయాల్లో రాణిస్తారు
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ప్రభుత్వపరమైన ఉపయోగపడతాయి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.
విదేశాలలో చదువుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది.
కొద్దిపాటి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాలు చేస్తారు.
ఏది ఏమైనా ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది.
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu,
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau,
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment