![]() |
Sri Plavanama Samvastara Rashipalalu-2021-22 (Kumbham) |
కుంభరాశి ఫలితాలు:
ఆధాయం : 14 వ్యయం : 14 రాజపూజ్యం : 6 అవమానం : 1
గురువు: | శని: | రాహువు: | కేతువు: |
(1లో) | (12లో) | (4లో) | (10లో) |
ఫలితాలు:
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు నీమీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. విద్యా వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు.
సివిల్ సర్వీస్ ఇతర పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
విదేశీ ఖర్చులకు విద్యా సంబంధమైన విషయాలు కి పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు.
మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
దీర్ఘకాలికంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వస్తాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి.
అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. నెగిటివ్ థింకింగ్ లేకుండా ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. ఈ మార్పు సంవత్సర ద్వితీయార్ధంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
బ్యాంకు రుణాలు సెటిల్మెంట్లు పూర్తవుతాయి.
ఫైనాన్స్ క్రీములకు లక్కీ డ్రా కు దూరంగా ఉండండి.
టెలివిజన్ రంగంలో సాంకేతిక సిబ్బంది చాలా అనుకూలం.
వైద్య విజ్ఞాన సాంకేతిక సంస్కృతి రంగాలలో ప్రతిష్టాత్మక సర్టిఫికెట్లు సన్మానాలు సత్కారాలు ప్రఖ్యాతి లభిస్తాయి.
సంతాన కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక అధిక భారం వస్తారు.
ఆరోగ్య వృద్ధి కోసం ధనం ఖర్చు అవుతుంది.
బంగారం వెండి వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. క్రెడిట్ కార్డులు ఏటీఎం కార్డుల విషయంలో అప్రమత్తంగా ఉండండి.
జనాకర్షణ ఏర్పడుతుంది.
తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు లాభిస్తాయి. సుగంధ ద్రవ్య వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి.
అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో జాగ్రత్త వహించండి.
ఎన్నో వివాహ సంబంధాలు చూసి విసిగి పోతారు. మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే శ్రమిస్తారు.
మీరు చాలా మందికి అర్థంకాని వ్యక్తిగా తయారవుతారు. చాలా విషయాలకు మీ నుండి ఇతరులకు అవసరమైన వివరణ లభించదు మౌనంగా మీ పని మీరు చేసుకుంటారు.
వాయిదా పద్ధతిలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వైద్య సంబంధ రంగానికి చెందిన ఫ్యాక్టరీలకు లాభాలు బాగుంటాయి.
సందర్భానుసారంగా విందు వినోదాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.
రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రతి విషయంలో విజయం నాదైన అహంభావం ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి.
విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది.
ప్రభుత్వ పరంగా, వ్యక్తుల పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటుఇటుగా పూర్తి చేస్తారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత వెసులుబాటు ఉండకపోవచ్చు. వ్యాపార వ్యాపార వాతావరణంలో ఉండలేరు.
పోటీ పరీక్షల ద్వారా మంచి ఉద్యోగాన్ని సంపాదించగలరు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి, గ్రీన్ కార్డు లభిస్తుంది.
ఇన్కమ్ టాక్స్ కమర్షియల్ టాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
సహోదరులు మధ్య అల్పమైన బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. వివాదాలకు పోకుండా సర్దుబాటు చేసుకుంటారు.
ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడిన వాటిని ఏదోవిధంగా అధిగమిస్తారు.
టీవీ సినీ రంగాల వారికి కొంత వరకు అనుకూలంగా ఉంది.
ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందున ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం, 8 శనివారాలు శనికి నువ్వుత నూనెతో దీపారాధన చేయండి. 11 మంగళవారాలు పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి సమర్పించండి ప్రతి నిత్యం కాలభైరవ అష్టకం పారాయణం చేయండి.
ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం.
హోమియోపతి, ఆయుర్వేదం డాక్టర్లు విశేషంగా రాణిస్తారు.
మీ ప్రయాణాలకు సంబంధించిన విషయాలు వివరాలు మీ రోజువారి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచండి లేనిపక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది ఈ సంవత్సరం ఉంటుంది.
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం.
విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయినప్పటికి మంచి ఫలితాలు సాధించగలరు.
వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. దీని ప్రభావం వృత్తి ఉద్యోగాల పై లేకుండా జాగ్రత్త వహించండి. సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకోవడం మంచిది.
వివాహాది శుభకార్యములు ముడిపడుతాయి. అందరికీ నచ్చిన సంబంధం కుదురుతుంది.
చనా వ్యాసంగం పేరు వస్తుంది. ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తారు.
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందుతారు.
అడిగి అడగకుండానే రుణాలు లభిస్తాయి.
చెప్పుడు మాటలు నమ్మవద్దు ప్రత్యేక ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా నిజాలు నిర్ధారించుకోండి. మీకు మేలు జరుగుతుంది. అపార్థాలు అపోహలకు దూరంగా ఉండి వాస్తవాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి.
సమాజంలో స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగుంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
స్త్రీలకు:
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది.
మీకు ఇష్టమైన ఉద్యోగం వస్తుంది.
మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ ప్రతిష్టను నిలబెడతారు.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి.
మీరు కోరుకున్న చోట చదువుకోడానికి చక్కటి అవకాశం లభిస్తుంది. చదువు కోసం అహోరాత్రులు శ్రమించి ఫలితాలు పొందుతారు.
స్వగృహ యోగం కలుగుతుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. సంపాదించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తారు.
కళ సాహిత్య రంగాలలో ప్రతిభ పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రేమ వివాహాలు సఫలం కావు.
ఇష్టం లేని వ్యక్తితో చట్టబద్ధంగా విడిపోతారు.జీవిత భాగస్వామి అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వలేదని విమర్శలు వస్తాయి ఎంత సర్దుకుపోయి నా వివాదాస్పద మనిషిగా ముద్ర పడతారు.
ఎంత సాధించిన గర్వం తక్కువ పెద్దల పట్ల గౌరవం ఉంటుంది.
ఈ సంవత్సరం జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ప్రతిరోజూ శ్రమిస్తారు ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
పేరుప్రఖ్యాతులు ఉద్యోగం లభిస్తాయి.
స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ శత్రువర్గం మీద ఆధిక్యత లభిస్తుంది.
నూతన వ్యాపారాలు టెండర్లు లీజులు లైసెన్సులు కోర్టు తీర్పులు మొదలైనవి కలిసివస్తాయి.
వివాహాది శుభకార్య విషయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థంలో రెండు బాగున్నాయి.
ఉన్నత విద్య వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి.
---------------------------------------------------------------------------------------------------
If you like this Post Please comment and share your near and dear
---------------------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology, Online free Astrology in telugu,
Prashana Jatakam, Tarabalam and chandrabalam, Free Horoscope in telugu, Rashipalau,
Darmasandehalu, Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : chintaamani.co.in
Comments
Post a Comment