శ్రీ ఆంజనేయ దండకం
![]() |
Jai Hanuman |
- భజే వాయుపుత్రం - భజే వాలగాత్రం - భజేహం పవిత్రం - భజే సూర్యమిత్రం
- భజే రుద్రరూపం - భజే బ్రహ్మతేజంబటంచున్ - ప్రభాతంబు సాయంత్రమున్
- నామ సంకీర్తనల్ జేసి - నీ రూపు వర్ణించి - నీ మీద నే దండంకం బొక్కటిన్ - చేయ నూహించి
- నీ మూర్తినింగాంచి - నీ సుందరం బెంచి - నీ దాస దాసుండనై - రామభక్తుండనై - నిన్ను నే గొల్చెదన్
- నీ కటాక్షంబునన్ జూచితే - వేడుకల్ జేసితే - నా మొరలించితే - నన్ను రక్షించితే
- అంజనాదేవి గర్భాన్వయా దేవ !
నిన్నెంచ నేనెంత వాడన్ -దయాశాలివై - జూచితే - దాతవై, బ్రోచితే - దగ్గరం బిల్చితే
- తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై - స్వామి కార్యార్థివై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి - వారిన్విచారించి
- సర్వేశుబూజించి - యబ్బానుజుం బంటు గావించి- యవ్వాలినిం జంపి
- కాకుత్థ్సు వంశ స్థ్యూర్ దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి
- శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ - లంకిణిన్ జంపియున్, లంకయున్ గాల్చియున్
- భూమిజన్ జూచి - యానంద ముప్పొంగ -యాయుంగరంబిచ్చి - యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి
- సంతోషునిజేసి - సుగ్రీవుడు యంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి
-యా సేతువున్ దాటి వానరుల్మూకలై - పెన్మూకలై -దైత్యులంద్రుంచగా
- రావణుండంత కాలాగ్ని యుగ్రండునై వచ్చి బ్రహ్మాండమైనట్టి - యాశక్తియున్ వేసి
- యాలక్ష్మణున్ - మూర్చ నొందింపగా- నప్పుడే బోయి - సంజీవియుం దెచ్చి
- సౌమిత్రికిన్నిచ్చి - ప్రాణంబు రక్షింపగా: కుంభకర్ణాది వీరాళితో - పోరిచెండాడి
-శ్రీరామబాణాగ్ని వారందరిన్ - రావణున్ జంపగా
-నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలన్-నవ్విభీషణు న్వేడుకన్ - దోడుకన్వచ్చి
-పట్టాభిషే కంబు జేయించి సీతామహాదేవినిదెచ్చి - శ్రీరాముకున్నిచ్చి
అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
- నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
-రామభక్తి ప్రశస్తంబుగా సేవించి-నీనామ సంకీర్తనల్ జేసితే
-పాపముల్బాయునే భయములు న్దీరు నే భాగ్యముల్గల్గు నే
సకల సామ్రాజ్యముల్సకల సంపత్తులున్ గల్గునో వానరాకార!
యోభక్త మందార! యో పుణ్య సంచార! యో వీర! యోశూర!
నీవే మహాఫలమ్ముగా వెలసి - యా తారక బ్రహ్మమంత్రంబు పఠించుచున్
స్థిరమ్ముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై
- యెప్పుడున్ తప్పకన్ తలకు - నా జిహ్వ యందుండి -నీ దీర్ఘ దేహంబునన్
- త్రైలోక్యసంచారివై రామనామాంకిత ధ్యానివై
- బ్రహ్మవై - బ్రహ్మతేజంబునన్-రౌద్రనీజ్వాల కల్లోల హావీర హన్మంత
- ఓంకార - హ్రీంకార శబ్దంబులం భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులన్
-నీదు వాలంబు నన్ జుట్టి -నేలంబడంగొట్టి
-నీముష్టిఘాతంబులం బాహుదండంబులంరోమ ఖండంబులంద్రుంచి
- కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునుంజూచి
-రారానాముద్దు నరసింహా యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి
నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే! వాయుపుత్రా! నమస్తే నమోనమః
![]() |
free astrology - chintaamani |
Comments
Post a Comment