Sree Sharvari Nama Samvatsara Panchangam Palitalu - శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాగం - ఫలితాలు

ఓం శ్రీ మహా గణపతయే నమః
శ్రీ శార్వరి నామ సంవత్సర ఫంచాగము
కలియుగం గతాబ్ధము : 1521                          శాలివాహన శకం: 1942
విక్రమార్క శతాబ్ధం: 2077                             క్రీస్తు శకం : 2020-21
Rashipalu-2021

శ్లోః శార్వరీవత్సరే సస్యవృద్ది ర్భవేద్భువి।రాజానోవిలయంయాంతి పరస్సరజయేచ్చయా ।।

తా।। శార్వరి నామ సంవత్సరమందు భూమి యందు అన్నిసస్యములు వృద్దిపొందును. రాజులలో ఒకరినొకరు జయించవలెనను కోరిక చేత నాశనము పొందుదురు. మూడు కుంచముల వర్షం కురియును. సగటు వర్షపాతము కంటే కొద్దిగా అధికము.
శార్వరి అనగా – సాధారణ పంటలు పండునది అని అర్ధము.

నవనాయకుల ఫలితములు
రాజు - బుధుడు
1. ప్రకృతి భీభత్సాలు (గాలివానలు అధికం), సాయం కాలం యందు ఈదురు గాలు వీచుటచే తోటలు పాడగును.
2.  మేఘములు కొద్దిగా వర్షించును, పంటలు మధ్యస్థంగా పండును.
3. వ్యాపారాలు బాగుండును
4. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలకు కొంత మేలు.
5. రాజకీయ నాయకులు ప్రజాసేవకు అంకితం
6. విద్యా వైద్యం సామాన్యులకు అంధుబాటులో ఉండదు.
7. వృద్దులకు మేలు, సమస్యల పరిష్కారం కరువు
8. ఎండలు అధికం, పన్నులు వసూలు, అధిక ధరలు
9. ఆత్మీయుల ప్రేమ తక్కువ
10. ఆధాయం మించి ఖర్చు
మంత్రి - చంద్రుడు
1.సువృష్టి – అన్ని రకముల పంటలు బాగుండును.
2. ధాన్య వ్యాపారం బాగుంటుంది.
3. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు.
4. పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తారు.
5. అందరూ పైకా బాగా కనపడుతారు.
6. తాత్కాలి ప్రయోజనాలకు ప్రాముఖ్యత- దీర్ఘకాలిక ప్రయోజనాలకు విలువ తక్కువ
7. ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది.
8. హింస, ప్రేలుల్లు, అగ్ని ప్రమాధాలు, భవనాలు కూలిపోవుట, పోరాటాలు, ఉత్పాతాలు, నిరసనలు
9. ధనప్రాణ నష్టం, ఫ్యాక్టరీలలో ప్రమాధాలు జరిగే అవకాశం
 3.  సైన్యాధిపతి – చంద్రుడు (రవి)
1. అధిక వర్షాలు, ప్రతి వస్తువు ధరలు అధికం, ప్రజలలో అనోరోగ్యం
2. పాడిపరిశ్రమలు వృద్ది, అన్ని రకాల పంటల ఉత్పత్తి పెరుగుతుంది.
3. అవినీతి అన్ని హద్దలు దాటుతుంది.
4. అంతరిక్ష నౌకలు విఫలం, విద్రోహక చర్యలు ముఖ్యపాత్ర
5. రక్షణ వ్యవస్థ తీరుతెన్నెలు చర్చాంచనీయమవుతాయి
6. సైనిక, రక్షణ, పోలీసు శాఖ వారి చర్యలు ప్రజలలో విముఖత ఏర్పడుతుంది.
 4. సస్యాధిపతి – గురుడు
1. ఉలవలు, గోధుమలు, శనగలు పూర్ణముగా పండును.
2. బంగారం ధర పెరుగుతుంది.
3. పసుపు రంగు నేలలు ఫలించును. దిగుబడులు బాగుంటాయి
5. వర్షపాతం ఎక్కువ, గోదావరి వంటి నందులు పొంగుతాయి. (రెండు సార్లు తుఫానులు)
6. నవధాన్యాలు, నవరత్నాలకు అధిక ధరలు
7. వ్యవసాయ రంగానికి ప్రభుత్వ అనుకూలం, గిట్టుబాటు ధరలు అందుతాయి.
 5. ధాన్యాధిపతి – బుధుడు (కుజుడు)
1. మధ్యమ వృష్టి, పంటలు సాధారణం
2. గాలి వానలు అధికం అగుటచే పంటలు చేతికి వచ్చి పాడగును.
3. పాలకులు భయబ్రాంతులగు సంఘటనలు అనేకం జరుగును.
4. మంత్రులకు ప్రాణాపాయం
5. నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత, అధిక ధరలు, కలుషిత ఆహారం
 6. అర్ఘాధిపతి – చంద్రుడు ( రవి)
1. పంటలు బాగా పండును, రైతలకు కలిసివచ్చును.
2. ధాన్యం ధరలు పెరుగును. ప్రత్తి, నూలు వస్త్రాలకు ధరలు పెరుగును.
3. ఎరుపు రంగు, తెలుపు రంగు వస్రాలకు ధరలుండును.
4. ప్రతికూల ఘటనలు, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడును.
5. ఖనిజ సంపదకు గిరాకీ ఉండును.
 7. మేఘాదిపతి – చంద్రుడు (రవి)
1. పాడి పరిశ్రమలకు అభివృద్ది ( పాలధరలు పెరుగును)
2. అన్ని రఖాల ధాన్యాలు ఫలించును. పాడిపరశ్రమ వృద్ది (నూతన గోవుల సృష్టి)
3. తెలుపు వంగడాలు బాగా పండును.
4. ఆకాశం ఎర్రబారును, సామాన్య వర్షపాతం
5. పిడుగులు, వడగల్ల వలన ధన నష్టం
 8. రసాధిపతి – శని
1. నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొ. రసజాతులు ధరలు తగ్గే అవకాశం
2. పండ్లు, కూరగాయలకు అధిక ధరలు
3. చెరుకు పంట దిగుబడిలేక రైతులు నష్టపోవుదురు.
4. స్త్రీలు అన్నిరంగాలలో ఆధిపత్యం, అధికార పదవులు
5. వినోదం విషయంలో అశ్లీలం హద్దులు దాటుతుంది. ఉత్పేరకాల వినియోగం అధికం, విలాసాలు
 9. నీరసాధిపతి – గురుడు
1. రత్నాలు, బంగారం, ధాన్యాలు, ప్రత్తి, తోళ్ళు, పువ్వులు, మంచి గంధము, కూస్తూరి, అగరు వంటి వాటికి
ధరలు పెరుగును.
2. యువతరం బాధ్యతారహితం, విలాసాలు ఎక్కువ
3. ధనం తేలికగా సంపాదించాలనే ధోరణి, ఊహలు ఎక్కువ
4. జీర్ణకోష సంబంధ రోగాలు ఎక్కువ
5. మధ్యం ప్రవాహం ఎక్కువ
6. పెద్దలకు గౌరవం తక్కువ, కొన్ని విషయాలలో వారు మౌనంగా ఉంటేనే గౌరవం
7. ఆర్ధిక పరిస్తితి ఇబ్బందికరం,
8. జ్యేష్టమాసం చివరలో దేశారిష్టం, భూకంపాలు వంటి సంబవించుట.



గమనిక : కొందరి అభిమతం ప్రకారం సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతులు  చంద్రుడు లేదా రవి, 

ధాన్యాధిపతి బుధుడు లేదా కుజుడు గా భావించవలెను.

మూఢములు:

1.       గురుమూడమి: 17-01-2021 నుండి 17-2-2021 వరకు
2.       శుక్రమూడమి : 14-2-2021 నుండి సంవత్సరాంతము వరకు

గ్రహణములు:

సూర్యగ్రహణము: తేది. 21-6-2021 అమావాస్య ఆదివారం చూడామణి నామక రాహుగ్రస్త సూర్యగ్రహణం
ఈ గ్రహణమును మృగశిర నక్షత్ర జాతకులు చూడరాదు.
పుష్కర నిర్ణయం: తేది. 8-11-2021 శ్రీ శార్వరి నామ సంవత్సర నిజ ఆశ్వీయుజ బహుళ అష్టమి ఆదివారం నుండి తుంగభద్రానది పుష్కర ప్రారంభం.
chintamani free Astrology
chintamani free Astrology

Comments