Mantrabhalam (మంత్రబలం)


సర్వేసన్తు నిరామయాః

జగత్ సర్వం దైవాధీనం - తత్ దైవం మంత్రాధీనం ।
తత్ మంత్రం భక్తాధీనం - భక్తానుసారే మమ దేవతా ।।

    ఒక సానుకూల విషయాన్ని పదేపదే జపించడం ద్వారా శక్తి జనిస్తుందని, అది రుగ్మతలను కూడా పోగొడుతుంది అని నమ్మకం. వాటినే మంత్రాలు, సూక్తాలు అంటాము. ఔషదాలు తీసుకోవడంతో పాటు వాటిని పఠించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.
అయితే ఒక మంత్రాన్ని జపించాలంటే  నియమనిష్టలతో జపించాలి. లేకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి.

నిషిద్ధ, అపక్వ, అకాల, అతిభోజనాలు చేసేవారిని, కూడని ప్రదేశాలలో నివసించేవారిని, లోకానికి కష్టం కలిగించే పనులు చేసేవారిని హింసించే భయంకర రాక్షసి ఉంధని, అది వారిని పీడిస్తుందని యోగ వాసిష్టం లో ఉంది. ఈ రక్కసి సూక్ష్మాతిసూక్ష్మరూపంలో (సూక్ష్మ క్రిములు - వాటినే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లు  అంటున్నాము) అంటువ్యాధుల రూపంలో మానవులను పీడిస్తుంది. నియమానుసారంగా భుజించేవారిని, శుచిశుభ్రత పాటించేవారి ఈ రక్కసి ఏమీచేయలేదు. అప్పటికే ఈ రక్కసి భారిన పడినవారు రక్షణ పొందేందుకు ఇక్కడ ఇవ్వబడిన మంత్రాలు ఫఠించి, దైవారాధన చేసినట్లయిన రక్షణ కలుగుతుందని నమ్మకం.  కావున భక్తిశద్ధలతో పఠించి ఆయురారోగ్యములు పొందలగలరు.


- వశిష్ఠ విరచిత యోగ వాసిష్ఠ మంత్రం

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తి మేనాం
ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరే కురు స్వాహా
హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా ।

- అపమృత్యునివారణ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ।

- ధన్వంతరీ మంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వంతరాయ చ అమృత కలశ హస్తస్య  చ
సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ
త్రిలోక పతయే త్రిలోక  నిత్యయే
ఓం మహావిష్ణు స్వరూపాయ
ఓం శ్రీ ధన్వంతర స్వరూపాయ
ఓం శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ నమః ।

- చండీ సప్తశతి మంత్రం

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమః

రోగా నశేషాన్ అపహన్తి దుష్టాన్
త్వా మాశ్రితానాం  న విప న్నరాణాం

- భాస్కర స్తోత్రం

య న్మండలం వ్యాధి వినాశదక్షం
యదృగ్యజుస్సామసు సంప్రగీతమ్ః
ప్రకాశితం యేన చ భూ ర్భువః స్వః
పునాతు మాం తత్ సవితు ర్వరేణ్యం ।

- శంకరాచార్య విరచిత శ్రీ మహాదేవీ మంత్రం

కిరంతీ మంగేభ్యం కిరణ నికురంబా మృతరసం
హృది త్వా మూధత్తే హిమకర శిలామూర్తిమివ యః
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా !

free astrology
chintamani free Astrology


Comments